Pages

Thursday, April 18, 2013

మోడీ- జేడీ(యు) ప్రహసనం

  1. Photo: మోడీ- జేడీ(యు) ప్రహసనం
బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో రెండవ పెద్ద భాగస్వామి జనతా దళ్‌(యునైటెడ్‌) భావి ప్రధాని అభ్యర్థి ఎంపికపై సాగిస్తున్న ఎడతెగని ప్రహసనం ఇప్పుడు మరింత రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌కు తామే ఏకైక ప్రత్యామ్నాయమని ఎన్ని ప్రగల్భాలు పలికినా అనేకానేక పక్షాల మద్దతు లేకుండా గద్దెనెక్కలేమని బిజెపికి అంతకు మించి దాన్ని నడిపించే ఆరెస్సెస్‌ పీఠాధిపతులకు బాగా తెలుసు. అందుకే కేంద్రంలో అధికారమే పరమార్థంగా అవమానాలు అవాంతరాలు దిగమింగి రాష్ట్రాల్లో సదరు భాగస్వామ్య పక్షాల పెద్దన్న పాత్రకు తలవంచుతుంటారు. గుజరాత్‌ మారణహౌమం తర్వాత ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల్లో అనేకం నిష్క్రమించినా మిగిలిన ఏకైక పెద్ద మిత్ర పక్షం జెడియు మాత్రమే. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నేతల నుంచే తమ మోడీకరణ వ్యూహానికి ప్రతిబంధకం ఎదురవడం బిజెపికి గొంతులో వెలక్కాయలా తయారైంది. పైకి ఎన్ని మేకపోతు గంభీరాలు వొలకబోసినా బిజెపి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ సారికి ఎలాగో కార్పొరేట్ల కరుణతో నెట్టుకురావచ్చని వ్యూహ కర్తల అంచనా. ఆయన అత్యాశా వ్యూహాలు కూడా అలాగే వుండటం వల్ల అనివార్యంగా అందుకు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హిందూత్వ ఎజెండా మోడీత్వ జెండాగా పరివర్తన చెందింది గుజరాత్‌ ముద్ర వేసుకుంది. గుజరాత్‌ మారణ కాండను సుదీర్ఘ పరిపాలనలో అవకతవకలను అమానుషాలను మటుమాయం చేసే ప్రచారం ప్రచండంగా సాగిపోతున్నది. నిరంతర నిరీక్షకుడు ఎల్‌ఎ అద్వానీ వంటి వారి పేరాశలు పటాపంచలు చేసేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైనా ఆయన మాత్రం రాజీ పడినట్టు కనిపించదు. అంతకన్నా కూడా జెడియు నాయకుడు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరింత గట్టిగా మోడీ అభ్యర్థిత్వానికి ససేమిరా అంటున్నారు. గత వారాంతం సమావేశమైన జెడియు అత్యున్నత స్థాయి సమావేశం కూడా ప్రధాని స్థానానికి డిసెంబర్‌లోగా నికరమైన లౌకిక అభ్యర్థిని ఖరారు చేయాలని బిజెపికి తాఖీదు ఇవ్వడం పెద్ద ప్రచారమే పొందింది.
జాతి హత్యాకాండకు ఆద్వర్యం వహించిన మోడీ నేతృత్వాన్ని నిరోధించడం మంచిదే అయినా బిజెపితో విడగొట్టుకుంటానని గాని ఎన్‌డిఎ నుంచి వైదొలుగుతానని గాని జెడియు అనడం లేదు. నిజానికి గుజరాత్‌ మారణ కాండ తర్వాత అనేక మంది భాగస్వాములు తప్పుకున్నా ఈ పార్టీ ఎన్‌డిఎలోనే కొనసాగింది. బీహార్‌ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆ కూటమికి కొత్త వూపిరిపోసింది కూడా జెడియునే. ఈ క్రమంలో కొన్ని సామాజిక తరగతుల్లో బిజెపికి కొత్త బలం సమకూర్చింది కూడా. అయితే మోడీ విషయంలో మాత్రం మొదటి నుంచి నితిష్‌ మొండిగానే వున్నారన్నది నిజం. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనరాదని షరతు పెట్టారు. ఆ మాటకొస్తే యుపి ఎన్నికల్లో బిజెపి నేతలే స్వయంగా మోడీని రాకుండా ఆపేశారు.మైనారిటీ ఓటర్లు దూరమవుతారన్న భయమే ఇందుకు ఏకైక కారణం. నితిష్‌ కుమార్‌ నిరంతర అభ్యంతరంలో ఆంతర్యం కూడా అదే! వ్యక్తిగతంగా తానూ అత్యున్నత పీఠం అధిష్టించాలనే ముచ్చట ఆయనకూ వున్నా వుండవచ్చు. ఏమైనా ఇవన్నీి మోడీకరణ మేడి పండు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తాయి.
బీహార్‌లో జెడియుతో స్నేహం కాస్త బెడిసికొడుతుందన్న అంచనా ఒకవైపు ..మోడీ మంత్రం తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదన్న ఆందోళన మరో వైపు కలగలసి బిజెపి నేతలు నితిష్‌ వ్యతిరేకతపై పరిపరివిధాల స్పందిస్తున్నారు. కొన్నిసార్లు తెగతెంపులకు సిద్ధమంటూనే మరోవైపు ప్రధాని అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోలేదని గడువు పెంచుకునేందుకు తంటాలు పడుతున్నారు.ఒకవైపున సర్వేలు తమ బలం తగ్గుతున్నట్టు చెబుతుంటే వున్న మిత్రులను కూడా పోగొట్టుకోవడం వల్ల జరిగేదేమిటో వారికి బాగా తెలుసు. అదే సమయంలో డిసెంబర్‌ నాటికి నికరమైన లౌకిక విలువలు కలిగిన అభ్యర్థి పేరు ప్రతిపాదించాలని జెడియు పెడుతున్న షరతులో డొల్ల తనం కూడా తెలియంది కాదు. సముద్రంలో ఉప్పు నీళ్లు తప్ప మంచినీళ్లు ఎలా దొరుకుతాయి? అంత వీర లౌకిక నేత బిజెపిలో ఎలా దొరుకుతాడు? జెడియు రాజధర్మానికి ఆదర్శంగా చెబుతున్న వాజ్‌పేయి కూడా గుజరాత్‌ వ్యవహారంలో ఎంత గుంజాటన పడిందీ ఎవరికి తెలియదు? కనక జెడియు నిజంగా లౌకిక వాదాన్ని విశ్వసిస్తే ఎన్‌డిఎలో వుండే అవకాశమే లేదు.జార్జి ఫెర్నాండెజ్‌ నుంచి శరద్‌ యాదవ్‌ నితిష్‌ కుమార్‌ల వరకూ సోషలిస్టు నేపథ్యం గల నాయకులే మతతత్వ కూటమికి సంధాన కర్తలుగా కొనసాగడం ఒక వైపరీత్యం. ఇలాటి అవకాశవాదమే తెలుగు దేశం వంటి పార్టీలు ప్రదర్శించి వుండకపోతే వాజ్‌పేయి ప్రభుత్వం మనగలిగేదే కాదు.జెడియు వంటి పార్టీలు ఇప్పటికీ ఆదే బాటలో కొనసాగుతున్నంత కాలం సంఘ పరివార్‌ పాచికలు వేస్తూనే వుంటుంది. అలా గాక బీహార్‌కు ప్రత్యేక సహాయం సాధించే పేరిట కాంగ్రెస్‌ వైపు మొగ్గితే అప్పుడు పెనంమీద నుంచి పొయ్యిలోకి పడినట్టవుతుంది. ఇప్పటికే కేంద్రం ఒక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆ ప్రయత్నం ప్రారంభించింది. రాబోయే ఎన్నికల ముందు దేశంలో రాజకీయ పునస్పమీకరణలు అనేకం జరిగే అవకాశం వున్నందున జెడియు బెదిరింపులు చివరకు ఎలా పరిణమించేది చూడాల్సి వుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా అవకాశవాద రాజకీయాలతో అసలైన ప్రత్యామ్నాయాలను నిర్మించలేరన్నది మాత్రం పరమ సత్యం. మోడీత్వ సీసాలో హిందూత్వ పానీయం చలామణి చేసుకోవడం అసలే చెల్లదన్నది మరింతగా నిజం.

    బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో రెండవ పెద్ద భాగస్వామి జనతా దళ్‌(యునైటెడ్‌) భావి ప్రధాని అభ్యర్థి ఎంపికపై సాగిస్తున్న ఎడతెగని ప్రహసనం ఇప్పుడు మరింత రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌కు తామే ఏకైక ప్రత్యామ్నాయమని ఎన్ని ప్రగల్భాలు పలికినా అనేకానేక పక్షాల మద్దతు లేకుండా గద్దెనెక్కలేమని బిజెపికి అంతకు మించి దాన్ని నడిపించే ఆరెస్సెస్‌ పీఠాధిపతులకు బాగా తెలుసు. అందుకే కేంద్రంలో అధికారమే పరమార్థంగా అవమానాలు అవాంతరాలు దిగమింగి రాష్ట్రాల్లో సదరు భాగస్వామ్య పక్షాల పెద్దన్న పాత్రకు తలవంచుతుంటారు. గుజరాత్‌ మారణహౌమం తర్వాత ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల్లో అనేకం నిష్క్రమించినా మిగిలిన ఏకైక పెద్ద మిత్ర పక్షం జెడియు మాత్రమే. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నేతల నుంచే తమ మోడీకరణ వ్యూహానికి ప్రతిబంధకం ఎదురవడం బిజెపికి గొంతులో వెలక్కాయలా తయారైంది. పైకి ఎన్ని మేకపోతు గంభీరాలు వొలకబోసినా బిజెపి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ సారికి ఎలాగో కార్పొరేట్ల కరుణతో నెట్టుకురావచ్చని వ్యూహ కర్తల అంచనా. ఆయన అత్యాశా వ్యూహాలు కూడా అలాగే వుండటం వల్ల అనివార్యంగా అందుకు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హిందూత్వ ఎజెండా

సంస్కృత సంస్కృతి




ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అత్యవసర పోలీసు డయల్‌ సర్వీసు 100 ప్రారంభించారు.ఈ నెంబరుకు ఎవరు ఎప్పుడు ఫోన్‌ చేసినా పోలీసు సహాయం లభిస్తుందని ప్రకటించి తనే డయల్‌ చేశారు. అయితే పాపం ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యం. తర్వాత ఎవరో ఎలాగో కలిపి ఇచ్చారు గాని పాపం ఆయనకు అప్పటికే విసుగొచ్చి ఇక స్పందించడం మానేశారు. ఆదిలోనే హంసపాదు వంటి ఈ చేదు అనుభవాన్ని కూడా దిగమింగి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారు పోలీసులకు ఓ చక్కటి సలహా ఇచ్చారు. ప్రజలతో వ్యవహరించేప్పుడు సంస్కృతం మాట్లాడకండి అని.
సంస్కృతమే మన సంస్కృతి అనీ, అది దైవభాష అనీ ఈ దేశంలో చాలా మంది ప్రచారం చేస్తుంటారు. కనక చాలా మంది నమ్ముతుంటారు కూడా. సంసృతంలో నాలుగు శ్లోకాలు ఇంగ్లీషులో నాలుగు కొటేషన్లు దంచేస్తేనే సదరు వ్యక్తి పండితుడని మనం నమ్ముతాం. అందుకే హైటెక్‌ బాబులు అడపాదడగా ఒకటో అరా సంసృత చరణాలు వల్లిస్తుంటారు. అలాగే స్వామి వర్యులు ఇంగ్లీషు వాక్యాలు జొప్పిస్తుంటారు.ఏతావాతా ఒక దశలో సంసృతం మరో దశలో ఆంగ్లం తెలుగు వంటి భాషలను ఎదగకుండా చేశాయన్నది ఒక వాదన. అలాగే అర్థం కాని సంసృతంలోనూ అన్నీ జరిపేంచుస్తుంటారు పురోహితులు. వారికైనా అర్థం అవుతాయో లేదో మనకు తెలియదు గాని వందల ఏళ్లపాటు వేదాలు వల్లెవేసిన వారంతా అక్షరాస్యులు కాదన్నది నిజం. అసలు వేదాలు అచ్చు వేయకూడదనేది కూడా వందేళ్ల కిందటి వరకూ మన వాళ్లు గట్టిగా నమ్మిన మాట. అన్నీ వేదాల్లో

