Pages

Saturday, November 27, 2010

రణంలో కొత్త 'కిరణం'- సవాళ్ల తోరణం

ఏడాది కాలంగా ఎడతెగని అంతర్గత అస్తిరత్వంలో కొట్టుమిట్టాడుతూ రాష్ట్రంలో అనిశ్చితికి కారణమైన అధికార పక్షం ఎట్టకేలకు మరో అడుగు వేసింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి దుర్మరణం అనంతరం అనివార్యంగానూ అనుభవం రీత్యానూ అధికార పీఠం అధిష్టించి అభిశంసనలు మూటకట్టుకున్న రోశయ్య ఆకస్మికంగా పదవీ చ్యుతులు కాగా శాసనసభ స్పీకర్‌ ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. ఏడాదిన్నరలో మూడవ ముఖ్యమంత్రి తెరపైకి రావడమే కాంగ్రెస్‌ అంతర్గత దురవస్థను

Wednesday, November 24, 2010

రోశయ్య నిష్క్రమణ పర్వం

తెలకపల్లి రవి

కాంగ్రెస్‌ పార్టీని ప్రభుత్వాన్ని రకరకాల పద్ధతుల్లో తన స్వాధీనంలో వుంచుకున్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం పాలైనప్పుడు వెంటనే గద్దెక్కేవాళ్లెవరన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. అనుభవం రీత్యానూ విధేయత రీత్యానూ ఆ స్థానం రోశయ్యకు దక్కుతుందనే ఏకాభిప్రాయం . అధిష్టానమూ అదే చేసింది. అయితే ఆయన ఏ ప్రాతిపదికపై వచ్చారు ఎంత కాలం కొనసాగుతారు సాగనిస్తారు అన్న దానిపై మాత్రం

Sunday, November 21, 2010

ఊబిలో కేంద్రం - వివాదాల్లో రాష్ట్రం- పోరాటాల్లో ప్రజానీకం

- తెలకపల్లి రవి

కాంగ్రెస్‌ 125 వార్షికోత్సవాల హడావుడిలో దేశాన్ని ఊపేయాలనుకుంటే అవినీతి ఆరోపణల వూబిలో అంతకంతకూ దిగబడి పోతున్నది. దేశ చరిత్రలోనే అతి పెద్దదైన 2 జి స్ప్రెక్ట్రమ్‌ వ్యవహారంలో ఎట్టకేలకు టెలికాం మంత్రి ఎ.రాజా దిగిపోక తప్పలేదు. గాని అంతటితోనే భారం దిగిపోయిందనుకున్న ఆశలు మాత్రం ఆవిరై పోయాయి. పురాణాల్లో ఇంద్రుడు తక్షకుడనే సర్పరాజును కాపాడాలనుకుంటే తన సింహాసనానికి కూడా ఎసరు వచ్చినట్టు ఇప్పుడు ప్రధాని

ఏప్రిల్ 8, 2010, టివి5 న్యూస్ స్కాన్లో తెలకపల్లి రవి - వరవరరావు

Sunday, November 14, 2010

సంఘ పరివార్‌ సర్వాతీతమా?

 - తెలకపల్లి రవి 
హిందూత్వ పేరుతో చెలరేగే సంఘ పరివార్‌ విద్వేష రాజకీయాల పట్లమీడియా ఎంత సుతిమెత్తగా సుతారంగా వ్యవహరిస్తుందో ఈ వారం తేటతెల్లమైంది. ప్రకాశ్‌ కరత్‌ చేయని వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని కమ్యూనిస్టులపై విషం కక్కిన వారికి ఆరెస్సెస్‌ బిజెపి నేతలు కపటవాదనల కవాతు చేయడం కనిపించలేదు. విమర్శనాస్త్రాలు మటుమాయమై పోయాయి. నిశిత పరిశీలనా శక్తి కొండెక్కిపోయింది. ఘనత వహించిన మన మీడియా సంస్థల

కేసిఆర్‌ స్నేహగీతం - వైరుధ్యాల వైపరీత్యం

తెలకపల్లి రవి
ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహావేశాలతో మొదలై జైపాల్‌ రెడ్డి సారథ్యం గురించిన కథనాలతో వేడెక్కి కెసిఆర్‌ కెకెల స్నేహగీతాలాపనపై తెలంగాణా విభజన వాదుల ఆగ్రహావేశాలతో పరాకాష్టకు చేరింది. ఈ పరిణామాలన్ని పాలక పక్ష నేతల స్వార్థ వ్యూహాలను సామాన్యులు కూడా తెలుసుకోగలిగిన స్థితి తీసుకొచ్చాయి. ఇరకాటంలో పడిన వారు ఎంతగా సమర్థించుకోవడానికి సవరించుకోవడానికి తంటాలు పడినా దాచేస్తే దాగని సత్యాల్లా వారి చేతలే వారిని ప్రశ్నార్థక స్థితిలో నిలబెట్టాయి. వైరుధ్యాల వైపరీత్యాలను విలువలతో నిమిత్తం లేని విన్యాసాలను విదితం చేశాయి.

Monday, November 1, 2010

వ్యూహాత్మక వివాదాలు, వికృతాలు

 - తెలకపల్లి రవి
ప్రాంతీయ పాచికలలో భాగంగా గతంలో శ్రుతి మించిన ప్రకటనలు చేసిన మంత్రులు కూడా ఈ సారి అనివార్యంగా వాస్తవికతను గుర్తించవలసి వచ్చింది. రాజ్యాంగ బద్ధంగా తమ బాధ్యతను తాము నిర్వహిస్తామని ప్రకటించవలసి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణే విద్రోహమనేట్టయితే దానికి అనుకూలంగా అత్యధికంగా ఓటు వేసిన నాటి హైదరాబాదు శాసనసభలోని పెద్దలందరూ ద్రోహులైపోతారా ఇంత కాలం ఇక్కడ వున్న వారంతా విద్రోహ రాష్ట్రంలో వున్నట్టు భావించుకోవాలా అన్న ప్రశ్నకు సమాధానాలు పెద్దగా రాలేదు. కాంగ్రెస్‌ తెలుగు దేశం పార్టీలలో గతంలో వలెనే భిన్న స్వరాలు వినిపించగా తెలంగాణా విభజన కోరే శక్తులు మొత్తంపైన ఈ వాదనకే కట్టుబడి వున్నాయి.