Pages

Saturday, December 31, 2011

కాలానికి స్వాగత గీతం జనావళికి శుభ ప్రభాతం
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ ఏడాది మీకు ప్రగతిశీలంగానూ ప్రయోజనాత్మకంగానూ వుండాలని మీరు ప్రణాళికా బద్దంగా పురోగమించాలని కోరుకుంటున్నాను. ఏడాది పొడుగునా నా బ్లాగులో ఎంట్రీలు చూసిన ఇతరత్రా ఆదరించిన ప్రతివారికీ, ప్రత్యేకించి విమర్శల ద్వారా పదును అప్రమత్తత పెంచిన వారికి నా కృతజ్ఞతలు.
గత ఏడాది చివరలో ' కాలం ఖాతాలో వీడ్కోలు వీక్షణం' అని రాశాను. ఇప్పుడు దాన్ని ఒకసారి చదువుకుంటే గతాన్ని సమీక్షించుకోవడం ఎలా వున్నా రాబోయే రోజులను మెరుగ్గా ఉపయోగించుకునే అవకాశముంటుంది. అందరికీ కనీసం అత్యధికులకు ఏదో మేరకు అందుబాటులో వుండే సామ్యవాది (సౌమ్యవాది మాత్రం కాదు) కాలం ఒక్కటే.

కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రభావం

కాలం ఒక ప్రణాళిక
కాలం ఒక ప్రహేళిక

కాలం ఒక సవాలు
కాలం ఒక జవాబు

కాలం ఒక అవకాశం
కాలం ఒక అవరోధం

కాలం ఒక వాహనం
కాలం ఒక వాహకం

కాలం ఒక ప్రమాణం
కాలం ఒక ప్రయాణం

కాలం ఒక ప్రయోగం
కాలం ఒక ప్రకాశం

Tuesday, December 27, 2011

మోత్కుపల్లి వృథావేశం అవాంఛనీయం

ఈ వారం నల్గొండ జిల్లా తెలుగు దేశం నాయకుడు మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు బొత్తిగా అవసరం లేనివి. చంద్రబాబు నాయుడు రైతు పోరు పేరిట చేసిన యాత్ర పూర్తి కావడం మంచిదే. దాన్ని అడ్డుకుంటామని మొదట ప్రకటించిన కోదండ రామ్‌ తర్వాత దాన్ని సవరించుకున్నారు కూడా. ఈ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయే బదులు తెలుగు దేశం నాయకులు టిఆర్‌ఎస్‌పైనా ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కె.సి.ఆర్‌పైన ధ్వజమెత్తడానికి ప్రాధన్యాత నిచ్చారు. తెలంగాణా రాజకీయ క్షేత్రంలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర వైరుధ్యం వున్న మాటా నిజం. టిఆర్‌ఎస్‌ తెలుగుదేశంపై దాడి కేంద్రీకరిస్తున్న మాటా నిజం. కెసిఆర్‌ రాజకీయ విన్యాసాలు వివాదాలు ఎలా వున్నా ఆ కారణంతో మోత్కుపల్లి మాటలు సమంజసమై పోవు. ఎందుకంటే ఉరేసుకుందాం రమ్మని సవాలు చేయడం, ఒక ప్లాస్టిక్‌తాడుతో ప్రత్యక్షం కావడం బాద్యత గల రాజకీయ నేతలు చేసే పని కాదు. పైగా అనేక బాధాకర ఘటనల తర్వాత ఇప్పుడెప్పుడే స్తిమితపడుతున్న తెలంగాణా ప్రాంత ప్రజలకు అసలే మంచిది కాదు. కెసిఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుంటే

నిజరూపాల నిరూపణ, కొనసాగిన ప్రజా కార్యాచరణ

కాలగతిలో కరిగిపోతున్న 2011 చివరి ఘట్టం. సమీక్షకూ సమాలోచనకు సందర్భం. సంవత్సరం పొడుగునా చూసిన సమస్యలు సవాళ్లు సంవాదాలు సమరాలు సంచలనాలు సంతోష విషాదాలను బేరీజు వేసుకోవడానికి సరైన సందర్భం. కాలం ముందుకే పోతుంది తప్ప వెనక్కు నడవదు. గడియారాలు ఆగిపోవచ్చు గాని ఘడియలు ఆగవు. పరిణామ క్రమం కూడా అంతే..ప్రతికూలతలను ప్రతిఘటిస్తూ ముందుకు సాగడమే మానవాళి స్వభావం. కట్టుకథలు పటాపంచలు చేసి కఠోర సత్యాలను కళ్లకు కట్టడం, కల్పనలనూ కట్టుకథలను కుప్పకూల్చి కఠినతర పరీక్షలకు ప్రజా రాశులను సమాయత్త పర్చడం కాలసూత్రం.
2011 నే తీసుకోండి. ధర్నా చౌక్‌ నుంచి వాల్‌స్ట్రీట్‌ వరకూ ప్రతిచోటా కనిపించిన దృశ్యం ప్రతిఘటనే.సంస్కరణల పేరిట నల్లేరు మీద బండిలా నడిపించుకుపోవాలన్న నయవంచక పథకాలను వామపక్ష ప్రజాస్వామిక శక్తుల నుంచి అడుగడుగునా నిరసన వ్యక్తమవుతూ వచ్చింది. అది కూడా పరిమితులలో ఆగిపోకుండా అంతకంతకూ విస్తారమవుతూ వచ్చింది. ఇన్ని సమస్యల మధ్యనా సాధించుకున్న కోర్కెలు నిలువరించిన ప్రమాదాలు చాలా వున్నాయి. వీటిని చూసి బెంబేలెత్తిన సామ్రాజ్యవాదం మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్న స్థితి.2007లో సద్ధాం హుస్సేన్‌ ఉరితీతతో ముగిసిపోతే 2011 కల్నల్‌ గడాపీని కడతేర్చడంతో ముగిసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు. ఇరాక్‌లో తిష్ట వేసిన సైన్యాలు ఇంటి దారి పడితే అరబ్‌ దేశాలలో అనుకున్నట్టల్లా అడటానికి అనేక ఆటంకాలను ఎదుర్కొవలసిన స్థితి అమెరికాకు ఎదురవుతున్నది.ఆఖరుకు ఉపగ్రహం వంటి పాకిస్థాన్‌ సైనిక కూటమి కూడా పూర్తిగా లొంగిపోవడానికి నిరాకరించడంతో ఉద్రక్తత పెరుగుతున్నది. ఇరాక్‌పైన దురాక్రమణ సమయంలో కన్నా ఇప్పుడు ప్రపంచం అమెరికా అసలు వ్యూహాలను అర్థం చేసుకోగలుగుతున్నది. లిబియా తర్వాత ఏ దేశంపైన దాడి చేస్తారో అని ప్రతివారూ ముందస్తుగానే

Wednesday, December 21, 2011

మాఫియా మహా సామ్రాజ్యాలుకారణమేదైనా మీరు మంచి పని చేశారు, ఆ చేసిందాంట్లో తెలిసిందేమిటో మాకూ చెప్పండి అని ప్రజలు ప్రతిపక్షాలు, మీడియా అడుగుతుంటేే పాలకులే తటపటాయించే పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయ రంగస్థలంపై ి దృశ్యం అదే. లిక్కర్‌ మాఫియాపై దాడులను ఆహ్వానిస్తూ వాటిలో పట్టుబడిన వారి వివరాలను పారదర్శకంగా ప్రజల ముందుంచమని కోరుతుంటే ప్రభుత్వం ప్రతిస్పందించడం లేదు. దాడులు చేసిన ఎసిబి అధిపతులు గాని, వారికి ఆదేశాలిచ్చే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గాని తమ దాడుల తీరు తెన్నులు ఫలితాలు పర్యవసానాలు రేఖా మాత్రంగానైనా పంచుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం జరపాలన్నారు. స్వపక్షం అద్యక్షుడు, సమిష్టి మంత్రివర్గ బృంద సభ్యుడు బొత్స సత్యనారాయణ విషయాలు బయిటపెట్టమని 'సవాలు' చేశారు. మహిళా సంఘాలు ఆందోళనలు మొదలెట్టాయి. మీడియా చర్చల్లో మాలాటి వాళ్లం మద్యం మాఫియా మతలబులు బహిర్గతం చేయాలని కోరుతూనే వున్నాం. అయినా సరే, ప్రభుత్వం కిమ్మిన్నాస్తి అన్నట్టుగా వుండిపోతున్నది. గనుల మాఫియా, భూముల మాఫియా, మాదకద్రవ్యాల మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఆయుధాల మాఫియా, అడవుల మాఫియా, అశ్లీల కృత్యాల మాఫియా, టెండర్ల మాఫియా, మర్దర్ల మాఫియా , మనీ లాండ్రింగ్‌ మాఫియా అన్నిటినీ మించి కనిపించని కార్పొరేట్‌ మాఫియా.. ఇన్ని మాఫియా మహా సామ్రాజ్యాల పదఘట్టనలో మన ప్రజాస్వామ్యం మనుగడ ఏమిటి?

