తెలంగాణా సమస్యపై ఏదో వెంటనే జరిగిపోతుందని భావించేవారు, జరిగిపోవాలని కోరుకునే వారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ ఇచ్చే నివేదికకు శ్రుతి మించిన ప్రాధాన్యత కల్పించారు. కాని వాస్తవం ఏమంటే దానికి ముందు తర్వాత కూడా కేంద్రం నుంచి వెలువడుతున్న సూచనల్లో కొత్తదనమేమీ లేదు.ఈ సమస్యపై వారికి అవగాహన లేదని కాదు, దాన్ని వెల్లడించాలనే ఉద్దేశమే లేదు. కెసిఆర్ ఏ జోస్యాలు చెప్పినా కాంగ్రెస్ నాయకులు మాత్రం అలాటి సాహసం చేయడం లేదు. ఎందుకంటే వారికి అంతర్గత పరిస్తితులు మరింత బాగా తెలుసు. శుక్రవారం నాడు హౌం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్టు స్పష్టమవుతుంది. కాకపోతే కాంగ్రెస్ ఒక అవగాహనకు రావడానికి ఆజాద్ అ ద్యక్షురాలికి ఇచ్చిన నివేదిక దోహదపడుతుందని మాత్రం అనుకోవాలి. ఎనిమిది మాసాల కిందట ఇచ్చిన శ్రీకృష్ణ నివేదికకే ఠికాణా లేనప్పుడు ఈ ప్రహసనంతో ఏదో ఒక వొరిగి పడుతుందని మౌలిక నిర్ణయాలు మారిపోతాయని బొత్తిగా ఆశించలేము. నిజానికి సమయం చాలా పడుతుందని ఆజాద్ నిన్న, చిదంబరం ఈ రోజు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకుని వ్యవహరించాల్సి వుంటుంది.
Friday, September 30, 2011
ఆజాద్ నివేదిక, అనంతరం..
తెలంగాణా సమస్యపై ఏదో వెంటనే జరిగిపోతుందని భావించేవారు, జరిగిపోవాలని కోరుకునే వారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ ఇచ్చే నివేదికకు శ్రుతి మించిన ప్రాధాన్యత కల్పించారు. కాని వాస్తవం ఏమంటే దానికి ముందు తర్వాత కూడా కేంద్రం నుంచి వెలువడుతున్న సూచనల్లో కొత్తదనమేమీ లేదు.ఈ సమస్యపై వారికి అవగాహన లేదని కాదు, దాన్ని వెల్లడించాలనే ఉద్దేశమే లేదు. కెసిఆర్ ఏ జోస్యాలు చెప్పినా కాంగ్రెస్ నాయకులు మాత్రం అలాటి సాహసం చేయడం లేదు. ఎందుకంటే వారికి అంతర్గత పరిస్తితులు మరింత బాగా తెలుసు. శుక్రవారం నాడు హౌం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్టు స్పష్టమవుతుంది. కాకపోతే కాంగ్రెస్ ఒక అవగాహనకు రావడానికి ఆజాద్ అ ద్యక్షురాలికి ఇచ్చిన నివేదిక దోహదపడుతుందని మాత్రం అనుకోవాలి. ఎనిమిది మాసాల కిందట ఇచ్చిన శ్రీకృష్ణ నివేదికకే ఠికాణా లేనప్పుడు ఈ ప్రహసనంతో ఏదో ఒక వొరిగి పడుతుందని మౌలిక నిర్ణయాలు మారిపోతాయని బొత్తిగా ఆశించలేము. నిజానికి సమయం చాలా పడుతుందని ఆజాద్ నిన్న, చిదంబరం ఈ రోజు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకుని వ్యవహరించాల్సి వుంటుంది.
