సాగరహారం వూహించినట్టే ఉధృతంగానూ, ఉద్రిక్తంగానూ జరిగింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా వినిపించాలన్న జెఎసి లక్ష్యం నెరవేరింది.
మొదటిది- ఈ మార్చ్‌తో మొదటి సారి రాజకీయ పార్టీల ప్రాధాన్యత తగ్గి జెఎసి,దాని నిర్వాహకులకు దగ్గరగా వుండే సంఘాల నాయకుల పిలుపు అమలు జరిగినట్టయింది. పాలక పక్షమైన కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం నేతలు మాత్రమే గాక ఇప్పటి వరకూ తెలంగాణా ఉద్యమానికి ప్రతీకగా పరిగణించబడిన టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కూడా వేదికపై కనిపించని,వినిపించని స్థితి మొదటిసారిగా గోచరించింది. పార్టీల పతాకాలు తీసేయాలని పిలుపునివ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని మరింత ప్రస్పుటంచేసే ప్రయత్నం జరిగింది. అయితే సమీకరణలో మాత్రం టిఆర్‌ఎస్, న్యూ డెమోక్రసీల తరపున వచ్చిన వారే అత్యధికంగా కనిపించారు.ఆ పైన సిపిఐ,బి.జెపి ఇతర సంఘాలు వుండొచ్చు.
రెండవది- మార్చ్ ఉద్రిక్తంగా జరిగిందనడంలో సందేహం లేదు. పోలీసుల పాత్ర, జోక్యం, బల ప్రయోగం చాలా ఎక్కువగానే వున్నాయి. ప్రజాస్వామిక హక్కుగా అనుమతినిచ్చిన తర్వాత ఇలాటి పరిస్తితి రావలసింది కాదు. ఇందుకు పోలీసుల వైఖరి ప్రధాన కారణంగా కనిపించినా ఇతర అంశాలు కూడా వున్నాయి.పార్టీలు విడివిడిగా ఎవరి యాత్ర వారు మొదలెట్టడం ఒక కారణం. చాలా మంది తెలంగాణా వాదులతో సహా అనేకులకు మార్చ్ తేదీ



