Pages

Thursday, June 30, 2011

రస కందంలో రాజకీయ హడావుడి


రాష్ట్ర రాజకీయాలలో మరోసారి హడావుడి పెరిగింది. ప్రాంతీయ సమస్యపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న సంకేతాలు ఒకవైపున వెలువడుతున్నాయి.అయితే ఈ సంకేతాలు కేంద్ర నేతలెవరూ నేరుగా ఇచ్చినవి కావు. వారైతే చాలా సమయం పడుతుందనే అంటున్నారు.ఇంకా చర్చించలేదని విధానం రూపొందంచలేదని కూడా చెబుతున్నారు. పైకి ఇలా అంటున్నా లోలోపల తమ పార్టీ వారికి ఏవో స్పష్టమైన సూచనలు చేసే వుండాలి గనకే అలజడి పెరుగుతున్నది. తెలంగాణా ప్రాంతంలో అధికార పక్షంలో ఆందోళన పెరుగుతుంటే టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అదను చూసి రంగ ప్రవేశం చేశారు. ఏ జానారెడ్డి ఆవరణలోనైతే లోగడ జెఎసి ఏర్పాటు వగైరాలు జరిగాయో అక్కడే మరోసారి అదే తతంగం పునరావృతమైంది. కాని ఈ సారి కాంగ్రెస్‌ వారందరూ ఒకే విధంగా మాట్లాడటం లేదు. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి రాజనరసింహ ప్రాంతీయ మండలికైనా ఒకే అని చెప్పి ఆ పైన సర్దుకున్నారు. 2009లో పరిస్థితి ఇప్పుడు లేదని డి.ఎల్‌.రవీంద్రారెడ్డి అంటున్నారు. కాని లగడ పాటి వంటి వారు అకారణ అనుచిత వ్యాఖ్యలతో వివాదాలు పెంచుతున్నారు. మరొవైపున తెలంగాణేతర ప్రాంతాల కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ ప్రదక్షిణ ప్రహసనం మొదలెట్టారు. ఇదంతా చూస్తుంటే పాలక పక్షం రాజకీయ క్రీడ రెండు వైపులా సమాన జోరులో సాగుతున్నదని స్పష్టమవుతుంది. తెలుగు దేశం కొంత జాగ్రత్త పడుతున్నా విశ్వసనీయత నిలబెట్టుకోవడం కష్టంగానే వుంది. రాజకీయంగా ఒక మెట్టు దిగి కెసిఆర్‌ను సందర్శించి వచ్చిన నాగం జనార్ధన రెడ్డి నిరాహారదీక్ష చేస్తున్నా దాని ప్రభావం పరిమితంగానే వుంటుంది.ఏమైనప్పటికీ కేంద్రం దాగుడు మూతలు విరమించి సూటిగా ప్రకటన చేసే సమయం వచ్చిందని కొందరు అంటున్నారు గాని అది నిజమేనా? అన్నది ప్రశ్న. ఎందుకంటే అంత సున్నితంగా సూటిగా వ్యవహరించే అలవాటు గాని అవసరం గాని అధిష్టానానికి ఎప్పుడూ లేవు. కావాలని వేడి పెరగనిచ్చి ఆ పైన చల్లనీళ్లు గుమ్మరించినట్టు అటూ ఇటూ గాని వ్యాఖ్యలు చేయడమే వారి రాజనీతి. ఇప్పుడైనా జరిగేది అదే. ఇది అన్ని ప్రాంతాలతో చెలగాలమాడుతున్న కేంద్ర జాలం.అంతే.

మన్మోహన భాషణాల మర్మమేమి?

