బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో రెండవ పెద్ద భాగస్వామి జనతా దళ్(యునైటెడ్) భావి ప్రధాని అభ్యర్థి ఎంపికపై సాగిస్తున్న ఎడతెగని ప్రహసనం ఇప్పుడు మరింత రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌కు తామే ఏకైక ప్రత్యామ్నాయమని ఎన్ని ప్రగల్భాలు పలికినా అనేకానేక పక్షాల మద్దతు లేకుండా గద్దెనెక్కలేమని బిజెపికి అంతకు మించి దాన్ని నడిపించే ఆరెస్సెస్ పీఠాధిపతులకు బాగా తెలుసు. అందుకే కేంద్రంలో అధికారమే పరమార్థంగా అవమానాలు అవాంతరాలు దిగమింగి రాష్ట్రాల్లో సదరు భాగస్వామ్య పక్షాల పెద్దన్న పాత్రకు తలవంచుతుంటారు. గుజరాత్ మారణహౌమం తర్వాత ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల్లో అనేకం నిష్క్రమించినా మిగిలిన ఏకైక పెద్ద మిత్ర పక్షం జెడియు మాత్రమే. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నేతల నుంచే తమ మోడీకరణ వ్యూహానికి ప్రతిబంధకం ఎదురవడం బిజెపికి గొంతులో వెలక్కాయలా తయారైంది. పైకి ఎన్ని మేకపోతు గంభీరాలు వొలకబోసినా బిజెపి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ సారికి ఎలాగో కార్పొరేట్ల కరుణతో నెట్టుకురావచ్చని వ్యూహ కర్తల అంచనా. ఆయన అత్యాశా వ్యూహాలు కూడా అలాగే వుండటం వల్ల అనివార్యంగా అందుకు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హిందూత్వ ఎజెండా
తెలకపల్లి రవి
Thursday, April 18, 2013
మోడీ- జేడీ(యు) ప్రహసనం
సంస్కృత సంస్కృతి
ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అత్యవసర పోలీసు డయల్ సర్వీసు 100 ప్రారంభించారు.ఈ నెంబరుకు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా పోలీసు సహాయం లభిస్తుందని ప్రకటించి తనే డయల్ చేశారు. అయితే పాపం ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యం. తర్వాత ఎవరో ఎలాగో కలిపి ఇచ్చారు గాని పాపం ఆయనకు అప్పటికే విసుగొచ్చి ఇక స్పందించడం మానేశారు. ఆదిలోనే హంసపాదు వంటి ఈ చేదు అనుభవాన్ని కూడా దిగమింగి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోలీసులకు ఓ చక్కటి సలహా ఇచ్చారు. ప్రజలతో వ్యవహరించేప్పుడు సంస్కృతం మాట్లాడకండి అని.
సంస్కృతమే మన సంస్కృతి అనీ, అది దైవభాష అనీ ఈ దేశంలో చాలా మంది ప్రచారం చేస్తుంటారు. కనక చాలా మంది నమ్ముతుంటారు కూడా. సంసృతంలో నాలుగు శ్లోకాలు ఇంగ్లీషులో నాలుగు కొటేషన్లు దంచేస్తేనే సదరు వ్యక్తి పండితుడని మనం నమ్ముతాం. అందుకే హైటెక్ బాబులు అడపాదడగా ఒకటో అరా సంసృత చరణాలు వల్లిస్తుంటారు. అలాగే స్వామి వర్యులు ఇంగ్లీషు వాక్యాలు జొప్పిస్తుంటారు.ఏతావాతా ఒక దశలో సంసృతం మరో దశలో ఆంగ్లం తెలుగు వంటి భాషలను ఎదగకుండా చేశాయన్నది ఒక వాదన. అలాగే అర్థం కాని సంసృతంలోనూ అన్నీ జరిపేంచుస్తుంటారు పురోహితులు. వారికైనా అర్థం అవుతాయో లేదో మనకు తెలియదు గాని వందల ఏళ్లపాటు వేదాలు వల్లెవేసిన వారంతా అక్షరాస్యులు కాదన్నది నిజం. అసలు వేదాలు అచ్చు వేయకూడదనేది కూడా వందేళ్ల కిందటి వరకూ మన వాళ్లు గట్టిగా నమ్మిన మాట. అన్నీ వేదాల్లో
