Pages

Saturday, October 27, 2012

విస్తరణ వివాదాలు- విస్తరించిన విభేదాలు


ఎంతకాలం నుంచో ప్రచారం జరుగుతున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఆదివారం పూర్తి కానుంది. ే పూర్వ ప్రజారాజ్య నేత మెగాస్టార్‌ చిరంజీవితో పాటు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, బలరాం నాయక్‌, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ పదవులు పొందనున్నారు. ప్రభుత్వం కూలిపోయే స్థితిలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపి ప్రాణం నిలిపిన చిరంజీవికి కేంద్రంలో స్థానం కల్పిస్తారని ఎప్పటినుంచో చెబుతున్నా ఆ ప్రక్రియ బాగా ఆలస్యమైంది. దీనిపై అనేక వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక కోట్ల సూర్య మాజీ ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికీ జిల్లాకే పరిమితమై తన వర్గం పనులను చూసుకుంటూ కాలం గడుపుతుంటారు. రాయలసీమలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఎదుర్కొవడానికి సామాజిక సమీకరణను నిలబెట్టడంలో ఆయనను తీసుకోవడం ఉపయోగమని అంచనా వేసినట్టు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో కిల్లి కృపారాణిని తీసుకోవడంలోనూ ఇదే వ్యూహం అనుకోవాలి. తెలంగాణా విషయానికి వస్తే ప్రాంతీయ ఉద్యమం నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్‌ అధిష్టానం తరపున నిలబడే వారు కావాలి గనక సర్వే, నాయక్‌లు ఎంపికయ్యారు. అనేక సందర్భాల్లో తీవ్ర స్వరంతో ప్రత్యేక నాదం వినిపిస్తున్న వారికి భిన్నంగా సర్వే అధిష్టానం విధేయతను చాటుకున్నారు. అందరూ బహిష్కరించినప్పుడు కూడా ఆయన లోక్‌సభలో వుండి తన వాదం వినిపించారు.ఇప్పుడు పదవి పూర్తిగా సోనియా గాంధీ దయా దాక్షిణ్యాల వల్లనే లభించిందంటూ ఆ విధేయతను రెట్టింపు చేశారు. పైగా వీరికి ఇవ్వడం వల్ల ఎస్‌సి ఎస్‌టి వర్గాల ప్రతినిధులుగానూ వారిని ముందుకు తెచ్చే అవకాశం వుంటుంది.
వాస్తవానికి ఎవరికి ఏ పదవి వచ్చిందన్న దానికన్నా ఎవరు ప్రజల కోసం ఏం చేశారన్నది

పోటీయాత్రల విశేషాలు
అధికార పక్షం సంగతి విభేదాల మయంగా వుంటే ఆ స్తానం మాదంటే మాదని పోటీ పడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగు దేశం పాదయాత్రలు పోటాపోటీగా సాగుతూనే వున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుకు, షర్మిలకు వ్యక్తిగతంగా పోటీ ఏమిటన్న ప్రశ్న వస్తున్నా రాజకీయంగా మాత్రం పోటీ వున్నప్పుడు పోలికలు కూడా వుంటాయి. చంద్రబాబు యాత్రలో కాంగ్రెస్‌తో పాటు కొన్ని సార్లు అంతకంటే ఎక్కువగా కూడా జగన్‌పార్టీపై విమర్శ కేంద్రీకరిస్తున్నారు.తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ అంటూ ఒకటిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల యాత్రను ఆయన ప్రస్తావించకపోయినా ఇతర నాయకులు తరచూ విమర్శిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో పాటు ఇటీవల బైబిల్‌ పట్టుకోవడంపైనా విమర్శలు కేంద్రీకరించారు. నిజానికి ఎవరు ఏ పుస్తకం పట్టుకున్నారు, ఏ దేవుడి బొమ్మకు వేదికపై పూజ చేశారు ఇలాటి అంశాలు ఎప్పుడూ చర్చనీయం కాలేదు.దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలక పార్టీలన్నీ కుల మత భావాలను రాజకీయ లబ్దికి వాడుకోవడం జరుగుతూనే వుంది. కుల సంఘాల సభలకు హాజరవడం, ప్రార్థనా స్థలాల్లో మత పెద్దల మద్దతు పొందడం జరుగుతూనే వుంది. అయితే ఈ స్తాయిలో దానిపై విమర్శలు గతంలో లేవు. తెలుగు దేశం వ్యూహాత్మకంగానే దీన్ని ముందుకు తెచ్చిందనే అభిప్రాయం వుంది. బైబిల్‌ భగవద్గీత ఏదైనా ఆ ప్రస్తావన వారు

Monday, October 22, 2012

రాంబాంబులు- రాజకీయాలు


కెమెరా మెన్‌ గంగతో రాంబాబు చిత్రం కట్స్‌ లేకుండా చూసే అవకాశం నాకు కలగలేదు.అయితే దానిపై విస్తారంగా వెలువడిన సమాచారాన్ని, పూరీ జగన్నాథ్‌, దిల్‌ రాజు వంటివారి స్పందనను చూసిన తర్వాత ఒక అభిప్రాయం చెప్పడంలో తప్పేమీ వుండదనుకుంటున్నాను.ఎందుకంటే ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా వెళ్లలేని చూడలేని అనేక అంశాలపై వ్యాఖ్యానాలు చేస్తునే వున్నాము( కొందరు సినిమా వాళ్లు కూడా పూర్తి అవగాహన లేని విషయాలు నచ్చినట్టు చూపిస్తుంటారు) ఇదీ అలాటిదే.

