Pages

Sunday, April 10, 2011

తెలుగు దేశం కథనాలు..



తెలుగు దేశంలో నాయకత్వ పోరు జరుగుతున్నదంటూ ఇటీవల మీడియాలో వరుసగా వచ్చిన కథనాలపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తారు. కుటుంబాలు వ్యక్తులు రాజకీయాలు పెనవేసుకుపోతున్న నేటి స్తితిలో ఇది వూహించదగిన విషయమే. హరికృష్ణ కృష్ణాజిల్లాపర్యటన సందర్భంగా రేగిన దుమారం ఇందుకు ఒక కారణమే. ఆయన ఆయా సందర్భాలలో కాస్త భిన్న స్వరాలు వినిపించి సర్దుకోవడం తరచూ జరుగుతున్నది. ఇవన్నీ పూర్తిగా అంతర్గత విషయాలైనా తెలుగు దేశం ఇప్పుడున్న స్తితిలో ఎవరూ నాయకత్వ సమస్య రగిలించుకుంటారని భావించలేము. హరికృష్ణ ప్రకటన బహుశా ఒత్తిడి తీసుకురావడానికి దారి తీయవచ్చునేమో కాని అన్న తెలుగు దేశం అనుభవం తర్వాత మళ్లీ ఎవరూ అంత తేలిగ్గా కొత్త ప్రయోగాలు చేయలేరు. బీరకాయ పీచులాటి బంధుత్వాల మధ్య కుటుంబాల మధ్య ఘర్సణ గురించిన వూహాగానాలతో ప్రజలకు ఒరిగేది లేదు. కేంద్రమంత్రి పురందేశ్వరిని ఈ వ్యవహారంతో ముడిపెట్టిన కథనాలను ఆమె కొట్టి వేస్తూనే బాలకృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానిస్తానని వ్యాఖ్యానించడం గమనించదగ్గ అంశం. ఆయన మాత్రం తను తెలుగు దేశం కోసమే పనిచేస్తానని ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ రోజులలో ఒడుదుడుకులు తెలుగు దేశం నేతలు లేదా నందమూరీయుల ముందున్న అవకాశాలు కూడా పరిమితమే. బాలకృష్ణ ప్రకటన ఈ దిశలో తొలి సంకేతం కావచ్చు.జగన్‌ వివేకా, నందమూరి నారా వంటి అంశాలలోనే జనాన్ని ముంచి తేల్చడం వల్ల సమస్యలు మరుగుపడి పోవడం తప్ప ఫలితం నాస్తి. చెప్పుకోదగిన రాజకీయ వ్యక్తులెవరూ ఈ దశలో పెద్దగా దుస్సాహసాలకు గాని ప్రయోగాలకు గాని పాల్పడగల దృశ్యం లేదు. కొంత కాలం తర్వాత గాని రాజకీయ వేదికపై కొత్త కదలికలు రాకపోవచ్చు.



బాబా అనారోగ్యం


ఈ వారం రోజులు పుట్టపర్తి సాయిబాబా అనారోగ్యం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశమైంది.కలియగ దైవంగా కీర్తించబడటంతో పాటు లక్ష కోట్లకు పైగా సంపద గల ట్రస్టుకు అధినేతగా సాయిబాబా ఆరోగ్యం ప్రత్యేకాసక్తి కలిగించింది. గతంలో అనేక సార్లు మహిమలకు సంబంధించి వివాదాలు సవాళ్లు ఎదుర్కొన్న సాయిబాబా గత చాలా కాలంగాధార్మిక కార్యకాపాలపై కేంద్రీకరించారు. అవన్నీ ఎలా వున్నా ఆయన ఆనారోగ్య చికిత్స మాత్రం ఆధునిక వైద్య పద్దతుల్లోనే అనివార్యంగా జరిగింది. ఐసియులో ఆయన స్తితి ఏమిటనే దానిపై ఎడతెగని కథనాలు వూహాగానాలు పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి.ప్రభుత్వ ప్రతిపక్ష ప్రముఖులు ప్రజా ప్రతినిధులు వున్నా సత్యం ఏమిటో సూటిగా వెల్లడి అయ్యే స్తితి రావడానికి చాలా సమయం పట్టింది.ఇన్ని విరుద్ధ కథనాల వెనక ఆర్థిక ఆధిపత్య ఘర్షణలున్నాయనే భావన అందరిలో ఏర్పడింది. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటున్నా తటపటాయింపులు కప్పదాట్లు ఎక్కువగానే కనిపించాయి. రాజ్యాంగ బద్దంగానూ ప్రజా సమచార దృష్ట్యానూ జరగాల్సిన విషయాల్లో ఎలాటి తటపటాయింపులు వుండాల్సిన అవసరం లేదన్నది ఇక్కడ ప్రధానాంశం. సాయిబాబా సామ్రాజ్యం విస్త్రతి శక్తి తెలిసినవే గనక ఇప్పటికైనా వాటి గురించి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతివారూ కోరుకుంటారు. బాబా ఆరోగ్యం ప్రస్తుతానికి కుదుటపడిందని అంటున్నా ఆయన సహాయ వ్యవస్థలపై ఆధారపడతున్నట్టు కూడా తెలుస్తూనే వుంది. ఈ దశలోనైనా పుట్టపర్తి ట్రస్టుకు దాని కార్యకలాపాలకు భవిష్యత్తు తీరుకు సంబంధించి స్పష్టత కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన బాబా సహాయకులపైన వుంటుంది. లేకపోతే అకారణ కథనాలు ఆందోళన పెంచడం స్శార్థపరశక్తులకే ఉపయోగపడుతుంది. నిష్కారణమైన నిగూడత సందేహాలు పెంచి పరిస్తితిని సంక్లిష్టం చేస్తుంది.ఇప్పటికే అదనపు బలగాలు ఆంక్షల మధ్య చిక్కుకుపోయిన పుట్టపర్తిలో భక్తులు వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా సమచారం విడుదల చాలా అవసరమవుతుంది.

