Pages

Sunday, November 13, 2011

ప్రధాని ప్రకటన - ఒక ఘట్టానికి ముగింపు?


ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దాదాపు సూటిగానే చేసిన వ్యాఖ్యలపై  ఎవరు ఎలా స్పందిస్తారు అన్నది వారి వారి వైఖరిపై ఆధారపడి వుంటుంది. రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని వెంటాడిన రాజకీయ ప్రతిష్టంభన, అన్ని జీవిత రంగాల్లోకి చొరబడిన స్తబ్దత, అచేతనత్వం నిస్సందేహంగా కేంద్రం సృష్టించినవే.
ప్రధాని చెప్పిన మాటలు కొత్తవేమీ కాదు. ఎవరికీ తెలియనవీ కావు. 1.తెలంగాణాపై తీసుకునే నిర్ణయానికి జాతీయ ప్రభావం వుంటుంది.2.ప్రశాంత పరిస్తితులు నెలకొనకుండా పరిష్కారం చేయలేము 3. దీనిపై జాతీయ సంప్రదింపులు అవసరం 4.పరిష్కారం పెనంమీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా వుండకూడదు. - ఇవి ఆయన చెప్పిన దానిలో నాలుగు అంశాలు. అంటే రాష్ట్ర విభజన గాని,రాజ్యాంగ ఏర్పాటు గాని చేయబోవడం లేదని దీన్నిబట్టి స్పష్టం అవుతున్నది. గత వారంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు పరిపరివిధాల మాట్లాడిన దాన్నే ప్రధాని క్రోడీకరించారని చెప్పాలి. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్రంతో చెలగాటమాడడం ప్రజలను అనిశ్చితికి గురి చేయడం కేంద్రం దోషమైతే దానిపై కొండంత నమ్మకంతో వుండటం ఇతరుల దోషం. ప్రధాని ప్రకటన తర్వాత టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.సి.ఆర్‌. శాపనార్థాలు పెట్టారు గాని తమకేవో సంకేతాలు అందతున్నాయని ఎప్పటికప్పుడు ఎందుకు చెప్పారనేదానికి ఆయన కూడా సమాధానం చెప్పవలసే వుంటుంది. నవంబరులో విభజన జరిగిపోతుందని ప్రకటించిన కోదండరామ్‌ కూడా ఆ పొరబాటుకే జవాబుదారి కాకతప్పదు.
నా వరకు నేను 2009 డిసెంబరు 10న ఎన్‌టివి చర్చలోనే అంతకు ముందు రాత్రి చిదంబరం చేసిన ప్రకటన పరిమితులు చెప్పాను, అది అంతిమ వాక్యం కాదనీ అన్నాను. దేశంలో పాలకవర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ తీరుతెన్నులు అలానే

స్పీకర్‌ నిర్ణయం సామూహికంగా వుండకపోవచ్చు




నాగం జనార్థనరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి రాజీనామాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆమోదించడం వూహించదగిందే. ఈ రాజీనామాలు తెలుగు దేశం పార్టీ నుంచి నిష్క్రమణల ఫలితాలు, ఫిరాయింపుల చట్టంతో ముడిపడినవి కూడా. ఇవి ఆమోదించినంత మాత్రాన మిగిలిన 80 మందివి కూడా గుండుగుత్తగా ఒప్పేసుకుంటారని కాదు. ప్రాంతీయ సమస్యపైన ఉద్వేగాలతో రాజీనామా చేసిన వారందరివీ ఒప్పుకుంటే సభలో మూడో వంతు వరకూ ఖాళీ అయిపోతుంది. ఇందులో టిఆర్‌ఎస్‌ వారు రాజీనామా చేసి మళ్లీ గెలిచి వచ్చారు. వారు కొత్తగా నిరూపించవలసింది ఏమీ లేదు.కాంగ్రెస్‌ తెలుగు దేశం సభ్యులు రాజీనామాలిచ్చినా వాటికోసం పట్టుపట్టకపోవచ్చు.ఇక జగన్‌ వర్గం 29 మంది పరిస్థితి కీలకమవుతుంది. వీరు కూడా తటపటాయింపులో పడినట్టే. తమ రాజీనామాలతో ప్రభుత్వం అస్థిరత్వానికి గురవుతుందన్న అంచనా ఆనాడు వుండొచ్చు గాని అలా జరగలేదు. జగన్‌ పై కేసుల దర్యాప్తు వగైరాల వల్ల ఒక విధమైన ఆత్మరక్షణ స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం కొంత వరకూ నిలదొక్కుకుంది. ప్రాంతీయ కల్లోలాలు కూడా కొంతైనా సర్దుకున్నాయి.ఇలాటప్పుడు రాజీనామాల పేరిట అధికారానికి దూరమయ్యేబదులు క స్పీకర్‌ పేరిట తప్పించుకోవచ్చు. జగన్‌కు బాగా సన్నిహితులైన అర డజను మందిని మినహాయిస్తే తక్కిన వారంతా ఈ మార్గానికే మొగ్గుచూపే అవకాశం వుంది.ఇక మనోహర్‌ సామూహికంగా రాజీనామాలు ఆమోదించేసి కొత్త దృష్టాంతాలు సృష్టించరనే అనుకోవాలి. ఆయన నిర్నయాన్ని ముందస్తుగా నిర్దేశించే అవకాశం ఎవరికీ వుండదు గనక వేచి చూడవలసిందే.