Wednesday, April 17, 2013

రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ



రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం తెలుగు వారందరూ సంతోషించే విషయం. రెండు మూడు తరాలుగా రావూరి భరద్వాజ పేరు, రచనలూ, భావనలూ సాహిత్య ప్రియులకు సుపరిచితాలు. ప్రగతిశీల వాదులకూ ప్రజాస్వామిక భావాలకూ సదా సన్నిహితంగా మెలిగే రావూరి భరద్వాజ అక్షర శ్రామికుడు. అవిరామ స్వాప్నికుడు. తరాల మధ్య వారధి. సాహిత్య కార్యక్రమాల సారథి. అన్నిటినీ మించి స్నేహశీలి. ఎనిమిది పదుల వయస్సు దాటినా నిరంతర క్రియాశీలంగా కలుపుగోలుగా మసలే సహృదయ సాహిత్య జీవి. అందుకే ఆయనకు అఖిలభారత స్థాయిలో అత్యున్నత పురస్కారం లభించడం అభినందనీయం. మొదటిది విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి వస్తే రెండవది సి.నారాయణరెడ్డి విశ్వంభరకు లభించింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు ఆ గౌరవం దక్కింది. ఈ విధంగా ఇది తెలుగు వారికి లభించిన మూడో జ్ఞానపీఠం కనుక మరింత ప్రత్యేకం.
నిజానికి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొడవటిగంటి కుటుంబరావు, వంటి మహాకవులు రచయితలెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నిజానికి తాను శ్రీశ్రీ, ఆరుద్రల పేర్లు అనేక సార్లు సిఫార్సు చేశానని సినారె ఒక సందర్భంలో చెప్పారు. అయితే అప్పట్లో అధినేతల ఆలోచనా ధోరణులు అభ్యుదయాన్ని అస్సలస్సలు సహించేవి కావు గనకే వీరెవరికీ జ్ఞానపీఠం వంటివి లభించే సూచనే లేకపోయింది. తర్వాతి కాలంలో

Thursday, March 28, 2013

వికసించిన విద్యుత్తేజం



ప్రభుత్వాలకు పోలీసులుంటారు. ఉసిగొలిపితే చాలు విరుచుకుపడి విరగ్గొడతారు. నిజమే. ఆ బలం చూసుకుని జులం చూపి విర్రవీగిన విరగబడిన వారందరూ ప్రజల ముందు శృంగభంగం పాలయ్యారన్నది అంతకన్నా పెద్ద నిజం.కాని అధికారబలంలో అహంకరించే వారికి, అప్రజాస్వామికంగా హుంకరించేవారికి చరిత్ర చెప్పిన ఈ పాఠాలు చెవికెక్కవు. నిరంతర గుణపాఠాలు తలకెక్కవు. చరిత్ర బుద్ధిమంతులకు దారి చూపిస్తుంది. బుద్ధి హీనులను ఈడ్చుకుపోతుంది అంటారు. తప్పదు. వికసించిన విద్యుత్తేజం ఎంతటి విస్పోటనమై విజృంభిస్తుందో బషీర్‌బాగ్‌ ఆ నాడు చెప్పింది. నాలుగు రోజులుగా వామపక్ష నేతలు సాగిస్తున్న నిరవధిక నిరాహారదీక్షలో పెల్లుబికిన ప్రజాభిమానమూ చాటించింది. అయినా ఆ గ్రహింపు లేని పాలకులు ఆగ్రహం తప్ప అవగాహన కనీసంగా ప్రదర్శించలేకపోయారు. ఖాకీలను ప్రయోగించడం తప్ప కాస్త విజ్ఞతతో స్పందించేందుకు నిరాకరించారు.
నిరాహారదీక్షలు ఎక్కువ రోజులు సాగి ఉద్రిక్తంగా మారితే, దీక్షలో కూచున్న వారి ఆరోగ్యం మరీ క్షీణిస్తే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అదుపులోకి తీసుకోవడం అస్పత్రిలో చేర్పించడం కొత్త కాదు. కాని దానికి ముందు ప్రజాస్వామ్య ప్రక్రియవుంటుంది. ప్రభుత్వం సానుకూలంగా ప్రస్తావనలు చేస్తుంది. శాసనసభలో ముఖ్యమంత్రి వంటి వారు సాధికారికంగా ప్రకటన చేసి ప్రతినిధులను పంపిస్తారు. మధ్యవర్తులైన పెద్దమనుషులతో సంప్రదింపులు జరుపుతారు. సగౌరవంగా ముగింపు పలికేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పాలక పక్షం

ములాయం ముసలం




రోజుకో సంచలన వ్యాఖ్యతో యుపిఎ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సమాజ్‌ వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ మరిన్ని ఫిరంగులు పేల్చారు. కాంగ్రెస్‌ మోసకారి పార్టీ అని అధికారమే దాని పరమావధి అని విమర్శలు గుప్పించారు. పలుసార్లు మూడవ ఫ్రంట్‌ గురించి మాట్లాడ్డం ద్వారా కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వదిలారు. అయితే ఆయన రాజకీయ విన్యాసాలు, పిల్లిమొగ్గల నేపథ్యంలో వెంటనే స్పందించడానికి స్వాగతించడానికి ఎవరూ సిద్ధం కావడం లేదు.
మూడవ ఫ్రంట్‌ గురించి ములాయం మాటలపై అవిశ్వాసం పెరగడానికి ఆయన గత వైఖరే కారణం 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయినప్పుడు తిరిగి 2008లో యుపిఎ అణుఒప్పందంపై ఓటింగును ఎదుర్కొన్నప్పుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆఖరి నిముషంలో నిర్ణయాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇటీవల ఎఫ్‌డిఐల విషయంలోనూ ఆ పార్టీ అలాగే చేసింది. ఇవన్నీ గాక ఈ మధ్యన ఒక సభలో ములాయం బిజెపి నేత ఎల్‌.కె.అద్వానీపై ప్రశంసలు కురిపించడం, బిజెపి గనక తన మూడు మత అజెండాలను వెనక్కు తీసుకుంటే సహకరించవచ్చునని చెప్పడం సందేహాలు పెంచింది.
కేంద్రంలో మూడవ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందని మార్చి24న ములాయం చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ బిజెపి లు తోసిపుచ్చాయి. అయితే ఆయన మాత్రం సుష్మా స్వరాజ్‌, శరద్‌ పవార్‌లతో సహా అనేక మందిని కలుసుకుని హడావుడి చేస్తున్నారు. కర్ణాటకలో జనతాదళ్‌(ఎస్‌)తోనూ మంతనాలు జరుపుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అందరి సహకారం అవసరం గనకే ఆయన ఇన్ని తంటాలు పడుతున్నారనే మాట రాజధాని వర్గాల్లో వినిపిస్తున్నది.యుపి రాజకీయాల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన బిఎస్‌పి నేత మాయావతి కూడా ప్రదాని కావాలన్న కోర్కెను బాహాటంగానే వెలిబుచ్చారు.ఈ ఉభయుల మధ్య పోటీ ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలను ఎలాటి మలుపులు తిప్పుతుందో ఆ మధ్యన కాంగ్రెస్‌ బిజెపిలు ఎలాటి రాజకీయం నడుపుతాయో చూడవలసిందే. కాకపోతే రాహుల్‌ గాంధీ కూడా పార్లమెంటుకు అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు వస్తే మంచిదని భావిస్తున్నాడనేది ఒక వాదన. దాన్నిబట్టి ఎన్నికలు ముందుగా జరిగే అవకాశం చాలా వుందనే చెప్పాలి.


