Pages

Thursday, April 28, 2011

ఆధ్యాత్మిక ముద్రతో అతీత రాజ్యాలా?
దాదాపు పదిహేను రోజుల పరస్పర విరుద్ధ కథనాల తర్వాత పుట్టపర్తి సాయిబాబా భౌతిక కాయం మహా సమాధి చేరింది. భగవత్‌ స్వరూపుడు ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు భగవంతుడే గనక ఆయనకు మరణం లేదని ఇప్పటికే మరో చోట పుట్టి వుంటాడని నమ్మే వారికి లోటు లేదు. తొంభై ఆరేళ్లు బతుకుతానన్న బాబా పదేళ్లు ముందే పయనం కట్టాడేమిటని అడిగేవారికి తెలుగు నెలల లెక్క సిద్దంగానే వుంది. పరమ పురుషులైనా పాంచభౌతిక కాయం వదలిపెట్టడం తప్పదనే ఓదార్పు మరో వైపు. అయితే అధునాతన వైద్యం ఆఖరు వరకూ ఎందుకు ఇచ్చారంటే అది ఆయన కోసం కాదు, మన కోసం అని మరో వివరణ. ఏమైనేతేనేం, మహత్వాల సంగతి అటుంచి మనిషిగానూ

Sunday, April 24, 2011

బాబా కన్నుమూత- భవిష్యత్తు??


దాదాపు నెల రోజుల పాటు అత్యంత నిగూఢంగా నడిచిన సత్యసాయిబాబా ఆఖరి ఘట్టాన్ని అధికారికంగా ముగిస్తూ ఆయన ఆదివారం ఉదయం అస్తమించినట్టు ట్రస్టు ప్రకటించింది. ఇది వూహించిన విషయమే గాక సహజ సిద్దం కూడా. బాబా మహిమాన్వితుడు గనక మరణం లేదని భావించే వారైనా సరే ఆయన దేహానికి చికిత్స చేయించకుండా వదలిపెట్టలేదు. అయితే ఆ చికిత్స మాత్రం అనేక అనుమానాలకు తావు నిచ్చింది. ఆయన తమ దగ్గరకు వచ్చే వరకు ఏ స్థితిలో వున్నారో ఏ మందులు వాడారో తెలియదని చికిత్సకు ఆధ్వర్యం వహించిన డా.సపాయి స్ఫష్టంగా చెప్పారు. ఐసియులోకి ఎవరినీ అనుమతించలేదు గనక అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. తమది సహాయక పాత్ర తప్ప ప్రత్యక్ష నిర్ణాయక స్థానం కాదని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. బాబా మహిమలపై, ఆయన ప్రశాంతి నిలయం మర్మాలపై చాలా వివాదాలే నడిచాయి. కాకపోతే ఆయన ఆకరి ఘట్లం కూడా అత్యంత అనుమానాస్పదంగా జవాబుదారి లేకుండా సాగడమే ఆందోళన కలిగిస్తుంది. ఇవన్నీఎవరు నడిపిస్తున్నారు? అక్కడున్న ప్రముఖులు ప్రభుత్వ నేతలు ఎందుకు సహిస్తున్నారు? భక్తులపై ఆదికేశవులు నాయుడు, శ్యాం సుందర్‌ వంటివారు లేవనెత్తిన సందేహాల వెనక సత్యాలేమిటి?బాబా వున్నప్పుడే అంతు చిక్కని ఈ సమాంతర సామ్రాజ్యం ఆయన అనంతరం ఏమి కానున్నది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. కేవలం సంపదకు సంబంధించినవి కాదు, సమాజంపై ప్రభావానికి సంబంధించిన ప్రశ్నలు. అంత్యక్రియల తర్వాతనైనా వీటికి సమాధానాలు రావలసిందే.

అరుణసీమవైపు అందరి చూపు

రాజకీయ ఆసక్తి వున్న వాళ్లెవరైనా, ఏ రాజకీయాలకు చెందిన వారైనా ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే- బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు ఏమవుతాయి? కమ్యూనిస్టు అభిమానులు తమ కంచుకోట దెబ్బ తింటుందా అన్న ఆందోళనతో అడిగితే కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎనిమిదవ సారైనా తమ కల నెరవేరుతుందా అన్న ఆశతో అడుగుతున్నట్టు స్పష్టమవుతుంది. మీడియా ప్రత్యేకించి బెంగాల్‌లో బడా మీడియా, జాతీయంగా టీవీ మీడియా వామపక్ష ఫ్రంట్‌కు చెల్లుచీటి రాసి మమతను మహారాణిగా చూపించేందుకు అహౌరాత్రాలు పని చేస్తున్నాయి. వాటి సర్వేల నుంచి ఎన్నికల కథనాల వరకూ ప్రతిదీ ఆ కోణంలోనే నడుస్తున్నాయి. ఉన్నంతలో వాస్తవికంగానూ సంయమనంతో సమాచార విశ్లేషణ చేసే పత్రికలు ఛానళ్లు అందుకు భిన్నంగా బెంగాల్‌లో హౌరాహౌరీ సమరం సాగుతున్న స్తితిని నివేదిస్తున్నాయి. ఇన్నిటి మధ్యనా ఒక్క వాస్తవం మాత్రం కొట్టవచ్చినట్టు

