Pages

Sunday, April 22, 2012

నిరాధారమైన వూహాగానాలు: నిగూఢమైన అవగాహనలు




గత నెల రోజులలోనూ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని ఆధార రహితమైన కథనాలను కావాలనే రాజకీయ శక్తులు ప్రచారంలో పెడుతున్నాయి.కీలకమైన నాయకులతో నేరుగా మాట్లాడినప్పుడు కాదని ఖండించే కొన్ని అంశాలపైనే తాడూ బొంగరం లేని ్ట ప్రచారాలు జరుగుతుండటం ఎంతైనా బాధ్యతా రహితం.
వాయిలార్‌ రవి ఎందుకు వచ్చాడంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, ఉప ఎన్నికల పోరాటంలో కొంతైనా వూపు నిలబెట్టడానికి అని అందరికీ తెలుసు.ఈ సందర్భంగా ఆయన పర్యటన వల్ల తెలంగాణా సమస్యకు సంబంధించి ఏదో నిర్ణయం జరుగుతుందని కాంగ్రెస్‌ ఎంపిలు అదే పనిగా చెబుతూ వచ్చారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మరో ఆరు నెలల వరకూ ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలో ఎలాటి ప్రకటన వుండబోదని విడిగా మాట్లాడినప్పుడు కొందరు ఎంపిలే చెబుతుంటే మరో వైపు వారి మిత్రులు ఇలా మాట్లాడుతుంటారు. ఇక మంత్రి టిజి వెంకటేశ్‌ వంటి వారైతే ఉప ఎన్నికలలో జగన్‌ గెలిస్తే రాష్ట్రం విభజన అయిపోతుందని వూదరగొడుతున్నారు. ఇది కూడా ఆధారం లేని కథనమే. ఈ ఫలితం జగన్‌ వర్గానికి అనుకూలంగా వుంటుందనే భావన బలంగా వుంది. కాంగ్రెస్‌కు అది ఆందోళన కలిగిస్తున్నది కూడా. అటువంటప్పుడు దాని వల్ల ఏదో నిర్ణయం జరిగిపోతుందని ప్రాంతాల వారిగా భావాలు రెచ్చగొట్టడం తగని పని.
ఈ వూహాగానాల్లో కెల్లా విడ్డూరమైనది కె.చంద్రశేఖర రావు ఉప రాష్ట్రపతి అవుతారనేది. దీన్ని ఎవరు సృష్టించారో తెలియదు గాని బాగానే చలామణిలో

ఉప ఎన్నికలు- ఉభయ కమ్యూనిస్టు పార్టీలు



రానున్న ఉప ఎన్నికలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెరొక మార్గం తీసుకున్నాయన్నది ఇప్పుడు మీడియాలో ఒక చర్చగా వుంది. చాలా కాలంగా జగన్‌,తెలంగాణా విభజన అంశాల చుట్టూనే పరిభ్రమించే మీడియా ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీల గురించిన విషయానికి ప్రాధాన్యత నివ్వడం జరిగిందంటేనే అది ఎన్నికల పొత్తులకు, భిన్నాభిప్రాయాలకు సంబంధించిన సమస్యగా వుంటుంది. ఒకటే పార్టీలో వారు రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా మాట్లాడినా అత్యున్నత స్థాయిలో తగాదాలు పడినా సర్వ సాధారణ అంశంగా నివేదిస్తుంటారు.కాని ి వేర్వేరుగా వున్న రెండు కమ్యూనిస్టు పార్టీలు భిన్నమైన వైఖరి తీసుకుంటే మాత్రం వాటి సైద్దాంతిక నిబద్దతనే ప్రశ్నించే పరిస్తితి వస్తుంది. పరి పరి విధాల వ్యాఖ్యలు వస్తాయి. నిజానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, సిపిఐ కార్యదర్శి నారాయణ తమ మధ్య అంగీకారం కుదరలేదని స్పష్టంగానే ప్రకటించారు. అయినా ఐక్య కార్యాచరణ ఆగదని కూడా గట్టిగా చెప్పారు. అయినా వ్యాఖ్యలు కొనసాగుతూనే వున్నాయి. కాగా నారాయణ సిపిఎం కు ఏదో రహస్య అజెండా వుందని ఆరోపించగా చంద్రబాబు నాయుడు మాత్రం

