Pages

Monday, September 12, 2011

నకిలీ కంపెనీల పేర్లతో నయ వంచన

ఎమ్మార్పణం-3

ఏజంటుగా నియమించుకున్న స్టైలిష్‌ హౌమ్స్‌కు చదరపు గజం రు5000 చొప్పున 100 ప్లాట్లు అప్పగించాలని, ఏజంటు ప్రతి విల్లాపైన నాలుగు శాతం తన కమిషన్‌గా అదనంగా వసూలు చేయొచ్చని దానితో కుదర్చుకున్న ఒప్పందంలో అవకాశమిచ్చారు. వాస్తవానికి అక్కడ భూమి ధర ఇంతకంటే డజను రెట్టు ఎక్కువ వుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై వేలకు తక్కువ కాదు. అయినా మొదటి వంద ప్లాట్లు ఏజంటు ఈ రేటుకే అమ్ముకోవాలని, మిగిలినవి మార్కెట్‌ రేటు ప్రకారం విక్రయించవచ్చునని అవకాశమిచ్చారు. ఆ తర్వాత 2-5-05 న ఎమ్మార్‌ ప్రతినిధులు మరో కొత్త పేరును తెచ్చారు. అప్పటికే తాము భాగస్వామిగా చేర్చుకున్న ఎంజిఎఫ్‌ గ్రూపు అనుబంధ సంస్థ అయిన ఫ్రిడ్జి హౌల్డింగ్స్‌ లిమిటెడ్‌కు తమ 74 శాతం వాటాలో 34 శాతం ఇచ్చేందుకు అంగీకరించాలని కోరారు.ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పంపిణీ ఏర్పాట్లు మార్చనవసరం లేదని ఎపిఐఐసి అధికారులు చెప్పారు. 2005 జూన్‌ 6న ఎపిఐఐసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొదటి దశకు సంబంధించిన రాస్తూ భూమి లావాదేవీలు ఇంకా మొదలు కాకుండానే నగదు తీసుకుంటున్నట్టు తెలిసిందని, ఇది సంయుక్త వ్యవహారం గనక తమతో కలసి వ్యవహరించాలని కోరారు.అంటే అప్పటికే పరిస్థితి చేజారడం

Sunday, September 11, 2011

ప్రాతిపదిక లేని ప్రచారార్బాటం


జగన్‌ ఆస్తులపై దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలివ్వడం, ప్రాంతీయ ఉద్యమాలు ప్రస్తుతానికి వ్యూహాన్వేషణలో తలమునకలవడం వల్ల తన ప్రభుత్వానికి కాస్త వూపిరి పీల్చుకునే వ్యవధి లభించిందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి భావిస్తున్నారు. ఆ మేరకు సంతోషించి వూరుకుంటే అదొక పద్ధతి. కాని దాన్ని అతిశయోక్తిగా చిత్రించుకుని ప్రజల్లో ప్రచారార్భాటం సాగించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్‌ యువ కిరణాల పేరిట అయిదు లక్షల ఉద్యోగాలు, స్త్రీ శక్తి బ్యాంకు, ఇందిర జల ప్రభ, రైతు రుణాల మాఫీ, పంటల బీమా పథకానికి నిధులు వగైరా పథకాల పరంపరతో దూసుకుపోగలనని భావిస్తున్నారు. ఆ వూపులో ఇప్పటికే ప్రజలను వేధిస్తున్న అనేకానేక సమస్యల పరిష్కారంపై దృష్టి మరల్చడానికి బదులు కొత్తసీసాలో పాత సారా చందంగా పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రచార ప్రహసనానికి తెర లేపుతున్నారు. ప్రతిష్టంభన నుంచి ప్రభుత్వం ఇంకా బయిటపడింది లేదు. రాజకీయ పాలనా పరమైన అనిశ్చితి

Saturday, September 10, 2011

ఎమ్మార్పణంలో ఎన్నెన్నో విచిత్రాలు






వేల కోట్ల రూపాయల విలువైన భూములను వాటిపై వచ్చే అపారమైన లాభాలను ఎమ్మార్‌కు కట్టబెట్టిన కథా క్రమంలో మలుపులకు లెక్కేలేదు. ఎన్ని మలుపులు తిప్పినా ఎమ్మార్‌ రథం నిరాఘాటంగా నడిచిపోయిందంటే ఏలినవారి ఆశీస్సులు ఎంత బలంగా పనిచేసిందీ తెలుస్తుంది.

తమ హయాంలో ఆరంభించినప్పటికీ భూములు సేకరణ, నిబంధనల మార్పు తర్వాతే జరిగిందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇ,చ్చారు.అయినా ఆరంభం అప్పుడే గనక తెలుగుదేశం ప్రస్తావన అనివార్యంగానే వస్తుంది. ఎపిఐఐసి అనే నోడల్‌ ఏజన్సీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, స్టార్‌ హొటల్‌, గోల్ఫ్‌ కోర్సు, విల్లాలతో కూడిన సమ్మిళిత నిర్మాణ పథకం(ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌) చేపట్టడానికి ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) కోరుతూ ప్రభుత్వం 1999 ఏప్రిల్‌4,2000 మార్చి 30, 2001జూలై 26 తేదీలలో బిడ్లను ఆహ్వానించింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, పబ్లిక్‌ జాయింట్‌ స్టాక్‌ కంపెనీ లిమిటెడ్‌(పిజెఎస్‌సి)దుబారు యుఎఇ, ఐవోఐ కార్పొరేషన్‌ బెర్హాద్‌,మలేషియా, లార్సెన్‌ అండ్‌ టాబ్రో(ఇసిసి డివిజన్‌) షాపూర్జీ పల్టోన్జీ కంపెనీ లిమిటెడ్‌, ముంబాయి, సోమ్‌ ఆసియా లిమిటెడ్‌, హాంకాంగ్‌ అన్న అయిదు కన్సార్టియాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అంచనాల కమిటీ ఇందులో ఎమ్మార్‌, ఐవోఐ,ఎల్‌ అండ్‌ టి లను జాబితాలో వుంచి వారితో సంప్రదింపులు జరిపింది. అయితే ఒప్పందం ఖరారు ఆఖరు తేదీ అయిన 2001 డిసెంబరు 15 నాటికి ఎమ్మార్‌ ప్రతిపాదన వొక్కటే అందడంతో దాన్నే ఖాయం చేసింది.