మోడీని వెంటాడుతున్న మారణహౌమ ఫలం
హౌమం చేసిన వారికి ఫలం దక్కుతుందనేది నమ్మకం. మారణహౌమం చేసిన వారైనా సరే ఆ ఫలాన్ని అనుభవించిక తప్పదు. పురాణ కాలంలో వలె కథల్లో కావ్యాల్లో వలె గాక ప్రజాస్వామ్య యుగంలో రాజ్యంగం ఆ పని చేయవలసి వుంటుంది. అయితే 2002లో గుజరాత్‌లో మైనారిటీలపై సాగిన ఘోర హత్యాకాండకు మాత్రం ఆ సూత్రం ఇంకా అమలు కావలసే వుంది.అయితే తాజాగా గుజరాత్‌ ఐపిఎస్‌ అధికారి సంజరు భట్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌తో మోడీ మరోసారి ఇరకాటంలో

Tuesday, April 19, 2011

వినాయక్‌ సేన్‌ విడుదల హర్షనీయం

మావోయిస్టు సానుభూతిపరుడనే ఒకే కారణంతో మానవ హక్కుల ఉద్యమ నాయకుడు వినాయక్‌ సేన్‌కు రోయచూర్‌ కోర్టు యావజ్జీవ శిక్ష విధించడం దేశ వ్యాపితంగా ప్రజాస్వామిక వాదులందరి విమర్శకు గురైంది. ఈ విషయంలో కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాలు కూడా తాడూ బొంగరం లేకుండా వున్నాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆయనను బెయిలుపై విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో మావోయిస్టు నాయకుడు ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పైన దర్యాప్తు జరపాలన్న ఆదేశం వెలువడింది. మావోయిస్టులను రాజకీయంగా ఎదుర్కోవడం, శాంతి భద్రతల కోణాన్ని కూడా కాపాడ్డం ప్రభుత్వాల బాధ్యత. అంతేగాని బూటకపు ఎన్‌కౌంటర్లు,వినాయక్‌ సేన్‌ వంటివారిపై కక్ష సాధింపులు ఇందుకు మార్గం కాదు. చత్తీస్‌ఘర్‌లో సాల్వాజుడం ప్రయోగం ఇలాటి పోకడలకు పరాకాష్ట. ఈ ఘటనల్లో సుప్రీం ఆదేశాలను ఆహ్వానించినంత మాత్రాన మావోయిస్టుల అర్థ రహిత హత్యా రాజకీయాలను బలపర్చినట్టు కాదు ,వాటిని ఖండించినంత మాత్రాన బూటకపు ఎన్‌కౌంటర్లను బలపర్చాలని కాదు. ప్రజాస్వామిక హక్కులను పద్ధతులను గౌరవించాల్సిన బాధ్యత ఉభయ పక్షాలపై వుంటుంది. ఈ సమయంలోనే బెంగాల్‌లో మమతా మావోయిస్టులకు సంబంధించి వస్తున్న వార్తలను గమనిస్తే కేంద్రం వైఖరిలోనూ ఇటు వీరి పోకడలోనూ కూడా పరస్పర విరుద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వున్నా వినాయక్‌ సేన్‌ వంటి గౌరవనీయ ప్రజాస్వామిక వాదిని నిష్కారణంగా నిరవధిక జైలు శిక్షకు గురి చేయడం సరైంది కాదు. అత్యున్నత న్యాయస్థానం దాన్ని సరిచేయడం సముచితంగా వుంది.

Sunday, April 17, 2011

బాబా బందీ.... భక్తుల మాట??


పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం విషమంగానే వున్నా బాగున్నట్టు బులిటెన్లు విడుదల అవుతున్నాయి. వాటిలో భిన్నమైన కోణాలను మేళవించుతున్నారు. ఈ లోగా కొందరు స్వార్థపరులైన సహాయకుల చేతుల్లో ఆయన అసహాయుడుగా వున్నాడంటూ మీడియాలో కథనాలు విపరీతంగా వెలువడుతున్నాయి. ట్రస్టుపైన భక్తులు కూడా అవిశ్వాసం ప్రకటించి ఆందోళన వెలిబుచ్చుతున్నారు. టిటిడి చైర్మన్‌గా పనిచేసిన మాజీ ఎంపి ఆదికేశవులు నాయుడు స్వయానా ఈ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది.గతంలో హేతువాదులు జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు బాబా ఆశ్రమంలో అక్రమ శక్తులను గురించి ప్రశ్నించినపుడు పెద్ద అపరాధంగా

చండీ యాగం రాగాలు - నాగం మాటల శివాలుమూడు రోజుల పాటు టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్ర శేఖర రావు నిర్వహించిన చండీ యాగంపై అనేక మంది నేతలు వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ యాగం వల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పడినట్టేనని చెప్పడాన్ని అపహాస్యం చేశారు. యాగాలతోనే రాజకీయ నిర్ణయాలు జరిగేట్టయితే ఉద్యమాలు ఎందుకని వారు ప్రశ్నించారు. కెసిఆర్‌కు సంబంధించినంతవరకూ ఆయన మాటలూ చేతలు ప్రతిదీ ప్రచార వ్యూహానికి బాగా ఉపయోగపడే రీతిలో వుంటాయి.ఈ యాగం కూడా అందుకు మినహాయింపు కాదు. వ్యక్తిగత విశా ్వసాలతో పాటు దీని వల్ల కొన్ని వర్గాలను సంతృప్తిపర్చాలనే ఆలోచన కూడా వుండొచ్చు.ఏమైనా దీనిపై విస్త్రత స్తాయిలోనే విమర్శలు రావడం ఆహ్వానించదగిన విషయం. రాజకీయాలను మత విశ్వాసాలను కలగాపులగం చేయడం ఎప్పడూ లౌకిక సూత్రాలకు

కడప రాజకీయ విన్యాసాలు- కాంగ్రెస్‌కు సవాళ్లుఎట్టకేలకు కడప, పులి వెందుల ఎన్నికల పర్వంలో ప్రధాన అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. కాకపోతే ఈ సందర్భంలోనే రకరకాల రాజకీయ విన్యాసాలు, ఎత్తులూ పై ఎత్తులూ రాష్ట్రం చూస్తున్నది.శిబిరాలు మారిన నేతలు,ధన రాశల చెలగాటాలూ, నిన్నటి మిత్రుల మధ్య నేడు వాగ్యుద్ధాలు అన్ని అసలైన ఆధిపత్య రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. ఇందులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా వాస్తవంలో పెద్ద తేడాలేమీ లేవు. వివేకానందరెడ్డి పులివెందులలో పోటీ చేడయం గాని, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జగన్‌పై ధ్వజమెత్తడం గాని విద్రోహమని

Wednesday, April 13, 2011

హజారే దీక్ష, హజార్‌ సవాళ్లు

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిరాహార దీక్షకు దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన, అత్యంత అవినీతి పరులు కూడా అతి బిగ్గరగా సంఘీభావం తెల్పడం అనూహ్యమైనదేమీ కాదు. కమల్‌హాసన్‌ చిత్రం భారతీయుడు ఘన విజయంతో మొదలై ఒకే ఒక్కడు, ఠాగూరు, అపరిచితుడు వంటి చిత్రాల విజయ పరంపర అవినీతిపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని ఆగ్రహానికి ఒక ప్రతిబింబం వంటిదే. వాటిలో పరిష్కారాలు సమగ్రమైనవా సక్రమమైనవా అంటే కాదు. అందుకే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం 'క్షమించడం' అన్న మెగా కథానాయకుడు అవినీతిని అరికట్టేందుకు సోనియా గాంధీ కృత నిశ్చయంతో వున్నారని జన్‌పథ్‌లో ప్రకటించేశారు. కాల్పనికతకూ వాస్తవికతకూ తేడా ఇక్కడే తెలుస్తుంది. జన లోక్‌పాల్‌ బిల్లును తమను కూడా కలుపుకొని హడావుడిగా ఆమోదించాలని పట్టుపట్టిన అన్నా హజారే దీక్ష కూడా అలాటి అవాస్తవిక సన్నివేశాన్నే ఆవిష్కరించింది.
తన దీక్ష దగ్గరకు రాజకీయ వేత్తలెవరూ రాకూడదని శాసించిన అన్నా హజారే రాజకీయ బాబాగా