Sunday, April 8, 2012

ఉప ఎన్నికల ముంగిట్లో వురుములు



ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందని, మధ్యంతర ఎ న్నికలు వస్తాయని వైఎస్‌ఆర్‌ పార్టీ నేత అంబటి రాంబాబు జోస్యం చెప్పడంలో గొప్ప రాజకీయ వ్యూహం వుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఉత్కంఠతో ఎదురు చూస్తూ భవిష్యత్తు పథకాలు సిద్ధం చేసుకుంటున్న ఇతర పార్టీల ముఖ్యంగా కాంగ్రెస్‌ తెలుగు దేశం పార్టీల నేతలను ఇప్పుడే ఆకర్షించడం ఇందులో ఉద్దేశం. అలాటి వారి స్తయిర్యాన్ని మరింత దెబ్బతీసి నిష్క్రమణను వేగిరపర్చాలని జగన్‌ పార్టీ వారు అనుకుంటున్నారు. అప్పుడు ఎన్నికలలో తమకు అనుకూలత పెరుగుతుందని వారి అంచనా. వైఎస్‌ రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించాలని కాంగ్రెస్‌లో అనుకుంటున్నట్టు కథనాలు వచ్చాయి గనక ఇప్పుడే ఎదురు దాడి తీవ్రం చేసి విమర్శలు పెద్దగా రాకుండా నిరోధించాలన్న ఆలోచన కూడా వుండొచ్చు. ఒక వైపున వైఎస్‌ హయాంలో పొరబాట్లు జరగలేదని వాదిస్తూనే మరో వైపున ఆయన కాలంలో మంత్రులకు బాధ్యత లేదా అని తాము చేస్తున్న వాదనలోని అసంగత్వం వారికి అర్తం కాలేదనీ కాదు. ఎదో విధంగా ఎదురు దాడి చేస్తూ ప్రజల్లో ఆదరణను పెంచుకోవడం ఇతర పార్టీల నేతలు చెల్లాచెదురు చేయడం వారి లక్ష్యం. అయితే ఈ అతిధీమాకు కారణం మాత్రం కాంగ్రెస్‌ తీరు తెన్నులే.

అంతర్గత కలహాలతో అట్టుడుకుతున్న అధికార పార్టీ వ్యవహారాలు ఈ వారం మరింత అధ్వాన్న స్తితికి చేరాయి. కాంగ్రెస్‌ నేతలకు మంత్రులకే పరిమితం కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రభావితం చేసే దశకు చేరాయి. అనిశ్చితి, అవినీతి ఆరోపణల విషయంలో హడావుడి ఎంత జరిగినా అంతిమంగా ప్రభుత్వ పరిరక్షణ రాజకీయ ప్రయోజనాల సాధనకే అధిష్టానం తాపత్రయపడుతున్నదని తేలిపోయింది. పైగా ఈ వ్యవహారాలన్ని కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశమంతటి దృష్టినీ ఆకర్షించి పరువు

Thursday, April 5, 2012

పార్టీలో కలహాలు, మీడియాపై ఆగ్రహాలు!



ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య అంతర్యుద్ధం బహిరంగ రాజకీయ సమరంగా మారాక ఆలస్యంగా ఢిల్లీకి రావించిన అధిష్టానం ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం లేదని అందరికీ తెలుసు. ఈ ఇద్దరితో పాటు ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ కూడా కీలకంగా భాగం పంచుకోగా జెడిశీలం కూడా పాలు పంచుకున్నట్టు సమాచారం. వీరు ఏం చర్చించారనేదానిపై వూహాగానాలు చేస్తున్నారే గాని నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలుసని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. బొత్స ఢిల్లీలో మీడియాతో జరిపిన సమావేశంలోనూ అదే ఆరోపణ లేదా అపహాస్యం చేశారు. మీరు ఏదేదో రాసేయడం తప్ప మాకు విభేదాలలు లేవని చెప్పి ఒప్పించేందుకు విఫల యత్నం చేశారు. లిక్కర్‌ మాఫియాపై ఎసిబి దాడులకు సంబంధించి సాగిన సంఘర్షణ ఆఖరుకు సిట్‌ అధిపతి శ్రీనివాసరెడ్డి హఠాత్తుగా బదిలీ చేయడం జరిగిన తర్వాత కూడా ఈ మాటలు నమ్మి వూరుకోవాలంటే ఎలా కుదురుతుంది? అసలు ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అసహనాన్ని వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఆయనే. దర్యాప్తు చేస్తున్న అధికారిని అర్థంతరంగానే గాక అర్థరాత్రి వేళ కిక్‌డ్‌ అప్‌స్టియర్స్‌ తరహాలో ప్రమోషన్‌ ఇచ్చి పంపేస్తే

