Pages

Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

Thursday, September 15, 2011

మసక బారిన క్యారెక్టర్‌ పాత్రలు


సినిమా అంటే హీరో హీరోయిన్లే కదా.. ఫలానా హీరో సినిమా అంటారు.. అందుకోసం ఎదురు చూస్తారు.. బాగుంటే కేరింతలు కొట్టడం,బాగాలేకుంటే చప్పుడుచేయకుండా సర్దుకోవడం ఇవన్నీ మామూలే. మొత్తం ప్రచారమంతా ఆ హీరోల చుట్టూనే! కొంతవరకు హీరోయిన్లు ఆ పైన కమెడియన్తు, కొత్తగా వచ్చిన వారైతే విలన్లు.. అంతే! అయితే ఏ చిత్రం కూడా వీళ్లతోనే పూర్తయిపోదు. వీళ్లకు తోడుగా అనేక ఇతర పాత్రలుంటాయి. అవే క్యారెక్టర్‌ పాత్రలు.
తమాషా ఏమంటే అసలు క్యారెక్టర్‌ అంటేనే పాత్ర. మరి క్యారెక్టర్‌ పాత్రలేమిటి అంటే ఇది సినిమా భాష. నాయికానాయకులు చుట్టూ తిరిగే సినిమా రంగంలో ఇతరత్రా ప్రాధాన్యత గల పాత్రలను ఆ పేరుతో పిలవడం కద్దు. మామూలు భాషలో చెప్పాలంటే తల్లులు, తండ్రులు, అన్నలు, వదినెలు, అత్తలు మామలు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, జానపదాల్లో రాజులు మంత్రులు వంటి పాత్రలు. ఇవన్నీ చెబుతుండగానే పాఠకుల కళ్లలో కొందరు మహామహులైన నటీనటులు కదలాడటం మొదలెడతారు. సందేహం లేదు-నాలుగు పదులకు అటూ ఇటుగా వున్నవారికి ఆ పై వారికి ముందుగా గుర్తుకు వచ్చే గంభీర విగ్రహుడు ఎస్వీఆర్‌. తర్వాత

ఉద్వేగాల చెలగాటం రియాల్టీ 'షో'


ఈ రోజుల్లో ఏ రోజు ఎవరు మాట్లాడుకున్నా టీవీ ప్రసక్తి లేకుండా ముగియదు. ఒకప్పుడు సినిమాల్లో చూపించినట్టు అనేవారు ఈ రోజున ప్రతిదానికి టీవీనే ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే టీవీ జీవితాన్ని దృశ్యమానం చేసింది.
టెలివిజన్‌ కేవలం వినోద సాధనమే కాదు, సమాచార సాధనమే కాదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పార్శ్వాలన్నింటినీ ఒక్క దెబ్బలో సమన్వయ పర్చగలిగిన ఇలాంటి అపురూప సాధనం ఏదీ ఇంతకు ముందు మనుషులకు అందుబాటులో లేదు.
టీవీలో వచ్చే హింసా దృశ్యాలపైన లేదా వ్యాపార ప్రకటనలపైన తరచూ విమర్శలు వింటుంటాము. అవన్నీ నిజమే కాని అంతకంటే తీవ్రమైన ప్రభావం మన భావోద్వేగాలపై పడుతుంటుంది. అలాంటప్పుడు పది పదిహేనేళ్ల కిందటే ఈ మీడియా విస్తరించిన మన దేశం వంటి చోట్ల మరింత ఎక్కువగా ఈ ప్రభావం వుం డడం చాలా సహజం. మనకంటే దాదాపు యాభై ఏళ్ల ముందే టీవీ విప్లవం చూసిన అమెరికా వంటి దేశాల్లోనే దీని గురించి ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
టీవీ చూడాలంటే ఏకకాలంలో మన కళ్లు చెవులు కూడా పనిచేయాలి. ఏది ఎంత వరకు స్వీకరించాలి, ఏది అట్టిపెట్టుకోవాలి, ఏది తోసిపుచ్చాలి అని విశ్లేషించుకోవడానికి మెదడుకు వ్యవధి కావాలి కాని అంత వ్యవధి తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. చూసే ప్రేక్షకుల పరిపక్వతను బట్టి అది ఆధారపడి వుంటుంది. అన్ని వయస్సుల వారు కలసి చూసే పరిస్థితిలో ఇది మరింత సత్యం. సమస్య ఏమిటంటే చూసే వారిపైనే కాదు, పాల్గొనే వారిపైన కూడా టీవీ కార్యక్రమాల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. అందుకే అది అన్ని విధాల మనుషుల భావోద్వేగాలతో ముడిపడిన వేల కోట్ల రూపాయల వ్యాపారం. సామాజిక కళాత్మక కార్యక్రమంగా కనిపిస్తుంటుంది. కనుక పూర్తిగా వ్యాపారం అనడానికి కూడా వుండదు. సమాచార సంబంధమైన విధినిర్వహణగా అనిపిస్తుంటుంది. కాని.. ఆ క్రమంలో మన కష్టసుఖాలూ, బాధలూ భావనలూ, ప్రేమలు, చావులూ, హత్యలూ, భక్తి, రక్తి అన్నీ బహిరంగ విన్యాసాలుగా మారిపోతుంటాయి. ఎప్పుడైతే బహిరంగ

వైభవ విషాదం- సావిత్రి!


