Pages

Monday, February 28, 2011

బహుముఖ వైరుధ్యాల మధ్య ఆనిశ్చిత ఆంధ్రప్రదేశ్‌ఈ వారం రోజులలోనూ ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల అనిశ్చితి కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తుంది. గత వారం శాసనసభలో గవర్నర్‌పై దాడి, తర్వాత జయ ప్రకాశ్‌పై దాడి వంటి ఘటనలు, సస్పెన్షన్లు చూశాము. బడ్జెట్‌ సమర్పణలోనూ ఇదే ప్రతిధ్వనించింది. కాకపోతే ఈ సారి టిఆర్‌ఎస్‌కే పరిమితం కాకుండా తెలుగు దేశం, సిపిఐ బిజెపి సభ్యులు కూడా గొంతు కలపడం కొత్త పరిణామం. ఆ తర్వాత తెలుగు దేశం సభ్యులను అద్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశపర్చి ఈ ధోరణి తగదని మందలించినట్టు కథనాలు వెలువడ్డాయి.అదే సమయంలో తెలంగాణా సమన్వయ కమిటీ అంటూ ఒకటి

Monday, February 21, 2011

భాష గురించి చర్చ,కొన్ని అనుభవాలు,అభిప్రాయాలునా వ్యాసంపైన కాదు గాని నా వ్యాసంతో మొదలై తెలుగు భాష గురించి చాలా చర్చ జరగడం సంతోషకరం... నిత్య పరివర్తనాశీలమైన భాష వంటి విషయంలో పట్టువిడుపులతో వాస్తవికంగా వ్యవహరించడం తప్ప మరో మార్గం లేదు. కొన్ని అనుభవాలు,అభిప్రాయాలు చెప్పి దీన్ని ముగిస్తాను.
తెలుగులో రాయడంతో పాటు ప్రముఖుల రచనలనూ, జాతీయ నేతల ఉపన్యాసాలనూ కూడా నేను విస్త్రతంగా అనువదించాను. నేనూ ఉపన్యాసాలు విరివిగా చేస్తుంటాను. వీటిలో రకరకాల అనుభవాలున్నాయి.
ఒకసారి నేను పాల్వంచలోనో ఇల్లెందులోనో గంట సేపు మాట్లాడాక

Sunday, February 20, 2011

వాస్తవిక దృష్టితో తెలుగు భాషా వికాసం.


విష్వక్సేనుడు అన్న మాట ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సక్రమంగా ఉచ్చరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్‌ పార్టీ నేత అంబటి రాంబాబు కొద్ది కాలం కిందట సవాలు చేశారు. ఈ రెంటిలో ఏదీ జరగలేదు. జరగవు కూడా. అయితే ఈ క్రమంలో తెలుగు భాషకు సంబంధించిన కీలకమైన అంశాన్ని గుర్తించడానికి మాత్రం ఈ వివాదం ఉపయోగపడుతుంది.
ముఖ్యమంత్రి తెలుగు పండితుడు కావాలన్న నిబంధన ఏమీ లేదు గనక ఆయన ఎలా మాట్టాడుతున్నారనేది పెద్ద సమస్యగా తీసుకోనవసరం లేదు. అయితే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో ధారాళంగా మాట్టాడేందుకు శ్రద్ధ చూపకపోవడం ఇంగ్లీషు భాషా బోధన ప్రాబల్యాన్ని చెప్పకనే చెబుతుంది. రెండవది తెలుగు భాషా పటిమను పరీక్షించడానికి ఎంచుకున్న విష్వక్సేనుడు అనే పదం తెలుగేనా? సంసృతమా? ప్రాచీన ప్రమాణాల ప్రకారం భాషను బంధించ దలచిన సనాతన వాదనలను మనం ఇంకా భుజాన మోయవలసిన

Friday, February 18, 2011

చట్టసభలు దాడులతో చట్టుబండలైన వేళచట్టసభలు దాడులతో
చట్టుబండలైన వేళ
రాజకీయ ఉద్యమాలు
రాజ్యాంగపు మాటలేల?