Monday, April 2, 2012

ఉభయ కమ్యూనిస్టు పార్టీల మహాసభలు



ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ మహాసభలు కొద్ది తేడాతో పూర్తవుతున్నాయి. సిపిఐ అఖిల భారత మహాసభలు పాట్నాలో జరిగాయి. అందరూ వూహించినట్టే సురవరం సుదాకరరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా చాలా పత్రికలు ఛానెళుచండ్ల్ర రాజేశ్వర రావు తర్వాత పాతికేళ్లకు తెలుగు నేత ఎంపిక అని రాశారు.నిజమే. రాజేశ్వరరావు తర్వాత ఇంద్రజిత్‌ గుప్తా ప్రధాన కార్యదర్శి అయ్యారు.ఆయన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో హౌం మంత్రి అయ్యాక బర్దన్‌ ఆ స్తానంలోకి వచ్చి ఇప్పటి వరకూ కొనసాగారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక తర్వాత సిపిఐకి చండ్ర సిపిఎంకు పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శులై నడిపించారు. సుందరయ్య సైద్ధాంతిక విభేదాల కారణంగా 1975లో రాజీనామా చేసినా 1977లో ఎమర్జన్నీ ఎత్తివేత తర్వాతే అధికారికంగా ప్రకటించబడింది. మావోయిస్టు పార్టీకి కూడా చాలా కాలం పాటు కొండపల్లిసీతారామయ్య, చండ్ర పుల్లారెడ్డి వంటి వారే అఖిల భారత నాయకత్వం అందిస్తూ వచ్చారు. ఈ విధంగా అన్ని కమ్యూనిస్టు గ్రూపులకు తెలుగు వారే సారథులు కావడం యాదృచ్చికం కాదు. ఇక్కడ ఉద్యమంలో విభజన తీవ్రతనూ ఇక్కడి నేతల ప్రత్యేకతను చెబుతుంది. ఇప్పుడు సుధాకర రెడ్డి ప్రధాన కార్యదర్శి కావడం కూడా ఆ వారసత్వంలో భాగమే అనుకోవాలి. బి.వి.రాఘవులు కూడా పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ముఖ్య పాత్ర వహిస్తున్నారు..ఏమైనా