Wednesday, September 28, 2011
కొత్త జోస్యాలు- పాత భాష్యాలు
కెసిఆర్ ఈ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన అయిదారుగురు నాయకులలో ఒకరుగా గౌరవనీయులు. కొత్త రాష్ట్రమే సాధించి దాని వ్యవస్థాపకుడు కావాలని కోరుకునే వ్యక్తి.అయితే దురదృష్టవశాత్తూ ఆయన మాటలు చేతలు తరచూ వివాదాస్పదంగానూ నిరాధారంగానూ వుంటాయి. ఈ బ్టాగులో గత ఎంట్రీలలో చేసిన వ్యాఖ్యలు విశ్లేషణలు చదివిన వారికి ఈ సంగతి బాగా తెలుసు.తాజాగా ఇప్పుడాయన కేంద్రం రెండు మాసాలలో తెలంగాణా ఇచ్యేస్తుందని చెప్పడం ఆ కోవలో మరో ప్రహసనం. అంతటితో ఆగక కేంద్రం ఆలోచనలుగా తనకు తెలిసిన వాటిని ఆయన ఇంచుమించు ప్రతిపాదనల చర్చగా మొదలెట్టారు. కర్నూలు అనంతపురంలతో కూడిన తెలంగాణా, హైదరాబాదు ప్రతిపత్తి వంటివాటిని ఈ కోవలో వదిలారు. వీటిపై తెలంగాణా ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు.తమాషా ఏమంటే గతంలో కాంగ్రెస్ ప్రతినిధుల నిరాహారదీక్షా శిబిరం దగ్గర ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ఢిల్లీలో చర్చలు జరుపుతున్న వారికన్నా ముందే ఈ అంశాలు ఆయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్ వాదులు మాత్రం వీటిని ధృవపర్చిన దాఖలాలు లేవు. ఉద్యమాలను ఉత్సాహ పర్చడం కోసం కెసిఆర్ ఇలాటివి మాట్లాడుతుంటారని ఆయన సహచరులు చెప్పే వివరణ దీనికీ వర్తిస్తుందనుకోవాలి.కాకపోతే వూహాగానాలతో వుత్తుత్తి కథనాలతో ఉత్సాహపర్చినా అది నిలబడుతుందా? తర్వాత కలిగే నిరుత్సాహం మరింత తీవ్రంగా వుండదా? ఈ అంశాలను ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ క్రమంలో విశ్వసనీయత దెబ్బతినడమూ కద్దు.ఇంతా చేసి భౌగోళికంగానూ చారిత్రికంగానూ రెండు రాయలసీమ జిల్లాలను తెచ్చికలపడం కుదిరేది కాదు. అలాటి ప్రతిపాదన తీవ్రంగా వచ్చే అవకాశమూ లేదు. కనక ఇది కెసిఆర్ మాటల పొదిలోంచి వదిలిన మరో అస్త్రంగానే భావించాలి. ఈ మాటలకు ముందు ఆయన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో మాట్టాడ్డం వల్ల ఇవి ఆయన భావాలకు దగ్గరగా వున్నాయని కూడా చెప్పొచ్చు.
Tuesday, September 27, 2011
లగడపాటి రాక- రాజకీయ కాక

సకల జనుల సమ్మె సగం నెల పూర్తి అవుతున్న సందర్భంలో విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ రంగ ప్రవేశం పరిస్తితిని అకారణంగా వుద్రిక్త పరిచింది. ఆర్టీఏ అధికారి పినిశెట్టి శ్రీనివాస్‌పై దాడిని అందరూ ఖండించారు. అందుకు కారకుడైన వ్యక్తిని తామే అప్పగించామని కూడా జెఎసి నాయకులొకరు నాతో చెప్పారు. ఏపీ ఎన్జీవో సంఘం నాయకుడు గోపాల్ రెడ్డి కూడా దీనిపై ఆందోళన వెలిబుచ్చారు. అలాటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత పెరక్కుండా చూసుకోవలసింది.అయితే లగడపాటి రాజగోపాల్ పరామర్శ పేరిట రావడంతో పరిస్తితి రాజకీయ రంగు పులుముకోవడం సహజం. గతంలో కెసిఆర్ నిరాహారదీక్ష సందర్భంలోనూ ఆయన ఇలానే చేశారు.వీటివల్ల ఆయనకు రాబిన్ హుడ్ ఇమేజ్ వస్తుందనుకుంటారేమో గాని రాష్ట్రంలో పరిస్తితి దిగజారుతుందని గుర్తించాలి. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు (మళ్లీ కాంగ్రెస్ వాదులతో సహా) వెళ్లడం, పోలీసులతో ఘర్షణ, నాయకులపట్ట ప్రవర్తనపై ఆగ్రహం, హరీష్ రావు సొమ్మసిల్లేందుకు దారి తీసిన ఘర్షణ ఇవన్నీ గత పదిహేనురోజులలో లేని కొత్త పరిస్థితికి దారి తీశాయి.ఈ ఉద్రిక్తతలు కొనసాగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతివారిపై వుంది. ఢిల్లీలో నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమోనని ముందే ప్రభావం ప్రసరించాలన్న ఆదుర్దా అందరిలో వున్నట్టు స్పష్టమవుతుంది. అది అర్థం చేసుకోవచ్చుగాని ఆ కారణంగా అవాంఛనీయ పరిస్తితులను సృష్టించుకోవడం ఎవరికీ మంచిది కాదు.
