Pages

Friday, December 31, 2010

శుభా కాంక్షలతో .. రెండు మాటలు




ఈ బ్లాగును చూస్తున్న మిత్రులందరికీ 2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2010 అనేక విధాల ఉద్రిక్తంగా అనిశ్చితంగా నడిచినా తెలుగు ప్రజల శాంతి కాంక్ష, రాజకీయ చైతన్యం 2011లోకి విశ్వాసంగా అడుగు పెట్టే పరిస్థితిని కల్పించాయి. నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అన్నట్టు ఆలోచనా పరులైన పౌరులే స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు. పరిపాలకుల సార్థపరశక్తుల కుటిలోపాయాలకు పగ్గం వేయగలిగిందీ వారే. కుంభకోణాలు తప్ప లంబ కోణాలకు తావు లేకుండా పోతున్న భారత దేశ పరిస్థితి విశృంఖల సరళీకరణ విధానాల ఫలితమన్న వాస్తవాన్ని గుర్తించడం చాలా అవసరం. తెలిసో తెలియకో చాలా మంది

ఈ ఏడాది మీదే కావాలంటే..

.

మనకున్న సమయం ఎంత;? దాన్ని ఎలా వినియోగించుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? గత ఏడాదికి సంబంధించిన వీక్షణను పూర్తి చేసిన తర్వాత దాన్నుంచి నేర్చుకోవలసిన అంశాలు తీసుకోవలసిన పాఠాలూ ఇందుకు మొదటి ప్రాతిపదిక అయితే రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితుల గురించిన అంచనాలు ప్రణాళికకు ప్రాథమిక వనరు. వాటి ఆధారంగా వాస్తవికమైన దృష్టితో ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి అన్నది రేఖామాత్రంగానైనా

Tuesday, December 28, 2010

మీ కాలం ఖాతాలో.... వీడ్కోలు వీక్షణం

కాలానికి ఏడాది కొండ గుర్తు అనుకుంటే ఏడాది కిందట లేదా ఈ ఏడాదిలో ఏమనుకున్నాము, ఏం చేశాము, అసలేమైనా అనుకున్నామా? ఏమీ అనుకోకపోతే ఇప్పుడైనా వచ్చే ఏడాదికైనా ఏమైనా అనుకుందామా అని చూసుకోవడం మొదటి మెట్టు. అలాటి ఆలోచనే లేకపోతే జీవితం చీకట్లో తడుములాటగానే మారిపోతుంది. ప్రతి వారికి ఏవో ఆకాంక్షలు ఆశలూ ఆశయాలు వుండనే

Saturday, December 25, 2010

వికీలీక్స్‌లో భారతం: విదేశాంగ వికృతం

 
విశ్వ రాజకీయ రంగ స్థలాన్ని విస్పోటనంలా ప్రకంపింప చేస్తున్న వికీలీక్స్‌లో భారత దేశానికి సంబంధించిన అంశాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. విదేశాంగ విధానంలో వికృత విన్యాసాలకు లజ్జాకరమైన లొంగు బాట్లకు తిరుగులేని సాక్ష్యాలను సమకూరుస్తున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు చేపట్టి అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు మరీ ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం మొదలెట్టాక ఆ ప్రభావం విదేశాంగ విధానంపైనా ప్రసరించడం అనివార్యమన్న వామపక్షాల హెచ్చరిక ఎంత వాస్తవమో వికీలీక్స్‌ బయిటపెట్టిన కేబుల్స్‌ను బట్టి తెలిసి పోతున్నది.న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తమ అధినేతలకు పంపిన 3000 కేబుల్స్‌ 2007-2010 మధ్య కాలానికి సంబంధించినవి. అణు ఒప్పందంపై సంతకాలు, వామపక్షాల మద్దతు వుపసంహరణ, మళ్లీ ఎన్నికలు, అనంతరం అణుపరిహారబిల్లును తీసుకురావడం ఇవన్నీ

Wednesday, December 22, 2010

దీక్షలు..ఉపేక్షలు..పరీక్షలు

 

నూతన సహస్రాబ్దిలో తొలి దశాబ్ది ముగిసిపోతున్న తరుణం. ఈ కాలాన్ని మీరెలా చూస్తారని ఛానెల్‌ మిత్రుడు అడిగితే ఒక పోలిక చెప్పాను. 2000 సంవత్సరం లో హైటెక్‌ ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు దశాబ్ది ముగింపు నాటికి రైతాంగ దురవస్థపై నిరవధిక నిరాహారదీక్షలో పట్టువదలకుండా వున్నారు. ఆనాడు ఆయన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌ కాల్పులు ఇతర ఉద్యమాల పునాదిపై అధికారం చేపట్టిన వైఎస్‌రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించగా ఆయన వారసుడుగా పెనుగులాడుతున్న జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా రైతుల సమస్యపైనే 48 గంటల దీక్ష

Tuesday, December 21, 2010

తెలుగు తెర ఆనంద బ్రహ్మ

 

ఏం సినిమాకు వెళ్దాం?
ఫలానా సినిమాకు
బాగుంటుందా?
బ్రహ్మానందం వున్నాడు కదా...