మొదటిది- ఒక సినిమా లేదా టీవీ లేదా పత్రికలో విషయం నచ్చకపోయినంత మాత్రాన విధ్వంసం చేయడం సరికాదు. ముందు నిరసన తెల్పడానికి తొలగింపులు కోరడానికి చాలా మార్గాలు వున్నాయి. ఇలాటి పద్ధతులు ఎవరు ఎవరిపై చేసినా సరికాదు. పైగా పాల్గొన్న వారి సంఖ్య రీత్యా వారే కోట్లమందికి ప్రతినిధులని చెప్పడానికి లేదు. సవరించుకునే సమయం ఇవ్వక తప్పదు..రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న రాజకీయ డ్రామాలను

Wednesday, October 17, 2012

ప్రధాని సందర్శన- పోలీసు పద ఘట్టనప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాక సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించేవిగా వున్నాయి.నిజానికి ఆయన హైదరాబాదుకు రాలేదు, సీవోపీ కి మాత్రమే వచ్చారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన బలం సమకూర్చిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం పట్ల తనకు ఎలాటి బాధ్యత వుందని ఆయన భావించలేదు. అస్తవ్యస్త నిర్ణయాలతో అరకొర ప్రకటనలతో రాష్ట్రాన్ని రాజకీయ అనిశ్చితిలో ముంచిన ప్రభుత్వాధినేత ఆ ప్రభావానికి భయపడి నేలమీద కాలు మోపకుండా గాలిలోనే ఎగిరిపోవడం నిజంగా సిగ్గుచేటే. సమయం చాలదనే సాకు ఎంతమాత్రం నిలిచేది కాదు. ఈ దేశానికే అత్యున్నత కార్యనిర్వహణాధినేత తల్చుకుంటే సమయం కుదుర్చుకోవడం సమస్య కానేకాదు. అనిశ్చితికి స్వస్తి చెప్పే ప్రకటన విధాన నిర్ణయం వెలువడాల్సింది ఆయన నుంచే.( రాజ్యాంగ పరంగా) అది గాకపోయినా కనీసం గాయాలు మాన్చి సాంత్వన చర్యలు తీసుకోవలసింది కూడా ఆయనే. సోనియా గాంధీ సరే రెండేళ్ళుగా రాష్ట్రంవైపు చూడనే లేదు.ఈయన రాక సందర్భంలో ప్రజలెవ్వరినీ చూడకుండా

Sunday, October 14, 2012

నంది అవార్డులు- ప్రతి స్పందనలు

నంది అవార్డు విజేతలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెల్పుతూ కొన్ని వ్యాఖ్యలు. దుకంటే చాలా సంవత్సరాలుగా చలన చిత్ర అవార్డులపై నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. ఈ సారి నంది అవార్డులు ప్రకటించిన ప్రజాభిప్రాయానికి దగ్గరగా వుందన్న భావన సాధారణంగా వ్యక్తమైంది. అదే సమయంలో అందరినీ సంతృప్తి పర్చడానికి చేసిన ప్రయత్నం కూడా వుంది. దాదాపు అన్ని సినిమాలకు అవార్డులు వచ్చాయి అని ఈనాడులో శ్రీధర్‌ వేసిన కార్టూన్‌లో కొంత నిజం వుంది. శ్రీరామ రాజ్యం, జై బోలోతెలంగాణా, దూకుడు ఈ చిత్రాలకు అవార్డులు ఎక్కువగా వచ్చాయి. విజయం జనాదరణ బట్టి చూస్తే వీటిలో దూకుడును ముందు చెప్పుకోవాలి. మహేష్‌బాబు ఎలాగూ ప్రథమ స్థానంలో వున్నాడు గనక ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం కూడా అర్థం చేసుకోవచ్చు. అయిత ఆ చిత్రం ప్రధానంగా హాస్యం వల్ల విజయవంతమైంది.కళ్లకింద క్యారీ బ్యాగులు పెట్టుకుని హీరో అయిపోయాననుకున్న ఎంఎస్‌ నారాయణకు ఉత్తమ హాస్య నటుడి అవార్డు అందుకే వచ్చింది. నా ఉద్దేశంలో మహేష్‌ బాబు నటించిన వాటిలో 'అతడు' నిజంగా కథలో(కమర్షియల్‌గానే) పట్టున్న సినిమా. సత్తా చూపించిన సినిమా. పోకిరీ ఆ ఇమేజ్‌ను కొనసాగించుకున్న ఫలితం మాత్రమే. దూకుడు వెనువెంటనే బిజినెస్‌ మాన్‌ రావడం కూడా అలాటిదే. (ఈ రెండూ పూరీ జగన్నాథ్‌వే కావడం మరో విశేషం) అయినా పేరుకు తగినట్టే ' చిత్ర' పరిశ్రమలో ఇలాటివి వుంటూనే వుంటాయి.
శ్రీరామరాజ్యం నంది అవార్డులు తెచ్చుకుంటుందని అందరూ అనుకుంటున్నదే. నిజానికి జాతీయ అవార్డు రానందుకు నిర్మాత సాయిబాబు వంటివారు కాస్త బాధ పడుతూ మాట్లాడారు.ఆ రోజుల్లో నేను టీవీ చర్చలో వారితో దీనిపై మాట్లాడాను కూడా. సాయిబాబా ప్రయత్నాన్ని బాపు ప్రతిభను పూర్తిగా గౌరవిస్తూనే శ్రీరామరాజ్యం సంభాషణలు, కథాగమనం, సెట్టింగులు అన్నిటిలోనూ మరింత జాగ్రత్త తీసుకుని వుండాల్సిందని చెప్పక తప్పదు. ఉదాహరణకు సింహాసనాల మధ్య మనుష/లు కనిపించడమే గగనమైన సన్నివేశాలున్నాయి. మొహాలపై కన్నీటి చుక్కలు మేకప్‌లో చిక్కుకుపోవడం కనిపిస్తుంది. హౌమ గుండంలో