Friday, November 11, 2011

జగన్‌పై దర్యాప్తులో మలుపులు, మరకలు



జగన్‌ సంస్థల విలువను డెలాయిట్‌ కంపెనీ పెంచి చూపించడానికి వారి ఆడిటర్‌ విజయసాయి రెడ్డి ఒత్తిడి లేదా అభ్యర్థన కారణమని సిబిఐ ముందు సంస్థ ప్రతినిధి సుదర్శన్‌ వాంగ్మూలమిచ్చారని మీడియా కథనం. ఇది సిబిఐ ఎలా లీక్‌ చేస్తుందని విజయ సాయి ప్రశ్న. అంతేగాక తాను అలా కోరలేదని ముఖాముఖి చర్చకు సిద్దమని కూడా సమర్థించుకుంటున్నారు. ఈ లేఖపై స్పందించాల్సింది సిబిఐ తప్ప ఇతరులు చెప్పగలిగింది లేదు. అయితే అదే లేఖలో ఆయన వ్యాపారాలలో విలువలు పెంచి చూపించడం మామూలేనని కూడా పేర్కొనడం గమనించదగ్గది.అదే నిజమైతే అప్పుడు ఇంత స్పందన అవసరముండేది కాదు. రాజకీయ కోణం నుంచి ఖండించడమే ఇక్కడ ముఖ్యం. అమెరికాలో ఎన్రాన్‌ కుంభకోణం నుంచి మన సత్యం కుంభకోణం వరకూ ఆడిటర్ల పాత్ర చాలా కీలకమని వారే ఎక్కువ విచారణకు గురయ్యారని గుర్తు చేసుకుంటే ఇంత చర్చ అవసరమనిపించదు. ఇక సిబిఐ లీక్‌ చేయడానికి వస్తే- గాలి కేసులో జగన్‌ను సాక్షిగానే పిలిచారని ఆయనకు ఏమీ కాదని ఇదే వైఎస్‌ఆర్‌ పార్టీ వారు అదేపనిగా చెప్పుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యమని అంత నమ్మకం దేనికని నేను చాలా చర్చల్లో ప్రశ్నించాను. ఆ విచారణ తర్వాత ఆయన బయిటకు వచ్చి చెప్పిన దానిపైనా అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇడి కూడా విచారించబోతున్నది. వ్యాపార పరమైన ఆర్థిక పరమైన లావాదేవీలలో అవకవతవకలు అక్రమాలకు రాజకీయ మద్దతుకు సంబంధం లేదని ఎవరైనా ఒప్పుకోవాలి. జగన్‌ వర్గం తరచూ రామోజీని లేదా రాధాకృష్ణను ప్రస్తావిస్తుంటుంది. కాని ఇక్కడ అధికారం ముఖ్యమంత్రి స్థానం అన్నవి కీలకంగా వున్నాయని గమనిస్తే ఈ కేసు ప్రత్యేకత తెలుస్తుంది.దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప ఇతరుల తప్పులు ఎత్తి చూపినంత మాత్రాన మరొకరి తప్పులు ఒప్పుగా మారవు. ఇప్పుడు విజయమ్మ కేసులో కోర్టు ఏదైనా చేయొచ్చు. అలాగే మార్గదర్శి విషయంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలను ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు అవి ఏ స్తితిలో వున్నాయో తెలియదు. కార్పొరేట్‌ ప్రపంచ అక్రమాలపై ఇదే బ్లాగులో చాలా ప్రస్తావనలున్నాయి.వైఎస్‌పై ఎవరికి ఎంత అభిమానమున్నా ఆ హయాంలో జరిగిన అవకవతవకలను విచారించడానికి అది ఆటంకం కానవసరం లేదు. ఇదంతా కక్ష సాధింపుగానే కొట్టేయడమూ కుదరదు. అదే నిజమైతే నిజమని రుజువైతే మరీ మంచిది. కాని అ సంగతి చెప్పాల్సింది ఆయన అనుయాయులు కాదు, కేసు నడిపిస్తున్న న్యాయస్థానాలూ, విచారిస్తున నిఘా సంస్థలూ.