Wednesday, March 6, 2013

అగ్నియోధునికి అశ్రుతర్పణ



వెనిజులా వేగుచుక్క, ప్రత్యామ్నాయ శక్తుల చైతన్య పతాక హ్యూగో చావేజ్‌ అస్తమయం మాటలకందని విషాదం. నాలుగోసారి దేశాద్యక్షుడుగా అప్రతిహత విజయం సాధించిన ఆ అచంచల యోధ రెండేళ్ల కాన్సర్‌ పోరాటంలో కన్నుమూయడం నమ్మక తప్పని నిజం. ఈ విషాద వార్త దేశాల సరిహద్దులకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రియులు స్వాతంత్రం పిపాసులందరిలోనూ శోకాన్ని రగిలించింది. ఎందుకంటే చావేజ్‌ ఒకానొక చారిత్రిక దశలో దిశా నిర్దేశం చేసిన ధీరుడు, ధీశాలి. సోవియట్‌ విచ్చిన్నానంతరం ప్రజాచైతన్యం ప్రతిఘటన అన్నవి మటుమాయమై పోతాయని ఆశపడిన దుష్టశక్తుల దురాశలను దునుమాడుతూ అతి బలమైన అమెరికా సామ్రాజ్యవాదాన్ని అతి దగ్గర నుంచి సవాలు చేసిన సాహస నేనాని. సమర్థ పాలకుడు.
చిల్లర వ్యాపారంలాటి రంగాల్లో ఇండియా విదేశీ పెట్టుబడులను అనుమతించడం లేదని అగ్రరాజ్యాధినేత ఒబామా పెదవి విరవడం.. ప్రధాని అసమర్థ సాధకుడని, విషాద యోగి అని అమెరికా మీడియా తీసిపారేయడం,, ప్రపంచ కార్పొరేటింగ్‌ సంస్థలు ఇండియా స్థానాన్ని దిగువకు నెట్టడం.. అన్యధా శరణం నాస్తి అన్నట్టు అమెరికా ఆదేశాలను ఆఘమేఘాల మీద అమలు చేసేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టడం మొన్నటి ముచ్చటే. ఇలాటి ప్రపంచంలో ఒకడు... మన కన్నా చాలా చిన్నదైన దేశపాలకుడు..... అమెరికాకు అతి సమీపస్తుడు..... నిన్నమొన్నటిదాకా అంకుల్‌ శ్యాం పెరటిదొడ్డిగా వారి కీలుబొమ్మలైన సైనిక పాలకుల చేతిలో నలిగిన మెలిగిన చరిత్రకు వారసుడు... ఐరాస సమావేశంలో ఆ అమెరికా అధినేతనే భూతంగా వర్ణించిన ఏకైక నాయకుడు చావేజ్‌. ప్రపంచ బ్యాంకు ఆదేశాల బాటలో దివాళా ఎత్తుతున్న దేశాలకు ప్రత్యామ్నాయం చూపుతూ మరెక్కడా లేనంత వేగంగా తీవ్రంగా ప్రజానుకూల విధానాలు అమలు చేసిన

Friday, March 1, 2013

అరుణారుణ.. త్రిపుర




త్రిపురలో అరుణ పతాక జైత్రయాత్ర అభ్యుదయ శక్తులకు అమితోత్సాహం కలిగించే పరిణామం. అస్థిరతకూ అవకాశవాద రాజకీయాలకు మారుపేరైన ఈశాన్య భారత రాజకీయాల్లో ఒక ఆశా కిరణంలా అరుణ తారలా భాసిస్తున్న త్రిపుర వామపక్ష ప్రభుత్వ విజయం నిజానికి దేశానికే ఒక ఉత్తేజం. కేంద్ర కాంగ్రెస్‌ కుట్రపన్ని వేర్పాటు వాద టియుజెఎస్‌(త్రిపుర ఉపజాతి యువసమితి)తో కలసి సైన్యం సహాయంతో అధికారం కైవశం చేసుకున్న 1988 ఎన్నికలను మినహాయిస్తే ఈ ముప్పై అయిదేళ్లలోనూ సిపిఎం వామపక్ష ఫ్రంట్‌ విజయ పరంపరలు సాధిస్తూనే వుంది. విజయ దుందుభులు మోగిస్తూనే వుంది.ఈ విజయానికి కర్తలు చైతన్య వంతులైన ఆ రాష్ట్ర ప్రజలే. ప్రకృతి పరంగానూ, పాలక వర్గాల కుటిల వ్యూహాల కారణంగానూ, దేశ విద్రోహ శక్తుల కుట్రల కారణంగానూ అనేక సవాళ్లు సంక్లిష్లతలూ ఎదురైనా మొక్కవోని చైతన్యం అది. దాడులు దౌర్జన్యాలూ నిర్బంధాలు నరమేధాలకు చలించని సాహసం అది. అందుకే ఈ విజయోత్సవ సన్నివేశంలో త్రిపుర మహాజనానికి మా జేజేలు. అక్కడ వామపక్ష ప్రభుత్వానికీ సిపిఎం నాయకత్వానికి శ్రేణులకు మా విప్లవాభినందనలు.
అది 1977.కేంద్రంలో తొలిసారి ఇందిరాగాందీ నిరంకుశ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బెంగాల్‌, తమిళనాడు మినహా అన్నిచోట్లా ఈ రెండు పార్టీల వారే విజయాలు సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ బిజెపిల చుట్టూ తిప్పినట్టే అప్పుడూ రెండు పార్టీల సిద్ధాంతం ముందుకు తెచ్చే ప్రయత్నం ప్రచారం జరిగాయి. అదిగో అలాటి సమయంలో 1977 చివరి తేదీన అంటే డిసెంబరు 31న నూతన భానోదయాన్ని సూచిస్తూ త్రిపుర వామపక్ష సంఘటన అపురూప విజయం సాధించింది.అరవైకి యాభై నాలుగు స్థానాలు గెలుపొందటమే గాక కాంగ్రెస్‌ బిజెపిలకు ఒక్క సీటు లేకుండా చేసింది. దీనికి వెనక త్రిపుర ప్రజల