Friday, October 12, 2012

అనునిత్య ప్రహసనం! అయినా సమర్థనం


తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని గులాం నబీ ఆజాద్‌ పక్షం రోజుల్లో రెండవ సారి చెప్పారు. (ఈ మధ్యలో హౌం మంత్రి షిండే రెండు సార్లు) గత పర్యాయం దేశం ఆ చివరనుంచి చెబితే ఈ సారి మన నట్టింట్లోకొచ్చి చెప్పారు. యుపి, బీహార్‌, మధ్య ప్రదేశ్‌లను విభజించినంత తేలిగ్గా ఏపిని విభజింపలేమన్నారు. కాల పరిమితికి కూడా అంగీకరించడానికి నిరాకరించారు. ఆజాద్‌ వ్యాఖ్యలు అనునిత్య ప్రహసనంలో భాగం అనుకుంటే దానికి ఉపాఖ్యానాలుగా అటు టిఆర్‌ఎస్‌, ఇటు లగడపాటి వ్యాఖ్యలు కూడా ఠంచనుగా వచ్చేశాయి. టిఆర్‌ఎస్‌ వారికి ఈ మాటల్లో తప్పు పెద్దగా కనిపించలేదు. తమ దసరా గడువుకు ఈ ప్రవచనాలకు వైరుధ్యమేమీ లేనట్టే మాట్లాడారు. అయితే ఆయన మాటల్లోని ఒక నిజం- ఆ రాష్ట్రాలకూ ఆంధ్ర ప్రదేశ్‌కు తేడా వుందన్న మాట మాత్రం కొట్టిపారేశారు.( అంతకు ముందే అయిదారు వరకూ వున్న హిందీ రాష్ట్రాలను మరిన్ని ఏర్పాటు చేయడానికి- భాష ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు తమిళ కన్నడ మళయాలీ, బెంగాలీ మరాఠీ కాశ్మీరీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీ తదితర రాష్ట్రాల విషయానికి మధ్య ఖచ్చితంగా కొంత తేడా వుంది.) టిఆర్‌ఎస్‌తో సంధానకర్తగా వ్యవహరిస్తున్న పాల్వాయి గోవర్థనరెడ్డి కూడా ఆజాద్‌ మాటలకు తనదైన భాష్యం చెప్పి తాము పార్టీ తరపున దౌత్యం చేస్తున్నామన్నారు. ఇక లగడపాటి షరామామూలుగా పరిస్తితి సున్నితత్వాన్ని మర్చిపోయి ఉస్మానియా విద్యార్థులపైన తెలంగాణా ఉద్యమంపైన ఏవో వ్యాఖ్యలు సంధించారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ బాధ్యతా రహితమైన మాటలు. కేంద్రం నాటకాలు ఆడుతున్నదని సిపిఎం రాఘవులు విమర్శిస్తుంటే ఆజాద్‌ మాటల్లో తప్పు లేనట్టు టిఆర్‌ఎస్‌ స్పందించడం నిజంగానే ఒక విపరీతం. ఇది ఆ రెండ పార్టీల మధ్య సయోధ్యకు సంకేతమంటే తప్పు లేదు. సయోధ్య వున్నంత మాత్రాన సంధిగ్ద వాఖ్యానాలను సమర్థించాల్సిన అవసరం వుందా?కష్టం అని వారన్నా ఇష్టం అని వీరంటున్నారంటే 'ఈ బంధం దృఢమైనది' అనుకోవలసిందే కదా!

మోడీని మోయడానికి కారణంగుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పదేళ్ల తర్వాత వీసా ఇవ్వాలని బ్రిటన్‌ నిర్ణయించడం పాశ్చాత్య దేశాల వ్యూహంలో మార్పును సూచిస్తుంది. రేపు అమెరికా చేసే పని ఈ రోజు బ్రిటన్‌ చేస్తుందనేది ఇరాక్‌ యుద్ధం నుంచి అర్థమవుతూనే వుంది. గత ఏడాది కాలంలోనే అమెరికా సెనేట్‌, విదేశాంగ నిపుణులు నెమ్మదిగా మోడీ వైపు మొగ్గుతుండడం చూస్తున్నాం. రాబోయే ఎన్నికలు మోడీకి రాహుల్‌కు మధ్యనే అని అధికారిక నివేదికలో అభివర్ణించడం కూడా ఇలాటిదే. గుజారాత్‌లో 2002లో జరిగిన జాతి హత్యాకాండకు అధికారంలో వుండి ఆధ్వర్యం వహించిన మోడీ విషయంలో వారి వైఖరి మారడానికి ఇంతకన్నా కారణం లేదు. ఆ మత మారణహౌమంలో ఆయన పాత్ర ఏమైనప్పటికీ ఆ కారణంగా వీసా నిరాకరించడాన్ని దేశంలో పార్టీలన్నీ ఖండించాయి. అయినా వారు పట్టించుకోలేదు. ఇప్పుడు తమకు తామే ఏకపక్షంగా స్వాగతం పలుకుతున్నారంటే ఇది వైదేశిక విధాన అవసరాల కోసమేనన్నది స్పష్టం. వాస్తవానికి ఈ కాలంలో మోడీ గత మంత్రి వర్గ సభ్యులకు కోర్టు శిక్షలతో సహా అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పటికే యుపిఎను లొంగదీసుకుని మన్మోహన్‌ సర్కారునుంచి అనేక అనుకూల నిర్ణయాలు రాబట్టిన అమెరికా కూటమి మరింత సాధించుకోవడానికి గాను మోడీ మోత మోగించుతున్నట్టు కనిపిస్తుంది. దీనికే ఉబ్బిపోయిన మోడీ మహాశయులు విదేశాలు మనకన్నా ముందు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నాయన్నట్టు మాట్లాడారు.అన్నిటికంటే వింత ఏమంటే మత సామరస్య దృష్టితో పరస్పర కలహాలు వద్దని చెప్పిన వివేకానందుని పేరిట ఆయన యాత్ర చేసి ముగింపులో ఈ ఆణి ముత్యాలు వినిపించడం! హతవిధీ!