అదనపు భూమికై ప్రతిపాదన
2002 సెప్టెంబరు4న జివోఎంఎస్‌359 ద్వారా ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ పిజెఎస్‌సి దుబారు సంస్థను ఎంపిక చేసినట్టు తెలియజేసింది. దానితో అవగాహనా పత్రం(ఎంవోయు)కుదుర్చుకోవడానికి ఎపిఐఐసి వైస్‌ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అధికార మిచ్చింది. అదే సమయంలో ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించాలని కూడా ఆదేశించింది. దాన్ని రెండు భాగాలుగా

ఎమ్మార్పణకు పూజారిగా ఎపిఐఐసి






జగన్‌ ఆస్తులపై దర్యాప్తు, గాలి జనార్ధనరెడ్డి అరెస్టులతో పాటు రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారం ప్రయివేటీకరణ విధానాల వినాశకర ఫలితాలకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ భూములనూ ప్రజల భూములను అప్పణంగా అప్పగించి ఇష్టారాజ్యం సాగించిన ఎమ్మార్‌కు ఎపిఐఐసి అధికారగణం దాసోహమైంది. ఒప్పందమే లోపభూయిష్టం కాగా దాన్ని కూడా అడుగడుగునా ఉల్లంఘిస్తుంటే ఉత్సాహంగా సహకరించింది. ఉద్దేశిత లక్ష్యాల నుంచి వైదొలగి వ్యాపారాలు చేసుకుంటున్నా, ఇష్టానుసారం ఒప్పందాన్ని మార్చేసి ఏకపక్షంగా కొత్త సంస్థలను సృష్టిస్తున్నా, వేల కోట్ల లాభాన్ని పూడ్చలేని నష్టంగా చూపిస్తున్నా అన్నిటికీ అప్పటి ఎపిఐఐసి పాలకవర్గం పూర్తిగా కుమ్మక్కయింది. బినామీ పేర్లతో ఖరీదైన కోటలు అనుమానాస్పదంగా కట్టబెడుతున్నా, దాన్ని మాఫీ చేసుకునేందుకు పెద్ద మనుషులు పందేరంలా ప్రముఖులకూ సౌధాలు కేటాయిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది.దినేష్‌ రెడ్డి నాయకత్వంలోని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం జరిపిన దర్యాప్తులో ఇందుకు సంబందించి వెల్లడైన నిజాలు దిగ్బ్రాంతికరంగా

సంపూర్ణ సంపాదకుడు..



సున్నితమైన పద పొందిక, సముచితమైన వాక్య నిర్మాణం, సమతుల్య ప్రతిస్పందన కలిస్తే నండూరి రామమోహనరావు. ఆయన సంపాదక శాస్త్ర సాహిత్య వేత్త. తెలుగు సంపాదకులు సర్వజ్ఞులు అని ఆయన అంటుండేవారు. ఏ అంశంపైనైనా ఎడాపెడా రాసేస్తుంటారనీ, రాయాల్సి వుంటుందనీ ఆయన భావం. తను మాత్రం ఏది ఎడాపెడా రాయలేదు. ఆచి తూచి రాశారు. అలాగే జీవించారు. పాత్రికేయులకు ప్రామాణికంగా నిలిచార్తు. ఎన్నో వాద వివాదలతో నిండిన నేటి వాతావరణంలోనూ ప్రతివారూ ఆయనకు తలుచుకున్నారంటే కారణమదే. ప్రగతిశీల పాత్రికేయుడుగా మొదలై అనువాదాలలో రాణించి వైజ్ఞానిక రచనలకు వరవడి పెట్టి సంపాదకుడుగా స్థిరముద్ర వేసిన దినీ విజ్ఞాన సర్వస్వం ఆయన. అంత జ్ఞానవంతుడైనా ఒద్దికగా వుంటూ కలసిన ప్రతివారినీ ప్రభావితం చేసిన సంయమి.
నండూరి జీవిత సాఫల్యానికి బలమైన నేపథ్యమే వుంది. బళ్లో చదువుకుంటున్నప్పుడే విజ్ఞానం అన్న లిఖిత పత్రకను నడపడం ఆయన భావి జీవిత సంకేతం. అమ్మ సేకరించి పెట్టిన శ్రీ మహాభక్త విజయం చిన్నతనంలోనే చదివి దైవభక్తులతో పాటు దేశ భక్తుల జీవితాలూ తెలుసుకున్నారు. పెత్తండ్రి నండూరి శివరావు గుడివాడలో ప్రచురణాలయం స్థాపించడం వల్ల ద్విజేంద్రలాల్‌ రారు బెంగాలీ నాటకాల అనువాదాలు చదివే అవకాశం వచ్చింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 'తేళ్లకు జెర్రులకు కూడా వెరవక అటకపైన వున్న ఆ కట్టలు తీసుకుని' చదువుతుండేవారు. ఆ వూపులోనే