మిగిలిన కొన్ని మాఫియాల్లాగా లిక్కర్‌ వ్యవహారం కేవలం ప్రకృతి సంపదనో ప్రజల ధనాన్నో కొల్లగొట్టడంతో ఆగదు. నేరుగా ప్రజల ఆరోగ్య సౌభాగ్యాలను దెబ్బతీస్తుంది. పురుషులు తాగితందనాలాడుతుంటే

Wednesday, December 7, 2011

అస్థిర విశ్వాసం
'నేనోడిపోయి గెలుపొందినాను, గెలిచానని నవ్వనా ఏడ్వనా' అంటూ నలభయ్యవ దశకంలో వచ్చిన పండంటి కాపురంలో పాట వుంటుంది. మనసా కవ్వించకే నన్నిలా అన్న పల్లవితో సాగిన ఆ పాటలోని పై చరణాలు మొన్న శాసనసభలో అవిశ్వాస తీర్మాన సన్నివేశానికి అచ్చంగా సరిపోతాయి. ఈ తీర్మానం రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో స్థిరీకరణ తీసుకువచ్చిందని ఒక కోణంలో అస్థిరత్వాన్ని స్థిరపరచిందని మరో కోణంలో చెప్పొచ్చు. పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ అభివర్ణనే అత్యంత వైరుధ్య భరితంగా వున్న ప్రస్తుత రాజకీయ స్తితికి సరైన నిర్వచనం.
జగన్‌పై కేసుల దర్యాప్తు, సకల జనుల సమ్మె, ప్రస్తుతం తెలంగాణా విభజన సాధ్యం కాదని ప్రధాని వ్యాఖ్య, చంద్రబాబు అస్తులపై దర్యాప్తుకు హైకోర్టు ఉత్తర్వులు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏడాది పూర్తి ఇవన్నీ ఇటీవల కొన్ని ముఖ్యమైన మలుపులు. కాగా అవిశ్వాస తీర్మానం వాటన్నిటికి పరాకాష్ట. అది చెప్పుకోదగినంత తేడాతో వీగిపోయింది గనక విజయం తమదేనని అధికార పక్షమైన కాంగ్రెస్‌ చెప్పుకోవచ్చు. అయితే జగన్‌ 16 మంది ఎంఎల్‌ఎలను తీసుకుపోవడం వల్ల కొట్టిన గండి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అంతర్గత కలహాల చరిత్రలో ఇంత తీవ్రమైన గండి గతంలో చూసి వుండకపోవచ్చు. ప్రజారాజ్యం పార్టీని ముందస్తు జాగ్రత్తతో విలీనం చేసుకోవడం వల్ల మజ్లిస్‌ మద్దతు వల్ల గండం గడిచి గట్టెకిని గండి మాత్రం పూడదు. పైగా రేపెవరైనా మరో గండి పడితే విజేత చిత్రంలో వలె ఆదుకోవడానికి మరో మెగాస్టార్‌ కూడా వుండరు. జగన్‌ శిబిరం మొదట చెప్పుకున్నట్టు అరవై మందిని గాక

Tuesday, December 6, 2011

అవిశ్వాసపర్వంలో ఎవరేమిటి? తర్వాతేమిటి?అనుకున్న విధంగానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే రాష్ట్ర రాజకీయాల పొందికను స్పష్టీకరించేందుకు దోహదం చేసింది.చాలా కాలంగా చాలా విషయాల్లో ఎదురు దాడికి గురవుతున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం తన స్థానాన్ని పునరుద్ఘాటించుకోడానికి, చొరవ చాటుకోవడానికి సందర్భమైంది. రైతు సమస్యలపై తీర్మానం అని చెప్పినప్పటికీ నిజంగా సమస్యలపై కేంద్రీకరణ తక్కువేనని చెప్పాలి. మరోవైపున అవినీతి వ్యవహారాలు, మంత్రివర్గంలో అనైక్యత, రాజకీయ అనిశ్చితి, జగన్‌ వర్గం సవాళ్లు తదితర అంశాలను చర్చించేందుకు కూడా అవకాశం చిక్కింది.
ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అనుకున్న మేరకు బలాన్ని సమీకరించడంలోనూ వున్న వారిని పూర్తిగా నిలబెట్టుకోవడంలోనూ విఫలమైనప్పటికీ- దాదాపు ఇరవై మంది సభ్యులు పాలకపక్షం నుంచి విడగొట్టుకునేట్టు చేయడంలో కృతకృతమైంది. ఇందులో త్యాగం సిద్ధాంతాలు వంటివి ఏమీ లేకున్నా అధికార పక్షంలో రాజకీయ సంక్షోభ వాతావరణం తీసుకురాగలిగింది.అయితే పదే పదే పడగొట్టడం గురించి తాము చేసిన సవాలు సమీపంలోకి కూడా రాలేకపోవడం వారికి ఎదురుదెబ్బ లాటిదే.ఇప్పుడు విప్‌ను ధిక్కరించిన తమ వారిపై వెంటనే అనర్హత వేటు వేయించుకుని ఎన్నికలకు వెళ్లాలన్న ఆతృత జగన్‌ తదితరుల్లో కనిపిస్తున్నది.

