Pages

Tuesday, November 29, 2011

రాష్ట్ర రాజకీయాల్లో తాజా మలుపులుఊహించనివి కాకున్నా రాష్ట్ర రాజకీయాల్లో తాజా మలుపులు చాలానే వున్నాయి. ఎవరి కోణం నుంచి వారు మాట్లాడినా ఎవరూ కాదనలేని వాస్తవాలూ కొన్ని వున్నాయి. ఏ రాజకీయ పార్టీ పెద్దగా ఆనందించే పరిస్తితి ఇప్పుడు లేదన్నది మొదటి విషయం. వ్యక్తిగతంగా ఏడాది పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొంచెం సంతోషించవచ్చునేమో గాని అసలు సవాళ్లు ఇప్పటి నుంచే మొదలవుతాయని ఆయనకు బాగా తెలుసు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలన అని నన్ను వ్యాఖ్యానం అడిగినప్పుడు ఆయన గురించి చెప్పొచ్చు గాని పాలన అనడానికేమీ లేదని చెప్పాను. ఇక ముందైనా ఆ స్థితి మారుతుందేమో చూడాలి. కాకపోతే ఆయన నిలదొక్కుకోవడానికి సీనియర్‌ మంత్రులెవరూ సహకరించడం కాంగ్రెస్‌ సంసృతిలో జరగని పని. కనక ఆయన పాట్లు ఆయన పడుతున్నారు .ప్రచారానికి కోట్టు పెడుతున్నారు. పనులు జరిగినా జరక్కున్నా పథకాల జాతర సాగిస్తున్నారు.ఈ సమయంలో తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ఆలోచన చేస్తున్నా అది నెగ్గే అవకాశం లేదు. తద్వారా ప్రభుత్వాన్ని వెన్నాడే అస్థిరత్వం పోయిందని చెప్పుకునే అవకాశం కలగవచ్చు. సభ బయిట సమీకరణలు ఎలా వున్నా సభలో మాత్రం జగన్‌ వర్గం సవాలు ఉధృతి తగ్గిపోవడం కనిపిస్తున్నా వాస్తవం.ఇప్పుడే స్పీకర్‌ కూడా మూకుమ్మడి రాజీనామాలను తిరస్కరించి సంబంధిత సభ్యుల నెత్తిన పాలు పోశారు. వీటిని ఆమోదిస్తారని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు కూడా. పార్టీలు మార్చిన, పట్టు పట్టిన సభ్యుల రాజినామాలనే ఆయన ఆమోదించినట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో స్పీకర్‌ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించే వారు పదే పదే రాజీనామాలను ప్రయోగించే తమ వైఖరిని కూడా ప్రశ్నించుకోవలసి వుంటుంది.ప్రజలకు ఏ మేలు చేయని రాజినామాలు ఉప ఎన్నికలలో మునిగి తేలడం వ్యర్థ ప్రక్రియ మాత్రమే.ఇప్పుడైనా పార్టీలు ప్రజల సమస్యలపై చర్చిస్తే మేలు. చివరగా పార్లమెంటులో బిజెపి కాంగ్రెస్‌లు టిఆర్‌ఎస్‌కు సహకరించే అవకాశం మాయమైంది. నిజానికి బిజెపి టిఆర్‌ఎస్‌ వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయి. జెఎసి భారం తనే మోయడానికి కూడా టిఆర్‌ఎస్‌ సిద్దంగా లేదు.ఏతావాతా ఎన్నికల కోసం ఎదురు చూడటమే జరిగేట్టు కనిపిస్తుంది.