Friday, April 8, 2011

కడప కదన రంగం...


.

కడప ఎన్నికల సమరంపైనే రాష్ట్రమంతటి దృష్టి కేంద్రీకృతమైంది. కనీసం టీవీ చర్చలూ మీడియా కథనాలు దాని చుట్టూనే తిరుగుతున్నాయి. కడప సమరం జగన్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మాత్రమే జీవన్మరణ పోరాటమనీ, కాంగ్రెస్‌కు సాధారణ ఎన్నికలేనని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్య సగమే సత్యం. ఈ ఎన్నిక ప్రస్తుత తరుణంలో జగన్‌కు సహజ సిద్ధమైన అనుకూలతలు కలిగివుంటుందని వ్యక్తిగత సంభాషణల్లో అన్ని పార్టీల వారూ

ఆశాలపై అమానుషం





విజయనగరంలో ఆశా వర్కర్లపై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ త్రినాథ్‌ అమానుషంగానే గాక అసభ్యంగా కూడా లాఠీ ప్రయోగించిన తీరు దారుణమైంది. బడిపిల్లల మధ్యాహ్న భోజనం వండిపెట్టడంతో సహా అనేక విధులు నిర్వహించే వారికి నెలకు రు.1500 జీతం ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయకపోగా అడగడమే నేరమైనట్టు విరుచుకుపడటం ఘోరం. మీడియాలో వచ్చిన కారణంగా ఆయనపై తాత్కాలికంగా చర్య తీసుకున్నప్పటికీ ఉద్యమాలు పోరాటాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇలాటి పరిణామాలు కలుగుతున్నాయి. పోలీసులు విధి నిర్వహణలో అనివార్యంగా కనీసం తీసుకోవలసిన చర్యలు వేరు, కక్ష కట్టి కొట్టడం దౌర్జన్య పూరితంగా వ్యవహరించడం వేరు.ప్రజలపై అందులోనూ మహిళలపై లాఠీలు ఝళిపించడం, చున్నీలు చెరుగులు లాగడం వంటి పనులు సహించరానివి.

Saturday, April 2, 2011

ఇంగ్లీషు కాలంలో తెలుగు 'న్యూ ఇయర్‌!' శుభాకాంక్షలతో...









.


మిమ్మల్ను ఎవరన్నా ఆదివారం ఎన్నో తేదీ అని అడిగితే ఏమంటారు? ఏప్రిల్‌ 3 అని చెప్పేస్తారు. కొత్త సంవత్సరం మొదటి రోజు అంటారా?బహుశా అనకపోవచ్చు. అదే ఇంగ్లీషు కాలంలో తెలుగు సంవత్సరం.
ఇంతకూ భారతీయులకు పండుగలకు కొదవ లేదు. కొన్ని దేశ వ్యాపితమైనవైతే కొన్ని ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఉత్తరాదిని ధూం ధాంగా జరిగే పండుగలు కొన్ని దక్షిణాదిన మరోలా జరుగుతాయి. దక్షిణాదిన కూడా రాష్ట్రాల వారిగా మారేవి వుంటాయి. అలా చూస్తే తెలుగు కన్నడ మహారాష్ట్ర ప్రాంతాల వారికి పరిమితమైన పండుగ ఉగాది. తెలుగు సంవత్సరం మొదలయ్యే రోజు గనక