Pages

Saturday, January 29, 2011

నల్లబడిన గణతంత్రం- గాంధీ జపం తూతూ మంత్రం


ఓ మహాత్మా ఓ మహర్షీ
ఓ క్షమా పీయూష వర్షీ
ఎచట నీ అహింస
ఎచట నీ కరుణా రిరంస
చూడు దేశం ద్వేష మగం
క్షుర జిహ్వానల విభుగం


మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ వాక్యాలు గాంధీజీ ప్రబోధాలకు దేశంలో వాస్తవాలకు మధ్యన అంతరాన్ని కళ్లకు కడితే కాళోజీ మరింత సూటిగా-
బాపూజీ బతికిన యప్పటి
సత్యాహింసల దుప్పటి
ఘనతలు సాంతము చిరిగెను
అతుకుల బొంతగ మిగిలెను
అంటాడు. ఈ వ్యాస రచయిత ఒక సందర్భంలో
కుంభకోణ భారతాన
రోజుకొక్క రోత గాధ
గంగలోన కలిసెనులే
గాంధి తాత నీతిబోధ
అని రాశాడు. ఈ మాటలు ఎంత నిజమో తెలుసుకోవడానికి మొన్ననే ముగిసిన గణతంత్ర(రిపబ్లిక్‌) దినోత్సవం కన్నా మరో సందర్భం అవసరం వుండదు.
రిపబ్లిక్‌ దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ దేశానికి ప్రధానమైన బెడద అవినీతి అని ఆవేదన ఆందోళన వెలిబుచ్చారు. ఇంచుమించు అదే సమయంలో శక్తివంతుడైన ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి దేశాలు దాటిపోయిన నల్లడబ్బు ఆసాములు వివరాలు తెలిసినా వెల్లడించగల అవకాశం లేదని నిస్సిగ్గుగా చెప్పేశారు.ఈ రెండు మాటలకూ మధ్యన తేడా

Wednesday, January 26, 2011

కిరణ్‌ వర్సెస్‌ జగన్‌ - ఇప్పుడేమి జరుగున్‌?ఈ రోజంతా చర్చ దీని చుట్టూ తిరుగుతున్నది. జగన్‌ వర్గం శాసనసభ్యులు సీఎల్పీ కార్యాలయం సాక్షిగా సవాలఅధిష్టానం ఆదేశాల మేరకే కిరణ్‌ అలా మాట్లాడారా అన్న దానిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి.
ు విసరడంతో కాంగ్రెస్‌ కలహాలు రసకందాయంలో పడినట్టే భావించాలి. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు భూమిక ఏర్పరచాయని చెప్పాలి. ఆయన వ్యాఖ్యల్లో నాలుగు అంశాలున్నాయి-

మొదటిది- ఒక ఎంఎల్‌ఎ ఖూనీ కేసులో ప్రతిపక్షం దాడి నుంచి ముఖ్యమంత్రి కుమారుడిని కాపాడ్డానికి అరవై రోజులు అధ్యయనం చేసి సమర్థించాల్సి వచ్చింది. నిజానికి ఇది చాలా తీవ్రమైన అంశం. మద్దెల చెరువు సూరి హత్య తర్వాతి పరిస్థితులలో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి యథాలాపంగా ప్రస్తావించి వుంటారనుకోలేము. పరిటాల రవి నుంచి సూరి వరకూ జరిగిన హత్యల పరంపరకు

Saturday, January 22, 2011

రాజ్యాంగ ఏర్పాటా? రాష్ట్ర వేర్పాటా?కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణా ప్రాంత ఎంపిలు పదవులు తీసుకోరాదని టిఆర్‌ఎస్‌ ఎంత చెప్పినా అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. సదరు కాంగ్రెస్‌ ఎంపిలు కుండబద్దలు కొట్టి మరీ పదవులు వదులుకోబోమని చెప్పడంలోనే అది తేలిపోయింది. తీరా ఎవరికీ ఏ పదవులూ వచ్చిందీ లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం వైఖరి ఎలా వుంటుందన్నదానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై వుంది. అవిభక్త రాష్ట్రంలో తెలంగాణాకు రాజ్యాంగ పరమైన రక్షణలు ఏర్పాటు చేయడం అత్యుత్తమ మార్గమని దేశానికీ మంచిదని కమిటీ చెప్పింది. విభజన అనివార్యమైన పరిస్తితుల్లోనే

Friday, January 14, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

పండుగ రోజునే ప్రధాని సలహా మండలి దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం సాధ్యం కాదని చెప్పిన వార్త వస్తున్నది.అంతులేని ఈ అంతరాల భారతాన్ని మార్చడం ఎలా? వెలిగే భారతానికి రగిలే భారతానికి మద్య అగాధాలు పూడ్చటమెలా అన్న ప్రశ్నను ఈ విధంగా సంక్రాంతి మన ముందుకు తెచ్చి నిలిపింది. అభివృద్ధి గురించిన అంకెల గారడీలకు మనం డూడూ బసవన్నల్లా తలూపకుండా వుంటనే- సంపన్న వర్గాల రంగుల రంగువల్లులను చూసి పరవశించడంతో పాలు పక్కనే వున్న రంగు వెలసిన అశేష జనాన్ని కూడా గుర్తు చేసుకున్న రోజున- అన్న దాతకు కూడా ఆనందం ఆశ కరువై పోతున్న ఈ పంటల పండుగ పరమార్థం నెరవేరెదెలా అని తర్కించిన రోజున నిజమైన క్రాంతి మొదలవుతుంది. సంపూర్ణ సంక్రాంతి సాక్షాత్కరిస్తుంది