చిల్లర బతుకులు ఛిద్రం


ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, ఉపాధి రాహిత్యం వంటి సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే పాలకుల చర్యలన్ని బతుకులను మరింత చితగ్గొట్టేవిగా వుంటున్నాయి. పెన్షన్‌ సంస్కరణలు, చిల్లర వ్యాపారంలో వాటికి ద్వారాలు తెరవడం పరిస్తితిని మరింత దిగజార్చడానికే దారి తీయడం అనివార్యం. 2004 ఎన్నికల ప్రణాళికలో చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను ప్రవేశపెడతానని ప్రకటించిన బిజెపి ఎన్‌డిఎ కూడా ఇప్పుడు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయంటే పరిస్తితి తెలుస్తుంది.
మధ్యతరగతి ఉద్యోగులు జీవితమంతా శ్రమించి నిల్వ చేసుకున్న పెన్షన్‌పై అనేక విధాల దాడి చేయడమే గాక దాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌కు మళ్లించడానికి నిర్ణయించడం, అందులోనూ విదేశీ పెట్టుబడులను అనుమతించడం దారుణమైంది. ఆ దె బ్బ నుంచి కోలుకునేలోగానే చిల్లర వ్యాపారంలో వాల్‌మార్ట్‌ వంటి బహుళ జాతి తిమింగళాలను స్వాగతించాలని నిర్ణయించారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికులకు స్వయం ఉపాధి కలిగిస్తున్న ఈ రంగంలో వాటిని రానివ్వడం అత్యంత వినాశకరమైన నిర్ణయం.ప్రస్తుతం వున్నదే ఉపాధి రహిత అభివృద్ధి. ఇందులో యాభై శాతం వరకూ స్వయం ఉపాధి వుందని కేంద్ర గణాంక శాఖ లెక్కలు. కొత్తగా ఉపాధి కల్పించకపోగా వున్నది కూడా హరించుకుపోవడానికి కేంద్రం నిర్ణయం దారితీస్తుంది.ముప్పయి శాతం సరుకులు దేశంలోనే చిన్న మధ్య తరహా సంస్థల దగ్గర తీసుకోవాలనే నిబంధన ఒక రక్షణగా చెప్పారు. అయితే అది దేశీయ సరుకులకే పరిమితం కాదని తర్వాత వివరణ

Thursday, November 24, 2011

అమానుష రాజకీయ బంధాల అనివార్య పరిణామం

మల్లోజుల కోెటీశ్వరరరావు అలియాస్‌ కిషన్‌జీ జంగల్‌ మహల్‌ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందడం సహజంగానే మీడియాలో పతాకశీర్షికలనాక్రమించింది. దీనిపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. కరీం నగర్‌లో ఆయన పుట్టిన వూరు కన్నవారు తదితర వివరాలతో పాటే మావోయిస్టు అగ్రనాయకుడుగా ఆయన పాత్రను కూడా అభివర్ణించే విశేషాలు అనేకం వచ్చాయి. కొన్ని పత్రికలు దీనిపైకథనాలు,వ్యాసాలు గుప్పించాయి. మావోయిస్టులతో చేతులు కలిపి మార్క్సిస్టు పార్టీని, వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అనేక కుట్రలు సాగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తుంచేసినట్టుగానే మాట్టాడారు. నిజానికి అధికారంలోకి రావడానికి గాను మావోయిస్టుల దాదులకు హత్యాకాండకు వత్తాసు నిచ్చిన ఆమె ముఖ్యమంత్రి కాగానే వారికి హెచ్చరికలు సవాళ్లు చేయడం మొదలు పెట్టారు.మావోయిస్టులు కూడా తమ పాత బంధాన్ని మర్చిపోయినట్టు మమత వర్గ స్వభావం గురించి వ్యాఖ్యానాలు ఆరంభించారు.అంటే వారి మధ్య రాజకీయ బంధం ఎందుకు ఏర్పడిందో ఆ అవసరం తీరిపోయిందన్న మాట. ఈ అమానుష బంధం అనివార్యంగా కిషన్‌జీ కాల్చివేతకు దారి తీసిందనేది ఇక్కడకాదనలేని వాస్తవం. బెంగాల్‌ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సూర్యకాంత్‌ మిశ్రా తన స్పందనలో కిషన్‌జీని ప్రాణాలతో పట్టుకుని వుంటే బాగుండేదని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాననని అన్నారు. ఈ ఒక్క ఘటన వల్ల మావోయిస్టుల ప్రమాదకర వ్యూహాలలో పెద్ద మార్పు వస్తుందని తాము అనుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే సిపిఎం ఏనాడూ మావోయిస్టు సమస్యకు బూటకపు ఎన్‌కౌంటర్లు లేదా కాల్చివేతలు మార్గమని భావించలేదు.
వ్యక్తిగతంగా కిషన్‌జీ నేపథ్యం ఏమైనప్పటికీ ఆయన మావోయిస్టు మారణ యంత్రంలో కీలక పాత్రధారిగా పనిచేశాడు. గనక ఆ కోణంలోనే అర్థం చేసుకోవలసి వుంటుంది. కిషన్‌జీ మృదు స్వభావం, కవితా హృదయం, సాహసికత వగైరాలపై ఆయన అభిమానులు అనేకం చెప్పారు. దేశ ప్రజలకు ఆయన గురించి బాగా పరిచయమైంది మాత్రం

Wednesday, November 23, 2011

దర్యాప్తులు, ద్వంద్వనీతులు

ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంతోషించే తరుణం. ఇప్పుడే ఆయనకు ప్రధాన ప్రత్యర్థులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉభయులూ న్యాయ పోరాటాలు, దర్యాప్తుల వ్యవహారంలో చిక్కుకోవడం ఒక విచిత్రమైన పరిణామం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం చర్చ కూడా వెనక్కు పోయింది. ఈ ముగ్గురిలో తక్కిన ఇద్దరూ కుమ్మక్కయినట్టు మూడోవారు ఆరోపిస్తుంటారు గాని వాటిని ప్రజలు అంతగా పట్టించుకోరు. అలాటి అవసరార్థపు అదృశ్య అవగాహనలున్నా పెద్ద ప్రాధాన్యతా వుండదు.
తెలుగు దేశం అధినేత ఆస్తులపై దర్యాప్తు జరపాలన్న హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర రాజకీయాలలో కొత్త సంచలనం తీసుకొచ్చాయి. ఇందిరా గాందీ ఎన్నిక రద్దుతో సహా - కోర్టుల తీరు ఎప్పుడూ ఆలాగే వుంటుంది. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగివున్నందున దాని నిర్ణయాలపై ఎవరూ వ్యాఖ్యానించరు. తమ వాదన వినకుండానే విచారణకు ఆదేశాలిచ్చారన్నది ఇక్కడ తెలుగుదేశం ప్రధాన ఫిర్యాదు. సాంకేతికంగా చూస్తే జగన్‌ కేసులోనూ సిబిఐ సీల్డు కవరు ఉపయోగించకుండానే నిర్ణయం ప్రకటించినట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా బహుళ సంస్థల ద్వారా ప్రాథమిక దర్యాప్తు జరిపించి అలాగే చెప్పొచ్చు. తెలుగు దేశం నేతలు తమపై విశేష ప్రభావం చూపే ఈ కేసులో జోక్యానికి ముందే ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. స్టేలు తెచ్చుకుంటారన్న విమర్శకు వెరిచి వెనకడుగు వేశారా లేక తేలిగ్గా అంచనా వేశారా? మొత్తంపైన ఈ పరిణామంతో వారిలో కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రాంతీయ సమస్యనుంచి ఎలాగో బయిటపడ్డామన్నంతలో ఇది చుట్టుకుందన్న దిగులూ వెంటాడుతుంది.సుప్రీం కోర్టు ఆదేశాలు అనుకూలమా కాదా అన్నదానిపైన కూడా భిన్నమైన అంచనాలున్నాయి.

ఇప్పటికే కొనసాగుతున్న ఒఎంసి, ఎమ్మార్‌, జగన్‌ కేసుల దర్యాప్తుల్లో చాలా అంశాలు వస్తున్నాయి. దర్యాప్తు సాగేకొద్ది

Sunday, November 20, 2011

కొత్త మలుపుల మధ్య కొలువు తీరే చట్టసభలు


జగన్‌ ఆస్తులపైన గాలి జనార్ధన రెడ్డి మైనింగ్‌ అక్రమాలపైన దర్యాప్తు సాగిస్తున్న సిబిఐ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపైన కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నది. హైకోర్టు ఆదేశాలు ఆకస్మికంగానూ అనూహ్యంగానూ రాష్ట్ర రాజకీయాలలో కొత్త సంచలనం సృష్టించాయి. ఇందిరాగాందీ ఎన్నిక రద్దు నుంచి ఇప్పటి వరకూ కూడా న్యాయస్థానాల ఆదేశాలు తీర్పులు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజా జీవితంలో ప్రభుత్వాల నిర్వహణలో కీలక పాత్రధారులైన నాయకులపైన ఆరోపణలు వచ్చినపుడు విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చడం అవసరమే. ఈ విషయంలో కోర్టుల ఆదేశాల వరకూ ఎవరూ వేచి వుండనవసరం లేదు న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగివున్నందున దాని నిర్ణయాలపై వ్యాఖ్యానించడం అరుదుగా తప్ప జరగదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాలు ౖ తీవ్ర ఆరోపణలు విమర్శలున్న మాట నిజం. రెండు సార్లు ఆయన ఎన్నికల్లో దెబ్బ తినడం వెనక ఈ ప్రభావాలు కూడా వుంటాయి. అయితే న్యాయశాస్త్ర పరంగా వీటిపై గతంలో కాంగ్రెస్‌ నాయకులు అనేక సార్లు కేసులు వేసి విఫలమైనారని తెలుగు దేశం నేతల వాదన. అది నిజమే అయినా ఇప్పుడు న్యాయ స్థానమే ఇలాటి ఆదేశాలిచ్చింది గనక ఆహ్వానించడం తప్ప గత్యంతరం లేదు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తారా లేదా అన్నది వారి అంచనాలపైన ఆలోచనల పైన

