Pages

Wednesday, February 15, 2012

విజయమ్మ పిటిషన్‌ తోసివేత: స్పందనలుతెలుగు దేశం అద్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులపై దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్‌ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను అనేక మలుపుల తర్వాత హైకోర్టు కొట్టి వేసింది. దీనిపై న్యాయ పరమైన పరిశీలన కంటే రాజకీయ వాగ్యుద్దాలే ఎక్కువగా చూడక తప్పదు.తీర్పులు లేదా ఉత్తర్వులు తమకు అనుకూలంగా వస్తే న్యాయం ధర్మం గెలిచినట్టు ప్రతికూలంగా వస్తే ఏదో తప్పు జరిగినట్టు అనిపించడం సహజం. అయితే ఒక వ్యవస్థను ఆశ్రయించిన వారు ఆ సూత్రాల పరిధిలోనే వ్యవహరించక తప్పదు. ఇప్పుడు వారు సుప్రీం కోర్టుకు వెళ్లడం ఎలాగూ జరుగుతుంది. న్యాయ స్తానాలు కూడా విమర్శలకు అతీతం కాదు గాని వాటిపై మాట్టాడేప్పుడు కాస్త ఆచితూచి స్పందించడం మంచిది. ఇక మొత్తం పిటిషన్‌ను తోసి పుచ్చడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు ప్రతివాదుల వాదన వినకుండానే గతంలో వచ్చిన తీర్పుపై విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి వుంటుంది. నాట్‌ బి ఫోర్‌ సమస్య అంటే అది ఈ కేసుకే పరిమితం కాదు. పైగా కొన్ని ఆరోపణలు చేయడం ద్వారా బెంచీలు మారడానికి కొంత వరకు తామూ కారకులమైనామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వారు ఒప్పుకోవలసి వుంటుంది. ఇటీవల పలు కేసుల్లో వరుసగా సుప్రీం కోర్టులోనూ హైకోర్టులోనూ ఆశాభంగం ఎదురవుతుంటే రాజకీయంగానూ న్యాయపరంగానూ తమ వాదనల్లో లోటు పాట్లు ఏమిటని సమీక్షించుకోవాలి గాని ప్రత్యర్థులపై విరుచుకుపడినా మీడియాను లేదా కోర్టులను తప్పు పట్టినా ఫలితం లేదు. తెలుగు దేశం కూడా కొంత వరకూ సంతోషించవచ్చు గాని ఎమ్మార్‌ కేసులో చంద్రబాబు హయాంలో వాటిపైనా విచారణ జరుపుతామని సిబిఐ సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి గుర్తుంచుకోవాలి. కనక రాజకీయ మధనం ఇంకా చాలా జరుగుతుంది.

శ్రుతి మించిన మతభాష్యం


సరికొత్త బొగ్గు కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు నిజం కాదని సిఎజి వినోద్‌ రాజా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసినట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్నది. వాస్తవం ఏమంటే సిఎజి నివేదిక లీకేజిపై ప్రధాని కార్యాలయం ఆరా తీస్తే దాన్ని మాత్రమే ఆయన ఖండించారు. విచారం వెలిబుచ్చారు. పైగా సిఎజిని సమాచార హక్కు చట్టం కింద చేర్చాలని కూడా కోరారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో మాత్రం తాము ఎలాటి ముసాయిదా(చిత్తు ప్రతి) నివేదిక కూడా ఇంత వరకూ ఇవ్వలేదని ఇంకా పరిశీలన చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఒక కీలకమైన సాంకేతికమైన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఆడిటింగ్‌లో ఏవైనా ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం ఒక పట్టాన ముగిసేది కాదని, అప్పటి వరకు వాటిని తాత్కాలిక అభిప్రాయాలుగానే పరిగణించాల్సి వున్నందున తమ దృష్టికి వచ్చిన అంశాలను కూడా చెప్పగల స్తితి వుండదని సూచించారు. బొగ్గు కుంభకోణం విషయానికి వస్తే అలాటి ఆరోపణలే లేవని ఆయన లేఖలో ఎక్కడా పేర్కొనటేదు. సిఎజి లేఖ

Tuesday, February 7, 2012

కర్ణాటకలో సంసృతీ పరిరక్షకుల అశ్లీల లీలలు!