శంకర్ రావుపై జడ్జి ఆదేశం ప్రభావం?

ఎప్పటికప్పుడు ఏవో విపరీత వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే మంత్రి శంకర్ రావు హౌం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యను సుమోటాగా తీసుకోవాలని సిబిఐ దర్యాప్తు జరిపించాలని జస్టిస్ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఆ ఆరోపణల లాగే ఈ ఆదేశం కూడా ఇంకా పూర్తి స్వరూపం తీసుకోవలసి వుంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజా ప్రయోజన వాజ్యం కింద దీన్ని తీసుకోవడానికి అన్ని అర్హతలు వున్నాయని న్యాయమూర్తి భావించినప్పటికీ తుది నిర్ణయం జరగాల్సింది మరోచోట. శంకరరావు వ్యాఖ్యలు మంత్రివర్గంలో అస్తవ్యస్త పరిస్థితిని ప్రతిబింబిస్తున్న మాట నిజమే గాని న్యాయమూర్తి ఆదేశాల పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే విషయం అర్థమవుతుంది.
Monday, September 26, 2011
టీ కాంగ్రెస్ నేతల ఆగ్రహావేశాలు
సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సోమవారం తీవ్రస్థాయిలోనే రంగంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిపైనా నేరుగా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధిష్టానంపైన కేంద్రంపైన మాత్రం ఇంకా విశ్వాసం ప్రకటించడం గమనించదగ్గది. ప్రాంతీయ విధేయతకు పార్టీ విధేయతకూ మధ్యన వారు తమ స్థానాన్ని నిర్ణయించుకోనంత వరకూ ఈ మాటల వల్ల ప్రయోజనం వుండదు.దామోదరరెడ్డి అవసరమైతే కొత్త పార్టీ వస్తుందని అన్నప్పటికీ ఆ మాటలలో వుండాల్సిన తూకం లేదు. ఇదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా రాష్ట్రం రావడాన్ని ఎవరూ వ్యతిరేకించదం లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజునే ఈ మాట చెప్పడం మరో విశేషం. నిన్న మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తమ పాత విధానాన్నే పునరుద్గాటించారు. వీటన్నిటిని బట్టి సమ్మె ఉధృతిని బట్టి ఏదో ఒక పరిష్కారం రాబోతుందని అనుకోవడానికి ఆస్కారముంది.అయితే కాంగ్రెస్ ధోరణి రీత్యా అలా అనుకోవడం అవాస్తవికతే అవుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ సమస్యనూ వారు పరిష్కరించకుండా అట్టిపెట్టి రాజకీయం నడపడానికి అలవాటు పడిపోయారు. ఒక విధానం చెప్పి దానిపై నిలబడటం కంటే ఏమీ చెప్పకుండా అందరినీ ఆడించుకునే అవకాశవాదం
Subscribe to:
Posts (Atom)