Thursday, November 10, 2011

ఇక ఎస్సార్సీ ముచ్చట



ఈ రెండు రోజులలోనూ కేంద్ర కాంగ్రెస్‌ తరపున ఇద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడినప్పటికీ సారాంశంలో పెద్దగా తేడా లేదు.రాష్ట్ర విభజన తెలంగాణా ఏర్పాటు జరిగిపోతుందన్నట్టుగా కొందరు చేసిన వూహాగానాలు జోస్యాలు నిజం కావడం లేదని క్రమంగా స్పష్టమవుతున్నది. ఆ విషయం అలా వుంచి రాష్ట్ర భవిష్యత్తుపై ఎలాటి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా కనిపించడం లేదు. డి.శ్రీనివాస్‌తో లేదా మరొకరితో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయొచ్చన్న మాట మాత్రం కాంగ్రెస్‌ ఎంపిలు, ఎంఎల్‌ఎలు జనాంతికంగా చెబుతున్నారు. అందుకు ఒప్పుకునేది లేదంటూనే అసహాయత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తీవ్రమైన చర్యలేమీ తీసుకుంటామని వారిలో ఎక్కువ మంది చెప్పడం లేదు.
ఇంతకూ కాంగ్రెస్‌ ఎస్‌ఆర్‌సి గురించి చెప్పే మాటలు తెలంగాణా సమస్యకు వర్తిస్తాయా లేదా ? ఈ ప్రశ్నకు ఆ మాట్లాడిన నాయకులు కూడా జవాబు చెప్పలేరు. కావాలనే అంత గందరగోళంగా వ్యాఖ్యలు చేశారు. ఆజాద్‌ చెబుతాడని వాళ్లన్నారు. అయితే ఆజాద్‌ మాత్రం ప్రభుత్వం తరపున హౌం మంత్రి చేసే ప్రకటనే కాంగ్రెస్‌ అధికార వైఖరి అన్నారు.అంటే ఇప్పటికీ ఇన్ని అనర్థాలు అనిశ్చితుల తర్వాత కూడా కాంగ్రెస్‌ రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ వైఖరిని చెప్పబోవడం లేదన్నమాట.గత అరవై ఏళ్లలో అన్ని చోట్లా అన్ని సందర్బాల్లో ఆ పార్టీ ఇలాగే ప్రవర్తించింది. ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో మరింత ఎక్కువగా. ఇదమిద్దంగా ఏమీ చెప్పకుండా డాటేయడమే కాంగ్రెస్‌ మార్కు రాజకీయమన్నమాట. ఈ దశ లో దీనిపై ఇంతకన్నా మాట్లాడాల్సింది లేదు. కాకుంటే కేంద్రం మీద అపారమైన నమ్మకంతో తేదీలు ప్రకటించిన వాళ్లు, గడువులు ప్రకటించిన వాళ్లు కూడా ఈ విషయంలో కాస్తయినా అత్మ విమర్శ చేసుకుంటారా?
చివరగా మాయావతి విషయం. ఇన్నేళ్లు పాలించినప్పుడు తీసుకోని నిర్ణయం ఎన్నికల ప్రాంగణంలో ఎందుకు వచ్చిందంటే ఎన్నికల కోసమే! మమతా డార్జిలింగ్‌(గూర్ఖాలాండ్‌)విషయంలో ఎన్నికల ముందు తర్వాత చేసింది ఇంతకన్నా భిన్నమేమీ కాదు. ఇప్పుడు ఎస్‌ఆర్‌సి వేసేస్తారని కాదు.మరో ఏడాదో ఆరు నెలలో దాని చుట్టూ చర్చ తిప్పుతారంతే. ప్రాంతీయ కమిటీకి గాని ఎస్సార్సీకి గాని తెలంగాణా నిర్ణయంతో సంబంధం లేదని నమ్మబలుకుతుంటారు కూడా. ఈ గజిబిజి రాజకీయ అనిశ్చితికి ప్రజల ఆందోళనకు ఎలా కారణమవుతుందనేది వారికి ఏ మాత్రం అవసరం లేదు. అందుకే ప్రాంతాల పేరిట రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి.