వ్యాఖ్యలు- వివాదాలు

. దేశంలో దేవాలయాల కన్నా మరుగుదొడ్ల అవసరం చాలా వుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై చాలా దుమారం రేగింది. ఆయన తరచూ ఇలాటి సంచలనాలు సృష్టిస్తుంటారు గాని ఈ మాటలో దేశంలోని పరిస్థితినే వెల్లడిస్తున్నారు. ఉదయం టీవీ చర్చలకు వెళ్లేప్పుడు బంజారా హిల్స్‌ వంటి అత్యాధునిక ప్రదేశంలో కూడా చెంబు తీసుకుని కొండలపైకి, పొదల మాటుకు వెళ్లే మనుషులు కనిపించినప్పుడల్లా నాగరికత వెక్కిరిస్తుంటుంది. ప్రపంచంలో బహిర్భూమి అన్న మాట వర్తించే వారిలో అత్యధికులు ఇండియాలోనే వున్నారట. అక్షరాలా 48.9 శాతం ఇళ్లకు మరుగుదొడ్ల సదుపాయం లేదని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మహిళల విషయంలో ఇదెంత నరకమో భారతీయులందరికీ తెలుసు. మర్యాద విషయం అలా వుంచి ఆర్థికంగానూ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఏటా24,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనాగా

క్రేజీ కేజ్రీ హడావుడిరాజకీయాలలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు గాని సమతుల్యత పాటించాల్సి వుంటుంది. సంచలనాలు ఎల్లకాలం వుండవు. స్వంత బలం లేకుండా ప్రచారాలతోనే పనిగడవదు. మీడియాలో అత్యధిక ప్రచారం పొందిన వారు ఎన్నికలలోనూ ఉద్యమాలలోనూ నిలవలేకపోవడం చూస్తూనే వున్నాం. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమంతో ప్రచారంలోకి వచ్చిన అరవింద కేజ్రీవాల్‌కైనా ఈ మాటలు వర్తిస్తాయి. అన్నా ను మరో గాంధీజీ అన్నంతగా హడావుడి చేస్తున్న రోజునా ఈ మాట చెప్పాను. తర్వాత అవన్నీ నిజమై ఆఖరుకు కేజ్రీవాల్‌ కూడా ఆయన నుంచి విడగొట్టుకున్నారు. స్వంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన కేజ్రీవాల్‌ ఇటీవల సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని అందరూ కోరారు. ఆ సందర్భంలో ముందుగా ఖండించిన వ్యక్తి కేంద్రమంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌. తాజాగా కేజ్రీవాల్‌ ఆయనపైనా ఆరోపణలు సంధించడమే గాక ఏకంగా రాజీనామా చేయాలంటూ ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు.వాద్రా విషయంలో జరిగిన చర్చ కూడా ఈ అంశంపై జరగలేదు.ఇంతలోనే ధర్నాలు చేసి రాజీనామాలిప్పించాలనుకోవడంలో వాస్తవికత ఏమిటి? ఒక వేళ కేవలం ప్రచారం కోసం ఇలాటి పనులు చేస్తే ఆ ప్రభావం ఎంతో కాలం వుండబోదని టీం అన్నా అనుభవం చెబుతూనే వుంది కదా, క్రేజీ కేజ్రీవాల్‌జీ? పైగా చిల్లర వర్తకంలో ఎఫ్‌డిల వంటి వినాశకరమైన విధాన నిర్ణయాలు వదిలిపెట్టి వ్యక్తుల అవినీతిచుట్టూనే (అదికూడా బిజెపియేతర పార్టీలపై) కేంద్రీకరించడంలో ఆంతర్యం ఏమిటి?

Thursday, October 11, 2012

అవే కుటుంబాలు, అదే మనుషులు, అవే యాత్రలు, అనంత వివాదాలుచంద్రబాబు మీ కోసం వస్తున్నా పాదయాత్ర సందర్భంగా నేను విమర్శనాత్మకంగా చాలా వ్యాఖ్యలే చేశాను. తన గత పాలనా నమూనా మార్చుకునేది లేనిదీ స్పష్టం చేయకుండా ఆయన నిర్ణయాత్మక పునరుద్దరణ సాధించలేరని కూడా పేర్కొన్నాను. అలాటి లోతుల్లోకి పోకుండా ఆయన 'తన గత పాలనలో తప్పులు జరిగివుంటే క్షమాపణలు చెబుతున్నా' నని పదే పదే అంటున్నారు.దీన్ని ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్షమాపణలు చెప్పే పాలనను మళ్లీ ఎందుకు తీసుకురావాలని ఎదురు దాడి చేస్తున్నారు. కాళ్లతో గాక చేతులతో నడిచినా చంద్రబాబును నమ్మరని ధ్వజమెత్తుతున్నారు. అంతటితో ఆగక సిబిఐ తరపునా కోర్టుల తరపున తానే ప్రతినిధి అయినట్టు సిబిఐ విచారణ జరుగుతుందని ముందస్తుగా ప్రకటించి సర్దుకున్నారు. చంద్రబాబు పాలనలో లోపాలు ఒక ఎత్తయితే ఇప్పుడు ప్రతిష్టంభనలో పడిన పరిపాలన సంగతేమిటన్నది ఆయన జవాబు చెప్పాల్సిన ప్రశ్న. ధర్మాన రాజీనామా విషయమే తేల్చడానికి లేని నిస్సహాయతలో తానుండి అంతా అద్బుతంగా జరిగిపోతున్నట్టు మాట్లాడితే కుదిరేపని కాదు.ఇంతకూ నాయకులు పార్టీలు పరస్పరం సహనం కోల్పోతున్నందువల్లనే ఇలాటి పరిస్థితి వస్తుంటుంది. విధానాలపై చర్చ కన్నా వివాదాలతో సరిపెట్టడం జరుగుతుంటుంది.
మరో వైపు చంద్రబాబు యాత్రపై వైఎస్‌ఆర్‌ పార్టీ కూడా తీక్షణంగానే దాడి చేసింది. చివరకు ఆ ప్రచారాన్ని తటస్థీకరించి తమ పార్టీ స్థయిర్యం పెంచేందుకు షర్మిల పాదయాత్ర( చంద్రబాబు కంటే ఎక్కువ దూరం) తలపెట్టింది. నేను టివీ9 కు మంగళవారం వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి ఇందిర బాట చంద్రబాబు మీకోసంకు పోటీ కాగలదా అని ఎస్‌ఎంఎస్‌ పోటీ పెడితే కాలేదని చాలా తేడాతో ఓటింగు వచ్చింది. గురువారం నాటికి షర్మిల యాత్ర ఖరారైనందున ఆ యాత్రకూ బాబు యాత్రకూ పోటీ పెడితే అత్యధికంగా షర్మిల వైపే

