Pages

Friday, February 22, 2013

ఆత్మస్తుతి ఆర్భాటాల మధ్య అభద్రాంధ్ర ప్రదేశ్‌


హైదరాబాదు దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయింత్రం సంభవించిన విధ్వంసక విస్పోటనం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై ఒక పరోక్ష వ్యాఖ్యానం. సహకార ఎన్నికల విజయాలపై శ్రుతిమించిన ఉత్సాహంలో మునిగి ఆత్మ స్తుతి అవధులు దాటిన అధినేతలకు ఒక కుదుపు. మరొకరికి పని లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పరస్పరం అభిశంసించుకుంటున్న అరుదైన ఘట్టం! ఆ క్రమంలో రెండు చోట్లా పాలిస్తున్న పార్టీ అపహాస్యం పాలవుతున్న వైపరీత్యం.
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు అకస్మాత్తుగా అనూహ్యంగా జరిగిన పరిణామాలు కాదు. హైదరాబాదుకు బాంబు దాడులు ముప్పు పొంచి వున్నదని గత నెలరోజులుగా హెచ్చరికలు వినిపిస్తూనే వున్నాయి. ప్రజాశక్తి కూడా గత నెల 13వ తేదీన పతాక శీర్షిక నిచ్చి ప్రచురించింది. ఇతరత్రా కూడా బాంబు హెచ్చరికలు వచ్చి శాసనసభను డిజిపి కార్యాలయాన్ని తనిఖీలు చేసిన సందర్భాలున్నాయి. ఒకటి రెండు చోట్ల బాంబులను నిర్వీర్యం చేసిన ఘటనలూ వున్నాయి. అన్నిటినీ మించి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో రకరకాల రాజకీయ శక్తులు పాచికలు వేస్తున్న తీరు విదితమవుతూనే వుంది. మతోద్రిక్తతలు పెంచేందుకు దేశ విదేశాలలో పొంచి చూస్తున్న సంస్థలు పక్షాల గురించి చెప్పనవసరం లేదు. భాగ్యలక్ష్మి వివాదంతో మొదలై అక్చరుద్దీన్‌ అరెస్టు విడుదల వరకూ జరిగిన పరిణామాలు సహజంగానే ఉద్రిక్తత పెంచాయి. ప్రాంతీయ వివాదాలపై వాదోపవాదాలు కూడా అనిశ్చితిని పెంచి ఆందోళన కలిగించాయి. గత నెలలో బాంబులు పట్టుపడటం, డిజిపి కార్యాలయం శాసనసభలతో సహా బెదిరింపులు రావడం తెలిసిన విషయమే. వీటిపై ప్రజాశక్తి పతాక శీర్షికలు ఇచ్చింది కూడా. సామాన్య ప్రజలు కూడా సందేహిస్తున్న ముప్పు సూచనలు ఏలిన వారికి మాత్రం కనిపించలేదు. కేంద్రం హెచ్చరికలు పంపితే అవి మామూలే అనుకున్నారట!(వారిని కాపాడ్డం కోసం ఇప్పుడు కేంద్ర హౌమంత్రి కూడా మామూలు పల్లవి ఎత్తుకున్నారు) అలసత్వం లేదా అసమర్థత ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ప్రస్తావించకుండా వుండటం ఎలా సాధ్యం?
కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక తక్కిన దేశంతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా

కుట్రలు వమ్ము చేయాలి



మానవ లక్షణాలే కోల్పోయిన ముష్కర హంతకుల ఉన్మాద హత్యాకాండకు అమాయకులూ అసహాయులే అత్యధికంగా బలవుతుంటారు. గురువారం సాయింత్రం దిల్‌సుఖ్‌నగర్‌లో హఠాత్‌ హంతక విస్పోటనాలకు విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయిన వారంతా ఈ కోవకు చెందిన వారే. నాగరికతకూ ఆధునికతకూ మానని వ్రణంలా తయారైన రకరకాల ఉగ్రవాదాల విచక్షణా రహిత హత్యాకాండతో వర్తమాన ప్రపంచం అందులో భాగంగా భారత దేశం కూడా తల్లడిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదు నగరం కూడా ఉగ్రవాద మారణహౌమాలకు ఒక కేంద్రబిందువుగా మారడం అత్యంత ఆందోళన కరం. ఈ విషయం గత కొన్నేళ్లలో అనేక సార్లు రుజువైనా అలసత్వం వీడని పాలకుల పోలీసుల అలసత్వం మరింత అపాయకరం. గత నెలరోజుల్లోనూ పొంచి వున్న ముప్పు గురించిన ప్రజాశక్తి కథనాలతో సహా అనేకానేక హెచ్చరికలు వెలువడ్డాయి. ఆఖరుకు ఆ పార్టీకే చెందిన కేంద్ర హౌంశాఖ మంత్రి కూడా ముందస్తు సమాచారం పంపించానంటున్నారు. అయినా సరే అప్రమత్తం కాని అధికార యంత్రాంగాన్ని అధినేతలను ఏమనాలి? ఏమన్నా అది రాజకీయం చేయడం అంటారు గాని మరెవరిని అనాలి?
లుంబిని గోకుల్‌చాట్‌ పేలుళ్ల తరుణంలోనే రాజధాని గుండె చెదిరింది. ఆ తర్వాత సాగిన ఆక్టోపస్‌ వ్యవహారం అదో పెద్ద ప్రహసనం. గత మూడేళ్లలోనూ రాష్ట్రంలో తిష్ట వేసిన అనిశ్చితి నడుమ హైదరాబాదులో పోటాపోటీ మత తత్వాల మధ్య పొంచి వున్న ప్రమాదంపై ప్రమత్తత వూహకందని విషయం. అఫ్జల్‌ గురు ఉరితో సహా అనేకానేక కారణాలు ఏకరువు పెట్టొచ్చు గాని అన్నిటికన్నా కీలకం అలసత్వమే. ఉగ్రవాద కుట్రలను ఛేదించడం నూటికి నూరు పాళ్లు సాద్యం కాకపోవచ్చు గాని విశృంఖల మారణ వ్యూహాలన అరికట్టడానికి పటిష్టమైన నిఘా నియంత్రణ అవసరం. దురదృష్టవశాత్తూ పదే పదే ఉగ్రవాదం పంజా విసురుతున్నా పోలీసు బాసులు గాని ప్రభుత్వ నేతలు గాని మేల్కొనడం లేదు. ఘటన జరిగిన తర్వాత గంభీర ప్రకటనలు ఎన్ని చేసినా వ్యర్థమే. ఇప్పుడు కూడా ఘటనా స్థలంలో సిసి కెమెరాల వైఫల్యం, ముందు

Friday, February 1, 2013

గడువులు, గండాలు



దూషణలు దుర్బాషల్లో తెలుగు నేతలంతా ప్రాంతాతీతమైన సమైక్య భావన ప్రదర్శించడం సమకాలీన రాజకీయాల్లో ఒక విలక్షణత. భావం భాష కన్నా ఎప్పుడూ ముఖ్యమైంది. కాని కావాలని భాషను విశృంఖలంగా ఉపయోగించినప్పుడు అసలు కన్నా కొసరు అన్నట్టు దానిచుట్టూనే పరిభ్రమించే విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంటుంది. మాటల మాంత్రికుడుగా మీడియా నామకరణం చేసిన టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. ఆంధ్ర తెలంగాణాలకు చెందిన గత ప్రస్తుత కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలపైన ఆయన ఉపయోగించిన భాష పదజాలంపై పెద్ద దుమారం సాగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. కొన్ని కేసులు కూడా నమోదైనాయి. ఇవన్నీ చివరకు ఎలా పరిణమిస్తాయో తెలియదు గాని ఇప్పటికైతే దీని వల్ల చర్చ తీరు మారిపోయింది. నెల అంటే రెండు నెలలు కావచ్చని ప్రజల ఇంగిత జ్ఞానాన్నే ప్రశ్నించిన కేంద్రం నిర్వాకం వెనక్కు పోయింది.
కెసిఆర్‌ ఇలా మాట్లాడ్డం ఇదే మొదటి సారి కాదు, బహుశా చివరి సారి కూడా కాబోదు! ఇస్తే వరం పెడితే శాపం అన్నట్టు ఆయన వ్యూహాత్మక బాషణాలన్ని విపరీతమైన మలుపులు తిరుగుతుంటాయి. వివాదంలో అవతలి పక్షాన్ని హీనాతిహీనంగా తీసిపారేయడం ద్వారా తనను తాను ఉన్నతంగా ప్రతిష్టించుకుని తన వాళ్లకు భరోసా ఇవ్వడం రాజకీయాల్లో ఒక బాణీ అనుకుంటే కెసిఆర్‌ దానికి ప్రతిరూపమనొచ్చు. అయితే శ్రుతిమించితే ఎలాటి వ్యూహమైనా బెడిసికొడుతుందనడానికి ఇప్పటి పరిస్థితి ఒక ఉదాహరణ.కాంగ్రెసేతర పార్టీలపై ఆయన దాడి సాగినంత కాలం వీణారవంలాగా వున్న ఈ మాటలే ఇప్పుడు విషతుల్యమై పోయాయంటే