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తాను అసమర్థుడిని కాదని చెప్పుకున్నారు. సమర్థుడు అవునో కాదో గాని సమర్థకుడు మాత్రం అవునని నిరూపించుకున్నారు. దేశ చరిత్రలోనే తనది అత్యంత అవినీతి కర ప్రభుత్వమని మీడియా వర్ణిస్తున్నట్టు ఆయన ఆక్రోశించారు. ........... రాజా వంటి వారు ఏదైనా చెప్పినప్పుడు నమ్మడం సహజం కదా అని అమాయకంగా పెద్ద మనిషిలా మాట్టాడారు. ఇదే పెద్ద మనిషి గతసారి మీడియాతో మాట్లాడినప్పుడు అవినీతి పరుడైనప్పటికీ మిశ్రమ ప్రభుత్వం గనక భాగస్వామ్య పార్టీలు చెప్పినట్టు తీసుకోక తప్పదని అన్నమాటలను గుర్తు చేసుకోవాలి.
...... లోక్‌ పాల్‌ పరిధిలోకి రావడానికి అభ్యంతరం లేదంటూనే అది సర్వరోగ నివారిణి కాని నొసటితో వెక్కిరించారు.ఇవన్నీ నిజమైతే లోగడ అన్నా హజారే వంటి వారితో చర్చలు,రామ్‌దేవ్‌ బాబాకు ఘన స్వాగత సత్కారాలు వంటి ప్రహసనాలన్ని ఎందుకు జరిపించినట్టు?
.... తాను సమర్థుడిని అంటూనే యువతరానికి అంటే రాహుల్‌కు ఎప్పుడైనా సింహాసనం అప్పగించడానికి సిద్ధమని ప్రకటించి విధేయత చాటుకున్నారు.
...... రాజ్యాంగాన్ని రాజకీయ విలువలను వల్లించే మర్యాదస్తుడు తమ లావాదేవీలపై తనిఖీకి ఉద్ధేశించిన సిఎజిపై బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేశారు. సిఎజి నిజంగా పొరబాటు చేస్తే ప్రభుత్వ పరిధిలో చట్టబద్దంగా వ్యవహరించాలి తప్ప ఈ బహిరంగ వ్యాఖ్యలెందుకు? ఆయన రాజాను నమ్మినట్టే సిఎజి కూడా నమ్మ లేదనా?
సమస్క సచ్చీలత సద్బుద్ధి కాదు. చట్టబద్దత. నిబంధనలు పాటించడం. ఆ సంగతి వదిలిపెట్టి పెద్దాయన ఏవో సుద్దులు చెప్పి ఫలితమేమిటి?

Tuesday, June 28, 2011

ఒకే రాష్ట్రానికి ఎంతమంది సిఎంలో!రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పు కాదు గాని అనుక్షణం ప్రతివారూ అదే పదవిపై ఆశలు( రాయలసీమ భాషలో బాసలు అంటారు) వదుల్తూ కూచోవడం పెద్ద గౌరవ ప్రదమైన విషయం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వున్నారు. అనేక విమర్శలు వివాదాల మధ్య ఎలాగో నెట్టుకు రావడానికి తంటాలు పడుతున్నారు. ఇతర పార్టీల వాళ్లు ఆయనను విమర్శించడం తొలగించాలనుకోవడం సహజం. కాని స్వంత పార్టీ అద్యక్షుడు, పార్టీలో కలిసిన మరో పార్టీ అద్యక్షుడు కూడా సిఎం కావాలని బహిరంగంగా కలలు కనడం ప్రారంభిస్తే ఏమనుకోవాలి? పిసిసి పీఠాధిపతి సత్తిబాబు క్షణమైనా ఈ విషయంలో తన మనసు దాచుకోవడం లేదు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి కూడా సిఎం పాత్రలో జీవించాలన్న ఆరాటాన్ని బయిటపెట్టేశారు.అసలు ప్రభుత్వ మనుగడే గండంగా నడుస్తుంటే ఇంత మంది సిఎం ఆశలకు అవకాశం వుంటుందా? వుండదని వారికీ తెలుసు. అంతదాకా వస్తే మాట వేసి వుండటం మంచిదనే ముందుచూపు తప్ప ఇందులో సారం ఏముంటుంది? పైగా ఆ విధంగా మాట్లాడ్డం రేంజిని స్పష్టం చేయడానికి కూడా పనికి వస్తుంది.చిరంజీవి కేంద్రం కన్నా రాష్ట్రమే తనకు ఇష్టమని గతంలోనే చెప్పారు. ఇప్పుడు దాని పూర్తి సారం విప్పారన్న మాట. మీడియాకు మేత కావచ్చు, అభిమానులకు మోత కావచ్చు గాని వాస్తవాల రాత ఏమిటన్నదే అసలు ప్రశ్న.