Friday, November 18, 2011

పునరాలోచనలో జగన్‌ వర్గీయులురెండేళ్ల కాలంలో జగన్‌ వర్గం బలహీనపడి పోవడం ఇప్పుడు దాచినా దాగని సత్యంలా కనిపిస్తున్నది. 150 మంది సంతకాలతో మొదలైన ఆయన యాత్ర ఇప్పుడు అందులో రెండంకెలకు పరిమితమై పోయినట్టే చెప్పాలి. జయసుధ అయితే దాగుడుమూతలు లేకుండా ముఖ్యమంత్రిని బలపరుస్తున్నట్టు స్పష్టంగా చెప్పేశారు. బాగా గట్టిగా నిలబడేవారిగా పేరొందినవారు కూడా స్పీకర్‌ నిర్ణయానికి కట్టుబడతామన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోయే స్తితి వుంటేనే బలపరుస్తామని వారిలో ఒకరన్నారు. స్పీకర్‌ కార్యాలయం ఈ ఎంఎల్‌ఎలు రాజీనామాల విషయంలో పట్టుదలగా లేరనీ పిలిస్తే రావడం లేదనీ కథనాలు విడుదల చేసినా ఒక్కరంటే ఒక్కరు నేరుగా ఖండించలేదు(ఇది రాసే సమయానికి) ఇదంతా నిస్పందేహంగా వూపు తగ్గడాన్నే సూచిస్తుంది. నా దయాదాక్షిణ్యాల వల్ల ప్రభుత్వం బతుకుతున్నదనీ మొదట, ఇంకా బతకనిస్తే దేవుడు క్షమించడాని తర్వాత వ్యాఖ్యానించిన జగన్‌ క్రమేణా తన బలం చాలదని కూడా బహిరంగంగానే చెప్పారు.అయినా తమ వెంట రాజీనామా చేసిన వారే గాక మొత్తం అరవై మంది వరకూ వున్నారని ఆ పార్టీ నేతలు సర్వసాధారణంగా చెబుతూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు వాస్తవం కాకపోగా వున్నవారంతా కూడా నిలబడటం లేదని అర్థమవుతున్నది.తెలుగుదేశం వైఖరి ఇందుకు కారణమని వైఎస్‌ఆర్‌ పార్టీ వారు చేసే వాదన తర్కవిరుద్ధమైంది. తమ ప్రధాన ప్రత్యర్థి తమ వ్యూహం అవసరాల మేరకు నడుచుకోలేదని చెప్పడం రాజకీయాల్లో చెల్లదు. జగన్‌పై కేసుల దర్యాప్తు వగైరాలే ఇందుకు కారణమై వుండాలి. జగన్‌ వర్గం మెత్తబడిన తర్వాత తెలుగుదేశం అవిశ్వాసం రాజకీయ ప్రదానమే తప్ప పడగొట్టేంత దృశ్యం వుండదు. కనక ప్రస్తుతానికి కిరణ్‌ కుమార్‌కు గండం లేనట్టేనా?