Wednesday, October 10, 2012

మరింత 'స్పష్టత'నిచ్చిన షిండే


తెలంగాణా సమస్యపై ఇప్పట్లో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కేంద్ర హౌంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యకు రాజకీయ ప్రాధాన్యత వుంది. దసరా లోగా అయిపోతుందని కెసిఆర్‌ అంటుంటే దీపావళి నాటికి కూడా నిర్ణయం రాకపోవచ్చని షిండే వువాచ. పైగా ఆయనతో తాము చర్చలు జరపలేదని పిలవలేదని కూడా వాయిలార్‌ రవిలాగే ఈయనా చెప్పాడు. కనక ఇప్పుడు వాస్తవాలు ఆలోచించవలసింది, ప్రకటించవలసింది కెసిఆరే. తాము కాంగ్రెస్‌లో కలసి పోవడం గురించి కూడా సంసిద్ధత ప్రకటించడం తమ త్యాగ నిరతికి నిదర్శనమని కెసిఆర్‌ కుటుంబ సభ్యులే చెబుతున్నారు.కనక మనం చాలా మార్పులు చూడవలసే వుంటుంది. ఈ లోగా జెఎసిపై తన పట్టు పెంచుకోవడానికి కెసిఆర్‌ ఏవైనా మార్పులు చేర్పులు చేయొచ్చు. కోదండరాం పట్ల ఆయన అసంతృప్తిగా వున్నారనేది నిజమైనా దాన్నిబట్టి వారిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పడం నిరాధారం. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ లేని జెఎసికి విలువుండదు. ఇతరులను కలుపుకోవడానికి జెఎసి వుండకుండా టిఆర్‌ఎస్‌కు మద్దతుండదు.కనకనే ఈ కోపతాపాలు దిగమింగి సర్దుకోవడం అనివార్యం. పైగా కేంద్రం కుండబద్దలు కొట్టి ప్రతికూల సంకేతాలు ఇస్తుంటే ఇప్పుడు వున్న వేదికలు భంగ పర్చుకోవాలని ఎవరూ అనుకోరు. కనక ఈ విభేదాల కథలకు పెద్ద విలువుండదు. మరో వైపున లగడపాటి రాజగోపాల్‌, టిజి వెంకటేష్‌ వంటి వారు టిఆర్‌ఎస్‌కు సమాధానమిచ్చే పేరిట తెలంగాణా అకాంక్షించే వారిని గాయపర్చేట్టుగా మాట్లాడటం అనర్థదాయకం.ఈ సమయంలోనే డికె అరుణ తమ జిల్లా వారిని తీసుకుని విడిగా వెళ్లడం బట్టి చూస్తే తెలంగాణా రాజకీయాలలో పార్టీలు మాత్రమే గాక వ్యక్తులు కూడా స్వంత వేదికలు ఏర్పర్చుకుంటున్నట్టు అర్థమవుతుంది.సందట్లో సడేమియాలా అజిత్‌ సింగ్‌ ఆర్‌ఎల్‌డి తెలంగాణా శాఖను స్థాపించి వెళ్లాడు. ఇవి గాక సిపిఐ బిజెపి వంటి పార్టీలు వాటి దారిని అవి పోతున్నాయి.కనక తెలంగాణా రాజకీయ రంగ స్థలంపై అందరూ కలసి పనిచేయడం గాని ఎవరికి వారు విడిపోయే సాహసం గాని రెండూ సాధ్యం కావు.

వాద్రాపై ఆరోపణలతో అధిష్టానం అయోమయంఇండియా ఎగనైస్ట్‌ కరప్షన్‌ తరపున కేజ్రీవాల్‌, ప్రశాంత భూషణ్‌లు సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్‌ వాద్రాపై లేవనెత్తిన ఆరోపణలు అధికార పార్టీని అయోమయంలోకి నెట్టాయి. అవి ఇంకా పూర్తిగా ప్రచారం కాకముందే సోనియా గాంధీతో సహా అగ్రనేతలందరూ ఒక్కుమ్మడిగా ఖండించేందుకు హడావుడి పడ్డారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రపంచంలోని అతి శక్తివంతమైన ఒక కుటుంబ సభ్యుడు ఇంత తీవ్రమైన ఆరోపణలకు గురైతే సంజాయిషీ ఇచ్చి సమగ్ర దర్యాప్తు చేయించేబదులు సమర్థనలకు పాకులాడడం హాస్యాస్పదం. డిఎల్‌ఎఫ్‌ కూ వాద్రాకు మధ్య లావాదేవీలు జరిగినట్టు దీనివల్ల ఆ సంస్థ లాభం పొందినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. యాభై లక్షల రూపాయలతో వ్యాపారం మొదలెట్ల్టిన అల్లుడు గారు 2007 తర్వాత చకచకా పైకి పాకిపోయారంటే ఇలాటి కారణాలు వుండే వుండాలి. ఆయనకు రుణాలు స్థలాలు భవనాలు ఇచ్చి తానూ యథాశక్తి లాభ పడిన డిఎల్‌ఎప్‌ ఈ మొత్తాలు చేతులు మారిన సంగతి కాదనడం లేదు. వాద్రా కూడా జరిగిందాన్ని కాదనలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి స్థలం చేతులు మారడం, వాద్రాకు అప్పు ఇచ్చి మళ్లీ తమ స్థలాన్నే చౌకగా అమ్మడం, ఒక దశలో యాభై శాతం వాటా ఇచ్చి తర్వాత తీసుకోవడం వంటి అనుమానాస్పద వ్యవహారాలున్నాయి. వాద్రాచెట్టుకింద కూచుని వ్యాపారం చేసుకుంటే అది వేరుగా వుండేది. కాకపోతే కాంగ్రెస్‌ వారే దీనిపై ఎలా స్పందించాలో తేల్చుకోలేకపోతున్నారు.మొదట రాగానే ఖండించారు. తర్వాత ఆయన వ్యక్తిగతంపార్టీకి సంబంధం లేదన్నారు. మళ్లీ ఆయనపై దాడి పార్టీపైనే దాడి అని స్పందించారు. ఇప్పుడు మళ్లీ