ఆయన పాతికేళ్ల హాస్య రసానందమై,, ప్రేక్షకులు హృదయానందమై,నిర్మాతల కనకానందమై అలా అలా అలరాలుతూ రజతోత్సవ సన్నివేశం చేరుకున్నారు. ఓ ఎనిమిది వందల పై చిలుకు చిత్రాలు చేసేసి సహస్రాధికానికి సాగిపోతున్నారు. కమెడియన్‌ అని ద్వితీయ స్తానంలోకి నెటిyవేయబడే విదూషక పాత్రను తారాపథంలో నిలిపి నిన్నటి హాస్య నట చక్రవర్తుల సరసన తిరుగులేని

Saturday, December 18, 2010

రైతాంగ విషాదం: రాజకీయ వివాదం

రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత కల్లోలితమైన ఒక ఏడాది ముగింపు దశకు చేరుతున్నా ఆ కల్లోలాలకు కారణమైన పోకడలు మాత్రం మారలేదని ఈ వారం జరిగిన అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. ఒకే ఖరీఫ్‌లో అయిదు సార్లు అతలాకుతలం చేసిన తుపానులతో హతాశులైన రైతాంగాన్ని ఆదుకోవడానికి సమగ్రమైన సానుకూల చర్యలను ప్రకటించేబదలు సంఘర్షణాత్మక వైఖరికే ప్రభుత్వం మొగ్గుచూపింది. మరీ ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నాయకత్వం చేపట్టాక జరిగిన మొదటి శాసనసభా సమావేశాలు ఆద్యంతం అవాంచనీయమైన నిరర్థకమైన వాగ్వివాదాలకు పంతాలు పట్టింపులకూ వేదికలుగా

Sunday, December 12, 2010

ప్రజా కవిత్వ వైతాళికుడు

- తెలకపల్లి రవి
 సంప్రదాయం ప్రకారం మనకు మహా రాజశ్రీలు, బ్రహ్మశ్రీలు వున్నారు. రాజులను, స్వాములను సంబోధించేటప్పుడు శ్రీశ్రీశ్రీ అని ఒకటికి రెండు గౌరవ వాచకాలు చేర్చే ఆనవాయితీ కూడా వుంది.

అలాటి అతిశయోక్తులేమీ లేకుండానే సహజ నామంలోనే రెండు శ్రీశ్రీలు ఇముడ్చుకున్న ఒకే ఒక సుప్రసిద్ధుడు శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు. ఇది ఆయన శత జయంతి సంవత్సరం.

Telakapalli Ravi, Sukhender & Prabhakar - War of words between Ministers, MPs in Andhra - 02

Telakapalli Ravi, Sukhender & Prabhakar - War of words between Ministers, MPs in Andhra - 01

Saturday, December 11, 2010

రాజకీయ ఖాయిలా - సమస్యల వాయిదా

- తెలకపల్లి రవి

తుపాను ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులూ పర్యటించారు గాని పరిస్థితి తీవ్రతకు సరిపడిన చర్యలేవీ ప్రకటించిన దాఖలాలు లేవు.గత వరదలు, తుపానుల సహాయమే ఇంకా అందవలసి వుండగా తాజా నష్టం నుంచి పరిహారం లభిస్తుందన్న భరోసా ఎక్కడా కనిపించడం లేదు. ఇదే గాక కాంట్రాక్టు లెక్చరర్లు, 104 వుద్యోగులు, బీడీ కార్మికులు, ఉపాధ్యాయ వుద్యోగ వర్గాలు, నియామకాలు కోరుతున్న నిరుద్యోగులు ఇలా అన్ని తరగతుల ప్రజల సమర ఘోషతో ధర్నా చౌక్‌ దద్దరిల్లుతున్నది గాని పాలకుల నుంచి పరిష్కార సూచనలే రావడం లేదు.