కర్ణాటకకు సంబంధించి ఒకే రోజున మీడియాలో వెల్లడైన రెండు వార్తలు స్వయంప్రకటిత భారతీయ సంసృతీ పరిరక్షకుల నిజ స్వరూపాన్ని వెల్లడిస్తున్నాయి.పుణ్య క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లే ఉడిపిలో అశ్లీల టూరిజాన్ని లేదా జారిజాన్ని ప్రోత్సహించినందుకు ప్రజా గ్రహం పెల్లుబికింది.ఆ నిరసన సాగుతుండగానే బిజెపి మంత్రి వర్గ సభ్యులు అక్షరాల శాసనసభలో అశ్లీల చిత్రాలు చూసి ఆనందిస్తూ దొరికి పోయారు. ఆరు మాసాలు పూర్తి చేసుకున్న సదాశివగౌడకు ఇది అర్థ సంవత్సర కానుక అన్నమాట. గతంలో అడ్డగోలుగా కేటాయించిన గనుల లైసెన్సులను సుప్రీం కోర్టు సాధికార సంఘం రద్దు చేయడం కూడా దీనికి తోడుగా చెప్పుకోవచ్చు. అపర ధర్మ పరాయణల అవినీతి అశ్లీల కాండను తప్పు పట్టడం మాత్రం అపరాధమేనేమో! కాని సంస్కార వంతులైన కర్ణాటక ప్రజానీకం వీటిని సహించే స్తితిలో లేరు. వాలెంటిన్స్‌ డే తప్పనీ, ఫలానా వస్త్ర ధారణ పొరబాటనీ దౌర్జన్యం చేసే సంఘ పరివార్‌ స్వంత పరివారం ఎంత ఘోరంగా వుందో తెలియడానికి ఈ ఉదాహరణలు చాలవా?

మంత్రిపై ఆరోపణ: తీవ్ర ప్రభావం తథ్యంలిక్కర్‌ మాఫియాపై దాడులు ఎంత సమర్థనీయమో దొరికిన ఆధారాలను బట్టి చర్యలు తీసుకోకపోవడం అంత పొరబాటని చర్చల్లో చాలా సార్లు చెప్పాను. మాఫియాల వివరాలు దొరికినా సమయం ఇవ్వడమంటే వారిని కాపాడేందుకు సమయం ఇచ్చినట్టే అనుకోవాలి. ఇది అంతర్గతంగా వత్తిడి తేవడానికి ఉపయోగించడం తప్ప కఠిన చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని లోగడనే తేలిపోయింది. మాఫియాల మాఫీకే ఇది దారి తీస్తుందని స్పష్టమైంది.ఇలాటి తరుణంలో ఎక్సయిజ్‌ మంత్రి మోపిదేవి వెంకటరమణకే ముడుపులు ఇచ్చినట్టు మాఫియా కింగ్‌ నున్నా వెంకట రమణ చెప్పినట్టు ఎసిబి డైరీలో పేర్కొన్న వార్త పెను సంచలనమే.షరా మామూలుగా మంత్రి దీన్ని ఖండిస్తున్నా అంత సులభంగా తీసుకోవడానికి లేదు. పైగా మంత్రి మొదటి నుంచి లిక్కర్‌ వేలం రేట్లు ఎక్కువగా వున్నందుకే అధిక ధరలకు అమ్ముతున్నారని సమర్థిస్తూ వచ్చారు. ఒక విధంగా ఆయన వాదన లిక్కర్‌ సిండికేట్‌కు సమర్థనలాగానే సాగింది. పైగా ఎవరిపైనా చర్య తీసుకోవడం గాక విధానాన్ని మార్చడం ముఖ్యమని మాత్రమే ఆయన చెబుతూ వచ్చారు. ఆ దశలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనపై ఇప్పుడు నేరుగా ప్రస్తావన వచ్చాక రాజకీయ ప్రభావం పడకుండా వుండదు.ఇప్పుడిప్పుడే మంత్రివర్గ విస్తరణతో కాస్త వూపిరి పీల్చుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీని వల్ల తన ప్రభుత్వానికే కళంకం రాకుండా జాగ్రత్త పడతారని కూడా అనుకోవచ్చు. ఇది కళంకిత మంత్రులందరికీ హెచ్చరికగానూ వుంటుంది.ఇప్పటికే అవినీతి వ్యవహారాలలో ఐఎఎస్‌లనే పట్టుకుంటూ అమాత్యులను వదిలేస్తున్నారన్న విమర్శలకు బలం చేకూరుతుంది.అధినేతలనూ అధికారులను ఆడించే అక్రమార్జనా పరులను కూడాపట్టుకుంటేనే అవినీతిని కాస్తయినా అరికట్టడం సాధ్యపడుతుంది.