మరో చరిత్రారంభం...

. కార్పొరేట్‌ స్వాప్నికుల కలలు కల్లలై కల్లోలాలు చుట్టుముడుతున్నాయి. చరిత్రాంతం భాష్య కారుల నోళ్లు మూత పడుతున్నాయి. మహా కథనాల మహా ప్రస్థానం మళ్లీ మొదలవుతున్నది. జోస్యాలన్ని అపహాస్యాల పాలవుతున్నాయి. విత్త విపణి విన్యాసాలన్ని వీగిపోతున్నాయి. ప్రతిఘటననూ ప్రజా చైతన్యాన్ని అపహాస్యం చేసిన అపర మేధావుల తలలు వాలిపోతున్నాయి. ఇవన్నీ నిజమేనా అనే సందేహ మందేహులుంటూ వాల్‌ స్ట్రీట్‌ దృశ్యాలు సమాధానం చెబుతున్నాయి.అక్కడిదాకా ఎందుకంటే కటకటాల్లో విఐపి హౌదా పొందిన గాలి జనార్ధనరెడ్డి ఇనుప సత్యాలను చెప్పడానికి సిద్దంగా వున్నాడు.అక్కడికీ అనుమానం తీరకపోతే తమిళ పొన్ను కనిమొళి కరుణార్ద్ర ఘట్టం కళ్లకు కడుతున్నది. సత్యం రామలింగరాజు స్వానుభవ కవిగా అందుబాటులో వున్నాడు. విదియ నాడు కనిపించని చంద్రుడు తదియ నాడు తానే కనిపించినట్టు ప్రపంచీకరణ పేరిట మొదలై నిరాఘాటంగా కొనసాగిన నిలువు దోపిడీ నిర్వాకాలకు నిదర్శనాలుగా ఇలాటివి ఎన్నయినా చూపించవచ్చు.ఈ నిలువు దోపిడినే శాశ్వతమని విశ్లేషించిన విపరీత సిద్ధాంత కారులకు సమాధానం వాల్‌స్ట్రీట్‌ నుంచి మంగళవారం భారత కార్మిక వర్గం అఖిల భారత సమ్మె పోరాటం వరకూ ప్రతి చోటా లభిస్తున్నది. చరిత్రాంతం కాదు, సరికొత్త సమర శీల చరిత్రకు అంకురార్పణ జరుగుతున్నది.
అమెరికా ప్రస్తుతానికి ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం వుగ్ర రాజ్యం కూడా గనక- పోలీసు తలారి న్యాయమూర్తి కూడా గనక - అక్కడ పరిణామాలకు ప్రత్యేక ప్రాధాన్యత. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రపంచమంతటా ప్రచార ప్రకంపనలే. అయితే అమెరికా ప్రపంచ దేశాలను వరుసగా అక్రమిస్తుంటే లేదా అక్కడే వాల్‌ స్ట్రీట్‌ ను అక్రమించడమేమి చిత్రం? ఎవరో ఇస్లామిక్‌ టెర్రరిస్టులు వచ్చి దాడి చేయకుండా ప్రతిచోటా తలదూర్చే ఆ మహాదేశాధినేతలు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ దారుల ధాటికి