Monday, November 14, 2011

ఇక న్యాయస్థానాలు, దర్యాప్తుల పోరాటం?మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవాద్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తు జరిపించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడం ఆసక్తికరమైన పరిణామం. ప్రజా జీవితంలో పారదర్శకత న్యాయస్థానాల పట్ల గౌరవం కోణాల నుంచి ఈ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సి వుంటుంది. తెలుగు దేశం నేతలు కూడా ఆహ్వానిస్తూనే సుప్రీం కోర్టుకు వెళ్లడంపైన కూడా ఆలోచనలు చేయడం సహజమే. ఇప్పటికే జగన్‌ గాలి జనార్థనరెడ్డి కేసుల దర్యాప్తుతో ఉత్కంఠ భరితంగా వున్న రాజకీయాలలో మరో దర్యాప్తు ప్రవేశించింది. గత రెండేళ్ల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలు రకరకాలైన పోరాటాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మొదట ఎన్నికల పోరాటం. వైఎస్‌ మరణానంతరం అధికార పక్ష అంతర్గత పోరాటం. తర్వాత ప్రాంతీయ పోరాటం. ఇప్పుడు న్యాయస్థానాలు దర్యాప్తుల పోరాటం మొదలైనట్టు కనిపిస్తుంది. మంత్రి శంకర రావు 2010 సెప్టెంబరులో కేసు దాఖలు చేస్తే 2011 జులై వరకూ వాదోపవాదాలకు అవకాశమిచ్చిన నేపథ్యంలో అసలు తమ వాదనలు వినకుండానే ఆదేశాలివ్వడం సహజ న్యాయానికి విరుద్ధమని తెలుగు దేశం వాదిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులు ఉన్నత న్యాయ వ్యవస్థ ఏమంటాయో

Sunday, November 13, 2011

ప్రధాని ప్రకటన - ఒక ఘట్టానికి ముగింపు?


ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దాదాపు సూటిగానే చేసిన వ్యాఖ్యలపై  ఎవరు ఎలా స్పందిస్తారు అన్నది వారి వారి వైఖరిపై ఆధారపడి వుంటుంది. రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని వెంటాడిన రాజకీయ ప్రతిష్టంభన, అన్ని జీవిత రంగాల్లోకి చొరబడిన స్తబ్దత, అచేతనత్వం నిస్సందేహంగా కేంద్రం సృష్టించినవే.
ప్రధాని చెప్పిన మాటలు కొత్తవేమీ కాదు. ఎవరికీ తెలియనవీ కావు. 1.తెలంగాణాపై తీసుకునే నిర్ణయానికి జాతీయ ప్రభావం వుంటుంది.2.ప్రశాంత పరిస్తితులు నెలకొనకుండా పరిష్కారం చేయలేము 3. దీనిపై జాతీయ సంప్రదింపులు అవసరం 4.పరిష్కారం పెనంమీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా వుండకూడదు. - ఇవి ఆయన చెప్పిన దానిలో నాలుగు అంశాలు. అంటే రాష్ట్ర విభజన గాని,రాజ్యాంగ ఏర్పాటు గాని చేయబోవడం లేదని దీన్నిబట్టి స్పష్టం అవుతున్నది. గత వారంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు పరిపరివిధాల మాట్లాడిన దాన్నే ప్రధాని క్రోడీకరించారని చెప్పాలి. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్రంతో చెలగాటమాడడం ప్రజలను అనిశ్చితికి గురి చేయడం కేంద్రం దోషమైతే దానిపై కొండంత నమ్మకంతో వుండటం ఇతరుల దోషం. ప్రధాని ప్రకటన తర్వాత టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.సి.ఆర్‌. శాపనార్థాలు పెట్టారు గాని తమకేవో సంకేతాలు అందతున్నాయని ఎప్పటికప్పుడు ఎందుకు చెప్పారనేదానికి ఆయన కూడా సమాధానం చెప్పవలసే వుంటుంది. నవంబరులో విభజన జరిగిపోతుందని ప్రకటించిన కోదండరామ్‌ కూడా ఆ పొరబాటుకే జవాబుదారి కాకతప్పదు.
నా వరకు నేను 2009 డిసెంబరు 10న ఎన్‌టివి చర్చలోనే అంతకు ముందు రాత్రి చిదంబరం చేసిన ప్రకటన పరిమితులు చెప్పాను, అది అంతిమ వాక్యం కాదనీ అన్నాను. దేశంలో పాలకవర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ తీరుతెన్నులు అలానే