Friday, June 24, 2011

పుట్ట(పర్తి)పగిలిన రహస్యాలు- సర్కారు మీన మేషాలుపుట్టపర్తి బాబా ఆఖరి ఘట్టంలోనే అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసినా అధినేతలు అలసత్వం ప్రదర్శించిన ఫలితం ఇప్పుడు స్పష్టమవుతున్నది. ఆధ్యాత్మికత పేరుతో సమాంతర సామ్రాజ్యాలను అనుమతించడం తగదని నా వంటి వారు హెచ్చరిస్తే ఆగ్రహించిన వారికి ఇప్పటి పరిణామాలు కనువిప్పు కాగలుగుతాయా? ఇప్పుడు ట్రస్టు సభ్యులపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆఖరుకు బాబా కుటుంబ సభ్యులు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాటి ఒకరిద్దరితో నేను టీవీ ఛానెల్‌ చర్చలో మాట్లాడాను కూడా. వారి గొంతులో స్పష్టంగా భయం తొంగి చూస్తున్నది. అంతా రత్నాకర్‌ లేదా శ్రీనివాసర్‌ వంటి వారి పేర్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నా నిజానికి ఇదో పెద్ద వలయం. ఇందులో అనేక పెద్ద తలకాయలు వున్నందునే ఇంత వెసలు బాటు లభించింది. హత్యలు జరిగినా రక్తం చిందినా అంతు చిక్కని రీతిలో అపార సంపదలు ప్రవహించినా ఆరాలు తీయని అధినేతలకు దానితో బ్రహ్మముడి వుంటుంది. ఇప్పుడు దేశంలో బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ వాణిజ్య వేత్తలు హఠాత్తుగా అగుపిస్తున్నారంటే ఇదంతా యాదృఛ్చికంగానూ భక్తి ప్రపత్తులతోనూ మాత్రమే జరుగుతున్నదనుకుంటే అంత కన్నా అవివేకం వుండదు. విదేశీయులు ప్రముఖులు కూడా యథేఛ్చగా సంచరించే ఇలాటి ఆశ్రమాలే నల్లడబ్బుకు అక్రమ కార్యకలాపాలకు మాఫియాలకు వాటమైన ఆశ్రయాలు అవుతుంటాయి. అందులో అభాగ్యులెందరో అమాయకంగా ఆహుతి అవుతుంటారు . ఆ మౌఢ్యాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవడానికి పైసలు కూడగట్టుకోవడానికి పాలక వర్గ నేతలు పాకులాడుతుంటారు.ఇదే విష వలయం. ఇప్పుడు కూడా అంతా బయిటకు వస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే సగం మాఫీ తతంగం జరిగే పొయింది....

