Pages

Friday, February 18, 2011

చట్టసభలు దాడులతో చట్టుబండలైన వేళ



చట్టసభలు దాడులతో
చట్టుబండలైన వేళ
రాజకీయ ఉద్యమాలు
రాజ్యాంగపు మాటలేల?

వీర తెలంగాణా ప్రజల
విజ్ఞతకే పరిహాస్యం
సమరశీల తెలుగు జనత
చేతనకే అపహాస్యం

నిన్న శాసనసభలో ఘటనలపై టీవీ9, సాక్షి ఛానళ్లలో చర్చలో పాల్గొన్నపుడు చెప్పిన చరణాలివి. నిస్సందేహంగా నిన్నటి ఘటనలు ఆవాంచనీయమైనవి, ఆందోళనకరమైనవి కూడా. టీవీ9లో తొలుత చర్చలో పాల్గొన్న హరీష్‌ రావు దాడులను సూటిగానే ఖండిస్తున్నట్టు చెప్పారు. తర్వాత కిర్నె ప్రభాకర్‌ మాత్రం సహజ శైలిలో పాత థోరణిలోనే మాట్లాడారు. దానిపై నేను స్వల్పంగానే స్పందించాను. ఎందుకంటే టిఆర్‌ఎస్‌లో మొదటి నుంచి నేను చూసిన మేరకు కెసిఆర్‌, కెటిఆర్‌,కవిత, హరీష్‌(కొంత వరకూ వినోద్‌) వంటి వారు మాట్లాడే తీరుకు అధికార ప్రతినిధులుగా వచ్చే వారు మాట్లాడే తీరుకు తేడా వుంటుంది. అగ్ర నాయక పరివారంలో వారు అవతలి వారిని తేలిగ్గా తీసేస్తూనే తర్కం వినిపించడానికి
ప్రయత్నిస్తారు.వారి ప్రతినిధులేమో ఆగ్రహంతో అవతలివారిపై ఆరోపణలు కురిపించడానికి హడావుడి పడుతుంటారు. ఇదో పని విభజన లాటిది. ప్రత్యక్ష రాజకీయాలకు శుద్ధ వాదనలకు తేడా కూడా కావచ్చు.

మరోవైపునుంచి చూస్తే జయ ప్రకాశ్‌ గారు భారతీయులు స్వాతంత్రానికి అనర్హులు అని చర్చిల్‌ అన్న మాటలను ఉటంకించడం అనవసరమే గాక అసందర్భం కూడా. రాజకీయ పార్టీలకూ ఉద్యమాలకూ అతీతంగా వున్నట్టు సూక్తులు చెప్పడం ఆహ్వానించదగింది కాదు. ఎవరి మార్గంలో వారు పని చేస్తారు.మంచి చెడ్డలు ప్రజలు నిర్ణయిస్తారు. సమయం సందర్భం బట్టి సంయమనం చూపించవలసిన బాధ్యత అందరిపైనా వుంటుంది. మహాత్మాగాంధీని అర్థనగ సన్యాసి అని గేళి చేసి చివరి వరకూ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదపు అవశేషంగా మిగిలిపోయిన చర్చిల్‌ పేరు తల్చుకోవలసిన అవసరం స్వతంత్ర భారతానికి లేదు. చర్చిల్‌ వక్త అయితే కావచ్చు. తెలివైన నేత అయితే కావచ్చు. అంతకంటే గొప్ప వివాదాస్పదుడు.సభలో గొడవ జరిగినంత మాత్రాన రాష్ట్రపతి పాలన రావలని, మనకు పాలించుకునే అర్హత లేదని అనుకోవడం కూడా అభ్యంతరకరమే. ఆ మాటలన్ని అవసరం లేదు. ఇంతకూ అమెరికా బ్రిటన్‌ వంటి పాశ్చాత్య దేశాలను ఆదర్శంగా చెప్పే వైఖరి జెపి విరమించుకుంటారని ఆశించాలి.