Wednesday, April 17, 2013
రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ

రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం తెలుగు వారందరూ సంతోషించే విషయం. రెండు మూడు తరాలుగా రావూరి భరద్వాజ పేరు, రచనలూ, భావనలూ సాహిత్య ప్రియులకు సుపరిచితాలు. ప్రగతిశీల వాదులకూ ప్రజాస్వామిక భావాలకూ సదా సన్నిహితంగా మెలిగే రావూరి భరద్వాజ అక్షర శ్రామికుడు. అవిరామ స్వాప్నికుడు. తరాల మధ్య వారధి. సాహిత్య కార్యక్రమాల సారథి. అన్నిటినీ మించి స్నేహశీలి. ఎనిమిది పదుల వయస్సు దాటినా నిరంతర క్రియాశీలంగా కలుపుగోలుగా మసలే సహృదయ సాహిత్య జీవి. అందుకే ఆయనకు అఖిలభారత స్థాయిలో అత్యున్నత పురస్కారం లభించడం అభినందనీయం. మొదటిది విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి వస్తే రెండవది సి.నారాయణరెడ్డి విశ్వంభరకు లభించింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు ఆ గౌరవం దక్కింది. ఈ విధంగా ఇది తెలుగు వారికి లభించిన మూడో జ్ఞానపీఠం కనుక మరింత ప్రత్యేకం.
నిజానికి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొడవటిగంటి కుటుంబరావు, వంటి మహాకవులు రచయితలెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నిజానికి తాను శ్రీశ్రీ, ఆరుద్రల పేర్లు అనేక సార్లు సిఫార్సు చేశానని సినారె ఒక సందర్భంలో చెప్పారు. అయితే అప్పట్లో అధినేతల ఆలోచనా ధోరణులు అభ్యుదయాన్ని అస్సలస్సలు సహించేవి కావు గనకే వీరెవరికీ జ్ఞానపీఠం వంటివి లభించే సూచనే లేకపోయింది. తర్వాతి కాలంలో
Thursday, March 28, 2013
వికసించిన విద్యుత్తేజం
ప్రభుత్వాలకు పోలీసులుంటారు. ఉసిగొలిపితే చాలు విరుచుకుపడి విరగ్గొడతారు. నిజమే. ఆ బలం చూసుకుని జులం చూపి విర్రవీగిన విరగబడిన వారందరూ ప్రజల ముందు శృంగభంగం పాలయ్యారన్నది అంతకన్నా పెద్ద నిజం.కాని అధికారబలంలో అహంకరించే వారికి, అప్రజాస్వామికంగా హుంకరించేవారికి చరిత్ర చెప్పిన ఈ పాఠాలు చెవికెక్కవు. నిరంతర గుణపాఠాలు తలకెక్కవు. చరిత్ర బుద్ధిమంతులకు దారి చూపిస్తుంది. బుద్ధి హీనులను ఈడ్చుకుపోతుంది అంటారు. తప్పదు. వికసించిన విద్యుత్తేజం ఎంతటి విస్పోటనమై విజృంభిస్తుందో బషీర్‌బాగ్ ఆ నాడు చెప్పింది. నాలుగు రోజులుగా వామపక్ష నేతలు సాగిస్తున్న నిరవధిక నిరాహారదీక్షలో పెల్లుబికిన ప్రజాభిమానమూ చాటించింది. అయినా ఆ గ్రహింపు లేని పాలకులు ఆగ్రహం తప్ప అవగాహన కనీసంగా ప్రదర్శించలేకపోయారు. ఖాకీలను ప్రయోగించడం తప్ప కాస్త విజ్ఞతతో స్పందించేందుకు నిరాకరించారు.