ఎమర్జన్సీ ఒక పీడకల.. ఒక ప్రమాద హెచ్చరిక


1975 జూన్‌ 25 అర్థరాత్రి విధించిన ఎమర్జన్సీ లేదా అత్యవసర పరిస్తితి భారత ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టిన ఒక ప్రమాద కర ఘట్టం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఈ దేశాన్ని అంత పెద్ద రాజ్యాంగం కూడా కాపాడలేక పోయిన చీకటి ఘట్టం.ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు తీర్పు నివ్వడం, ప్రతిపక్షాలు ఆమె అవినీతికి వ్యతిరేకంగా ఉమ్మడిగా ఉద్యమించడం జరిగిన నేపథ్యంలో కేవలం తన పదవిని కాపాడుకోవడానికి రాష్ట్రపతిని రబ్బరు స్టాంపుగా చేసుకుని ప్రధాని ఇందిర అర్థరాత్రి అత్యవసర పరిస్థితి ప్రకటించారు.హక్కులన్ని రద్దయిపోయాయి. పత్రికలు ప్రభుత్వాధికారుల అనుమతి తీసుకున్నాకే విడుదల కావలసిన స్థితి. ఆకాశవాణిలో అనుక్షణం ఆమె భజన. జయప్రకాశ్‌ నారాయణ్‌, మొరార్జీ దేశాయి, వాజ్‌పేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్‌, జ్యోతిర్మయి బోసు, మాకినేని బసవపున్నయ్య తదితరులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. వామపక్ష నేతలను అరెస్టు చేస్తే అంతర్జాతీయంగా అభ్యుదయ ముసుగు తొలగిపోతుందనే భయంతో పై సా ్తయి నేతలను విడుదల చేసినా కార్యకర్తలను జిల్లాల నాయకులను నిర్బంధంలోనే వుంచారు. ఇందిరా గాందీ కుమారుడైన సంజరు గాంధీ రాకతో భారత రాజకీయాల్లో వారసత్వ పర్వం వూపందుకుంది. ప్రజల ప్రాణ రక్షణ హక్కు కూడా లేదని సుప్రీం కోర్టులో కేంద్ర న్యాయవాది వాదించాడు! అనేక అమానుసాలు అత్యాచారాలకు అది దారితీసింది. ఇదంతా అయ్యాక ఎన్నికలు ప్రకటిస్తే 1977మార్చిలో హడావుడిగా జనతా పార్టీ ఏర్పడి అ ధికారంలోకి వచ్చింది. కాని విధాన సారూప్యత లేక జనసంఘం ఆరెస్సెస్‌ విధేయులు ఇమడ లేక ఆ ప్రభుత్వం పతనమై పోవడంతో మళ్లీ 1980లో

Wednesday, June 22, 2011

ప్రొఫెసర్‌ జయ శంకర్‌ ...ఒక దీపస్తంభంతాము పూర్తిగా ఏకీభవించని వారినెవరినైనా ఇతరులు గౌరవిస్తున్నారంటే అది వారి వ్యక్తిత్వానికి ప్రతీక. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ అక్షరాలా అలాటి వ్యక్తి. అరవై ఏళ్లపాటు ఒకే మాటకు బాటకు కట్టుబడి నిస్వార్థంగా నిష్కల్మషంగా నిలబడ్డారు. తెలంగాణా విముక్తికి మొదటి తరంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి వారు ప్రతీకలైతే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత కాలంలో ఆ ప్రాంత సమస్యలకు ఆయన ప్రతిధ్వని అయ్యారు. అది పదవులతో ప్రచారాలతో సంబంధం లేని భావాత్మక ప్రాతినిధ్యం. అనుకున్నది జరక్కపోయినా ఆకాంక్షకే కట్టుబడిన దృఢమైన ప్రాతినిధ్యం. విద్యా రంగంలో వున్నతమైన బాధ్యతలు నిర్వహించినా రాజకీయ నేతలకు గురుపీఠంలో భాసించినా జయ శంకర్‌ నిబద్ధంగా నిరాడంబరంగా సంచరించారు. తనకు చాలా ఇష్టమైన మాటల్లో చెప్పాలంటే చెన్నారెడ్డి నుంచి చిన్నా రెడ్డి వరకూ రకరకాలైన రాజకీయ పాత్ర ధారులు మారారు గాని తాను సూత్రధారిగానే వుండిపోయారు.వచ్చీ పోయే నౌకలకు దారి చూపిస్తూ వుండిపోయే దీపస్తంభమే