Monday, October 8, 2012

Paritranaya sampannam
 Vinasayacha samanya
 Kharma  samsthapanarthaya                  
  Santarpanam dine dine…

                     - Manmohan Gita..

శభాష్‌ చావేజ్‌! వివా వెనిజులా!అమెరికా ఆధిపత్యాన్ని అతి సమీపం నుంచి సవాలు చేసి... అన్ని కుట్రలనూ కుహకాలనూ తట్టుకుని నాలుగో సారి అఖండ విజయం సాధించిన హ్యూగో ఛావేజ్‌ హిప్‌ హిప్‌ హుర్రే! లొంగుబాటు కాదు తిరుగుబాటులోనే భవిష్యత్తు వుందంటూ 21 వ శతాబ్ది సోషలిజం నినాదమిచ్చిన ఈ ధీరుడి గెలుపు వర్తమాన చరిత్రకొక మలుపు. క్యూబా ధృవతార ఫైడెల్‌ కాస్ట్రో తర్వాత సమకాలీన ప్రపంచంలో ఉత్తేజ ప్రదాత, ఉదాత్త నేత చావేజ్‌. అమెరికా కూటమి, అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు, ముఖ్యంగా చమురు సంస్థల మాఫియా, అభివృద్ధి నిరోధకులు, ప్రతీఘాత ప్రతిపక్షాలూ కలసి ధనరాశులు గుమ్మరించినా 30 పార్టీల కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నినా 54 శాతం పైగా ఓట్లు తెచ్చుకుని విజయ ఢంకా మోగించాడు. చావేజ్‌పై అమెరికన్‌, లాటిన్‌ అమెరికన్‌ బడా పత్రికలన్నీ శాపనార్తాలు పెట్టాయి. ఆయనను ఓడించడానికి ఇదే అదనని హడావుడి చేశాయి. ఆయన స్వల్ప మెజారిటీతో గెలిచినా తట్టుకోలేడని జోస్యాలు చెప్పాయి. ప్రత్యక్షంగానూ బోలెడు ప్రతికూల ప్రచారం సాగించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి.
చమురు సంపన్న దేశాలలో ఒకటైన వెనిజులా స్వంత కాళ్లపై నిలబడటం సామ్రాజ్యవాదులకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం. ఎందుకంటే చావేజ్‌ చమురు సంస్థల జాతీయ కరణతో సహా అనేక ప్రగతిశీల చర్యలు

విజయమ్మ భేటీ వివాదగ్రస్థంవైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవాద్యక్షరాలు విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలవడంపై రకరకాల వాదనలు వచ్చాయి. అనుకున్నట్టుగా జగన్‌ విడుదల కానందున ఆయన తరపున తాను రాష్ట్రపతికి అభినందనలు తెలిపానన్నది ఆమె అధికారిక వివరణ. దాంతో పాటే సిబిఐ 'కుట్ర'ను కూడా దృష్టికి తెచ్చామంటున్నారు. దేశాధినేతను కలిసిన తర్వాత వివిధ విషయాలు ప్రస్తావనకు రాకుండా వుంటాయని ఎవరూ అనుకోరు గాని అది పెద్ద అభ్యంతరక

రం కూడా కాదు. ఎందుకంటే ఎవరిని కలవాలి, ఏమి చర్చించాలి అన్నది ఆయన నిర్ణయం మాత్రమే. గతంలోనూ అన్ని పార్టీలూ సంఘాల ప్రతినిధులూ వ్యక్తులూ కూడా రాష్ట్రఫతులను కలుస్తూనే వస్తున్నారు. ఈ భేటీకి రాజకీయ కోణాలూ వుంటాయనడంలో సందేహం లేదు. అయినా ఆ పేరుతో దీన్ని వివాదగ్రస్థం చేయడం నిలిచేది కాదు. ఎవరిని ఎవరు ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా ఇది ప్రజాస్వామ్యం గనక అందరికీ హక్కులుంటాయి. అసహనాల వల్ల ఫలితం వుండదు.

Friday, October 5, 2012

బెయిల్‌ రాకపోవడం వూహించిందే..