బడ్జెట్‌ బండారం



అనితర సాధ్యంగా ఎనిమిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం చిదంబరానికి ఎందుకు వచ్చిందో యుపిఎ 2 తరపున ఆయన సమర్పించిన ఆఖరి బడ్జెట్‌ తేటతెల్లం చేస్తున్నది. దేశ ఆర్థిక పరిస్థితిపై తానే ఇచ్చిన సర్వేలో పేర్కొన్న సమస్యలు వేటికీ పరిష్కారాలు చూపకపోగా మరింత జటిలం చేసే ఝంఝాటమే ప్రదర్శించారు. నిన్న మా సంపాదకీయంలో చెప్పినట్టు ఆ సర్వే బడ్జెట్‌కు ఉపోద్ఘాతం అనుకుంటే అందులో ఇచ్చిన దుస్సలహాల హాలాహలమే చిదంబర బడ్జెట్‌ సారాంశం. ఈడిగిల బడిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసే ఏ ఒక్క నిర్దిష్ట చర్యనైనా ప్రతిపాదించింది లేకపోగా సామాన్య జన వ్యతిరేకమైన వాటిని మాత్రం మహౌత్సాహంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి. సబ్సిడీల స్తంభన,కోత వాటిలో భాగమే. కంటితుడుపుగా కాస్త పెంపు చూపిించినా పెరిగిన ధరలతో పోలిస్తే అవి అక్కరకు వచ్చేవి కావు. అమెరికా తదితర దేశాలలో విరుచుకు పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయిటపడ్డామని గొప్పలు పోయిన ఆర్తిక మంత్రి అందుకు రక్షగా నిలిచిన బ్యాంకులు బీమా సంస్థలపైనే వేటు వేసేందుకు సిద్దం కావడం ఒక విడ్డూరం. అవినీతి భాగోతాలకు ఆలవాలమైన బొగ్గు చమురు సహజవాయు రంగాల్లోనే ప్రభుత్వ సంస్థలు నేరుగా ప్రైవేటుతో కలవొచ్చని ప్రతిపాదించడం బంగారు బాతులను అప్పజెప్పడమే. వ్యవసాయం నాలుగు శాతం కూడా అభివృద్ధి సాధించలేని స్తితిలో

Friday, February 22, 2013

ఆత్మస్తుతి ఆర్భాటాల మధ్య అభద్రాంధ్ర ప్రదేశ్‌


హైదరాబాదు దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయింత్రం సంభవించిన విధ్వంసక విస్పోటనం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై ఒక పరోక్ష వ్యాఖ్యానం. సహకార ఎన్నికల విజయాలపై శ్రుతిమించిన ఉత్సాహంలో మునిగి ఆత్మ స్తుతి అవధులు దాటిన అధినేతలకు ఒక కుదుపు. మరొకరికి పని లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పరస్పరం అభిశంసించుకుంటున్న అరుదైన ఘట్టం! ఆ క్రమంలో రెండు చోట్లా పాలిస్తున్న పార్టీ అపహాస్యం పాలవుతున్న వైపరీత్యం.
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు అకస్మాత్తుగా అనూహ్యంగా జరిగిన పరిణామాలు కాదు. హైదరాబాదుకు బాంబు దాడులు ముప్పు పొంచి వున్నదని గత నెలరోజులుగా హెచ్చరికలు వినిపిస్తూనే వున్నాయి. ప్రజాశక్తి కూడా గత నెల 13వ తేదీన పతాక శీర్షిక నిచ్చి ప్రచురించింది. ఇతరత్రా కూడా బాంబు హెచ్చరికలు వచ్చి శాసనసభను డిజిపి కార్యాలయాన్ని తనిఖీలు చేసిన సందర్భాలున్నాయి. ఒకటి రెండు చోట్ల బాంబులను నిర్వీర్యం చేసిన ఘటనలూ వున్నాయి. అన్నిటినీ మించి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో రకరకాల రాజకీయ శక్తులు పాచికలు వేస్తున్న తీరు విదితమవుతూనే వుంది. మతోద్రిక్తతలు పెంచేందుకు దేశ విదేశాలలో పొంచి చూస్తున్న సంస్థలు పక్షాల గురించి చెప్పనవసరం లేదు. భాగ్యలక్ష్మి వివాదంతో మొదలై అక్చరుద్దీన్‌ అరెస్టు విడుదల వరకూ జరిగిన పరిణామాలు సహజంగానే ఉద్రిక్తత పెంచాయి. ప్రాంతీయ వివాదాలపై వాదోపవాదాలు కూడా అనిశ్చితిని పెంచి ఆందోళన కలిగించాయి. గత నెలలో బాంబులు పట్టుపడటం, డిజిపి కార్యాలయం శాసనసభలతో సహా బెదిరింపులు రావడం తెలిసిన విషయమే. వీటిపై ప్రజాశక్తి పతాక శీర్షికలు ఇచ్చింది కూడా. సామాన్య ప్రజలు కూడా సందేహిస్తున్న ముప్పు సూచనలు ఏలిన వారికి మాత్రం కనిపించలేదు. కేంద్రం హెచ్చరికలు పంపితే అవి మామూలే అనుకున్నారట!(వారిని కాపాడ్డం కోసం ఇప్పుడు కేంద్ర హౌమంత్రి కూడా మామూలు పల్లవి ఎత్తుకున్నారు) అలసత్వం లేదా అసమర్థత ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ప్రస్తావించకుండా వుండటం ఎలా సాధ్యం?
కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక తక్కిన దేశంతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా

కుట్రలు వమ్ము చేయాలి



మానవ లక్షణాలే కోల్పోయిన ముష్కర హంతకుల ఉన్మాద హత్యాకాండకు అమాయకులూ అసహాయులే అత్యధికంగా బలవుతుంటారు. గురువారం సాయింత్రం దిల్‌సుఖ్‌నగర్‌లో హఠాత్‌ హంతక విస్పోటనాలకు విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయిన వారంతా ఈ కోవకు చెందిన వారే. నాగరికతకూ ఆధునికతకూ మానని వ్రణంలా తయారైన రకరకాల ఉగ్రవాదాల విచక్షణా రహిత హత్యాకాండతో వర్తమాన ప్రపంచం అందులో భాగంగా భారత దేశం కూడా తల్లడిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదు నగరం కూడా ఉగ్రవాద మారణహౌమాలకు ఒక కేంద్రబిందువుగా మారడం అత్యంత ఆందోళన కరం. ఈ విషయం గత కొన్నేళ్లలో అనేక సార్లు రుజువైనా అలసత్వం వీడని పాలకుల పోలీసుల అలసత్వం మరింత అపాయకరం. గత నెలరోజుల్లోనూ పొంచి వున్న ముప్పు గురించిన ప్రజాశక్తి కథనాలతో సహా అనేకానేక హెచ్చరికలు వెలువడ్డాయి. ఆఖరుకు ఆ పార్టీకే చెందిన కేంద్ర హౌంశాఖ మంత్రి కూడా ముందస్తు సమాచారం పంపించానంటున్నారు. అయినా సరే అప్రమత్తం కాని అధికార యంత్రాంగాన్ని అధినేతలను ఏమనాలి? ఏమన్నా అది రాజకీయం చేయడం అంటారు గాని మరెవరిని అనాలి?
లుంబిని గోకుల్‌చాట్‌ పేలుళ్ల తరుణంలోనే రాజధాని గుండె చెదిరింది. ఆ తర్వాత సాగిన ఆక్టోపస్‌ వ్యవహారం అదో పెద్ద ప్రహసనం. గత మూడేళ్లలోనూ రాష్ట్రంలో తిష్ట వేసిన అనిశ్చితి నడుమ హైదరాబాదులో పోటాపోటీ మత తత్వాల మధ్య పొంచి వున్న ప్రమాదంపై ప్రమత్తత వూహకందని విషయం. అఫ్జల్‌ గురు ఉరితో సహా అనేకానేక కారణాలు ఏకరువు పెట్టొచ్చు గాని అన్నిటికన్నా కీలకం అలసత్వమే. ఉగ్రవాద కుట్రలను ఛేదించడం నూటికి నూరు పాళ్లు సాద్యం కాకపోవచ్చు గాని విశృంఖల మారణ వ్యూహాలన అరికట్టడానికి పటిష్టమైన నిఘా నియంత్రణ అవసరం. దురదృష్టవశాత్తూ పదే పదే ఉగ్రవాదం పంజా విసురుతున్నా పోలీసు బాసులు గాని ప్రభుత్వ నేతలు గాని మేల్కొనడం లేదు. ఘటన జరిగిన తర్వాత గంభీర ప్రకటనలు ఎన్ని చేసినా వ్యర్థమే. ఇప్పుడు కూడా ఘటనా స్థలంలో సిసి కెమెరాల వైఫల్యం, ముందు

Friday, February 1, 2013

గడువులు, గండాలు



దూషణలు దుర్బాషల్లో తెలుగు నేతలంతా ప్రాంతాతీతమైన సమైక్య భావన ప్రదర్శించడం సమకాలీన రాజకీయాల్లో ఒక విలక్షణత. భావం భాష కన్నా ఎప్పుడూ ముఖ్యమైంది. కాని కావాలని భాషను విశృంఖలంగా ఉపయోగించినప్పుడు అసలు కన్నా కొసరు అన్నట్టు దానిచుట్టూనే పరిభ్రమించే విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంటుంది. మాటల మాంత్రికుడుగా మీడియా నామకరణం చేసిన టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. ఆంధ్ర తెలంగాణాలకు చెందిన గత ప్రస్తుత కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలపైన ఆయన ఉపయోగించిన భాష పదజాలంపై పెద్ద దుమారం సాగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. కొన్ని కేసులు కూడా నమోదైనాయి. ఇవన్నీ చివరకు ఎలా పరిణమిస్తాయో తెలియదు గాని ఇప్పటికైతే దీని వల్ల చర్చ తీరు మారిపోయింది. నెల అంటే రెండు నెలలు కావచ్చని ప్రజల ఇంగిత జ్ఞానాన్నే ప్రశ్నించిన కేంద్రం నిర్వాకం వెనక్కు పోయింది.
కెసిఆర్‌ ఇలా మాట్లాడ్డం ఇదే మొదటి సారి కాదు, బహుశా చివరి సారి కూడా కాబోదు! ఇస్తే వరం పెడితే శాపం అన్నట్టు ఆయన వ్యూహాత్మక బాషణాలన్ని విపరీతమైన మలుపులు తిరుగుతుంటాయి. వివాదంలో అవతలి పక్షాన్ని హీనాతిహీనంగా తీసిపారేయడం ద్వారా తనను తాను ఉన్నతంగా ప్రతిష్టించుకుని తన వాళ్లకు భరోసా ఇవ్వడం రాజకీయాల్లో ఒక బాణీ అనుకుంటే కెసిఆర్‌ దానికి ప్రతిరూపమనొచ్చు. అయితే శ్రుతిమించితే ఎలాటి వ్యూహమైనా బెడిసికొడుతుందనడానికి ఇప్పటి పరిస్థితి ఒక ఉదాహరణ.కాంగ్రెసేతర పార్టీలపై ఆయన దాడి సాగినంత కాలం వీణారవంలాగా వున్న ఈ మాటలే ఇప్పుడు విషతుల్యమై పోయాయంటే

Wednesday, January 23, 2013

తలచినదే జరిగినదీ!



తలచినదే జరిగినదా దైవం ఎందులకూ అనే ఒక సినిమా పాట కాంగ్రెస్‌ విషయంలో మాత్రం తిరగబడుతుంటుంది. దేవుడి విషయం పక్కనబెడితే ఆ పార్టీ మాటల గారడీని రాజకీయ మాయాజాలాన్ని పదే పదే చూసిన ప్రజలు చెప్పగానే నమ్మేసే స్థితి ఎప్పుడో మారిపోయింది. నెల రోజుల గడువులో తెలంగాణాపై ప్రకటన చేస్తామన్న హౌం మంత్రి హామీని కూడా నా వంటి వాళ్లం విమర్శనాత్మకంగానే తీసుకున్నాము. ఆ ప్రకటన వచ్చిన రోజున నేను తిరుపతిలో తెలుగు మహాసభల్లో వున్నాను. నెల అంటే బాగానే వుంది గాని నెలకు 365 రోజులు కాకుండా చూడాలని సరదాగా అన్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అదే నిజమైనట్టు కనిపిస్తుంది. మూడు రోజులు ముందుగానే గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు కథ మొదటికి వచ్చిందని తేల్చేశాయి. ఇందుకు సీమాంధ్ర నాయకుల లాబీయింగ్‌ కారణమని తెలంగాణా వాదులు చేసే ఆరోపణ పాక్షికంగానే సత్యం. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణా సీమాంధ్ర నాయకులు వుభయులూ వ్యవహరిస్తుంటారన్నది పూర్తి సత్యం. ఉభయ ప్రాంతాల నేతలకూ ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి. ఏదో విధంగా కేంద్ర రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకోవడంలో వారికి ఎలాటి విభేదాలు వుండవు. ఆజాదూ అని మీడియాలో ఆయన పేరును సరదాగా రాస్తుంటారు గాని నిజానికి ఆ జాదు కాంగ్రెస్‌ రాజనీతిదే!రేపు దీనిపై మరో సవరణో వివరణో వచ్చినా ఆశ్చర్యం లేదు. కనక అన్ని ప్రాంతాల ప్రజలూ అప్రమత్తంగానూ సంయమనంతోనూ వుంటేనే ఈ రాజకీయ మాయోపాయాలను తిప్పికొట్టడం సాధ్యమవుతుంది. విద్యుచ్చక్తి భారాలు, ఆర్టీసీ చార్జీలు అధిక ధరలు అవినీతి వ్యవహారాలపై పోరాడటం అందుకో మార్గం. అన్ని పార్టీలూ 2014 ఎన్నికలపై దృష్టి పెట్టి వున్నాయి గనక అసలు సంగతి అప్పుడే తేలుతుంది.