Saturday, December 4, 2010

దొరికి పోతున్న మీడియా

మీడియా నిష్పాక్షికత గురించి నిత్యం కబుర్లు వినిపిస్తూనే వుంటాయి.అదేదో నిష్కామకర్మగా నివేదించడానికే అంకితమైందన్నట్టు మాట్లాడుతుంటారు. కాని వాస్తవంలో ధనాఢ్యవర్గాలు ఆధిపత్య శక్తుల ప్రయోజనాలనే మీడియా ప్రతిబింబిస్తుందని నిస్సందేహంగా నిరూపించే పరిణామాల పరంపర ఇటీవల చూస్తున్నాము. ఇవన్నీ మీడియా వర్గస్వభావాన్ని తేట తెల్లం చేస్తున్నాయి. అది అన్నిటికీ అతీతమైనట్టు నిష్పాక్షికమైనట్టు వినిపించే కథనాల లోగుట్టు తేలిపోతున్నది. సాక్షాత్తూ

మసక బారిన క్యారెక్టర్‌ పాత్రలు!

సినిమా అంటే హీరో హీరోయిన్లే కదా.. ఫలానా హీరో సినిమా అంటారు.. అందుకోసం ఎదురు చూస్తారు.. బాగుంటే కేరింతలు కొట్టడం,బాగాలేకుంటే చప్పుడుచేయకుండా సర్దుకోవడం ఇవన్నీ మామూలే. మొత్తం ప్రచారమంతా ఆ హీరోల చుట్టూనే! కొంతవరకు హీరోయిన్లు ఆ పైన కమెడియన్తు, కొత్తగా వచ్చిన వారైతే విలన్లు.. అంతే! అయితే ఏ చిత్రం కూడా వీళ్లతోనే పూర్తయిపోదు. వీళ్లకు తోడుగా అనేక ఇతర పాత్రలుంటాయి. అవే క్యారెక్టర్‌ పాత్రలు.
తమాషా ఏమంటే అసలు క్యారెక్టర్‌ అంటేనే పాత్ర. మరి క్యారెక్టర్‌ పాత్రలేమిటి అంటే ఇది సినిమా భాష. నాయికానాయకులు చుట్టూ తిరిగే సినిమా రంగంలో ఇతరత్రా ప్రాధాన్యత గల పాత్రలను ఆ పేరుతో పిలవడం కద్దు. మామూలు భాషలో చెప్పాలంటే తల్లులు, తండ్రులు, అన్నలు, వదినెలు, అత్తలు మామలు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, జానపదాల్లో రాజులు మంత్రులు వంటి పాత్రలు. ఇవన్నీ చెబుతుండగానే పాఠకుల కళ్లలో కొందరు మహామహులైన నటీనటులు కదలాడటం మొదలెడతారు. సందేహం లేదు-నాలుగు పదులకు అటూ ఇటుగా వున్నవారికి ఆ పై వారికి ముందుగా గుర్తుకు వచ్చే గంభీర విగ్రహుడు ఎస్వీఆర్‌. తర్వాత గుమ్మడి. నాగయ్య, ఆ పైన మిక్కిలినేని, ముక్కామల, సీఎస్సార్‌,

ధన్యవాదాలు.....

నమస్తే. ఈ బ్లాగును చదివి స్పందిస్తున్న సీనియర్‌ బ్లాగర్లకు మా కార్యాలయ కంప్యూటర్‌ నిపుణుడు రాజు సహాయం వల్ల ఇది ప్రారంభమైంది. నేను సమయం కేటాయించడానికి, స్వయంగా నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ నెలలోనే దీన్ని మరింత సమగ్రంగా తీర్చి దిద్ది చలన చిత్రాలు, సాహిత్యం, సామాజిక భావనలు, వ్యక్తిగత స్పందనలు, చర్చల,మీడియా పోకడలు వంటివి కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఇందుకు సంబంధించి ఏవైనా సూచనలు సలహాలకు సదా స్వాగతం. ఇప్పటి వరకూ తిలకించిన పలకరించిన ప్రతివొక్కరికి హార్దికాభినందనలు. వీలును బట్టి ప్రతి వారికి సమాధానం ఇచ్చేందుకు కృషి చేస్తాను.ఏవైనా నేను చెప్పగలిగిన అంశాలు అడిగితే తప్పక చెప్పడానికి ప్రయత్నిస్తాను.

Wednesday, December 1, 2010

ఆధిపత్య క్రీడలు, అస్తిరత్వపు నీడలు

నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి 39 మందితో పూర్తి చేసిన మంత్రివర్గ ఏర్పాటులో కాంగ్రెస్‌ రాజకీయ దృశ్యం యావత్తూ గోచరిస్తుంది. అసలు మంత్రివర్గం ఖరారుకు ఇంత సమయం తీసుకోవడంలోనూ, తర్వాత ఇంతమందికి చోటు కల్పించడంలోనూ కూడా ఇప్పటి అస్థిరత్వపు నీలినీడలు ఆధిపత్య క్రీడలూ అగుపిస్తాయి. ఈ ఏర్పాటుకు రెండు రోజుల ముందే కడప ఎంపి వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి తన తల్లి విజయ లక్ష్మితో సహా