సుప్రీం కోర్టులో వైఎస్‌ఆర్‌పార్టీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురి కావడం వూహించని విషయమేమీ కాదు. గతంలో ఏ కారణాల వల్ల తిరస్కరించారో అవి ఇప్పటికీ వర్తిస్తుండడమే గాక ఇంకా తీవ్రమైనాయి కూడా. ఆయనకు సంబంధించిన కేసులో ఆస్తుల జప్తుకు ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌ ఉత్తర్వులివ్వడం నిజానికి చాలా పెద్ద పరిణామం. గతంలో సాక్షికి సంబంధించి జప్తు జరిగినప్పటికీ ఇప్పటికీ హడావుడిలో తేడా ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగు దేశం, కాంగ్రెస్‌ల కుమ్మక్కు వల్లనే ఇలా జరిగిందని వైఎస్‌ఆర్‌ పార్టీ ఆరోపిస్తున్నా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అలాటి ఉద్దేశాలు ఆపాదించడానికి లేదు.ఒక వేళ బెయిల్‌ వచ్చివుంటే అప్పుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం వారు ఆరోపించి వుండేవారు. ఏమైనా జగన్‌ బయిటకు రాలేకపోవడం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. అంటే ఆ పార్టీ స్థయిర్యం కాపాడుకోవడం కష్టమవుతుంది. నాయకుడిపై ఆధారపడిన పార్టీ కావడమే ఇందుకు కారణం. పైగా ఆయన తర్వాత ఎవరన్న దానిపైనా స్పష్టత ఇచ్చింది లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతర పార్టీలలోంచి వలస వచ్చేవారు ఆగిచూద్దామనుకుంటారు. ఈ తీర్పు ముందే వచ్చివుంటే బహుశా చంద్రబాబు పాదయాత్ర తీరు మరోలా వుండేదేమో. అయితే ఛార్జిషీట్లు అదే పనిగా వేయొద్దని ఒక్కదానితో సరిపెట్టమని సిబిఐని ఆదేశించడం కూడా ముఖ్య పరిణామమే. బెయిలు రాకపోవడానికి సిబిఐ లక్ష్మీనారాయణ తాజాగా ప్రవేశపెట్టిన ఆధారాలే కారణమన్న ప్రచారం ఒకవైపున వుండగా గట్టి లాయర్‌ను నియోగించారన్నది మరో వాదనగా వుంది. వాస్తవానికి సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలోఅవినీతి కేసుల విషయంలో తీసుకుంటున్న వైఖరికి అనుగుణంగానే జగన్‌ బెయిల్‌ తిరస్కరణ వుందని చెప్పొచ్చు.. వైఎస్‌ఆర్‌పార్టీ దీని తర్వాత వ్యూహం మార్చుకునే అవకాశాలు చాలా వుంటాయి. దీనివల్ల నిజంగా తెలుగు దేశం కోలుకుంటుందనుకుంటే అప్పుడు కాంగ్రెస్‌ తీరు మార్చుకోవచ్చు.కనక ఇంతటితోనే కథ ముగిసిపోయిందని మరే మలుపులూ వుండవని అనుకోవడం కూడా తొందరపాటే.

శ్రీకృష్ణ సత్యాలుతెలంగాణా సమస్యపై కేంద్రం నాటకాలను చెలగాటాలను రాజకీయ పార్టీలు అనేక సార్లు విమర్శించాయి.కాగా ఇప్పుడు సాక్షాత్తూ ఆ కేంద్రమే నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కూడా సూటిగానే ఖండించక తప్పలేదు. తాను సరైన సిఫార్సు చేయనందువల్లనే నిర్ణయం తీసుకోలేకపోయినట్టు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని తేల్చిపారేశారు.తనను తోచిన సిపార్సులు చేయమన్నందునే ఆరు మార్గాలు సూచించానని ఒకటే అడిగితే ఒకటే చెప్పేవాణ్నని కూడా అన్నారు. ఆయన సిఫార్సులు వచ్చిన మొదట్లో నైతే తెలంగాణా విభజన వాదులు కూడా తమకు అనుకూలంగా వుందన్నట్టు వాదించేవారు. ఇతర విషయాలు బయిటకు వచ్చిన తర్వాత వైఖరి మార్చుకున్నారు. ఇంతకూ కేంద్రమే ఏదైనా చేయాలనుకుంటే కమిటీలు కమిషన్లు అడ్డం వస్తాయా? అయితే కెసిఆర్‌ మాత్రం ఇప్పుడు తన గడువును మరో నెల పొడగించి ప్రకటన వస్తుందనే చెబుతున్నారు. ఆయన రాజకీయావసరాలు ఆయనవి.

బీమా,పెన్షన్లపై వేటుసంస్కరణల జ్వరంతో వూగిపోతున్న మన్మోహన్‌ సింగ్‌ సర్కారు తాజాగా బీమా వ్యాపారంలో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు రావలసిన పెన్షన్‌ నిధులలోనూ ఎఫ్‌డిఐలకు ద్వారాలు తెరిచి ప్రమాదంలోకి నెట్టింది. సరళీకరణ వల్ల ఉద్యోగ భద్రత ఎలాగూ హరించుకుపోగా పదవీ విరమనాంతరం కూడా వారికి భద్రత లేకుండా చేసే చర్చ ఇది. బీమా రంగం అనేక ప్రతికూల నిర్ణయాల తర్వాత కూడా 2011612 లో

11 దందల కోట్లకు పైగా లాభం సంపాదించింది. ఇక ప్రీమియం ఆదాయం చూస్తే అంతకు ముందు ఏడాది కంటే 25 శాతంపైగా పెంచుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోగా పోటీ పెంచుతున్న నేపథ్యంలోనే ఎల్‌ఐసితో నాలుగు సంస్థలు ఇంతటి విజయాన్ని సాధించాయి. దీన్ని మరింతగట్టి చేసుకునే బదులు 49 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతినివ్వాలని నిర్ణయించడం చిరకాలంగా అమెరికా చేస్తున్న ఒత్తిడి ఫలితమే. ఒబామా స్వయంగా ఈ మేరకు ప్రకటన చేయడం చూశాం. ఎన్నికల సంవత్సరంలో భారతీయులను ప్రత్యేక లక్ష్యంగా చేసుకుని ఆయన దాడి చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం దేశ ప్రయోజనాలను హారతి పళ్లెంలో పెట్టి అప్పగిస్తున్నది.