వీర తెలంగాణా ప్రజల
విజ్ఞతకే పరిహాస్యం
సమరశీల తెలుగు జనత
చేతనకే అపహాస్యం

నిన్న శాసనసభలో ఘటనలపై టీవీ9, సాక్షి ఛానళ్లలో చర్చలో పాల్గొన్నపుడు చెప్పిన చరణాలివి. నిస్సందేహంగా నిన్నటి ఘటనలు ఆవాంచనీయమైనవి, ఆందోళనకరమైనవి కూడా. టీవీ9లో తొలుత చర్చలో పాల్గొన్న హరీష్‌ రావు దాడులను సూటిగానే ఖండిస్తున్నట్టు చెప్పారు. తర్వాత కిర్నె ప్రభాకర్‌ మాత్రం సహజ శైలిలో పాత థోరణిలోనే మాట్లాడారు. దానిపై నేను స్వల్పంగానే స్పందించాను. ఎందుకంటే టిఆర్‌ఎస్‌లో మొదటి నుంచి నేను చూసిన మేరకు కెసిఆర్‌, కెటిఆర్‌,కవిత, హరీష్‌(కొంత వరకూ వినోద్‌) వంటి వారు మాట్లాడే తీరుకు అధికార ప్రతినిధులుగా వచ్చే వారు మాట్లాడే తీరుకు తేడా వుంటుంది. అగ్ర నాయక పరివారంలో వారు అవతలి వారిని తేలిగ్గా తీసేస్తూనే తర్కం వినిపించడానికి

Thursday, February 17, 2011

నిరసన సహజం -దాడులు అసహనం
కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలలో రాజకీయ ప్రకంపనాలు వూహించినవే. ప్రజాస్వామికంగా ఏ అంశంపైనైనా నిరసన తెలిపేందుకు పార్టీలకూ సభ్యులకూ హక్కు వుంటుంది.కాగితాలు లాక్కోవడానికి ప్రయత్నించడం వంటివి పక్కన పెడితే గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం కూడా అసాధారణం కాదు. అంతకన్నా ఆయన మాటల్లోని డొల్లతనాన్ని ఎండగడితే ఎక్కువ ఉపయోగంగా వుంటుంది. ఈ సందర్భంగా జయప్రకాశ్‌ నారాయణ్‌పై దాడి జరిగిన తీరు కూడా అవాంఛనీయమైంది. ఆయన అభిప్రాయాలతో అభివ్యక్తితో తేడాలుంటే తప్పక ఖండించవచ్చు. కాని ఎవరిపైనైనా సరే రాజకీయ కారణాలతో దాడులకు దిగడం సరైంది కాదు. మంగళవారం నాడు తెలంగాణా ప్రాంతానికే చెందిన ఎస్‌సి శాసనసభ్యుడు షిండే కారును ధగ్దం చేసిన ఘటన కూడా ఇలాటిదే. సహాయ నిరాకరణ ఉద్యమం మొదలవుతున్న తరుణంలో ఇలాటి ఘటనలు పొరబాటు సంకేతాలు పంపుతాయని ఆందోళన కారులు గుర్తించడం అవసరం. ఇంతకూ ప్రధాని ప్రసంగంపై వ్యాసంలో రాసినట్టు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ దాగుడు మూతలు అడుతున్నంత కాలం రాష్ట్రానికి అనిశ్చితి తప్పదు. ఈ సమయంలో సంయమనంతో రాజకీయ వ్యూహాలను ఎదుర్కోవాలి తప్ప కవ్వింపు ధోరణులకు లోబడితే మరింత నష్టం జరుగుతుంది. ఢిల్లీలో మకాం వేసిన కాంగ్రెస్‌ నాయకులు కూడా తమ నిస్సహాయతను స్పష్టంగానే వెల్లడిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలలో ఎవరి కోర్కెలు వారు ముందుకు తేవచ్చు గాని అకారణ ఉద్రేకాలను పెంచుకోవడం వల్ల జరిగే మేలు శూన్యం.

'ప్రధాన' ప్రహసనం

కురుసభలో వుంటూ తింటూ విదుర దేవులు ఎన్ని నీతులు చెప్పినా నిరర్థకమే. ఎందుకంటే వ్యక్తి గొప్పవాడైనంత మాత్రాన చాలదు. వ్యక్తి నడిపించే వ్యవస్థ ఏమిటన్నది అసలు కీలకం. కళంకిత వ్యవస్థలకు నాయకత్వం వహిస్తూ నా విశుద్ధత చూడండని విద్వత్‌ పరీక్షలను ఆహ్వానించినంత మాత్రాన చాలదు. వరుస కుంభకోణాల తాకిడితో తల్లడిల్లి పోతున్న తన సర్కారును కాపాడుకునే ఆఖరి ప్రయత్నంలో అగత్యం లేక తెర ముందుకొచ్చిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రవచనాల ప్రహసనం అలాటిదే. నీతి బాహ్య వ్యవహారాలను సూటిగా ఒప్పుకుని తప్పు దిద్దుకోడానికి సిద్ధపడలేని నీరస నిర్జీవ తతంగం అది. రాజకీయ లాంఛనం లాటి విన్యాసం అది. ఆయనే చెప్పినట్టు వంద కోట్ల పైబడిన జనాభా గల భారత దేశాధినేత, అంత అసహాయంగా ఆత్మ రక్షాణావస్థలో