Sunday, April 1, 2012

ఆత్మహత్యల ఆదర్శీకరణ అవాంఛనీయం


ఇప్పుడు తెలంగాణా ప్రాంతంలో ఆత్మహత్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆత్మహత్యలు వద్దంటూ టిఆర్‌ఎస్‌ తదితర పార్టీల నాయకత్వంలో ఒక ప్రదర్శన జరిగింది. ఒక టీవీ ఛానెల్‌ చర్చ నిర్వహించింది. హౌం మంత్రి చిదంబరం కూడా ఈ సమస్యను ప్రస్తావించారు. ఈ ఆత్మహత్యలకు ఎవరు కారణమనే దానిపైన, ఎవరు ఏమన్నారనేదానిపైన కూడా వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి తనకు ఆపాదించిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఆత్మహత్యలపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయంగా సామాజికంగా వాటి మూల కారణాలు శోధించి నిరోధించడం అన్నిటికన్నా ముఖ్యం. ఉప ఎన్నికల ఫలితాలు గమనించిన వారంతా ఉద్వేగాలు ఉద్రేకాలు కాస్త తగ్గుముఖం పట్టి సాధారణ రాజకీయ వాతావరణం ఏర్పడుతున్నదని భావించిన తరుణంలో ఈ పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. ఒక ప్రతికూల పరిణామం. చనిపోయిన వారి పట్ల సానుభూతి తెల్పుతూనే రాజకీయ ఉద్యమాలలో ఆత్మహత్యల చర్చ కేంద్ర బిందువుగా మారకుండా జాగ్రత్తపడాల్సి వుంటుంది. ఈ ధోరణి కేవలం తెలంగాణా సమస్యకే పరిమితం కాదు గనక రేపు మరో సందర్బంలోనూ ఇలా జరగొచ్చు. అది కుటుంబాలకు సమాజానికి కూడా శ్రేయస్కరం కాదు.కనక పదే పదే అసహాయ భావనతో ఆత్మహత్య చేసుకున్న వారిని ఆదర్శీకరించే వైఖరి రాకుండా ఆయా సంఘాల , పార్టీల నాయకులు చూసుకోవాలి.బలిదానాలు వంటి మాటలు మీడియాలో ఎక్కువగా వాడుతున్న తీరును కూడా పున: పరిశీలించుకోవాలి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖండించాలి గాని దాని వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పదే పదే చెప్పడం ఒక విధంగా సమర్థనగా కనిపించవచ్చు.కొందరు స్వార్థపరులైన వారు ఒక వైపున ఖండిస్తూ వద్దని సలహాలు చెబుతూనే వాటి చుట్టూనే చర్చ తిప్పుతుంటారు. ఇదే కాలంలో రెండు వేల మంది రైతులు ఆర్థిక అవస్తలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఇవి కొనసాగుతున్నాయి. అంతకు ముందు చేనేత కార్మికుల కుటుంబాలలోనూ ఆకలి చావులే గాక ఆత్మహత్యలు చూశాం. ఆ అన్ని ఘటనలలోనూ సంబంధిత సంఘాలు ఆత్మ విశ్వాసం తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని చెప్పాయే తప్ప దాని చుట్టూ చర్చ నడవలేదు. ఇప్పుడు మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఏ చర్చకు కూచున్నా పిల్లలు చనిపోతున్నారంటూ మొదలవుతున్నది. ప్రాంతీయ వాదాలతోనే పిల్లలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి సాగనిస్తే రేపు మరింత తీవ్రమైన వ్యక్తిగతమైన సవాళ్లు వస్తే వీరు తట్టుకోగలుగుతారా?విభజన జరిగినా జరక్కపోయినా అది ప్రాణాలు తీసుకోవలసినంత మౌలిక సమస్య కాదని, దాంతోనే జీవితాలు తలకిందులుగా మారిపోవని కూడా మన యువతకు స్పష్టమైన అవగాహన కలిగించడం అవసరం. ఏ సమస్యకైనా ఆత్మహత్య తరుణోపాయం గాని సమర్థనీయం గాని కాదు. లోగడ ఇలాటి ఒక సందర్భంలో చనిపోయిన యువకుడిని జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ భగత్‌ సింగ్‌తో పోలిస్తే నేను ఖండిస్తూ రాశాను. పైగా భగత్‌ సింగ్‌ ఆత్మహత్య ఏ పరిస్థితుల్లోనూ తగదంటూ రాసిన భాగాన్ని వుటంకించాను. తర్వాతి రోజు నమస్తే తెలంగాణాలో నేనిచ్చిన కొటేషన్‌ను పునర్ముద్రించడం సంతోషం కలిగించింది.కనక వద్దనుకుంటూనే ఆత్మహత్యలతో విమర్శలు ఆరంభించడం మానుకోవాలి.అలాగే ఆత్మహత్య చేసుకున్న వారి వ్యక్తిగత నేపథ్యాన్ని పరిసరాలలో పరిస్థితులను కుటుంబాల తీరు తెన్నులను నిశితంగా పరిశీలించేట్టయితే భవిష్యత్తులో నిరోధించే చర్యలు తీసుకోవచ్చు.