ఖమ్మంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు: అపూర్వ సంరంభం
ఫిబ్రవరి 2,3,4 తేదీలలో ఖమ్మంలో జరిగిన సిపిఎం ఆంధ్ర ప్రదేశ్‌ 23వ మహాసభ, ప్రత్యేకించి చివరి రోజున అపూర్వంగా జరిగిన బహిరంగసభ రాష్ట్రమంతటినీ ఆకర్షించాయి. రాజకీయ విశిష్టతకే గాక నిర్మాణ దక్షతకు కూడా అద్దం పట్టాయి. ప్రాంతాలవారీ రాజకీయంలో ప్రతిదీ వివాదాస్పదమవుతున్న నేటి కాలంలో వీర తెలంగాణా పోరాట క్షేత్రమైన ఖమ్మం నడిబొడ్డున లక్షలకు లక్షల మంది ప్రజలు అత్యంత క్రమ శిక్షణగా సమీకృతులై ఎర్ర జెండా సత్తా చాటారు. అంత పెద్ద సభలోనూ చిన్న అపశ్రుతి కూడా దొర్లనివ్వని ఆహ్వాన సంఘం ప్రణాళికా రచన, అచరణ అందరి జేజేలందుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలలోనే అత్యంత అనిశ్చిత కాలంలో అరుదైన ఆదర్శాన్ని, అనితర సాధ్యమైన ఉత్తేజాన్ని అందించిందీ సభ.
ఖమ్మం ఒక అరుణ వనం...
కనుచూపు మేరలో జన సందోహ సముద్రం తప్ప ఖాళీ స్థలం కనిపించని అనూహ్య స్పందన ప్రత్యర్థి వర్గాలలో ప్రకంపనలు పుట్టించి, మైకులు తీసేయించడం, ప్రసారాలు నిలిపేయించడం వంటి అవివేకపు పనులకు కారణమైంది. అవన్నీ సభికుల సంకల్పాన్ని ఇంకా దృఢతరం చేశాయి. వేదికపై వక్తలు ఈ దుర్నీతిని ఎండగడుతుంటే అక్కడ చేరిన లక్షల కంఠాలు ఒక్కపెట్టున ఖండించాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే ఈ అవివేకపు అల్పిష్టి చేష్టలు అక్కసు పనులు అందరిలో అసహ్యాన్ని కలిగించాయి. అరుణవనంలా మారిన ఖమ్మం సభల సందేశం అందరినీ ఆవరించి కొత్త చైతన్యం నింపింది.
2010 ఆగష్టులో విజయవాడలోనూ సిపిఎం కేంద్ర కమిటీ విస్త్రత సమావేశాల ముగింపులో పెద్ద సభ జరిగింది. అక్కడా ఇక్కడా కూడా సిపిఎం చెప్పిన విధానం ఒక్కటే. రాజకీయ సారాంశం ఒక్కటే. బహుశా ఇంత బలంగా స్వంత గొంతు వినిపించగలుగుతున్నందుకే ఇంతటి ప్రజా దరణ పెల్లుబికిందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లా నుంచి కూడా గణనీయంగా ప్రజలు హాజరవగా మరికొన్ని జిల్లాల నుంచి కూడా తర తమ తేడాలతో పార్టీ అభిమానులు విచ్చేశారు. 'తెలంగాణా లేదు ఆంధ్ర లేదు అంతా జనమే జనం' అన్నాడు ఖమ్మంలో ఆ రోజు రాత్రి నేనెక్కిన ఆటో డ్రైవర్‌ పక్క పాసింజరుతో. పార్టీ అగ్రనేతలు కూడా