Monday, February 14, 2011

రద్దయిన రాజ్యం- రాజకీయ మూల్యంరెండున్నర గంటల వ్యవధిలో ముగిసే చలన చిత్రంలా రెండున్నర ఏళ్లలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌ రాజ్యంలో కలిసిపోయి కథ ముగించుకుంది. సోనియా నివాసం 10 జనపథ్‌ ముందు చిరంజీవి తన పార్టీ పేరు కూడా ప్రస్తావించకుండానే విలీనం చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఆమెను కలుసుకున్న తర్వాత తమతో మాట్లాడి ప్రకటన చేస్తారనుకున్న ముఖ్య నాయకులు కూడా ఆశ్చర్య పోక తప్పలేదు. ఆకర్షణలు సామాజిక సమీకరణల అతిశయోక్తి అంచనాల మధ్య అమిత ప్రచారార్భాటంతో ఆవిర్భవించిన ఒక రాజకీయ పక్షం ఆ విధంగా తనకు తానే స్వస్తి చెప్పుకుంది. ఒక ప్రభుత్వం అనిశ్చితిలో వున్నప్పుడు తృతీయ స్థానంలో వున్న ప్రతిపక్షం అస్తిత్వాన్ని రద్దు చేసుకుని సంలీనం కావడం

Sunday, February 6, 2011

10 జనపథ్‌ ముంగిట ముగిసిన ప్రజారాజ్యంప్రజారాజ్యం భవిష్యత్తు ఇప్పటికీ చిరంజీవి అవకాశాలపై కొనసాగుతున్న వూహాగానాల గురించిన నా ఆలోచనలను గత గురువారం ఎంట్రీలో పంచుకున్నాను.దానిపై ఒక్క మిత్రుడు స్పందించిన తీరు కూడా చూశాను.తీరా ఈ ఆదివారం నాడు చిరంజీవి హడావుడిగా 10 జన్‌పథ్‌ ముందు విలీనం అవుతున్నట్టు చేసిన ప్రకటన నేను భావించిన దానికన్నా కూడా ఆత్రుతను ప్రదర్శించింది. కనీసం తన ప్రజారాజ్యం పార్టీ స్తాపన అనివార్యంగా విలీనం చేయడం వంటి అంశాల గురించి ఒక్క ప్రస్తావనైనా చేయకపోవడం ఇందుకు నిదర్శనం.వీరప్ప మొయిలీనే ఆ పార్టీ పేరు ప్రస్తావించారు.
ఇక రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేవని చెబుతూ చిరంజీవి ఉటంకించిన అంశాలు- మహిళా రిజర్వేషన్‌, సచార్‌ కమిటీ, పోలవరం ప్రాణహిత వంటివి అరిగిపోయిన రికార్డుల్లా

Wednesday, February 2, 2011

నేను సైతం,, హస్తరేఖగ.

.

శ్రీశ్రీ మహా ప్రస్థానంలో తొలి కవిత నేనుసైతం .చిరంజీవి రుద్రవీణలోనూ తర్వాత ఠాగూరులోనూ సుద్దాల అశోక్‌ తేజ ఈ పాట ఆధారంగా గీతాలు రాశారు. జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తరోత్తరా అది ప్రజారాజ్యం ప్రారంభ గీతమైంది. తిరుపతిలో ఆ పాట మోగుతుంటే మెగాస్టార్‌ మాటల కోసం అన్నిచోట్లా కోట్ల మంది ఎదురు చూశారు. ఇప్పుడు నేను సైతం హస్త రేఖగ కొత్త పాత్రకు మారిపోతాను అన్న పల్లవి ఇప్పుడు అక్కడ వినిపిస్తుంటే ఆ సన్నివేశాలూ ,చర్చోపచర్చలూ మెగాస్టార్‌ రాజకీయ గమనంలో విన్యాసాలు వైరుధ్యాలూ కళ్లముందు కదలాడుతున్నాయి. ఎందుకంటే అంతకు ముందూ తర్వాత కూడా దీనిపై మీడియా చర్చలలో ఎక్కువగా పాల్గొన్న వారిలో నేనొకణ్ని.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస దారులు, చలనచిత్రాభిమానులు, సామాజిక అనుయాయులు, ఔత్సాహిక నేతలతో చిరు రాజకీయ యాత్ర మొదలెట్టారు. మాజీ వామపక్షీయులు కొందరు