Sunday, April 10, 2011

తెలుగు దేశం కథనాలు..తెలుగు దేశంలో నాయకత్వ పోరు జరుగుతున్నదంటూ ఇటీవల మీడియాలో వరుసగా వచ్చిన కథనాలపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తారు. కుటుంబాలు వ్యక్తులు రాజకీయాలు పెనవేసుకుపోతున్న నేటి స్తితిలో ఇది వూహించదగిన విషయమే. హరికృష్ణ కృష్ణాజిల్లాపర్యటన సందర్భంగా రేగిన దుమారం ఇందుకు ఒక కారణమే. ఆయన ఆయా సందర్భాలలో కాస్త భిన్న స్వరాలు వినిపించి సర్దుకోవడం తరచూ జరుగుతున్నది. ఇవన్నీ పూర్తిగా అంతర్గత విషయాలైనా తెలుగు దేశం ఇప్పుడున్న స్తితిలో ఎవరూ నాయకత్వ సమస్య రగిలించుకుంటారని భావించలేము. హరికృష్ణ ప్రకటన బహుశా ఒత్తిడి తీసుకురావడానికి దారి తీయవచ్చునేమో కాని అన్న తెలుగు దేశం అనుభవం తర్వాత మళ్లీ ఎవరూ అంత తేలిగ్గా కొత్త ప్రయోగాలు చేయలేరు. బీరకాయ పీచులాటి బంధుత్వాల మధ్య కుటుంబాల మధ్య ఘర్సణ గురించిన వూహాగానాలతో ప్రజలకు ఒరిగేది లేదు. కేంద్రమంత్రి పురందేశ్వరిని ఈ వ్యవహారంతో ముడిపెట్టిన కథనాలను ఆమె కొట్టి వేస్తూనే బాలకృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానిస్తానని వ్యాఖ్యానించడం గమనించదగ్గ అంశం. ఆయన మాత్రం తను తెలుగు దేశం కోసమే పనిచేస్తానని ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ రోజులలో ఒడుదుడుకులు తెలుగు దేశం నేతలు లేదా నందమూరీయుల ముందున్న అవకాశాలు కూడా పరిమితమే. బాలకృష్ణ ప్రకటన ఈ దిశలో తొలి సంకేతం కావచ్చు.జగన్‌ వివేకా, నందమూరి నారా వంటి అంశాలలోనే జనాన్ని ముంచి తేల్చడం వల్ల సమస్యలు మరుగుపడి పోవడం తప్ప ఫలితం నాస్తి. చెప్పుకోదగిన రాజకీయ వ్యక్తులెవరూ ఈ దశలో పెద్దగా దుస్సాహసాలకు గాని ప్రయోగాలకు గాని పాల్పడగల దృశ్యం లేదు. కొంత కాలం తర్వాత గాని రాజకీయ వేదికపై కొత్త కదలికలు రాకపోవచ్చు.బాబా అనారోగ్యం


ఈ వారం రోజులు పుట్టపర్తి సాయిబాబా అనారోగ్యం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశమైంది.కలియగ దైవంగా కీర్తించబడటంతో పాటు లక్ష కోట్లకు పైగా సంపద గల ట్రస్టుకు అధినేతగా సాయిబాబా ఆరోగ్యం ప్రత్యేకాసక్తి కలిగించింది. గతంలో అనేక సార్లు మహిమలకు సంబంధించి వివాదాలు సవాళ్లు ఎదుర్కొన్న సాయిబాబా గత చాలా కాలంగాధార్మిక కార్యకాపాలపై కేంద్రీకరించారు. అవన్నీ ఎలా వున్నా ఆయన ఆనారోగ్య చికిత్స మాత్రం ఆధునిక వైద్య పద్దతుల్లోనే అనివార్యంగా జరిగింది. ఐసియులో ఆయన స్తితి ఏమిటనే దానిపై ఎడతెగని కథనాలు వూహాగానాలు పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి.ప్రభుత్వ ప్రతిపక్ష ప్రముఖులు ప్రజా ప్రతినిధులు వున్నా సత్యం ఏమిటో సూటిగా వెల్లడి అయ్యే స్తితి రావడానికి చాలా సమయం పట్టింది.ఇన్ని విరుద్ధ కథనాల వెనక ఆర్థిక ఆధిపత్య ఘర్షణలున్నాయనే భావన అందరిలో ఏర్పడింది. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటున్నా తటపటాయింపులు కప్పదాట్లు ఎక్కువగానే కనిపించాయి. రాజ్యాంగ బద్దంగానూ ప్రజా సమచార దృష్ట్యానూ జరగాల్సిన విషయాల్లో ఎలాటి తటపటాయింపులు వుండాల్సిన అవసరం లేదన్నది ఇక్కడ ప్రధానాంశం. సాయిబాబా సామ్రాజ్యం విస్త్రతి శక్తి తెలిసినవే గనక ఇప్పటికైనా వాటి గురించి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతివారూ కోరుకుంటారు. బాబా ఆరోగ్యం ప్రస్తుతానికి కుదుటపడిందని అంటున్నా ఆయన సహాయ వ్యవస్థలపై ఆధారపడతున్నట్టు కూడా తెలుస్తూనే వుంది. ఈ దశలోనైనా పుట్టపర్తి ట్రస్టుకు దాని కార్యకలాపాలకు భవిష్యత్తు తీరుకు సంబంధించి స్పష్టత కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన బాబా సహాయకులపైన వుంటుంది. లేకపోతే అకారణ కథనాలు ఆందోళన పెంచడం స్శార్థపరశక్తులకే ఉపయోగపడుతుంది. నిష్కారణమైన నిగూడత సందేహాలు పెంచి పరిస్తితిని సంక్లిష్టం చేస్తుంది.ఇప్పటికే అదనపు బలగాలు ఆంక్షల మధ్య చిక్కుకుపోయిన పుట్టపర్తిలో భక్తులు వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా సమచారం విడుదల చాలా అవసరమవుతుంది.