ఆమెను తల్చుకోగానే తెలుగు దనం తొణకిసలాడే ఒక కళాత్మక మహిళా మూర్తి మనసులో కదలాడుతుంది. అభినయం మూర్తీభవించిన విదుషీమణి సాక్షాత్కరిస్తుంది. నటీనటులు ధరించిన పాత్రలూ వారి వాస్తవ జీవితాలూ పెనవేసుకు పోవడం అరుదుగానైనా జరుగుతుంటుంది. అందులోనే అనేక వైరుధ్యాలూ వుంటాయి. అలాటి అరుదైన జీవితం సావిత్రిది! ఆమె తర్వాత ఎంత ప్రతిభా వంతులైన కథానాయికలు వచ్చినా ఒక పట్టాన ఆమెతో పోల్చలేని స్థితి కొనసాగుతూనే వుంది. వాణిశ్రీ, శారద, సుహాసిని, సౌందర్య ఇలాటి వారిని ఎంతగానో ఆరాధించేవారు కూడా. సావిత్రిలోని సంపూర్ణత్వం వుందని మాత్రం పూర్తిగా ఆమోదించలేరు. ఆమె వేసిన ముద్ర అంత ప్రగాఢమైంది.
కొంతమంది లాగా సావిత్రి బంగారు సోపానాలపై నడిచి రాలేదు. వెండి తెర ఆమెకు ఎర్రతివాచీలు పర్చి ఆహ్వానించలేదు. నటనపై ఎనలేని మక్కువతో- ఎన్ని సార్లు కాదన్నా ఎదురీద గల తెగువతో ఆమె పోరాడి నిలదొక్కుకుంది. తెరపై ఒక మూల ఒక్కసారి కనిపించే పాత్రలైనా ధరించేందుకు సిద్ధపడి తర్వాత అక్కడ ఎవరున్నా తననే చూపించకతప్పని

అమర గాయకుని అద్భుత గీతావళి


  హీరో కృష్ణకు పద్మభూషణ్‌ పురస్కారం లభించగానే ప్రతి ఛానెల్‌లో కనిపించిన దృశ్యం 'తెలుగు వీర లేవరా' అన్న పాట. తెరపై ఎందరో నాయకులు నాయికలు ప్రతినాయకులు విదూషకులు, వుండొచ్చు. తెర వెనక దర్శకులు నిర్దేశకులు సాంకేతిక నిపుణులు మరింత మంది వుండొచ్చు. వారు కలసి రూపొందించిన చిత్రాల్లో అమోఘమైన సన్నివేశాలు పోరాటాలు, నృత్యాలు, సంభాషణలు మరెన్నో వుండొచ్చు. కాని - సినిమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా గుర్తుండి పోయేవీ, నిరంతరం పెదవులపై కదలాడేవీ మాత్రం అందులోని పాటలే. తరాలు మారినా తరగని మాధుర్యం వాటిలో ఇమిడి వుండటమే ఇందుకు కారణం. సైగల్‌, మన్నాడే, మహ్మద్‌ రఫీ, కిశోర్‌ కుమార్‌, లతా మంగేష్కర్‌ వంటి వారి పాటలు అప్పటికీ ఇప్పటికీ భారతీయుల హృదయాలలో వెన్నెల పూలు పూయిస్తూనే వున్నాయి. ప్రేమ వియోగం, విషాదం, వినోదం తదితర రకరకాల సందర్భాలలో మదిలో మెదులుతూనే వున్నాయి. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ ఆ కోవలో అగ్ర గణ్యుడు అమరగాయకుడు ఘంటసాల.
ఘంటసాల పేరు తల్చుకోగానే ఆయన మధుర స్వరం నుంచి జాలు వారిన మనోహర గీతాలు మనస్సును నింపేస్తాయి. వేయికి పైబడిన పాటలు, పద్యాలలో వారి వారి అభిరుచిని బట్టి అనుభూతిని బట్టి

Tuesday, September 13, 2011

నవరసాల బాటసారి

కాస్త వంగి నడవడం..

లత, రాధా అని ప్రేమగా పిలిచినా 
అమ్మా అని బరువుగా పిలిచినా 
ఆ కాస్తలోనే విరుపూ మాటలోనూ మనిషిలోనూ
శాలువా కప్పుకుని బరువుగా నడవడం
వేలు పైకి లేపి మాట్లాడ్డం
అర్థవంతమైన ఆక్షేపణీయమైన రీతిలో బిగ్గరగా నవ్వడం
ఆడవాళ్లకన్నా నాజూగ్గా కనిపించాలని ప్రయత్నించడం
కళ్లు పైకి కిందికీ తిప్పుతూ ఎదుటి వాళ్లను శల్య పరీక్ష చేయడం
తెలుగు వారికి చిరపరిచితమైన ఈ లక్షణాలన్ని ఎవరివో మళ్లీ చెప్పాలా?

Tuesday, December 21, 2010

తెలుగు తెర ఆనంద బ్రహ్మ

 

ఏం సినిమాకు వెళ్దాం?
ఫలానా సినిమాకు
బాగుంటుందా?
బ్రహ్మానందం వున్నాడు కదా...

ఆయన పాతికేళ్ల హాస్య రసానందమై,, ప్రేక్షకులు హృదయానందమై,నిర్మాతల కనకానందమై అలా అలా అలరాలుతూ రజతోత్సవ సన్నివేశం చేరుకున్నారు. ఓ ఎనిమిది వందల పై చిలుకు చిత్రాలు చేసేసి సహస్రాధికానికి సాగిపోతున్నారు. కమెడియన్‌ అని ద్వితీయ స్తానంలోకి నెటిyవేయబడే విదూషక పాత్రను తారాపథంలో నిలిపి నిన్నటి హాస్య నట చక్రవర్తుల సరసన తిరుగులేని