స్పీకర్‌ నిర్ణయం సామూహికంగా వుండకపోవచ్చు
నాగం జనార్థనరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి రాజీనామాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆమోదించడం వూహించదగిందే. ఈ రాజీనామాలు తెలుగు దేశం పార్టీ నుంచి నిష్క్రమణల ఫలితాలు, ఫిరాయింపుల చట్టంతో ముడిపడినవి కూడా. ఇవి ఆమోదించినంత మాత్రాన మిగిలిన 80 మందివి కూడా గుండుగుత్తగా ఒప్పేసుకుంటారని కాదు. ప్రాంతీయ సమస్యపైన ఉద్వేగాలతో రాజీనామా చేసిన వారందరివీ ఒప్పుకుంటే సభలో మూడో వంతు వరకూ ఖాళీ అయిపోతుంది. ఇందులో టిఆర్‌ఎస్‌ వారు రాజీనామా చేసి మళ్లీ గెలిచి వచ్చారు. వారు కొత్తగా నిరూపించవలసింది ఏమీ లేదు.కాంగ్రెస్‌ తెలుగు దేశం సభ్యులు రాజీనామాలిచ్చినా వాటికోసం పట్టుపట్టకపోవచ్చు.ఇక జగన్‌ వర్గం 29 మంది పరిస్థితి కీలకమవుతుంది. వీరు కూడా తటపటాయింపులో పడినట్టే. తమ రాజీనామాలతో ప్రభుత్వం అస్థిరత్వానికి గురవుతుందన్న అంచనా ఆనాడు వుండొచ్చు గాని అలా జరగలేదు. జగన్‌ పై కేసుల దర్యాప్తు వగైరాల వల్ల ఒక విధమైన ఆత్మరక్షణ స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం కొంత వరకూ నిలదొక్కుకుంది. ప్రాంతీయ కల్లోలాలు కూడా కొంతైనా సర్దుకున్నాయి.ఇలాటప్పుడు రాజీనామాల పేరిట అధికారానికి దూరమయ్యేబదులు క స్పీకర్‌ పేరిట తప్పించుకోవచ్చు. జగన్‌కు బాగా సన్నిహితులైన అర డజను మందిని మినహాయిస్తే తక్కిన వారంతా ఈ మార్గానికే మొగ్గుచూపే అవకాశం వుంది.ఇక మనోహర్‌ సామూహికంగా రాజీనామాలు ఆమోదించేసి కొత్త దృష్టాంతాలు సృష్టించరనే అనుకోవాలి. ఆయన నిర్నయాన్ని ముందస్తుగా నిర్దేశించే అవకాశం ఎవరికీ వుండదు గనక వేచి చూడవలసిందే.

Friday, November 11, 2011

జగన్‌పై దర్యాప్తులో మలుపులు, మరకలుజగన్‌ సంస్థల విలువను డెలాయిట్‌ కంపెనీ పెంచి చూపించడానికి వారి ఆడిటర్‌ విజయసాయి రెడ్డి ఒత్తిడి లేదా అభ్యర్థన కారణమని సిబిఐ ముందు సంస్థ ప్రతినిధి సుదర్శన్‌ వాంగ్మూలమిచ్చారని మీడియా కథనం. ఇది సిబిఐ ఎలా లీక్‌ చేస్తుందని విజయ సాయి ప్రశ్న. అంతేగాక తాను అలా కోరలేదని ముఖాముఖి చర్చకు సిద్దమని కూడా సమర్థించుకుంటున్నారు. ఈ లేఖపై స్పందించాల్సింది సిబిఐ తప్ప ఇతరులు చెప్పగలిగింది లేదు. అయితే అదే లేఖలో ఆయన వ్యాపారాలలో విలువలు పెంచి చూపించడం మామూలేనని కూడా పేర్కొనడం గమనించదగ్గది.అదే నిజమైతే అప్పుడు ఇంత స్పందన అవసరముండేది కాదు. రాజకీయ కోణం నుంచి ఖండించడమే ఇక్కడ ముఖ్యం. అమెరికాలో ఎన్రాన్‌ కుంభకోణం నుంచి మన సత్యం కుంభకోణం వరకూ ఆడిటర్ల పాత్ర చాలా కీలకమని వారే ఎక్కువ విచారణకు గురయ్యారని గుర్తు చేసుకుంటే ఇంత చర్చ అవసరమనిపించదు. ఇక సిబిఐ లీక్‌ చేయడానికి వస్తే- గాలి కేసులో జగన్‌ను సాక్షిగానే పిలిచారని ఆయనకు ఏమీ కాదని ఇదే వైఎస్‌ఆర్‌ పార్టీ వారు అదేపనిగా చెప్పుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యమని అంత నమ్మకం దేనికని నేను చాలా చర్చల్లో ప్రశ్నించాను. ఆ విచారణ తర్వాత ఆయన బయిటకు వచ్చి చెప్పిన దానిపైనా అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇడి కూడా విచారించబోతున్నది. వ్యాపార పరమైన ఆర్థిక పరమైన లావాదేవీలలో అవకవతవకలు అక్రమాలకు రాజకీయ మద్దతుకు సంబంధం లేదని ఎవరైనా ఒప్పుకోవాలి. జగన్‌ వర్గం తరచూ రామోజీని లేదా రాధాకృష్ణను ప్రస్తావిస్తుంటుంది. కాని ఇక్కడ అధికారం ముఖ్యమంత్రి స్థానం అన్నవి కీలకంగా వున్నాయని గమనిస్తే ఈ కేసు ప్రత్యేకత తెలుస్తుంది.దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప ఇతరుల తప్పులు ఎత్తి చూపినంత మాత్రాన మరొకరి తప్పులు ఒప్పుగా మారవు. ఇప్పుడు విజయమ్మ కేసులో కోర్టు ఏదైనా చేయొచ్చు. అలాగే మార్గదర్శి విషయంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలను ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు అవి ఏ స్తితిలో వున్నాయో తెలియదు. కార్పొరేట్‌ ప్రపంచ అక్రమాలపై ఇదే బ్లాగులో చాలా ప్రస్తావనలున్నాయి.వైఎస్‌పై ఎవరికి ఎంత అభిమానమున్నా ఆ హయాంలో జరిగిన అవకవతవకలను విచారించడానికి అది ఆటంకం కానవసరం లేదు. ఇదంతా కక్ష సాధింపుగానే కొట్టేయడమూ కుదరదు. అదే నిజమైతే నిజమని రుజువైతే మరీ మంచిది. కాని అ సంగతి చెప్పాల్సింది ఆయన అనుయాయులు కాదు, కేసు నడిపిస్తున్న న్యాయస్థానాలూ, విచారిస్తున నిఘా సంస్థలూ.