Saturday, June 18, 2011

పాలక పక్ష విన్యాసాల పరాకాష్టతెలంగాణా ప్రాంత ప్రజా ప్రతినిధుల ఢిల్లీ యాత్ర ఫలితాలపై వస్తున్న కథనాలు పాలక పక్ష రాజకీయ క్రీడ పరాకాష్టకు చేరిన వైనాన్ని స్పష్టం చేస్తున్నాయి. వరుసగా రాజధానికి ప్రదక్షిణల ప్రహసనం సాగించే నాయకులకు అక్కడ ఏం ఆలోచిస్తున్నారో తెలియదనుకోవడం పొరబాటు.అలాగే వారికి చెప్పిందంతా బయిటకు వచ్చాక చెబుతున్నారనుకోవడం ఇంకా పొరబాటు. వారు చెప్పే మాటలకు, చేస్తున్న విన్యాసాలకు పొంతన వుండటం లేదని కాస్త పరిశీలించే వారెవరైనా చెప్పగలరు. గత పది రోజుల్లో, ప్రధానితో సహా కేంద్ర ప్రతినిధులందరూ చెప్పిన మాటలను బట్టి రాష్ట్ర విభజన విషయమై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. అయితే ఆ మాట సూటిగా చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేరు. ప్రధానిని కలిసిన తర్వాత కూడా ఏ విధమైన అధికారిక వ్యాఖ్య వెలువడలేదంటే కేంద్రం అంతకన్నా చెప్పేదేముంటుంది? జటిలమైన సమస్య అనీ, సమయం పడుతుందనీ రకరకాలుగా సన్నాయి నొక్కులు నొక్కడం అందులో భాగమే. డిసెంబర్‌ 9 ప్రకటన కేంద్రం చేసింది తప్ప(అదీ క్యాబినెట్‌లో చర్చించకుండా) కాంగ్రెస్‌ది కాదని జైపాల్‌ రెడ్డి వివరణ, సవరణ వగైరాల సారాంశం. ప్రధాని స్వయంగా మౌనయోగం పూనిన తర్వాత ఆయన క్యాబినెట్‌ సహచరులేవో చెబుతారనుకోవడం హాస్యాస్పదం. హోం మంత్రి చిదంబరాన్ని కలసినపుడు ఈ విషయంలో కాంగ్రెస్‌ ఇంకా ఒక వైఖరి తీసుకోలేదని అన్నట్టు

Sunday, June 12, 2011

దీనిభావమేమి కేంద్ర మంత్రీ?
భాషా పటిమలోనూ భావ పరిణతిలోనూ సాటిలేని పేరు సంపాదించిన కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ జాతీయ వాదం గురించి చేసిన వ్యాఖ్యలు చాలా విచిత్రంగా వున్నాయి. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ తప్ప ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీ కాదని తాను అన్న మాటలకూ తెలంగాణా సమస్యకూ సంబంధం లేదని ఆయన తర్వాత వివరణిచ్చారు. అంతటి అనుభవజుఞలకు హైదరాబాదులో మాట్లాడినప్పుడు ఎలాటి ప్రభావం వచ్చేది తెలియదని అనుకోలేము.తర్వాత ఇచ్చిన వివరణ కూడా అరకొరగా వుంది తప్ప సంతృప్తి కలిగించేది కాదు.

1.డిసెంబర్‌ 9 ప్రకటన కేంద్రానిదే తప్ప కాంగ్రెస్‌ది కాదని ఆయన అంటున్నారు. అంటే ఇంత వరకూ

పదవీ పంపక వ్యూహం- పరిష్కార చర్యలు శూన్యంఅయిదు ముఖ్యమైన పదవులకు పంపకాలు చకచకా పూర్తి చేయడం పాలకపక్ష వ్యూహంలో కొత్త దశను సూచిస్తుంది. అలాగే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా విన్యాసాలు చేసిన నాయకుల స్వభావాన్నీ వెల్లడిస్తుంది. దీనిపై కేవలం ప్రాంతీయ కోణాల నుంచి భాష్యాలు చెప్పేవారు చెబుతుండగానే అధికార పక్షీయులు మాత్రం మిగిలిన పదవుల పంపకంలో స్థానం కోసం పడిగాపులు కాస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ క్రీడకు పరాకాష్ట అనదగిన ప్రహసనమిది. స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్‌, డిప్యూటీ స్పీకర్‌గా భట్టి విక్రమార్క ఎన్నికవదంతో తమ ప్రభుత్వం బలం నిరూపించుకున్నట్టు కాంగ్రెస్‌ నేతలు చేసే వాదన కేవలం సాంకేతికమైందే తప్ప సంఖ్యలు