Friday, January 18, 2013

హైదరాబాద్‌ చర్చ తీవ్రం



అవసరమైతే హైదరాబాదు ప్రతిపత్తిపై రెఫరెండంకు  సిద్ధమని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్య రాజధానిపై మధనాన్ని మరింత తీవ్రం చేసింది. ఇప్పటి వరకూ మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌, తెలుగుదేశం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఈ ప్రత్యేక ప్రతిపత్తి కోరుతూ వచ్చారు. ఏ పరిస్థితిలోనూ హైదరాబాద్‌పై చర్చకు ఆస్కారమే లేదనీ, వదులుకునే ప్రసక్తి లేదని టిఆర్‌ఎస్‌ ఘంటా పథంగా చెబుతూ వచ్చింది. అలాటిది గురువారం నాడు ఒక టీవీ చర్చ మధ్యలో జొక్యం చేసుకున్న కె.సి.ఆర్‌ అనపర్తి ఎంఎల్‌ఎ శేషారెడ్ది ప్రశ్నకు జవాబుగా తాము రెఫరెండంకు సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. తెలంగాణా విడిపోవాలని ఆ ప్రాంతంలో 99.9 శాతం మంది కోరుకుంటారన్న ఆయన మాటలు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు గాని రెఫరెండంకు సంసిద్ధమనడమే చర్చను కొత్త మలుపు తిప్పింది. హైదరాబాదు ఒక్కటే ఇప్పుడు నిర్ణయానికి ఆటంకమవుతుందనే భావన బాగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి రాష్ట్ర భవిష్యత్తుపై ప్రకటన రాకుండా ఒక్క హైదరాబాదు గురించిన చర్చ జరిగే అవకాశం చాలా తక్కువ. కాగా హైదరాబాదు చర్చనే ముందు చేపడితే తెలంగాణా చర్చ వెనక్కు పోయే అవకాశం కూడా వుంటుంది. ఇవన్నీ తెలిసి కూడా కెసిఆర్‌ రెఫరెండంకు సిద్ధమని చెప్పడంలో వ్యూహాత్మక కారణాలుంటాయని భావిస్తున్నారు. అందుకు తగినట్టే
కెసిఆర్‌ ఆలా అని వుండాల్సింది కాదని టిఆర్‌ఎస్‌లో కొందరు భావిస్తున్నారు గనకే

పాక్‌ ప్రమాద వ్యూహం


భారత సైనికులు హేమరాజ్‌, సుధాకర్‌లను అమానుషంగా హతమార్చి మృతదేహాలను పంపించిన పాకిస్తాన్‌ దుశ్చర్య వెనక దుస్తంత్రం చాలా ప్రమాదకరమైంది. ఇటీవలి కాలంలో సంబంధాల సాధారణీకరణ చర్యల గురించిన మాటలు జరుగుతుండగా హఠాత్తుగా ఇంతటి అఘాయిత్యం జరగడం అందరినీ దిగ్భ్రాంత పరిచింది.అలవాటైన సైనిక పద్ధతుల ప్రకారం ఆ మరుసటి రోజున భారత సైన్యం కాల్పుల్లోనూ ఒక పాకిస్తాన్‌ జవాను మరణించాడు. దాయాదులుగా పిలవబడే ఈ రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతల పర్వంలో ఇది కొత్త అధ్యాయం. ఇప్పటికి మూడు సార్లు యుధ్ధాలు చేసుకున్న ఉభయ దేశాలు 1998లో టీవీల సాక్షిగా కార్గిల్‌ ఘర్షణను కూడా చూశాయి.ఈ అన్ని సందర్భాల్లోనూ వివాదాన్ని ఘర్షణను రగిలించింది పాకిస్తాన్‌ అనడంలో సందేహం లేదు. దీని వెనక తీవ్రమైన అంతర్జాతీయ రాజకీయ వ్యూహాలు వున్నాయన్నది కూడా నిజం. భారత ఉపఖండంలో ఉద్రిక్తతలను రగిలించడం, పెద్ద దేశమైన భారత్‌ను నిరంతరం చక్రబంధంలో ఇరికించడం పాకిస్తాన్‌ నిరంకుశ సైనిక- రాజకీయ - అధికార దుష్టత్రయం వ్యూహమైతే అందుకు ప్రేరణ, నిర్ధేశకత్వం అమెరికా సామ్రాజ్యవాదానిది. ఆఖరుకు తమ నాయకురాలైన బెనజీర్‌ భుట్టోతో సహా వందలాది మందిని ఉగ్రవాదదాడుల్లో బలి చేసుకున్న పాకిస్తాన్‌ భారత్‌కు వ్యతిరేకంగా అలాటి ఉగ్రవాద కార్యకలాపాలనే మూర్ఖంగా కొనసాగిస్తున్నదంటే కారణం అది ఆ దేశ పాలక కూటమి అస్తిత్వానికి మూలాధారం కావడమే.
గతంలో మూడు యుధ్దాలు ఒక సాయుధ ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాలు 2003 నవంబరులో వాస్తవాధీన రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఆమాత్రమైనా ఉపశమనం కలిగినందుకు అందరూ ఆనందించినా అది పైపై వ్యవహారమేనని కూడా అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు ఏదో సాకుతో కాల్పులు ఘర్షణలు చొరబాట్టు జరుగుతూనే వస్తున్నాయి. కొత్త నిర్మాణాలు, బంకర్ల మరమ్మత్తులు వంటివి ప్రత్యేకంగా కారణమవుతుంటాయి. కాశ్మీరీ ప్రజలను రెండుగా విభజించిన యుద్దాల ప్రభావం కూడా దీనివెనక వుంటుంది. ఆరు మాసాల కిందట ఒక వృద్ధ మాత సరిహద్దుకు ఆవల వున్న తన కుటుంబసభ్యులను చూసేందుకు వెళ్లిరావడం చినికి చినికి గాలివానై తాజా ఘటనలను ఘర్షణలకు దారి తీసిందని