నిరాహారదీక్షలు ఎక్కువ రోజులు సాగి ఉద్రిక్తంగా మారితే, దీక్షలో కూచున్న వారి ఆరోగ్యం మరీ క్షీణిస్తే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అదుపులోకి తీసుకోవడం అస్పత్రిలో చేర్పించడం కొత్త కాదు. కాని దానికి ముందు ప్రజాస్వామ్య ప్రక్రియవుంటుంది. ప్రభుత్వం సానుకూలంగా ప్రస్తావనలు చేస్తుంది. శాసనసభలో ముఖ్యమంత్రి వంటి వారు సాధికారికంగా ప్రకటన చేసి ప్రతినిధులను పంపిస్తారు. మధ్యవర్తులైన పెద్దమనుషులతో సంప్రదింపులు జరుపుతారు. సగౌరవంగా ముగింపు పలికేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పాలక పక్షం
ములాయం ముసలం
రోజుకో సంచలన వ్యాఖ్యతో యుపిఎ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మరిన్ని ఫిరంగులు పేల్చారు. కాంగ్రెస్ మోసకారి పార్టీ అని అధికారమే దాని పరమావధి అని విమర్శలు గుప్పించారు. పలుసార్లు మూడవ ఫ్రంట్ గురించి మాట్లాడ్డం ద్వారా కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వదిలారు. అయితే ఆయన రాజకీయ విన్యాసాలు, పిల్లిమొగ్గల నేపథ్యంలో వెంటనే స్పందించడానికి స్వాగతించడానికి ఎవరూ సిద్ధం కావడం లేదు.
మూడవ ఫ్రంట్ గురించి ములాయం మాటలపై అవిశ్వాసం పెరగడానికి ఆయన గత వైఖరే కారణం 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయినప్పుడు తిరిగి 2008లో యుపిఎ అణుఒప్పందంపై ఓటింగును ఎదుర్కొన్నప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఆఖరి నిముషంలో నిర్ణయాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇటీవల ఎఫ్‌డిఐల విషయంలోనూ ఆ పార్టీ అలాగే చేసింది. ఇవన్నీ గాక ఈ మధ్యన ఒక సభలో ములాయం బిజెపి నేత ఎల్.కె.అద్వానీపై ప్రశంసలు కురిపించడం, బిజెపి గనక తన మూడు మత అజెండాలను వెనక్కు తీసుకుంటే సహకరించవచ్చునని చెప్పడం సందేహాలు పెంచింది.
కేంద్రంలో మూడవ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని మార్చి24న ములాయం చేసిన ప్రకటనను కాంగ్రెస్ బిజెపి లు తోసిపుచ్చాయి. అయితే ఆయన మాత్రం సుష్మా స్వరాజ్, శరద్ పవార్‌లతో సహా అనేక మందిని కలుసుకుని హడావుడి చేస్తున్నారు. కర్ణాటకలో జనతాదళ్(ఎస్)తోనూ మంతనాలు జరుపుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అందరి సహకారం అవసరం గనకే ఆయన ఇన్ని తంటాలు పడుతున్నారనే మాట రాజధాని వర్గాల్లో వినిపిస్తున్నది.యుపి రాజకీయాల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన బిఎస్‌పి నేత మాయావతి కూడా ప్రదాని కావాలన్న కోర్కెను బాహాటంగానే వెలిబుచ్చారు.ఈ ఉభయుల మధ్య పోటీ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను ఎలాటి మలుపులు తిప్పుతుందో ఆ మధ్యన కాంగ్రెస్ బిజెపిలు ఎలాటి రాజకీయం నడుపుతాయో చూడవలసిందే. కాకపోతే రాహుల్ గాంధీ కూడా పార్లమెంటుకు అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు వస్తే మంచిదని భావిస్తున్నాడనేది ఒక వాదన. దాన్నిబట్టి ఎన్నికలు ముందుగా జరిగే అవకాశం చాలా వుందనే చెప్పాలి.
Subscribe to:
Posts (Atom)