బేషరతుగా లీనమై పొరబాటు చేశామని పశ్చాత్తాప పడుతున్న ప్రజారాజ్యం కాస్త బెట్టుచేసి ఏవో హామీలు సంపాదించుకోవడానికి కూడా అవిశ్వాసం అక్కరకు వచ్చింది. ప్రభుత్వం తమ వల్లే నిలబడిందని చెప్పుకునే అవకాశం లభించింది.అయితే అవసర సమయంలో బేరసారాలు చేయడం భవిష్యత్తుపై ఎలాటి ప్రభావం చూపిస్తుందో చెప్పడం కష్టం. మజ్లిస్‌ విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేదు గాని

Saturday, December 3, 2011

అవిశ్వాస పర్వం: టీ కప్పులో తుపాన్లు
ఎట్టకేలకు శాసనసభలో తెలుగు దేశం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌ స్వీకరించి చర్చకు అనుమతించారు గనక ఇక రెండు రోజుల పాటు దృష్టి దానిపైనే కేంద్రీకృతమవుతుంది. దీన్ని బలపరుస్తామని దాదాపు ప్రతిపక్షాలన్ని ప్రకటించాయి. జగన్‌ వర్గం కూడా అదే వైఖరి తీసుకుంది. అయితే జగన్‌ వెనక ఎందరున్నారు, వున్నవారిలో ఎందరు నిలబడతారు అన్నది మాత్రం ఇంకా సందేహంగానే వుంది. ఆ విధంగా ఇది ఆయనకూ విశ్వాస పరీక్ష వంటిదే అనుకోవాలి. ఈ సమయంలో చిరంజీవి శిబిరం( లేదా శాసనసభలో సాంకేతికంగానే మిగిలి వున్న పిఆర్‌పి) అసంతృప్తి టీ కప్పులో తుపానులా ముందుకొచ్చింది. బహుశా చాలా మాసాల తర్వాత రద్దయిన పిఆర్‌పి వునికిని ప్రత్యేకంగా చూపించిన సందర్భమిది. దీన్ని అలుక ఆసంతృప్తి ఆగ్రహం ఇలా ఏ పేరుతో పిలిచినా పెద్ద తేడా లేదు. వీటన్నిటినీ కలిపినా మాజీ ప్రజారాజ్య నేతల బాధను పూర్తిగా వ్యక్తం చేయలేవు. అయితే వారికి వున్న అవకాశాలేమిటనే ప్రశ్న అంతకన్నా ముఖ్యమైంది.చిరంజీవి పార్టీని లీనం చేయడమే అనివార్య పరిస్థితుల్లో తన వెనక వున్నవారిని తనే నాయకుడుగా మిగలడానికి చేసిన పని. ఇప్పుడు జగన్‌ వెనక వున్న వారే పాలక పక్షం ఆకర్షణలో లాగేయబడుతుంటే ఉనికిని వదులుకున్న పిఆర్‌పి చేయగలిగింది స్వల్పం. కాకుంటే ఏ కారణంతో లీనమైనారో ఆ పరీక్షా సమయం వచ్చింది గనక సన్నివేశానికి తగినట్టు బెట్టు చూపించి మెగాస్టార్‌ రక్తి కట్టించారు. ఎలాగూ కాంగ్రెస్‌తో రాజీకి రాకపోతే జగన్‌ విషయంలో జరిగిందే తమ పార్టీ విషయంలోనూ జరుగుతుందని ఆయనకు బాగా తెలుసు. గులాం నబీ ఆజాద్‌ తప్ప ఇతర పార్టీల నాయకులెవరూ చిరంజీవితో మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే కారణమదే.అలాగే టిఆర్‌ఎస్‌ నేతలు గాని, కోదండరామ్‌ గాని పిలుపునిచ్చినా కాంగ్రెస్‌ సభ్యులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి ముందుకు రాలేదు. కనక అవిశ్వాసం నెగ్గే అవకాశాలు దాదాపు కనిపించడం లేదనే చెప్పాలి. కనీసం ఈ పేరుతో ప్రజా సమస్యలపైనైనా సమగ్ర చర్చ జరిగితే పదివేలు. అయితే సాధారణంగా ఇలాటి చర్చల్లో రాజకీయాలే ప్రధానమై సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రధానమై పోవడం కద్దు. ఖచ్చితమైన ముగింపు సోమవారం. అయితే ఈ తీర్మానం వీగిపోయినా అది ప్రభుత్వానికి గొప్ప సుస్థిరత తెస్తుందని అనుకోవడానికి లేదు.