స్వాములకైనా..చట్టం చట్టమే



శ్రీశైలంలో స్వామి కమలానంద భారతిని అరెస్టు చేయడం హిందూ మతంపైన దాడిగా సంఘ పరివార్‌ ప్రతినిధులు గగ్గోలు పెట్టడం ఏ విధంగానూ సమర్థించరాని విషయం. మజ్లిస్‌ నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ మత భావాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తప్పయితే కమలానందులది కూడా తప్పే. సంక్రాంతి నాడు స్వామీజీని అరెస్టు చేశారంటూ రాజకీయాలతో సంబంధం లేదనే సాధుసంతులు అనేకులు ధ్వజమెత్తడం మరింత అవాంచనీయం. సాధువులకైనా సన్యాసులకైనా మౌల్వీలు పాధర్లు ఎవరికైనా చట్టం చట్టమే. నిజానికి సంయమన శీలతకు ప్రతిరూపంగా వుండాల్సిన స్వామీజీ బిరుదాంకితులకు ఇది మరింతగా వర్తిస్తుంది. కమలానంద అరెస్టు న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జరిగిందే తప్ప ఎవరి ఇష్టానుసారం చేసింది కాదు. ఇందిరా పార్కు దగ్గర ఆయన మాట్లాడిన మాటలు కూడా తెలియనివి కావు. ఉద్రిక్త వాతావరణం వున్నప్పుడు బాధ్యత గలవారెవరైనా ఆచితూచి మాట్లాడాల్సి వుంటుంది.అంతేగాని అవతలివారిపై రెచ్చగొట్టడమే ఏకైక లక్ష్యంగా నోరు పారేసుకోవడం దురుద్దేశపూరితం. ఇలాటి ప్రసంగాలకు ప్రజలు స్పందించడం లేదంటే అది వారి పరిపక్వత మాత్రమే. వాస్తవంలో అది భారతీయ సమాజంలో అంతర్లీనంగా వుండే లౌకికతత్వం,మత సామరస్యాల ప్రతిబింబం. అయితే ఆ మౌలిక విలువలకే చేటు తెచ్చేలా ఇటీవలి పరిణామాలు వుండటం ఆందోళన కలిగిస్తుంది. కమలానంద భారతి దేవుళ్లను దూషించలేదంటూ సమర్థించే వారు అంతకన్నా తల్లిని మించిన దైవం లేనేలేదు అన్న మానవజాతి మహౌన్నత సూక్తిని విస్మరిస్తున్నారు. ఆ వాదనలన్ని అలా వుంచి వివాదం న్యాయస్థానంలో వున్నప్పుడు దాని ఆదేశాల కోసం అంతిమతీర్పు కోసం ఎదురు చూడాలి తప్ప తమకు తామే తీర్పులిచ్చేసుకుని ఆవేశపడిపోతే కుదిరేపని కాదు. పొంచి కూచున్న రకరకాల మతోన్మాద శక్తుల పాచికల నుంచి మతసామరస్యాన్ని సామాజిక శాంతిని కాపాడుకోవడమే ఇప్పుడు ప్రథమ కర్తవ్యం.

సమీక్షా లేశం లేని శత చంద్ర దినోత్సవం


తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకోవడం సహజంగానే ఆ పార్టీ ముఖ్య నాయక గణానికి సంబరంగా మారింది. ఈ క్రమంలో ఆయన గతంలో వైఎస్‌రాజశేఖర రెడ్డి నడిచిన దూరాన్ని అధిగమించాడన్నది కూడా ప్రచారంలో ప్రధానాంశమైంది. కొన్ని పత్రికలు అత్యుత్సాహంతో వెనక రాజశేఖరరెడ్డిని వేసి చంద్రబాబు ఆయనను మించిపోయినట్టు చిత్రాలు ప్రచురించాయి. సజీవంగా వున్నప్పుడు ఈ ఇద్దరు నాయకుల మధ్యనే రాజకీయ పోటీ అన్నట్టు చిత్రించింది చాలక ఆయన మరణానంతరం కూడా దాన్నే కొనసాగించడం కొంత విడ్డూరంగానే వుంది. వాస్తవానికి రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల జగన్‌ పార్టీ తరపున పోటీ యాత్ర నడిపించిందనే వాస్తవం గుర్తు చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కొంటున్నది ఆయన సంతానాన్ని అని అర్థమవుతుంది. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న మీమాంస బొత్తిగా అనవసరం. ఈ పాదయాత్రలేవీ పేద యాత్రలు కావని నేను చాలా చర్చల్లో సరదాగా అన్నాను. బలమైన పాలక పక్ష నేతలు అధికారం కోసం జరుపుతున్న యాత్రలు ఇవి. వీటికి స్పష్టమైన నేపథ్యం వుంది. హంగూ ఆర్భాటాలు కూడా వున్నాయి. చంద్రబాబు వయస్సు అరవై దాటిపోయింది గనక కాస్త శ్రమ అధికంగా వుండొచ్చు గాని దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక మందినాయకులు అనేక విధాల శ్రమదమాదుల కోర్చి ప్రజల కోసం పోరాడిన సందర్బాలున్నాయి.
ఇటీవలి కాలంలో తెలుగు దేశం ఎదుర్కొంటున్న ఇరకాటాలు, సంక్షోభాలు తగిలిన ఎదురుదెబ్బల దృష్ట్యా పార్టీకి కాస్త జవసత్వాలు కల్పించేందుకు శ్రేణులలో విశ్వాసం నింపేందుకు చంద్రబాబు యాత్ర ఉద్దేశించిందని అందరికీ తెలుసు.ఆ విషయంలో కొంత వరకూ ఫలితాలు సాధించివుండొచ్చు గాని విస్తార జనాలలో విశ్వసనీయత పొందగలిగారా అన్నది ముందు ముందు గాని తేలదు. బయిటి జనం విశ్వాసం మాట ఎలా వున్నా పార్టీ ఎంఎల్‌ఎలు, నాయకులు అవతలి పార్టీలలోకి వెళ్లకుండా ఆపడంలో కూడా ఆయన కృతకృత్యం కాలేకపోయారన్నది వాస్తవం. ఎందుకంటే ఈ యాత్రకు సమాంతరంగా అలాటి వలసలు సాగుతూనే వున్నాయి.ఇప్పటికీ ఆగిన దాఖలాలు లేవు.అలాగే తెలంగాణాపై స్పష్టత అన్న విషయం తీసుకుంటే పార్టీపై దాడిని తట్టుకోవడానికి కాస్త ఉపయోగపడే వైఖరి ప్రకటించగలిగారే తప్ప పూర్తిగా సుస్పష్టత ఇచ్చారని ఎవరూ అనలేరు.రాసిన లేఖలో అస్పష్టత, అఖిలపక్షానికి హాజరైన ప్రతినిధి చెప్పిన దాంట్లో స్పష్టత వుందనేది అత్యధకుల