Thursday, November 10, 2011

ఇక ఎస్సార్సీ ముచ్చటఈ రెండు రోజులలోనూ కేంద్ర కాంగ్రెస్‌ తరపున ఇద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడినప్పటికీ సారాంశంలో పెద్దగా తేడా లేదు.రాష్ట్ర విభజన తెలంగాణా ఏర్పాటు జరిగిపోతుందన్నట్టుగా కొందరు చేసిన వూహాగానాలు జోస్యాలు నిజం కావడం లేదని క్రమంగా స్పష్టమవుతున్నది. ఆ విషయం అలా వుంచి రాష్ట్ర భవిష్యత్తుపై ఎలాటి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా కనిపించడం లేదు. డి.శ్రీనివాస్‌తో లేదా మరొకరితో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయొచ్చన్న మాట మాత్రం కాంగ్రెస్‌ ఎంపిలు, ఎంఎల్‌ఎలు జనాంతికంగా చెబుతున్నారు. అందుకు ఒప్పుకునేది లేదంటూనే అసహాయత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తీవ్రమైన చర్యలేమీ తీసుకుంటామని వారిలో ఎక్కువ మంది చెప్పడం లేదు.
ఇంతకూ కాంగ్రెస్‌ ఎస్‌ఆర్‌సి గురించి చెప్పే మాటలు తెలంగాణా సమస్యకు వర్తిస్తాయా లేదా ? ఈ ప్రశ్నకు ఆ మాట్లాడిన నాయకులు కూడా జవాబు చెప్పలేరు. కావాలనే అంత గందరగోళంగా వ్యాఖ్యలు చేశారు. ఆజాద్‌ చెబుతాడని వాళ్లన్నారు. అయితే ఆజాద్‌ మాత్రం ప్రభుత్వం తరపున హౌం మంత్రి చేసే ప్రకటనే కాంగ్రెస్‌ అధికార వైఖరి అన్నారు.అంటే ఇప్పటికీ ఇన్ని అనర్థాలు అనిశ్చితుల తర్వాత కూడా కాంగ్రెస్‌ రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ వైఖరిని చెప్పబోవడం లేదన్నమాట.గత అరవై ఏళ్లలో అన్ని చోట్లా అన్ని సందర్బాల్లో ఆ పార్టీ ఇలాగే ప్రవర్తించింది. ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో మరింత ఎక్కువగా. ఇదమిద్దంగా ఏమీ చెప్పకుండా డాటేయడమే కాంగ్రెస్‌ మార్కు రాజకీయమన్నమాట. ఈ దశ లో దీనిపై ఇంతకన్నా మాట్లాడాల్సింది లేదు. కాకుంటే కేంద్రం మీద అపారమైన నమ్మకంతో తేదీలు ప్రకటించిన వాళ్లు, గడువులు ప్రకటించిన వాళ్లు కూడా ఈ విషయంలో కాస్తయినా అత్మ విమర్శ చేసుకుంటారా?
చివరగా మాయావతి విషయం. ఇన్నేళ్లు పాలించినప్పుడు తీసుకోని నిర్ణయం ఎన్నికల ప్రాంగణంలో ఎందుకు వచ్చిందంటే ఎన్నికల కోసమే! మమతా డార్జిలింగ్‌(గూర్ఖాలాండ్‌)విషయంలో ఎన్నికల ముందు తర్వాత చేసింది ఇంతకన్నా భిన్నమేమీ కాదు. ఇప్పుడు ఎస్‌ఆర్‌సి వేసేస్తారని కాదు.మరో ఏడాదో ఆరు నెలలో దాని చుట్టూ చర్చ తిప్పుతారంతే. ప్రాంతీయ కమిటీకి గాని ఎస్సార్సీకి గాని తెలంగాణా నిర్ణయంతో సంబంధం లేదని నమ్మబలుకుతుంటారు కూడా. ఈ గజిబిజి రాజకీయ అనిశ్చితికి ప్రజల ఆందోళనకు ఎలా కారణమవుతుందనేది వారికి ఏ మాత్రం అవసరం లేదు. అందుకే ప్రాంతాల పేరిట రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి.

