Pages

Thursday, April 18, 2013

మోడీ- జేడీ(యు) ప్రహసనం

  1. Photo: మోడీ- జేడీ(యు) ప్రహసనం
బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో రెండవ పెద్ద భాగస్వామి జనతా దళ్‌(యునైటెడ్‌) భావి ప్రధాని అభ్యర్థి ఎంపికపై సాగిస్తున్న ఎడతెగని ప్రహసనం ఇప్పుడు మరింత రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌కు తామే ఏకైక ప్రత్యామ్నాయమని ఎన్ని ప్రగల్భాలు పలికినా అనేకానేక పక్షాల మద్దతు లేకుండా గద్దెనెక్కలేమని బిజెపికి అంతకు మించి దాన్ని నడిపించే ఆరెస్సెస్‌ పీఠాధిపతులకు బాగా తెలుసు. అందుకే కేంద్రంలో అధికారమే పరమార్థంగా అవమానాలు అవాంతరాలు దిగమింగి రాష్ట్రాల్లో సదరు భాగస్వామ్య పక్షాల పెద్దన్న పాత్రకు తలవంచుతుంటారు. గుజరాత్‌ మారణహౌమం తర్వాత ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల్లో అనేకం నిష్క్రమించినా మిగిలిన ఏకైక పెద్ద మిత్ర పక్షం జెడియు మాత్రమే. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నేతల నుంచే తమ మోడీకరణ వ్యూహానికి ప్రతిబంధకం ఎదురవడం బిజెపికి గొంతులో వెలక్కాయలా తయారైంది. పైకి ఎన్ని మేకపోతు గంభీరాలు వొలకబోసినా బిజెపి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ సారికి ఎలాగో కార్పొరేట్ల కరుణతో నెట్టుకురావచ్చని వ్యూహ కర్తల అంచనా. ఆయన అత్యాశా వ్యూహాలు కూడా అలాగే వుండటం వల్ల అనివార్యంగా అందుకు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హిందూత్వ ఎజెండా మోడీత్వ జెండాగా పరివర్తన చెందింది గుజరాత్‌ ముద్ర వేసుకుంది. గుజరాత్‌ మారణ కాండను సుదీర్ఘ పరిపాలనలో అవకతవకలను అమానుషాలను మటుమాయం చేసే ప్రచారం ప్రచండంగా సాగిపోతున్నది. నిరంతర నిరీక్షకుడు ఎల్‌ఎ అద్వానీ వంటి వారి పేరాశలు పటాపంచలు చేసేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైనా ఆయన మాత్రం రాజీ పడినట్టు కనిపించదు. అంతకన్నా కూడా జెడియు నాయకుడు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మరింత గట్టిగా మోడీ అభ్యర్థిత్వానికి ససేమిరా అంటున్నారు. గత వారాంతం సమావేశమైన జెడియు అత్యున్నత స్థాయి సమావేశం కూడా ప్రధాని స్థానానికి డిసెంబర్‌లోగా నికరమైన లౌకిక అభ్యర్థిని ఖరారు చేయాలని బిజెపికి తాఖీదు ఇవ్వడం పెద్ద ప్రచారమే పొందింది.
జాతి హత్యాకాండకు ఆద్వర్యం వహించిన మోడీ నేతృత్వాన్ని నిరోధించడం మంచిదే అయినా బిజెపితో విడగొట్టుకుంటానని గాని ఎన్‌డిఎ నుంచి వైదొలుగుతానని గాని జెడియు అనడం లేదు. నిజానికి గుజరాత్‌ మారణ కాండ తర్వాత అనేక మంది భాగస్వాములు తప్పుకున్నా ఈ పార్టీ ఎన్‌డిఎలోనే కొనసాగింది. బీహార్‌ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆ కూటమికి కొత్త వూపిరిపోసింది కూడా జెడియునే. ఈ క్రమంలో కొన్ని సామాజిక తరగతుల్లో బిజెపికి కొత్త బలం సమకూర్చింది కూడా. అయితే మోడీ విషయంలో మాత్రం మొదటి నుంచి నితిష్‌ మొండిగానే వున్నారన్నది నిజం. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనరాదని షరతు పెట్టారు. ఆ మాటకొస్తే యుపి ఎన్నికల్లో బిజెపి నేతలే స్వయంగా మోడీని రాకుండా ఆపేశారు.మైనారిటీ ఓటర్లు దూరమవుతారన్న భయమే ఇందుకు ఏకైక కారణం. నితిష్‌ కుమార్‌ నిరంతర అభ్యంతరంలో ఆంతర్యం కూడా అదే! వ్యక్తిగతంగా తానూ అత్యున్నత పీఠం అధిష్టించాలనే ముచ్చట ఆయనకూ వున్నా వుండవచ్చు. ఏమైనా ఇవన్నీి మోడీకరణ మేడి పండు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తాయి.
బీహార్‌లో జెడియుతో స్నేహం కాస్త బెడిసికొడుతుందన్న అంచనా ఒకవైపు ..మోడీ మంత్రం తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదన్న ఆందోళన మరో వైపు కలగలసి బిజెపి నేతలు నితిష్‌ వ్యతిరేకతపై పరిపరివిధాల స్పందిస్తున్నారు. కొన్నిసార్లు తెగతెంపులకు సిద్ధమంటూనే మరోవైపు ప్రధాని అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోలేదని గడువు పెంచుకునేందుకు తంటాలు పడుతున్నారు.ఒకవైపున సర్వేలు తమ బలం తగ్గుతున్నట్టు చెబుతుంటే వున్న మిత్రులను కూడా పోగొట్టుకోవడం వల్ల జరిగేదేమిటో వారికి బాగా తెలుసు. అదే సమయంలో డిసెంబర్‌ నాటికి నికరమైన లౌకిక విలువలు కలిగిన అభ్యర్థి పేరు ప్రతిపాదించాలని జెడియు పెడుతున్న షరతులో డొల్ల తనం కూడా తెలియంది కాదు. సముద్రంలో ఉప్పు నీళ్లు తప్ప మంచినీళ్లు ఎలా దొరుకుతాయి? అంత వీర లౌకిక నేత బిజెపిలో ఎలా దొరుకుతాడు? జెడియు రాజధర్మానికి ఆదర్శంగా చెబుతున్న వాజ్‌పేయి కూడా గుజరాత్‌ వ్యవహారంలో ఎంత గుంజాటన పడిందీ ఎవరికి తెలియదు? కనక జెడియు నిజంగా లౌకిక వాదాన్ని విశ్వసిస్తే ఎన్‌డిఎలో వుండే అవకాశమే లేదు.జార్జి ఫెర్నాండెజ్‌ నుంచి శరద్‌ యాదవ్‌ నితిష్‌ కుమార్‌ల వరకూ సోషలిస్టు నేపథ్యం గల నాయకులే మతతత్వ కూటమికి సంధాన కర్తలుగా కొనసాగడం ఒక వైపరీత్యం. ఇలాటి అవకాశవాదమే తెలుగు దేశం వంటి పార్టీలు ప్రదర్శించి వుండకపోతే వాజ్‌పేయి ప్రభుత్వం మనగలిగేదే కాదు.జెడియు వంటి పార్టీలు ఇప్పటికీ ఆదే బాటలో కొనసాగుతున్నంత కాలం సంఘ పరివార్‌ పాచికలు వేస్తూనే వుంటుంది. అలా గాక బీహార్‌కు ప్రత్యేక సహాయం సాధించే పేరిట కాంగ్రెస్‌ వైపు మొగ్గితే అప్పుడు పెనంమీద నుంచి పొయ్యిలోకి పడినట్టవుతుంది. ఇప్పటికే కేంద్రం ఒక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆ ప్రయత్నం ప్రారంభించింది. రాబోయే ఎన్నికల ముందు దేశంలో రాజకీయ పునస్పమీకరణలు అనేకం జరిగే అవకాశం వున్నందున జెడియు బెదిరింపులు చివరకు ఎలా పరిణమించేది చూడాల్సి వుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా అవకాశవాద రాజకీయాలతో అసలైన ప్రత్యామ్నాయాలను నిర్మించలేరన్నది మాత్రం పరమ సత్యం. మోడీత్వ సీసాలో హిందూత్వ పానీయం చలామణి చేసుకోవడం అసలే చెల్లదన్నది మరింతగా నిజం.

    బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో రెండవ పెద్ద భాగస్వామి జనతా దళ్‌(యునైటెడ్‌) భావి ప్రధాని అభ్యర్థి ఎంపికపై సాగిస్తున్న ఎడతెగని ప్రహసనం ఇప్పుడు మరింత రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌కు తామే ఏకైక ప్రత్యామ్నాయమని ఎన్ని ప్రగల్భాలు పలికినా అనేకానేక పక్షాల మద్దతు లేకుండా గద్దెనెక్కలేమని బిజెపికి అంతకు మించి దాన్ని నడిపించే ఆరెస్సెస్‌ పీఠాధిపతులకు బాగా తెలుసు. అందుకే కేంద్రంలో అధికారమే పరమార్థంగా అవమానాలు అవాంతరాలు దిగమింగి రాష్ట్రాల్లో సదరు భాగస్వామ్య పక్షాల పెద్దన్న పాత్రకు తలవంచుతుంటారు. గుజరాత్‌ మారణహౌమం తర్వాత ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల్లో అనేకం నిష్క్రమించినా మిగిలిన ఏకైక పెద్ద మిత్ర పక్షం జెడియు మాత్రమే. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నేతల నుంచే తమ మోడీకరణ వ్యూహానికి ప్రతిబంధకం ఎదురవడం బిజెపికి గొంతులో వెలక్కాయలా తయారైంది. పైకి ఎన్ని మేకపోతు గంభీరాలు వొలకబోసినా బిజెపి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ సారికి ఎలాగో కార్పొరేట్ల కరుణతో నెట్టుకురావచ్చని వ్యూహ కర్తల అంచనా. ఆయన అత్యాశా వ్యూహాలు కూడా అలాగే వుండటం వల్ల అనివార్యంగా అందుకు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హిందూత్వ ఎజెండా

సంస్కృత సంస్కృతి
ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అత్యవసర పోలీసు డయల్‌ సర్వీసు 100 ప్రారంభించారు.ఈ నెంబరుకు ఎవరు ఎప్పుడు ఫోన్‌ చేసినా పోలీసు సహాయం లభిస్తుందని ప్రకటించి తనే డయల్‌ చేశారు. అయితే పాపం ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యం. తర్వాత ఎవరో ఎలాగో కలిపి ఇచ్చారు గాని పాపం ఆయనకు అప్పటికే విసుగొచ్చి ఇక స్పందించడం మానేశారు. ఆదిలోనే హంసపాదు వంటి ఈ చేదు అనుభవాన్ని కూడా దిగమింగి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారు పోలీసులకు ఓ చక్కటి సలహా ఇచ్చారు. ప్రజలతో వ్యవహరించేప్పుడు సంస్కృతం మాట్లాడకండి అని.
సంస్కృతమే మన సంస్కృతి అనీ, అది దైవభాష అనీ ఈ దేశంలో చాలా మంది ప్రచారం చేస్తుంటారు. కనక చాలా మంది నమ్ముతుంటారు కూడా. సంసృతంలో నాలుగు శ్లోకాలు ఇంగ్లీషులో నాలుగు కొటేషన్లు దంచేస్తేనే సదరు వ్యక్తి పండితుడని మనం నమ్ముతాం. అందుకే హైటెక్‌ బాబులు అడపాదడగా ఒకటో అరా సంసృత చరణాలు వల్లిస్తుంటారు. అలాగే స్వామి వర్యులు ఇంగ్లీషు వాక్యాలు జొప్పిస్తుంటారు.ఏతావాతా ఒక దశలో సంసృతం మరో దశలో ఆంగ్లం తెలుగు వంటి భాషలను ఎదగకుండా చేశాయన్నది ఒక వాదన. అలాగే అర్థం కాని సంసృతంలోనూ అన్నీ జరిపేంచుస్తుంటారు పురోహితులు. వారికైనా అర్థం అవుతాయో లేదో మనకు తెలియదు గాని వందల ఏళ్లపాటు వేదాలు వల్లెవేసిన వారంతా అక్షరాస్యులు కాదన్నది నిజం. అసలు వేదాలు అచ్చు వేయకూడదనేది కూడా వందేళ్ల కిందటి వరకూ మన వాళ్లు గట్టిగా నమ్మిన మాట. అన్నీ వేదాల్లో

Wednesday, April 17, 2013

రావూరి భరద్వాజకు జ్ఞానపీఠరావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం తెలుగు వారందరూ సంతోషించే విషయం. రెండు మూడు తరాలుగా రావూరి భరద్వాజ పేరు, రచనలూ, భావనలూ సాహిత్య ప్రియులకు సుపరిచితాలు. ప్రగతిశీల వాదులకూ ప్రజాస్వామిక భావాలకూ సదా సన్నిహితంగా మెలిగే రావూరి భరద్వాజ అక్షర శ్రామికుడు. అవిరామ స్వాప్నికుడు. తరాల మధ్య వారధి. సాహిత్య కార్యక్రమాల సారథి. అన్నిటినీ మించి స్నేహశీలి. ఎనిమిది పదుల వయస్సు దాటినా నిరంతర క్రియాశీలంగా కలుపుగోలుగా మసలే సహృదయ సాహిత్య జీవి. అందుకే ఆయనకు అఖిలభారత స్థాయిలో అత్యున్నత పురస్కారం లభించడం అభినందనీయం. మొదటిది విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి వస్తే రెండవది సి.నారాయణరెడ్డి విశ్వంభరకు లభించింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు ఆ గౌరవం దక్కింది. ఈ విధంగా ఇది తెలుగు వారికి లభించిన మూడో జ్ఞానపీఠం కనుక మరింత ప్రత్యేకం.
నిజానికి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొడవటిగంటి కుటుంబరావు, వంటి మహాకవులు రచయితలెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నిజానికి తాను శ్రీశ్రీ, ఆరుద్రల పేర్లు అనేక సార్లు సిఫార్సు చేశానని సినారె ఒక సందర్భంలో చెప్పారు. అయితే అప్పట్లో అధినేతల ఆలోచనా ధోరణులు అభ్యుదయాన్ని అస్సలస్సలు సహించేవి కావు గనకే వీరెవరికీ జ్ఞానపీఠం వంటివి లభించే సూచనే లేకపోయింది. తర్వాతి కాలంలో