Friday, April 8, 2011

కడప కదన రంగం...


.

కడప ఎన్నికల సమరంపైనే రాష్ట్రమంతటి దృష్టి కేంద్రీకృతమైంది. కనీసం టీవీ చర్చలూ మీడియా కథనాలు దాని చుట్టూనే తిరుగుతున్నాయి. కడప సమరం జగన్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మాత్రమే జీవన్మరణ పోరాటమనీ, కాంగ్రెస్‌కు సాధారణ ఎన్నికలేనని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్య సగమే సత్యం. ఈ ఎన్నిక ప్రస్తుత తరుణంలో జగన్‌కు సహజ సిద్ధమైన అనుకూలతలు కలిగివుంటుందని వ్యక్తిగత సంభాషణల్లో అన్ని పార్టీల వారూ

ఆశాలపై అమానుషం

విజయనగరంలో ఆశా వర్కర్లపై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ త్రినాథ్‌ అమానుషంగానే గాక అసభ్యంగా కూడా లాఠీ ప్రయోగించిన తీరు దారుణమైంది. బడిపిల్లల మధ్యాహ్న భోజనం వండిపెట్టడంతో సహా అనేక విధులు నిర్వహించే వారికి నెలకు రు.1500 జీతం ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయకపోగా అడగడమే నేరమైనట్టు విరుచుకుపడటం ఘోరం. మీడియాలో వచ్చిన కారణంగా ఆయనపై తాత్కాలికంగా చర్య తీసుకున్నప్పటికీ ఉద్యమాలు పోరాటాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇలాటి పరిణామాలు కలుగుతున్నాయి. పోలీసులు విధి నిర్వహణలో అనివార్యంగా కనీసం తీసుకోవలసిన చర్యలు వేరు, కక్ష కట్టి కొట్టడం దౌర్జన్య పూరితంగా వ్యవహరించడం వేరు.ప్రజలపై అందులోనూ మహిళలపై లాఠీలు ఝళిపించడం, చున్నీలు చెరుగులు లాగడం వంటి పనులు సహించరానివి.

Saturday, April 2, 2011

ఇంగ్లీషు కాలంలో తెలుగు 'న్యూ ఇయర్‌!' శుభాకాంక్షలతో...

.


మిమ్మల్ను ఎవరన్నా ఆదివారం ఎన్నో తేదీ అని అడిగితే ఏమంటారు? ఏప్రిల్‌ 3 అని చెప్పేస్తారు. కొత్త సంవత్సరం మొదటి రోజు అంటారా?బహుశా అనకపోవచ్చు. అదే ఇంగ్లీషు కాలంలో తెలుగు సంవత్సరం.
ఇంతకూ భారతీయులకు పండుగలకు కొదవ లేదు. కొన్ని దేశ వ్యాపితమైనవైతే కొన్ని ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఉత్తరాదిని ధూం ధాంగా జరిగే పండుగలు కొన్ని దక్షిణాదిన మరోలా జరుగుతాయి. దక్షిణాదిన కూడా రాష్ట్రాల వారిగా మారేవి వుంటాయి. అలా చూస్తే తెలుగు కన్నడ మహారాష్ట్ర ప్రాంతాల వారికి పరిమితమైన పండుగ ఉగాది. తెలుగు సంవత్సరం మొదలయ్యే రోజు గనక