- తెలకపల్లి రవి
ఈ వారంలో అనేక సమస్యలు రోశయ్య ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలోకి నెట్టాయి. అందులోనూ సూక్ష్మ రుణ సంస్థల రాక్షసాలకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిశిత విమర్శలకు గురైంది. ఆఖరుకు అర్డినెన్సు తెచ్చినా అది అరకొరగా వుండటంతో ఆగ్రహం పెల్లుబికింది. కీలకమైన అధిక వడ్డీ సమస్యను అంటుకోకుండా ఆర్దినెన్సు వల్ల ప్రయోజనమేమిటని అందరూ ప్రశ్నిస్తుంటే అది రిజర్వు బ్యాంకుపై నెట్టి తప్పుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆర్‌బిఐ గవర్నర్ డువ్వూరి సుబ్బారావు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేనని, దీనిపై జులైలోనే తాము తాఖీదు పంపించామని వెల్లడించడంతో ఆ సమర్థన తేలిపోయింది. ఉద్యోగ వర్గాల న్యాయమైన కోర్కెలను కూడా ఆమోదించకపోవడంతో వారు సమైక్యంగా ఉద్యమ బాట పట్టనున్నట్టు ప్రకటించారు.Friday, October 29, 2010
'విద్రోహ దినం' వివాదం విడ్డూరం
- తెలకపల్లి రవి
ముఖ్యమంత్రి రోశయ్య ఈ వారం సిఐఐ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సు మాత్రమే తప్ప నిర్ణయాత్మకం కాదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. పైగా రాష్ట్ర విభజన అనేది వీధుల్లో తేల్చుకునే విషయం కాదని కూడా ఆయనన్నారు. ఇదే సమయంలో సోనియాగాంధీ కూడా కాంగ్రెస్ సమావేశంలో ప్రాంతీయ వేర్పాటు వాదాల వల్ల ప్రమాదాలను గురించి చేసిన హెచ్చరికపై పరిపరివిధాల వ్యాఖ్యలు వచ్చాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ చరిత్రను బట్టి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు సమయంలో గాని తర్వాత వివిధ ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో గాని అవకాశవాదానికే పాల్పడటం గమనించవచ్చు.Thursday, October 28, 2010
కట్టలు తెగిన కమ్యూనిస్టు ద్వేషం
- తెలకపల్లి రవి
మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ లండన్‌లో చేసిన ప్రసంగాన్ని వక్రంగా నివేదించడమే గాక దాని ఆధారంగా రెచ్చిపోయి విషం కక్కడంలో కొన్ని పత్రికలు,మీడియా సంస్థలు పోటీ పడ్డాయి. అవగాహన చేసుకోవడానికి అరక్షణమైనా యత్నించకుండా అవహేళన చేయడానికి అధ్వాన వ్యాఖ్యలతో అల్పానందం ప్రదర్శించడానికి మహా విజ్ఞులైన సదరు సంపాదకీయ రచయితలు చూపించిన ఆరాటం అన్యులకు అసాధ్యమైన పని!కరత్ ప్రసంగంలోని కీలకమైన రెండు అంశాలను మళ్లీ చెప్పుకుంటే- భారత దేశంలో సిద్ధాంత పరంగానూ ఆచరణ
Subscribe to:
Posts (Atom)