Sunday, January 9, 2011

శ్రీకృష్ణ నివేదిక: బహుళ కోణాల వేదిక

మహాభారతంలో కృష్ణ రాయబారం అనేది యుద్ధానికి బాట వేసింది. యుద్దం తప్పదంటూనే 'అయినను పోయి రావలయు హస్తినకు' అంటూ అక్కడ శత్రు రాజుల స్థితి గతులను గమనించి రావచ్చని బయిలుదేరి వెళ్లాడు శ్రీకృష్ణుడు. నా మాట వినక పోతే యుద్ధం తప్పదనీ,పది వేల మంది కర్ణులైనా అని నొత్తురు చత్తురు అని హెచ్చరించి మరీ చిచ్చు పెట్టాడు. జస్టిస్‌ గారి పేరును బట్టి మీడియాలో కృష్ణ రాయబారం అని,కృష్ణతులాబారం అని పరిపరి విధాల ప్రస్తావనలు చేశారు గాని వాస్తవానికి ఈ శ్రీకృష్ణ పర్వం అందుకు పూర్తి భిన్నమైంది. ప్రాంతీయ రాజకీయ పాచికలతో ఉద్రిక్తమైన రాష్ట్రానికి ఒకింత ఉపశమనం

Thursday, January 6, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక- ప్రతిస్పందనలు

ఈ రోజు మొత్తం ఛానళ్ల ప్రదక్షిణ కారణంగా బ్లాగు మిత్రుల కోసం వివరమైన వ్యాసం రాయడం కుదరలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక గొప్పగా వుందని గాని చప్పగా వుందని గాని నిర్ధారణలు చేయగలిగిందేమీ లేదు. దానికి ఏ విషయాలు పరిశీలించవలసిందిగా చెప్పారో ఆ అంశాలనే నివేదిక ప్రతిబింబిస్తుంది. తెలంగాణా విభజనే కోరుకునే వారికి అవిభక్త రాష్ట్రాన్ని కొనసాగించడం అత్యుత్తమ పరిష్కారమని చెప్పడం నచ్చక పోవడం సహజమే. అదే సమయంలో తెలంగాణాను హైదరాబాదు రాజధానిగా విడదీసి, ఆంధ్ర ప్రాంతానికి కొత్త

Wednesday, January 5, 2011

చెయ్యెత్తి జై కొట్టు, తెలుగోడు!

24 గంటల ఛానెళ్ల యుగంలో గడువులూ, ఉత్కంఠలూ కీలకం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే డిసెంబరు 31 చుట్టూ బోలెడు కథ నడిచిన తర్వాత జనవరి 6 ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇంటర్‌ నెట్‌లో విడుదల చేయదగిన లేదా టపాలో పంపదగిన ఆ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రమూ నాటకీయత కొనసాగించింది. విమర్శలూ వివాదాల తర్వాత ఇప్పుడు రావడం రాకపోవడం ఒకరా ఇద్దరా తేల్చుకోవడం అంతా సదరు పార్టీల ఇష్టమేనని ప్రకటిస్తున్నది. నివేదిక ఇవ్వడం తప్ప చేసేదేమీ వుండదనిచల్లగా సెలవిస్తున్నది. కేంద్ర రాష్ట్రాలను పాలించే కాంగ్రెస్‌ నిజంగా అంత నిష్కామ కర్మగా వ్యవహరించి వుంటే ఈ అనిశ్చితి ఇంత కాలం కొనసాగేదే కాదు. ఇప్పుడు అది సమసిపోయే సూచనలూ

Saturday, January 1, 2011

నిజరూపాలు చూపనున్న 2011

గత ఏడాది యావత్తూ రాజకీయ అనిశ్చితితో ముగిసి పోతే ఈ ఏడాది ఆరంభంలో దాని పరిష్కార ప్రహసనం కొత్త రూపంలో ముందుకొస్తున్నది. శ్రీకృష్ణ కమిటీ నివేదికతోనే నిర్ణయాలు జరిగిపోతాయని ఎవరూ అనుకోవడం లేదు గాని అది ఒక ప్రాతిపదికగానూ అధికారిక చర్చా పత్రంగానూ వుంటుందనేది కాదనలేని విషయం. అదే అంతిమం కాదు, దాంతోనే అంతా ముగిసి పోదు అనేది కూడా సత్యమే. దాన్ని వ్యతిరేకించే హక్కు కూడా వుండొచ్చు. 15 కోట్ల రూపాయల ప్రజాధనంతో లక్ష వినతి పత్రాలు, వందలాది అభిప్రాయ సేకరణలు, మరెన్నో భేటీల తర్వాత రూపొందిన ఒక సాధికారిక పత్రానికి విలువే వుండదని ఎవరు చెప్పినా వాస్తవికంగా వుండదు. కాకపోతే పత్రాన్ని ముందు తనుగా పరిశీలించి అభిప్రాయాలతో ముందుకు రావలసిన కేంద్రం ఆ బాధ్యతను రాష్ట్రంలోని రాజకీయ పక్షాలపై నెట్టి వేసింది. తన చేతికి మట్టి