మరో చరిత్రారంభం...

. కార్పొరేట్‌ స్వాప్నికుల కలలు కల్లలై కల్లోలాలు చుట్టుముడుతున్నాయి. చరిత్రాంతం భాష్య కారుల నోళ్లు మూత పడుతున్నాయి. మహా కథనాల మహా ప్రస్థానం మళ్లీ మొదలవుతున్నది. జోస్యాలన్ని అపహాస్యాల పాలవుతున్నాయి. విత్త విపణి విన్యాసాలన్ని వీగిపోతున్నాయి. ప్రతిఘటననూ ప్రజా చైతన్యాన్ని అపహాస్యం చేసిన అపర మేధావుల తలలు వాలిపోతున్నాయి. ఇవన్నీ నిజమేనా అనే సందేహ మందేహులుంటూ వాల్‌ స్ట్రీట్‌ దృశ్యాలు సమాధానం చెబుతున్నాయి.అక్కడిదాకా ఎందుకంటే కటకటాల్లో విఐపి హౌదా పొందిన గాలి జనార్ధనరెడ్డి ఇనుప సత్యాలను చెప్పడానికి సిద్దంగా వున్నాడు.అక్కడికీ అనుమానం తీరకపోతే తమిళ పొన్ను కనిమొళి కరుణార్ద్ర ఘట్టం కళ్లకు కడుతున్నది. సత్యం రామలింగరాజు స్వానుభవ కవిగా అందుబాటులో వున్నాడు. విదియ నాడు కనిపించని చంద్రుడు తదియ నాడు తానే కనిపించినట్టు ప్రపంచీకరణ పేరిట మొదలై నిరాఘాటంగా కొనసాగిన నిలువు దోపిడీ నిర్వాకాలకు నిదర్శనాలుగా ఇలాటివి ఎన్నయినా చూపించవచ్చు.ఈ నిలువు దోపిడినే శాశ్వతమని విశ్లేషించిన విపరీత సిద్ధాంత కారులకు సమాధానం వాల్‌స్ట్రీట్‌ నుంచి మంగళవారం భారత కార్మిక వర్గం అఖిల భారత సమ్మె పోరాటం వరకూ ప్రతి చోటా లభిస్తున్నది. చరిత్రాంతం కాదు, సరికొత్త సమర శీల చరిత్రకు అంకురార్పణ జరుగుతున్నది.
అమెరికా ప్రస్తుతానికి ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం వుగ్ర రాజ్యం కూడా గనక- పోలీసు తలారి న్యాయమూర్తి కూడా గనక - అక్కడ పరిణామాలకు ప్రత్యేక ప్రాధాన్యత. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రపంచమంతటా ప్రచార ప్రకంపనలే. అయితే అమెరికా ప్రపంచ దేశాలను వరుసగా అక్రమిస్తుంటే లేదా అక్కడే వాల్‌ స్ట్రీట్‌ ను అక్రమించడమేమి చిత్రం? ఎవరో ఇస్లామిక్‌ టెర్రరిస్టులు వచ్చి దాడి చేయకుండా ప్రతిచోటా తలదూర్చే ఆ మహాదేశాధినేతలు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ దారుల ధాటికి