Pages

Sunday, December 30, 2012

కార్యాచరణే కాలమానం

కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రభావం
కాలం ఒక ప్రణాళిక
కాలం ఒక ప్రహేళిక
కాలం ఒక సవాలు
కాలం ఒక జవాబు
కాలం ఒక చిత్రం
కాలం ఒక సూత్రం
కాలం ఒక అవకాశం
కాలం ఒక అవరోధం

కాలం సరిపోవాలి గాని చెప్పుకుంటూ పోతే కాలం గురించి ఇలా ఎన్నయినా పరస్పర విరుద్ధ విషయాలు ఏకరువు పెట్టొచ్చు.
కాలం గురించి ఆలోచనా పరులంతా ఏదో చెబుతూనే వచ్చారు. కవులు కావ్యాలు వెలువరించారు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. చేస్తున్నారు. కాలంతో పరుగు తీయాలని మానవులు కలలు కంటూనే వున్నారు. కాలాన్ని జయించేశామనుకునే లోపలే మళ్లీ అది కవ్విస్తూ సవాలు చేస్తూనే వుంది.
ఇన్ని తమాషాలకు కారణం ఒక్కటే- కాలం దానికదే ఏమీ కాదు. కాలమానం ఒక కొలమానం మాత్రమే.
అబ్బిన జ్ఞానాన్ని బట్టి అధ్యయానికి విలువు. వచ్చిన మార్కులను బట్టి రాసిన పరీక్షకు విలువ. వచ్చిన లాభాన్ని బట్టి వ్యాపారానికి విలువ. దిగుబడిని బట్టి సేద్యానికి విలువ.గుణాన్ని బట్టి వైద్యానికి విలువ. రుచిని బట్టి వంటకు విలువ. అలాగే కాలాన్ని విలువ కట్టాలంటే కార్యాచరణతోనే సాధ్యం. కాలాన్ని కొలవడానికి ఏకైక సాధనం కార్యాచరణే. ఎంత సమయంలో ఎంత పని జరిగింది లేదా జరగలేదు అన్నదాన్ని బట్టే కాలానికి విలువ అన్నది మొదటిసూత్రం.
ఎవరు ఏ రంగంలోనైనా వుండొచ్చు. పైన చెప్పుకున్న పనుల్లో ఏది చేసేవారైనా కావచ్చు. సాపేక్షంగా ఎంత సమయంలో ఎంత ఫలితం సాధించారనేదాన్ని బట్టి - లేక ఎంతో సమయంలోనైనా ఏం సాధించారనే దాన్ని బట్టి విలువ కట్టాల్సివుంటుంది.
నీటికి విలువ వుండేది కాదు- ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకుని వాడుకోవడం మొదలెట్టాకే బొట్టుబొట్టు లెక్క కట్టడం జరుగుతున్నది. అలాగే జీవరాశులే లేనప్పుడు కాలం గురించిన ఆలోచనే వుండి వుండదు. జంతు జాలమైనా వచ్చాకే వాటి అలవాట్లకు ప్రాకృతిక పరిణామాలకు అనుసంధానం అవసరమైంది. తెలియకుండానే అనుసరించడం మొదలెట్టాయి.మనిషి కూడా మొదటి దశలో ఎన్ని వేల సంవత్సరాలు అనాగరికంగా జంతు సదృశంగా బతికాడో మనకు తెలియదు.ఆ దశలోనూ కాలానికి విలువ గాని లెక్క గాని వుండి వుండదు.మేధా వికాసం జరిగాకే పరిసరాలను అధ్యయనం చేసి విజ్ఞానశాస్త్రం పెంపొందింది. అప్పుడే కాలాన్ని లెక్కగట్టడం మొదలైంది.ఒకసారి మొదలైన తర్వాత వెనకటి కాలాన్ని కూడా గణించే పద్ధతులన్నీ తెలిశాయి. అలా చూసినప్పుడు ఎన్ని సహస్రాబ్దులు అలా స్తబ్దుగా గడిచిపోయాయి? మరి ఇప్పుడో..!
2000 సంవత్సరం నూతన సహస్రాబ్ది వచ్చిందని హడావుడి చేసి అప్పుడే పుష్కర కాలం గడిచిపోయింది. ఆ రోజున అదే పనిగా కేరింతలు కొట్టిన వారు చిందులేసిన వాళ్లు ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవద్దూ.. పన్నెండేళ్లలో సాధించేందేమిటి? అని. అప్పటితో పోలిస్తే ఇప్పుడెక్కడున్నాం?కొత్తగా ఏం నేర్చుకున్నాం? ఏం మార్చుకున్నాం? పుష్కర కాలం పురస్కరించుకుని పరిశీలించుకోవచ్చు.అంత ఓపిక లేకుంటే

Saturday, December 29, 2012

జోహార్లు చిట్టి తల్లీ!


పదమూడు రోజుల పాటు మృత్యువుతో హౌరాహౌరీ పోరాడి అలసి సొలసి ఆఖరి శ్వాస విడిచిన గ్యాంగ్‌రేప్‌ బాధిత యువతి కోసం చెమ్మగిల్లని కళ్లేవీ దేశంలో వుండవు. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అని కవి రాసిన మాటలు ఇక్కడ మొత్తం దేశానికి వర్తిస్తాయి. దేశాధినేతలు అన్ని పార్టీల ప్రముఖులూ సకల జన సమూహాలు శోకతప్త హృదయాలతో ఆమెకు ఆఖరి నివాళి సమర్పిస్తూనే అత్యాచార భారతాన్ని అంతమొందించాలని ప్రతిజ్ఞబూనుతున్నారంటే ఆమె మరణం ఎంత ప్రభావం చూపిందో తెలుస్తుంది. అమాయకంగా అమానుష ముష్కరులకు బలైనా ఆమె మరణంలోనూ దేశాన్ని మేల్కొలిపే సమర సంకేతం కావడం నేటి కాల పరిస్థితులకు ప్రతిబింబిస్తుంది. ఈ రాక్షస కాండపై రగిలిన ఆగ్రహం, పెల్లుబికిన యువచైతన్యం, మహిళలపై దుర్మార్గాలు సాగించే వారికి ఒక హెచ్చరిక అవుతుంది. నిత్యం మహిళా జపం చేస్తూనే వారి రక్షణ పట్ల ఘోర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ చాలా సందర్భాల్లో నేరస్తులకు గొడుగు పట్టే పాలకవర్గాలను ప్రకంపింపచేస్తుంది. కాపాడకపోగా కలుషిత సంసృతిని వ్యాపింపచేస్తూ ఆ పైన అమ్మాయిలే అన్నిటికీ బాధ్యులని అవాకులు చవాకులు పలికిన వారికి గుణపాఠం చెబుతుంది. ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తర్వాత కూడా అనేక ఘటనలు జరిగాయి గనక వీటికి ముగింపు వుండదంటూ ఎవరైనా మాట్లాడితే అంతకన్నా పోరబాటు వుండదు. ఎందుకంటే ఏ విషయంలోనైనా ప్రజల సహనానికి ఒక హద్దు వుంటుంది. అది చెరిగిపోయిన తర్వాత మామూలు మనుషులే మహౌధృతంగా విజృంభించి పిడుగుల వర్షం కురిపిస్తారు. ఆధునిక చైతన్యం గల విద్యాధిక యువతీ యువకులు ఫేస్‌బుక్‌ మెసేజ్‌లతోనే లక్షోపలక్షలుగా దేశం నలుమూలలా కదలి వస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. దేశంలో ఇంత కదలిక రావడానికి కారణమైన ఢిల్లీ యువతి అక్షరాలా అమరజీవిగా మిగిలిపోతుంది. అత్యాచారాలపై పోరాడిన ప్రతిసారీ ఆమె గాధ ప్రతిధ్వనిస్తుంది.

ఢిల్లీ టు తిరుపతి - తెలుగు భాష, రాష్ట్రంచరిత్రలో యాదృచ్చికంగా కనిపించే అంశాల మధ్య వాస్తవికమైన అంతస్సంబంధం వుంటుంది. తెలుగు భాషా వికాసం కోసం తిరుపతిలో మహాసభలూ, తెలుగు రాష్ట్ర భవిష్యత్తుపై ఢిల్లీలో అగ్రనేతల అఖిలపక్ష సమావేశం ఏక కాలంలో జరగడం అలాటి ఒక సందర్భం.
ముందు అత్యంత కీలకమైన ఢిల్లీ అఖిలపక్ష సమావేశం సంగతి తీసుకుంటే గతంలో జరిగిన రెండు సమావేశాలకు దీనికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 2009 డిసెంబర్‌ 9, 23 తేదీలలో చేసిన ప్రకటనల తర్వాత ఏర్పడిన పరిస్థితిని చర్చించి ఒక పరిష్కారం కనుగొనడంపై మొదటి సమావేశం జరిగింది. శాంతి భద్రతలు కాపాడి పరిష్కారం కోసం కృషి చేయాలని అంగీకారం కుదిరింది. ఆ మేరకు శ్రీకృష్ణ కమిటీ ఏర్పడి తనదైన అధ్యయనం చేసి ఆరు అంశాలతో ఒక నివేదిక సమర్పించింది. దాన్ని చర్చించేందుకు తర్వాత మరో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ కమిటీ నివేదికపట్ల అభిప్రాయం చెప్పకుండానే కేంద్రం పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి తన మాయాజాలం కొనసాగించింది. అయితే ఈ సమావేశంలో అలాటి ప్రయత్నానికి ఆస్కారం లేకుండా ముకుతాడు వేయడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. మీడియా కథనాల ప్రకారం చూస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు కాంగ్రెస్‌ వైఖరి చెప్పకుండా ఇతరులను అడగడం ఏమిటని నిలదీయడం, కాల పరిమితి లేకపోతే కుదరదని పట్టుపట్టడం హౌంమంత్రి ప్రకటన చేయకతప్పని స్థితికి దారి తీసింది. రాష్ట్ర విభజన వద్దనీ, భాషా ప్రయుక్త సూత్రాన్ని కొనసాగించాలని దేశవ్యాపితంగా చెబుతున్న సూత్రాన్నే సిపిఎం ఇక్కడా గట్టిగా పునరుద్గాటిస్తున్నది.మిగిలిన అనేక పార్టీలు వూగిసలాటలకు గురైనా సిపిఎం నికరంగా ఒక్కమాటమీదే వుందన్న వాస్తవం అందరూ ఆమోదించిన పరిస్థితి.ఆ నైతిక దృఢత్వమే రాఘవులు గొంతుకు బలం చేకూర్చడం సహజం. ఇతర పార్టీలు కూడా అదే వైఖరి ప్రకటించిన తర్వాత హౌం మంత్రి లేదా కేంద్రం తలపెట్టిన కాలయాపన తతంగం సాగని స్థితి. ఫలితంగా వచ్చిందే నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్న మాట.
సమావేశంలో వివిధ పార్టీలు అనుసరించిన వైఖరి వాటి ధోరణికి ప్రతిబింబంగానే వుంది. టిఆర్‌ఎస్‌ ఇటీవలి వరకూ కాంగ్రెస్‌పై అపారమైన నమ్మకం ప్రకటిస్తూ విలీనం వరకూ ప్రతిపాదించి విమర్శలకు గురైంది. ఈసారి అఖిలపక్షం ప్రయోజనంపైనా పరిపరివిధాల వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలనుంచి వచ్చాయి. తమ జాబితాలో కోదండరాంను తీసుకుపోతామని చెప్పిని అదీ చెల్లుబాటు కాలేదు. చివరకు రాష్ట్రం వస్తుందనే ఆశ భ్రమ లేకుండానే వెళ్తున్నామని కెసిఆర్‌ ముందే ప్రకటించి వెళ్లారు. అందుకు తగినట్టే సమావేశం ముగిసిన తర్వాత అందరూ ఎంతోకొంత సానుకూల సంకేతాలున్నట్టు మాట్లాడితే కెసిఆర్‌ మాత్రం పూర్తిగా ప్రతికూలత ప్రకటించి బంద్‌కు కూడా

Thursday, December 27, 2012

ఐనను పోయిరావలయు హస్తినకు...ఐనను పోయిరావలయు హస్తిన, కచ్చటి సంధిమాటలె
ట్లైనను,శత్రురాజుల బలాబల సంపద జూడవచ్చు, మీ
మానసమందుగల్గు ననుమానము తీర్పగవచ్చు, తత్సమా
ధానము మీ విధానమును తాతయు ఒజ్జయు విందులెల్లరున్‌

ే తరచూ వినిపించే ఈ పాండవోద్యోగ విజయాల పద్యం ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణా సమస్యపై జరిగే అఖిలపక్ష సమావేశానికి అచ్చంగా సరిపోతుంది. సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రమే దానికి ఎలాటి ప్రాధాన్యత లేదన్నట్టు మాట్లాడింది. హౌం మంత్రి షిండే ప్రకటనే ఆలస్యంగా స్పష్టత లేకుండా ఇచ్చారు.మరుసటి రోజునే గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌ వచ్చి కేవలం కొత్తగా శాఖ చేపట్టిన షిండే అవగాహన కోసమే అఖిలపక్షం అని తేలికచేశారు. ప్రత్యేకంగా లేఖ రాసి స్పష్టత ఇస్తామన్న తెలుగు దేశం ఆ లేఖలో అఖిలపక్షం వేస్తే చెబుతామని చెప్పి సరిపెట్టింది. అయతే ఆ లేఖ తమకు అందలేదని చప్పరించిన షిండే ఎంపిలు( నిజానికి తమ పార్టీ వారు) సూచించిన మేరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించుతున్నట్టు లేఖలో రాశారు. ఆ సూచన ఎప్పుడు చేసిందీ అంటే ఎఫ్‌డిఐ ఓటింగులో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా వున్నప్పుడు! అధిష్టానంపై వత్తిడి పెట్టి ఏదో ప్రకటన తెప్పిస్తామన్న వారు ఆఖరుకు సాధించిందేమిటంటే నిర్దిష్ట అజెండా లేని అఖిలపక్షం. సమావేశం జరిపితే చెప్పేస్తామన్న ప్రతిపక్షం చెప్పేదేమంటే వారు చెబితే మేము చెబుతామన్న దాట వేత. ఈ ఇద్దరి మధ్య అసలు ఆ వూసే మాట్లాడని మూడో పక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌.
ే మొత్తంపైన ఇప్పుడు పాలిస్తున్న పార్టీ బాధ్యతారాహిత్యం ఒకటైతే గతంలో పాలించి మళ్లీ పాలించాలనుకుంటున్న పార్టీ, మేమే పాలనకు వస్తామంటున్న పార్టీ కూడా దాగుడు మూతలతో కాలం గడిపేశాయి. 28వ తేదీ ముంగిట్లోకి వచ్చి నిలబడినా సమావేశానికి ఎవరు వెళ్తారన్నది గాని వెళ్లిన వారు ఏమి చెబుతారన్నది గాని బయిటపెట్టడం లేదు. పారదర్శకంగా ప్రజాస్వామికంగా నడవాల్సిన రాజకీయ ప్రక్రియ ఈ విధంగా సస్పెన్స్‌ చిత్రంలాగా మారిపోయిందంటే అందుకు అవకాశవాదం తప్ప మరో కారణం లేదు. మా నిర్ణయమే

Tuesday, December 25, 2012

గొంతులో వెలక్కాయజగన్‌ కేసులో నిందితులైన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించే ఫైలును మంత్రివర్గానికి తిప్పి పంపడం ద్వారా గవర్నర్‌ నరసింహన్‌ పొరబాటును దిద్దుకునే అవకాశం కల్పించినట్టయింది. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గ నిర్ణయాలను పున: పరిశీలనకై పంపించడం తప్ప పూర్తిగా తిరస్కరించే అధికారం వుండదు. తన విచక్షణను ఉపయోగించే అంశంలో మాత్రం గవర్నర్‌ స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నియామకం, ఆయనపై గాని మంత్రులపై గాని అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తుకు అనుమతించే అధికారం గవర్నర్‌కు వుంటుంది. దాన్ని ప్రశ్నించే అవకాశం మంత్రివర్గానికి వుండదు. అందులోనూ ే రాజకీయంగా ప్రభుత్వం, పాలక పక్షం అనుదిన అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో గవర్నర్‌ ఫైలును తిప్పిపంపడం కూడా పెద్ద సవాలు. ఈ సమయంలో ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం తప్ప ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం లేదని మాడభూషి శ్రీధర్‌ వంటి న్యాయ నిపుణులు సోదాహరణంగా వివరిస్తున్నారు. ధర్మానతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో విచారణ నోటీసులు ఎదుర్కొంటుండగా వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించిందన్న విమర్శలు కూడా మూటకట్టుకుంది.
నైతిక నియమావళి కోసమే పదవికి రాజీనామా సమర్పించానని ధర్మాన గొప్పలు చెబుతున్నా ఆయన రాజీనామా ఆమోదం లేదా తిరస్కారం పొందకుండా అలా త్రిశంకు స్థితిలో సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఎట్టకేలకు ఇటీవలనే క్యాబినెట్‌ సమావేశానికి ఆయనకు ఆహ్వానించడం, తిరస్కరణ సంగతి తేలితేనే వస్తానని

చారిత్రిక పరిణామంలో తెలుగు,,,


చారిత్రిక పరిణామంలో తెలుగు,,,
తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. అని ఘంటసాల పాడుతుంటే హాయిగా వుంటుంది. పాడనా తెలుగు పాట గీతం ఓహౌ అనిపిస్తుంది. తేనెకన్నా తియ్యనిది తెలుగు పాట..అనితల వూగిపోతుంది. తెలుగు'వాడి' గురించిన శ్రీశ్రీ ప్రయోగంలో శ్లేష ఓహౌ అనిపిస్తుంది...
ఇంకాస్త వెనక్కు వెళితే గురజాడ.. ఆ వెనక వేమన్న.. ఆ వెనక తిక్కన. ఆ ముందు నన్నయ్య, నన్నెచోడుడు.. ఇలా కవి పుంగవులు.. పండిత ప్రకాండులు కళ్లముందు కదలాడతారు. అఆలు దిద్దించిన అమ్మలు అమ్మమ్మలు పంతుళ్లు పంతులమ్మలు ఒకరేమిటి చదువుతో ముడిపడిన ప్రతివారూ గుర్తుకొస్తారు. తెలుగు తల్లి, తర్వాత వెలసిన తెలంగాణా తల్లి తదితర వల్లీమతల్లులందురూ మదిలో మెదులు తారు.
మల్లమ్మ పతిభక్తి. రుద్రమ్మ భుజశక్తి, తిమ్మరుసు ధీయుక్తి..కృష్ణ రాయల కీర్తి.. చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. స్వాతంత్ర సంగ్రామం, జమీందారీ వ్యతిరేక పోరాటం.. నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు అన్నీ మదిలో మెదులుతాయి. ఇన్నిటిని కలిపి వుంచిన బంధం అక్షరం. తెలుగు అక్షరం. అందచందాల ఒంపుసొంపుల అక్షర ం. 56 అక్షరాలతో ప్రపంచంలో ఏ భాషా పదాన్నయినా రాయగల తెలుగు అక్షర సంపద అనితర సాధ్యం. అరుదైన సంగీత గుణంతో ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌ అని పిలిపించుకున్న తెలుగు కు ఆంధ్రం అనీ, తెనుగు అనీ తెనుంగు అనీ పర్యాయ పదాలు. తెలుగు ప్రాతిపదికపై ఏర్పడిన భౌగోళిక విభాగాన్ని విభజించాలన్న కోర్కెతో పాటే తెలుగు భాషలో తేడాలపైనా వివాదాలు నడుస్తున్నాయి గాని తెలుగు ఔన్నత్యంపై భిన్నాభిప్రాయాలు లేవు.
ఇంతకూ ఈ తెలుగు ఎప్పుడు పుట్టింది? దాని తొలి అడుగులేవి?

ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు పి.వి.పరబ్రహ్మశాస్త్రి అధ్యయనం ప్రకారం తెలుగు భాష క్రీపూ5 వ శతాబ్డం వరకూ తెలుగు అనదగిన భాష లేదు. స్థానిక తెలుగు/ఆంధ్ర, బౌద్ధ మత ప్రచారకుల ప్రాకృతం, విద్వత్‌ బ్రాహ్మణుల అలాగే బౌద్ధ జైన ఆచార్యుల సంసృతం అనే మూడు భాషలు వుండేవంటారు. స్థలనామాలు, నదుల పేర్లు , దేవీ దేవతలపేర్లు వంటివి, పనిముట్ల పేర్లు పక్కనపెడితే లిఖితపూర్వకంగా తెలుగు అని చెప్పదగిన ఆధారాలు లేవని తేల్చేశారు. ఆచార్య నాగార్జునుడు క్రీపూ మొదటి శతాబ్దంలో వ్యాఖ్య రాసిన ప్రజా పారమితను అంధక అనే శాఖకు చెందిన అనేక మంది విస్తరించారు. నాగార్జునుని శిష్యులు మరిన్ని బౌద్దగ్రంధాలు వెలువరించారు. ఈ కాలంలోనే ఆపస్తంభ కృతులు కూడా వెలువడ్డాయి.వైదిక ధర్మాలను వివరించే ఈ గ్రంధాన్నే ఆంధ్ర వేద పండితులు మననం

మూడో మోడీత్వం .


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ శాసనసభల ఎన్నికల ఫలితాలు బిజెపి బులపాటాాలకు సమాధానాలు. ప్రత్యేకించి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చుట్టూ కార్పొరేట్‌ మీడియా సహాయంతో కాషాయ దళాలు సృష్టించిన కాల్పనిక భ్రమలు తొలగిపోవడానికి కూడా దారితీసేవిగా వున్నాయి. సంఘ పరివార్‌ ప్రత్యక్ష ప్రతినిధిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తొలి నేత మోడీ ఆ సిద్ధాంతాలను ఆచరణలో అమలు చేసి అల్లకల్లోలానికి కారకులైనారు. ఇప్పుడేమో ఆ విషయాలన్ని మర్చిపోయి అభివృద్ధినే చూడమని ఆయన చెప్పడం దానికి మేధావులు పారిశ్రామిక వేత్తలనబడేవారంతా వంత పాడటం మహా విచిత్ర దృశ్యంగా గోచరిస్తుంది. ప్రపంచీకరణకు మత మార్కెట్‌ తత్వాలు రెండు ముఖాలనుకుంటే అవి అక్షరాలా మూర్తీభవించిన కాషాయ కరోడా మోడీ. మూడోసారి ఆయన గుజరాత్‌లో సాధించిన విజయం ఎన్నికల ప్రమాణాల రీత్యా ఘనమే అయినా సాగిన ప్రచారాలు అంతులేని అతిశయోక్తులతో పోలిస్తే అంత కాదు! నాలుగు వందల ఏళ్లకిందట బాబర్‌ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పేవారు గుజరాత్‌కు వచ్చేసరికి మాత్రం పదేళ్ల కిందటి మారణకాండను మర్చిపొమ్మన్నారు. కొన్ని సర్వేలైతే ఏకంగా 140 వరకూ వచ్చేస్తాయని జోస్యాలు చెప్పాయి. చివరకు అతిశయోక్తులన్నీ అవాస్తవాలుగా తేలిపోయి.ఆయన పరిమితులేమిటో స్పష్టమైంది.
బడా మీడియా ఎంతగా కీర్తిస్తున్నా న్యాయస్థానాల్లోనూ పౌర సమాజంలోనూ మోడీకి ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన జరిగిన దానికి విచారం వెలిబుచ్చిన దాఖలాలు లేకపోగా పరోక్షంగా అహంభావం ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ కారణంగానే ి మోడీని మొదటి నుంచి అభద్రత వెన్నాడుతూనే వచ్చింది. ఆఖరి నిముషంలో వచ్చిన నరహరి అమీన్‌ వంటి కాంగ్రెస్‌ వాదులను కూడా పిలిచి పీట వేశారందుకే. మైనారిటీల పట్ల ఆయన అనుచిత వైఖరి తీసుకోవడమనేదే గాక

Tuesday, December 11, 2012

ఆంధ్రప్రదేశ్‌తో ఆటలా?


దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్‌ను అనిశ్చితిలో ముంచి ప్రజలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు మరింత దారుణమైన దగాకోరు అధ్యాయానికి తెరతీసింది. ఎఫ్‌డిఐ ఓటింగులో కంపించిపోతున్న అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి అదే సమయంలో తెలంగాణా సమస్యపై ఏదో జరగబోతుందన్న భ్రమ కల్పించడానికి డిసెంబరు 28 వ తేదీ అఖిలపక్ష సమావేశ సూచన వదిలింది. అదైనా అధికారికంగా లిఖిల పూర్వకంగా గాక అలకబూనిన టికాంగ్రెస్‌ ఎంపిలను బుజ్జగించే ప్రక్రియలో భాగంగా జరిగిన తతంగం మాత్రమే. తెలంగాణా మనోభావాలు ముఖ్యమంటూనే ఎప్పటికప్పుడు అధికారాన్ని అంతకన్నా ముఖ్యంగా కాపాడుకొస్తున్న సదరు ఎంపిలు చెప్పుకోవడానికైనా ఏదో వుండాలి గనక అఖిలపక్షం పాచిక అక్కరకు వచ్చింది. అయితే అఖిలపక్ష సమావేశం జరపడమే ఘన కార్యమైనట్టు పరిష్కారం వచ్చేసినట్టు ప్రచారం జరిగింది. తెలంగాణా పేరిట ఎఫ్‌డిఐలపై ప్రజా వ్యతిరేక నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయడమే గాక అధినేత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపే ప్రహసనమూ షరామామూలే. అఖిలపక్షం ఎలా జరగాలి, ఎంతమంది హాజరుకావాలి, ఏమి చెప్పాలి వంటి రకరకాల రాజకీయ తర్జనభర్జనలు జరుగుతుండగానే ఆదిలోనే హంసపాదులా గులాం నబీ ఆజాద్‌ భవిష్యద్ధర్శనం చేయించారు. అఖిలపక్ష సమావేశం కొత్తగా వచ్చిన హౌం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అవగాహన కోసం ఏర్పాటు చేసిన రాజకీయ కచేరి వంటిదే తప్ప నిర్ణయాలు తీసుకునేది కాదని తేల్చిపారేశారు! మొత్తం వ్యవహారంపై కొత్తగా పరిశీలన ప్రక్రియ మొదలవుతుందని ప్రవచించారు. ప్రజా ప్రతినిధులు తాత్కాలికం, ప్రభుత్వ చట్రం శాశ్వతం. మంత్రులు మారినప్పుడల్లా ప్రతిదీ మళ్లీ మొదలు పెట్టేట్టయితే ప్రజాస్వామ్య ప్రక్రియకు అర్థమే వుండదు.
నిజానికి గతంలో ఒక అఖిల పక్ష సమావేశం, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక, తర్వాత మరో అఖిల పక్షం జరిగిపోయాక ఇంకా పార్టీలు కొత్తగా చెప్పవలసింది వినవలసిందీ ఏమీ లేదు. అధికారం వెలగబెడుతూ అనిశ్చితిని సృష్టించిన అధికార పక్షమే చెప్పేదేమీ లేదని పిసిసి అద్యక్షులవారు సెలవిచ్చారు. ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలని తెలుగు దేశం నేతలు సవాలు చేస్తూ తమ వైఖరి దాటేస్తున్నారు. ఈ ఇద్దరినీ దోషులుగా చూపించి తను కూడా అదే చేస్తున్న వాస్తవాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కప్పిపుచ్చుతున్నది. ఈ విధంగా మూడు ప్రధాన పార్టీలూ దాగుడు మూతలు ఆడటం దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. నిజానికి అలాటి

పోరాడిన మానవులెవ్వరు? మీడియాలో చోటే ఇవ్వరు!!


దయ్యానికైనా రావలసింది ఇవ్వాలి అన్నది ఒక ఇంగ్లీషు సామెత. గివ్‌ ద డెవిల్‌ ఇట్స్‌ డ్యూ. మీడియాకు ఈ సూత్రం మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఎవరి నేపథ్యం ఏమైనా ఎవరి రాజకీయాలు ఏవైనా సందర్భాన్ని బట్టి సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్య ధర్మం. కనకనే ఏ పరిణామం జరిగినా దానికి సంబంధించిన నాయకులు ఎక్కడ వున్నా వెంటబడి మరీ ఇంటర్వ్యూలు చేయడం, ఫోన్‌ఇన్‌లు పెట్టడం జరుగుతుంటుంది. పత్రికలైతే ఆ వార్తతో పాటే దానికి కారకులైన ఉద్యమాల చిత్రాలు వివరాలు ఘట్టాలు విపరీతంగా గుప్పిస్తాయి. మొదటి పేజీలో ఇండికేటర్స్‌ ఇస్తాయి. కాని చారిత్రాత్మకమైందిగా చెప్పుకుంటున్న ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ వాస్తవ రూపం దాల్చిన సన్నివేశంలో మాత్రం ఎందుకనో మన మీడియా ఈ సంప్రదాయాన్ని పాటించకలేదు!
సబ్‌ ప్లాన్‌ కేవలం మా వరప్రసాదం దక్క మరొకటి కాదని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు నానాతంటాలు పడ్డారంటే అదో రకం. ఒకటి రెండు సీట్లు వున్న పార్టీలకు భయపడబోమని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ధైర్య సాహసాలు ప్రకటించినా సరిపెట్టుకోవచ్చు( వాస్తవానికి అలా పరోక్షంగా ప్రస్తావించడంలోనే ఆయన ఎంతగా భయపడుతున్నదీ తెలుస్తుంది. తుమ్మితే వూడే ముక్కులా ప్రతి సభ్యుడిని ప్రాధేయ పడాల్సినస్థితిలో వున్న సర్కారు నేత తిరుగులేని ఆధిక్యతకు తనే ప్రతిరూపంలా మాట్లాడ్డం మరీ హాస్యాస్పదం) ఆయన ధోరణి ఒకటైతే నిష్పాక్షితకు నిలువుటద్దాలమనీ, నిర్భీతికి నిదర్శనాలమనీ చెప్పుకునే మీడియా సంస్థలు వ్యాఖ్యాతలూ కూడా అదే ఫక్కీలో పడటాన్ని ే ఏమనాలి? సబ్‌ ప్లాన్‌కోసం 2002తో మొదలు పెట్టి దశాబ్ద కాలంగా పోరాటాలు జరుగుతూనే వున్నాయి. బి.వి.రాఘవులు తదితరులు ఒక పర్యాయం, జాన్‌ వెస్లీ మరొకసారి, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆ తర్వాత దఫదఫాలుగా నిరవధిక నిరాహారదీక్షలు చేయడం పోలీసులు రకరకాలుగా స్పందించడం జరుగుతూనే వచ్చింది.ఒకసారి అర్థరాత్రి దాకా బైఠాయింపు అరెస్టులు ఆ తర్వాతనే ప్రభుత్వం సమ్మతించడం జరిగింది. మాజీ ఉన్నతాధికారులు, దాదాపు 900 సంఘాలు, ఈ పోరాటంలో పాలు పంచుకున్నాయి. శాసనసభ లోపలా, వెలుపలా పదే పదే ప్రస్తావనలు వచ్చాయి. ఇన్ని పోరాటాల ఫలితంగానే సబ్‌ ప్లాన్‌ ముందుకు వచ్చిందన్న సత్యాన్ని సముచిత రీతిలో తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియాకు లేదా?
ఒకవైపు చూపు...
సబ్‌ ప్లాన్‌మొసాయిదా శాసనసభలో ప్రవేశపెట్టిన రోజున పత్రికల్లో టిఆర్‌ఎస్‌అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యలు ప్రముఖంగా వచ్చాయి.గతంలో గల్లంతు చేసిన25 వేల కోట్టు ఇప్పుడు కక్కించాలన్నట్టు

మత సంబంధాల చిత్రణలో మలుపులు మరకలు..కులంతో పోలిస్తే మతాల చిత్రణ తెలుగు సినిమాల్లో ఎక్కువగానే వుంటుంది. ఇందుకు సంబంధించిన కొన్ని మూస ధోరణులు కూడా స్థిరపడిపోయాయి. ముస్లిం పాత్రల వేషభాషలను మన సినిమాలు ప్రత్యేకంగానే చూపించడం పరిపాటి. తెలుగులో అష్టావధానం చేయగల ముస్లిములు కూడా వున్నారని తెలిసినా మన దర్శకులు ఎప్పుడూ కృత్రిమ తెలుగు మాట్టాడే పాత్రలనే సృష్టిస్తుంటారు. వారికి పిల్లిగడ్డం, నెత్తిపైన టోటీ, గళ్లలుంగి లేదా పైజామా వంటి వేషాలు వేయిస్తారు. ముస్లిములతో పోలిస్తే క్రైస్తవ పాత్రలు తక్కువగా వున్నా వాటిపై అల్లిన కథలు ఎక్కువగానే వుంటాయి. వీటిలో అనేకం మత సామరస్యం బోధించేవిగా వుంటాయి గాని కాలక్రమంలో అనేక తేడాలు వచ్చాయి.
విజయా వారి మిస్సమ్మలో కథానాయిక సావిత్రి మేరి ఉద్యోగార్థం హీరో ఎన్టీఆర్‌ భార్యగా ఒక వూరు వస్తుంది. తర్వాత కథలో ఆమె మత విశ్వాసాలకు హిందూ సంప్రదాయాలకు మధ్యన ఘర్సణ చాలా సన్నివేశాల్లో వుంటుంది. కరుణించు మేరిమాత అన్న పాట ఆ తరహాలో ఒకే ఒక్కటి అని చెప్పాలి. విశేషమేమంటే ఇదే విజయా సంస్థ ఇంచుమించు ఇలాటి ఇతివృత్తంతోనే మళ్లీ 1975లో శ్రీరాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌ నిర్మించటం.ఇందులోనూ కథానాయకుడు కృష్ణ అతని యజమాని జగ్గయ్యతో సహా అనేకులు క్రైస్తవులై వుండి బ్రాహ్మణులుగా వేషం వేసి హౌటల్‌ నడుపుతుంటారు. చివరకు అంతా ఒక్కటే అన్న సందేశంతో ముగుస్తుంది.
విలన్‌ పాత్రల విలక్షణ నటుడు నాగభూషణం స్వంతంగా నిర్మించిన ఒకే కుటుంబం మరో కోవకు చెందింది. ఇందులో ఎన్టీఆర్‌ అనుకోని పరిస్థితుల్లో రహీమ్‌గా పెరుగుతాడు. అందరికీ ఒక్కడే దేవుడు అన్న పాటతో మత సామరస్యం బోధించే ఈ చిత్రంలో కుటుంబ కథ మత ప్రభావం పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ సమయంలోనే అక్కినేని నిర్మించిన మరో ప్రపంచం చిత్రం కులమతాలు వద్దని చెబుతుంది. అందులో అక్కినేని క్రైస్తవ ఫాదర్‌ వేషంలో కనిపిస్తాడు. ఆయనే కథానాయకుడుగా విఠలాచార్య ఫ్రెంచి నవల లే మిజరబులే అధారంగా పునర్నిర్మించిన బీదల పాట్లు చిత్రంలోనూ క్రైస్తవ ఫాదర్‌ ప్రభావంతో మారతాడు. ఎన్టీఆర్‌ తీసిన రామ్‌ రహీమ్‌, హిందీ నుంచి పునర్నిర్మించిన రామ్‌ రాబర్ట్‌ రహీం వీటన్నిటిలోనూ వివిధ మతాలకు చెందిన ప్రధాన పాత్రులుంటాయి. చాలా చిత్రాల్లో కథానాయకుడు ఒక మతానికి చెందినవాడై వుండి మరోచోట పెరగడం వుంటుంది. అయితే ప్రధాన పాత్రలుగా చూపించినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇలాటి పాత్రలను హాస్యానికే


ఇటీవల ప్రజాశక్తి బుకహేౌస్‌ నుంచి ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్‌గా బాధ్యతలు తీసుకఁన్నందువల్ల పోస్టింగులలో అంతరాయం ఏర్పడింది. ఇకపై గతంలో లాగే సంభాషణ కొనసాగించుకోవచ్చునఁ ఆశిస్తున్నాను.

Saturday, December 8, 2012

విశ్వసనీయతకు విఘాతంప్రాంతీయ పార్టీలుగా జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర వహిస్తున్న ప్రధాన ప్రాంతీయ పార్టీల వూగిసలాటలు, అవకాశవాదాలు పార్లమెంటులో ఎఫ్‌డిఐ ఓటింగులో స్పష్టంగా బయిటపడ్డాయి. ఎఫ్‌డిఐల ప్రవేశంపై సభ బయిట నిప్పులు కక్కుతున్న నేతలే సభలో వ్యతిరేకతను నీరుగార్చేందుకు సాధనాలు కావడం ఘోరం. ్ట ఎస్‌పిది అవకాశవాదం కాగా బిఎస్‌పి ది బూటకపు వ్యతిరేకత. ఆఖరుకు కాంగ్రెస్‌ వ్యతిరేకతకు చిరునామా మేమేనని తరచూ చెప్పుకునే తెలుగు దేశం రాజ్యసభ ఎంపిల్లో అత్యధికులు ఓటింగుకు ఎగనామం పెట్టి మన్మోహన వ్యూహానికి దోహదకారులైనారు. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా అధికారికంగా ఆ పార్టీ నుంచి ఎలాటి తీవ్రమైన ప్రతిస్పందన లేకపోవడం కూడా ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది. తెలుగు దేశం విశ్వసనీయతకు విఘాతం కలిగింది. కొంతమంది నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతుంటే మరికొంత మంది సర్దుబాటు సూచనలు చేయడం యుగళ గీతంలా సాగుతున్నది. ఆర్థిక సంస్కరణల విషయంలో గతంలోని తెలుగు దేశం సర్కారు ి దాని అధినేత కనపరిచిన అత్యుత్సాహం నేపథ్యంలో దీని వెనక విధానపరమైన వూగిసలాటలు కూడా వున్నాయా అన్న సందేహాలు కొన్ని వ్యక్తమవుతున్నాయి.కాంగ్రెస్‌ కుట్రలను కుటిలతలనూ ఎంతగా ఖండించినా ఆ ప్రలోభాల ప్రభావం నుంచి తమ ముఖ్య నేతలనే కాపాడుకోలేకపోవడం తెలుగు దేశం ప్రతిష్టను పలచబారుస్తుంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలలో వరుస పరాజయాలు, వలసల నిరోధించడంలో వైఫల్యం, ప్రాంతీయ సమస్యపై అస్పష్టత వంటి పలు సమస్యలతో సతమవుతున్న ప్రధాన ప్రతిపక్షానికి ఇది తాజా శరాఘాతం. ఎస్‌పి, బిఎస్‌పిలు ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లోనూ ఢిల్లీలోనూ ఇలాటి విన్యాసాలు చాలా చేసి వున్నందున పెద్ద సమస్య కాకపోవచ్చు గాని తెలుగు దేశంకు మాత్రం ఇది తీవ్రమైన సవాలు. 1993లో పి.వి.నరసింహారావు ప్రభుత్వాన్ని, 2008లో అణుఒప్పందం ఓటింగు సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆదుకున్న చరిత్ర ఆ పార్టీ ఫిరాయింపుదార్లదే. ్ట తెలుగు దేశం అధినేత తీవ్రమైన అస్తిత్వ పోరాటం చేస్తున్న తరుణంలో చరిత్ర పునరావృతమైన రీతిలో తగిలిన ఈ ఎదురు దెబ్బను ఎలా తట్టుకుంటారనేది చూడాల్సిందే. పార్టీలేవైనా వ్యక్తులుగా నేతలెవరైనా విలువలకు విధానాలకు కట్టుబడకుండా పదవులు ప్రయోజనాలే సర్వస్వమనుకునే స్వార్థ రాజకీయాల పరాకాష్ట ఈ పరిణామాలు