హైదరాబాదు దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయింత్రం సంభవించిన విధ్వంసక విస్పోటనం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై ఒక పరోక్ష వ్యాఖ్యానం. సహకార ఎన్నికల విజయాలపై శ్రుతిమించిన ఉత్సాహంలో మునిగి ఆత్మ స్తుతి అవధులు దాటిన అధినేతలకు ఒక కుదుపు. మరొకరికి పని లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పరస్పరం అభిశంసించుకుంటున్న అరుదైన ఘట్టం! ఆ క్రమంలో రెండు చోట్లా పాలిస్తున్న పార్టీ అపహాస్యం పాలవుతున్న వైపరీత్యం.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు అకస్మాత్తుగా అనూహ్యంగా జరిగిన పరిణామాలు కాదు. హైదరాబాదుకు బాంబు దాడులు ముప్పు పొంచి వున్నదని గత నెలరోజులుగా హెచ్చరికలు వినిపిస్తూనే వున్నాయి. ప్రజాశక్తి కూడా గత నెల 13వ తేదీన పతాక శీర్షిక నిచ్చి ప్రచురించింది. ఇతరత్రా కూడా బాంబు హెచ్చరికలు వచ్చి శాసనసభను డిజిపి కార్యాలయాన్ని తనిఖీలు చేసిన సందర్భాలున్నాయి. ఒకటి రెండు చోట్ల బాంబులను నిర్వీర్యం చేసిన ఘటనలూ వున్నాయి. అన్నిటినీ మించి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో రకరకాల రాజకీయ శక్తులు పాచికలు వేస్తున్న తీరు విదితమవుతూనే వుంది. మతోద్రిక్తతలు పెంచేందుకు దేశ విదేశాలలో పొంచి చూస్తున్న సంస్థలు పక్షాల గురించి చెప్పనవసరం లేదు. భాగ్యలక్ష్మి వివాదంతో మొదలై అక్చరుద్దీన్ అరెస్టు విడుదల వరకూ జరిగిన పరిణామాలు సహజంగానే ఉద్రిక్తత పెంచాయి. ప్రాంతీయ వివాదాలపై వాదోపవాదాలు కూడా అనిశ్చితిని పెంచి ఆందోళన కలిగించాయి. గత నెలలో బాంబులు పట్టుపడటం, డిజిపి కార్యాలయం శాసనసభలతో సహా బెదిరింపులు రావడం తెలిసిన విషయమే. వీటిపై ప్రజాశక్తి పతాక శీర్షికలు ఇచ్చింది కూడా. సామాన్య ప్రజలు కూడా సందేహిస్తున్న ముప్పు సూచనలు ఏలిన వారికి మాత్రం కనిపించలేదు. కేంద్రం హెచ్చరికలు పంపితే అవి మామూలే అనుకున్నారట!(వారిని కాపాడ్డం కోసం ఇప్పుడు కేంద్ర హౌమంత్రి కూడా మామూలు పల్లవి ఎత్తుకున్నారు) అలసత్వం లేదా అసమర్థత ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ప్రస్తావించకుండా వుండటం ఎలా సాధ్యం?
కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక తక్కిన దేశంతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా