Friday, December 31, 2010
శుభా కాంక్షలతో .. రెండు మాటలు
ఈ బ్లాగును చూస్తున్న మిత్రులందరికీ 2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2010 అనేక విధాల ఉద్రిక్తంగా అనిశ్చితంగా నడిచినా తెలుగు ప్రజల శాంతి కాంక్ష, రాజకీయ చైతన్యం 2011లోకి విశ్వాసంగా అడుగు పెట్టే పరిస్థితిని కల్పించాయి. నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అన్నట్టు ఆలోచనా పరులైన పౌరులే స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు. పరిపాలకుల సార్థపరశక్తుల కుటిలోపాయాలకు పగ్గం వేయగలిగిందీ వారే. కుంభకోణాలు తప్ప లంబ కోణాలకు తావు లేకుండా పోతున్న భారత దేశ పరిస్థితి విశృంఖల సరళీకరణ విధానాల ఫలితమన్న వాస్తవాన్ని గుర్తించడం చాలా అవసరం. తెలిసో తెలియకో చాలా మంది
ఈ ఏడాది మీదే కావాలంటే..
.
మనకున్న సమయం ఎంత;? దాన్ని ఎలా వినియోగించుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? గత ఏడాదికి సంబంధించిన వీక్షణను పూర్తి చేసిన తర్వాత దాన్నుంచి నేర్చుకోవలసిన అంశాలు తీసుకోవలసిన పాఠాలూ ఇందుకు మొదటి ప్రాతిపదిక అయితే రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితుల గురించిన అంచనాలు ప్రణాళికకు ప్రాథమిక వనరు. వాటి ఆధారంగా వాస్తవికమైన దృష్టితో ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి అన్నది రేఖామాత్రంగానైనా
మనకున్న సమయం ఎంత;? దాన్ని ఎలా వినియోగించుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? గత ఏడాదికి సంబంధించిన వీక్షణను పూర్తి చేసిన తర్వాత దాన్నుంచి నేర్చుకోవలసిన అంశాలు తీసుకోవలసిన పాఠాలూ ఇందుకు మొదటి ప్రాతిపదిక అయితే రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితుల గురించిన అంచనాలు ప్రణాళికకు ప్రాథమిక వనరు. వాటి ఆధారంగా వాస్తవికమైన దృష్టితో ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి అన్నది రేఖామాత్రంగానైనా
Tuesday, December 28, 2010
మీ కాలం ఖాతాలో.... వీడ్కోలు వీక్షణం
కాలానికి ఏడాది కొండ గుర్తు అనుకుంటే ఏడాది కిందట లేదా ఈ ఏడాదిలో ఏమనుకున్నాము, ఏం చేశాము, అసలేమైనా అనుకున్నామా? ఏమీ అనుకోకపోతే ఇప్పుడైనా వచ్చే ఏడాదికైనా ఏమైనా అనుకుందామా అని చూసుకోవడం మొదటి మెట్టు. అలాటి ఆలోచనే లేకపోతే జీవితం చీకట్లో తడుములాటగానే మారిపోతుంది. ప్రతి వారికి ఏవో ఆకాంక్షలు ఆశలూ ఆశయాలు వుండనే
Saturday, December 25, 2010
వికీలీక్స్‌లో భారతం: విదేశాంగ వికృతం
విశ్వ రాజకీయ రంగ స్థలాన్ని విస్పోటనంలా ప్రకంపింప చేస్తున్న వికీలీక్స్‌లో భారత దేశానికి సంబంధించిన అంశాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. విదేశాంగ విధానంలో వికృత విన్యాసాలకు లజ్జాకరమైన లొంగు బాట్లకు తిరుగులేని సాక్ష్యాలను సమకూరుస్తున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు చేపట్టి అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు మరీ ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం మొదలెట్టాక ఆ ప్రభావం విదేశాంగ విధానంపైనా ప్రసరించడం అనివార్యమన్న వామపక్షాల హెచ్చరిక ఎంత వాస్తవమో వికీలీక్స్ బయిటపెట్టిన కేబుల్స్‌ను బట్టి తెలిసి పోతున్నది.న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తమ అధినేతలకు పంపిన 3000 కేబుల్స్ 2007-2010 మధ్య కాలానికి సంబంధించినవి. అణు ఒప్పందంపై సంతకాలు, వామపక్షాల మద్దతు వుపసంహరణ, మళ్లీ ఎన్నికలు, అనంతరం అణుపరిహారబిల్లును తీసుకురావడం ఇవన్నీ
Wednesday, December 22, 2010
దీక్షలు..ఉపేక్షలు..పరీక్షలు
నూతన సహస్రాబ్దిలో తొలి దశాబ్ది ముగిసిపోతున్న తరుణం. ఈ కాలాన్ని మీరెలా చూస్తారని ఛానెల్ మిత్రుడు అడిగితే ఒక పోలిక చెప్పాను. 2000 సంవత్సరం లో హైటెక్ ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు దశాబ్ది ముగింపు నాటికి రైతాంగ దురవస్థపై నిరవధిక నిరాహారదీక్షలో పట్టువదలకుండా వున్నారు. ఆనాడు ఆయన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్ కాల్పులు ఇతర ఉద్యమాల పునాదిపై అధికారం చేపట్టిన వైఎస్‌రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించగా ఆయన వారసుడుగా పెనుగులాడుతున్న జగన్ మోహన్ రెడ్డి కూడా రైతుల సమస్యపైనే 48 గంటల దీక్ష
Subscribe to:
Posts (Atom)