Wednesday, June 8, 2011

బొత్స ఎంపిక.... ప్రాంతీయ జోస్యాలు వృథా


పీసీసీ పీఠాధిపతిగా బొత్స సత్యనారాయణ నియామకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ భవిష్యత్తుపై అనిశ్చితిని తొలగించడం కంటే అంతర్గత పరిస్థితిని చక్కదిద్దుకోవడానికే అధిష్టానం ప్రాధాన్యత నిస్తున్నట్టు విదితమైంది. చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాలలో ఒక కేంద్ర బిందువుగా మారాలని వేచి వున్న బొత్స ఈప్సితం నెరవేరినట్టే చెప్పాలి. ఆయన నియామకం తెలంగాణా విభజనకు అనుకూలమని దాన్ని కోరుకునే వారు, జగన్‌ను కట్టడి చేయడానికే నని ఆయనను వ్యతిరేకించే వాళ్లు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సమాంతర కేంద్రాన్ని అనుమతించడమేనని మరికొందరు ఇలా పరి పరి విధాల వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడుగా వుండి సకుటుంబంగా కాంగ్రెస్‌లో ఆధిపత్యం చాలాయిస్తున్న బొత్స రాజకీయ సత్తా గురించి

మర్మయోగి విన్యాసాలు -వివాదాలుఅవినీతి చాలా ప్రమాదకరమైందే, దాన్ని అరికట్టడానికి అవినీతి పరులను శిక్షించడానికి అవశ్యం పోరాటాలు సాగవలసిందే. కాకపోతే ఆ పోరాటాలు చేసే వారు కూడా అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా వుండకూడదు. యోగా గురు పేరిట బృహత్‌ సామ్రాజ్యం స్థాపించుకున్న రామ్‌దేవ్‌బాబా అవినీతి వ్యతిరేక పోరాటం మాత్రం అడుగడుగునా అలాటి వివాదాలకే ఆలవాలంగా వుండటం విడ్డూరం. .మొదటిది- కాంగ్రెస్‌ ప్రభుత్వ నేతలు ఆయనను రాజలాంఛనాలతో స్వాగతించడం. రెండవది- ఆయన దీక్ష ప్రారంభించడానికి ముందే దాళన్ని విరమించే విషయమై తమకు లేఖ రాశారని ప్రభుత్వం ఆ ప్రతులు విడుదల చేయడం. మూడవది- దీక్షా శిబిరం కోసం భారీ ఎత్తున కార్పొరేట్‌ స్థాయిలో జరిగిన ఏర్పాట్లపై సమాచార హక్కు చట్టం కార్యకర్త అరుణ్‌ రారు స్వయంగా ధ్వజమెత్తడం. నాలుగు- దీక్షా శిబిరంలో సాధ్వీ రీతాంబరి లాటి కరుడు గట్టిన మతోన్మాద శక్తులు ప్రత్యక్షం కావడం. అయిదవది- ఆయనను ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు సంభవించిన సంఘటనలు, చేసిన ప్రకటనలు ఆరు- ఆరెస్సెస్‌,బిజెపిలు వాటి అనుకూల మీడియా ఇదే ఏకైక ఎజెండాగా సాగిస్తున్న హడావుడి. యోగాను ఛాందసాన్ని వ్యాపారాన్ని జోడించి లాభాలు దండుకుంటున్న రామ్‌ దేవ్‌ను నిస్వార్థ దేశభక్తుడైన