Wednesday, October 3, 2012

కెసిఆర్‌ చర్చల 'సఫలత' ఎందులో?కాంగ్రెస్‌ నేతలతో తన తొలి విడత చర్చలు సఫలమైనాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.సి.ఆర్‌ ఢిల్లీ నుంచి  చేసిన ప్రకటన సారాంశం దురూహ్యంగా వుంది. ముఖ్యమంత్రితో సహా కేంద్ర రాష్ట్ర నాయకులు తెలంగాణా మార్చ్‌ ఘటనలు అన్నీ చూసిన తర్వాత కూడా ఆయన అంతా అనుకూలంగా వుందని గత వైఖరిని కొనసాగించడం వాస్తవాలతో పొసగదు. మాయలఫకీరు ప్రాణం లా ఎవరికీ తెలియని రహస్యాలు రాజకీయాల్లో వుండటం కుదరని పని. అసలు గత నెల చివరికల్లా ప్రకటన వస్తుందన్న ఆయన తొలి విడత చర్చలు ముగిశాయని చెప్పడంలోనే అనుకున్నట్టు జరగలేదని ఒప్పుకోవడం వుంది. ప్రహసనంగానైనా, తెలంగాణా ప్రాంత మంత్రులు ఎంపిలకు వున్న మేరకైనా కెసిఆర్‌కు అధిష్టానంపై అవిశ్వాసం అసంతృప్తి లేకపోవడం విచిత్రమే! అయినా అదే ధోరణిలో మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్‌తో వ్యూహాత్మక బంధం ఎంత బలంగా వుందో అర్థమవుతుంది. బహుశా హైదరాబాద్‌ రాగానే మరింత నాటకీయమైన వ్యాఖ్యలు మనం వినొచ్చు.

విధానాల సమీక్షలో కూడా వినమ్రత వుండాలిచంద్రబాబు నాయుడు పాదయాత్ర ఘనంగానే ప్రారంభమైంది. ప్రచారం ఎలాగూ అదిరిపోయింది. దీర్ఘకాల మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ఆహ్వానించదగింది. దీనిపై అసహనంతో శవయాత్ర అని వైఎస్‌ఆర్‌సిపి వ్యాఖ్యానించడం, నడిస్తే కొవ్వు కరుగుతుందని రేణుకా చౌదరి తిట్టిపోయడం అనుచితంగా వున్నాయి. అయితే లదే సమయంలో తెలుగు దేశం ఈ యాత్రను గురించి చేసుకుంటున్న ప్రచారంలోనూ అతిశయోక్తులు ఎక్కువగానే వున్నాయి. అసలు ఈ యాత్ర తలపెట్టడమే త్యాగమని సాహసమనీ తనను తాను శిక్షించుకోవడమనీ ఎందుకు అం టున్నారో అర్తం కాదు. 80 ఏళ్ల వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ వంటి వారు దేశాన్ని పాలించగా లేనిది 60 ఏళ్ల చంద్రబాబు పూర్తి భద్రతతో జాగ్రత్తలతో పాద యాత్ర చేయడంలో త్యాగం ఏమీ లేదు.విజయ సంకేతం నుంచి వినమ్ర పూర్వక వందనం వైపు ఆయన మారడం మంచిదే గాని ఈ వినమ్రత విధాన పరమైన అంశాల పున:పరిశీలనలోనూ వుంటుందా అన్నది అసలు సమస్య.
బాబు మాటల్లోనూ ఆయన పార్టీ వారి వ్యాఖ్యల్లోనూ కూడా ఆయన గత పాలన స్వర్థయుగమైనట్టు అది తిరిగి రావాలనే ప్రజలు కోరుతున్నట్టు పదే పదే చెబుతున్నారు. అయితే ఆ పాలనా కాలంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు పరాకాష్టకు చేరిన ఫలితంగానే చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను ఎదుర్కొన్న

Monday, October 1, 2012

సాగర హారం- సందేశం, సారాంశంసాగరహారం వూహించినట్టే ఉధృతంగానూ, ఉద్రిక్తంగానూ జరిగింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా వినిపించాలన్న జెఎసి లక్ష్యం నెరవేరింది.
మొదటిది- ఈ మార్చ్‌తో మొదటి సారి రాజకీయ పార్టీల ప్రాధాన్యత తగ్గి జెఎసి,దాని నిర్వాహకులకు దగ్గరగా వుండే సంఘాల నాయకుల పిలుపు అమలు జరిగినట్టయింది. పాలక పక్షమైన కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం నేతలు మాత్రమే గాక ఇప్పటి వరకూ తెలంగాణా ఉద్యమానికి ప్రతీకగా పరిగణించబడిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కూడా వేదికపై కనిపించని,వినిపించని స్థితి మొదటిసారిగా గోచరించింది. పార్టీల పతాకాలు తీసేయాలని పిలుపునివ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని మరింత ప్రస్పుటంచేసే ప్రయత్నం జరిగింది. అయితే సమీకరణలో మాత్రం టిఆర్‌ఎస్‌, న్యూ డెమోక్రసీల తరపున వచ్చిన వారే అత్యధికంగా కనిపించారు.ఆ పైన సిపిఐ,బి.జెపి ఇతర సంఘాలు వుండొచ్చు.
రెండవది- మార్చ్‌ ఉద్రిక్తంగా జరిగిందనడంలో సందేహం లేదు. పోలీసుల పాత్ర, జోక్యం, బల ప్రయోగం చాలా ఎక్కువగానే వున్నాయి. ప్రజాస్వామిక హక్కుగా అనుమతినిచ్చిన తర్వాత ఇలాటి పరిస్తితి రావలసింది కాదు. ఇందుకు పోలీసుల వైఖరి ప్రధాన కారణంగా కనిపించినా ఇతర అంశాలు కూడా వున్నాయి.పార్టీలు విడివిడిగా ఎవరి యాత్ర వారు మొదలెట్టడం ఒక కారణం. చాలా మంది తెలంగాణా వాదులతో సహా అనేకులకు  మార్చ్‌ తేదీ