అయితే జెపి ఏం అన్నారనుకున్నా అది ఆయనపై దాడికి సమర్థన గాని సాకు గాని కాదు. అందులోనూ టిఆర్‌ఎస్‌ అగ్రనాయకులందరూ వుండి మరీ దాడి చేయడం ఇంకా దారుణం. ఈ క్రమంలో పాలడుగు కూడా దెబ్బ తినడం బాధాకరం. ఈ విషయంలో అయిదుగురిని సస్పెండ్‌ చేశారని తాజా సమాచారం చెబుతున్నా అంతకంటే ముఖ్యమైంది రాజకీయ సమీక్ష. అహింసా మార్గం గురించి చెప్పిన మాటలకు ఆదిలోనే పెనుదాడులు సాగించడానికి ఎలాటి పొంతన లేదు. తనకంటూ బలం వున్న టిఆర్‌ఎస్‌ ఇలా చేయవలసిన అవసరమూ లేదు. బయిట సాధారణ ప్రజలు సహాయనిరాకరణ శాంతి యుతంగా చేస్తుంటే సభా వేదికపై ఇలాటి అఘాయిత్యాలకు పాల్పడ్డం స్వీయాభిశంసనం వంటిదే.
నాగం, కడియం శ్రీహరి వంటి వారి వైఖరికి వ్యతిరేకంగా అధినేతకు తోడు నిలిచినట్టు పేరు తెచ్చుకున్న రేవంత్‌ రెడ్డి వంటి వారు ఈ ఘట్టంలో టిఆర్‌ఎస్‌తో పోటీ పడబోయి పరిస్థితిని మరింత జటిలం చేశారని పిస్తుంది. ఈ విధమైన పోటాపోటీ ఉద్రిక్తత ఎవరికీ మేలు చేయదు.
తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు అధిష్టానాన్ని ఒప్పించే పేరిట ఢిల్లీలో మకాం వేసి ఇబ్బంది కరమైన ఈ ఘట్టాన్ని దాటేశారు.
కనక దాడి పూర్వాపరాలు పరిశీలిస్తే ఇందలో లోతైన రాజకీయ ప్రయోజనాలు వైరుధ్యాలు వున్నాయని స్పష్టమవుతుంది. ప్రజలు అప్రమత్తంగా వుండి అన్ని రకాల కుట్రలనూ కుత్సితాలనూ పూర్వపక్షం చేయడమే నేడు జరగాల్సింది. ఎందుకంటే కేంద్రం ఉద్దేశపూర్వకంగానే దాగుడుమూతలాడుతూ ప్రాంతాల, ప్రజల మధ్య తంపులు పెడుతున్నది. (18,2,11 4 జూఎ)

21 comments:

  1. రవి గారికి నమస్కారం!!
    మీ విశ్లేషణ చాల బాగుంది. చాల చక్కగా మీ తెలంగాణా అనుకూల వాదనను మరోసారి సమర్దించుకున్నారు. కాని, నిన్న Assembly lobby లో J.P.గారు వ్యక్తం చేసిన అభిప్రాయంలో తప్పు ఎముంది. మన శాసనసభల పరిస్థితి ఈ విధంగా కొనసాగుతూ పోతే మిగతా దేశస్థులే కాదు, మన దేశస్థులే ఆ విధంగా అనుకోరు అనే నమ్మకం మీకుందా? అదేవిధంగా ఆయా రాజకీయ పక్షాలు వారి విధానాలపై పోరాడుతున్నప్పుడు, ప్రక్కవారి అభిప్రాయాలను కూడా గౌరవించాలనే కనీస పరిజ్ఞానం ఉండవద్దా. వారికి లేనప్పుడు, మీ లాంటి మేధావులు అనుకునేవారైనా ఆ విషయాన్ని ఆ మూర్ఖ శిఖామణులకు చెప్పవద్దా మహాశయా!!! ఈ వ్యాఖ్యానాలు మనలను మనం మోసం చేసుకోడానికి కాదా ఆచార్యా!!!

    ReplyDelete
  2. ఒకవేళ జెపి కోవర్ట్ సమైక్యవాది అయితే ముఖ్యమంత్రి అంత కంటే పోటుగాడైన కోవర్ట్ సమైక్యవాది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాకముందే తెలంగాణాలో భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించడం, కోస్తా ఆంధ్రలో అంతగా పోలీసుల్ని పెట్టకపోవడం చూస్తే ప్రభుత్వం సమైక్యవాదానికే ప్రిఫరెన్స్ ఇస్తోందని ఎవరికైనా తెలిసిపోతుంది. జెపిని కొట్టడం తప్పే. ఎందుకంటే అతనికంటే పెద్ద దొంగలు చాలా మంది ఉన్నారు. వాళ్లు తెలంగాణా ఇచ్చేది తమ పార్టీయేనని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.

    ReplyDelete
  3. "ఇంతకూ అమెరికా బ్రిటన్‌ వంటి పాశ్చాత్య దేశాలను ఆదర్శంగా చెప్పే వైఖరి జెపి విరమించుకుంటారని ఆశించాలి "

    అమెరికా,బ్రిటన్ లాంటి దేశాల్లోని మంచి విధానాలగురించే JP ప్రస్తావిస్తుంటారు గానీ ఆ దేశాలు అనుసరించే అన్ని విధానాలు మంచివని JP ఎక్కడా చెప్పలేదు. అలాగే చైనా లోని మంచి విధానాల గురించి కూడా JP చాలా సార్లు చెప్పిఉన్నారు. అణుమానముంటే యూటూబ్ లో ఆయన ప్రసంగాల లింకుల్ని ఓసారి చూడండి. అమెరికా,బ్రిటన్ లను తిట్టని వాల్లు అందరూ మీకు(కమ్యూనిస్టులకు) వ్యతిరేకులే అనుకుంటే ఎలాగండి? ఆయనపై దాడి కరెక్ట్ కాదు, కానీ.. అంటూ ఇలా 'కానీ' లు 'అణాలు' లెక్కిస్తూ లోలోన సంతోషిస్తున్న వారితో మీరు కూడా చేరిపోవడం కొంత బాధిస్తుంది.

    ReplyDelete
  4. మన సమాజంలో బుద్ధి జీవులుగా పరిశీలకులుగా పరిగణించబడే మీ వంటి మిత్రులు- నేను రాతలో అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాత కూడా ఇలాటి స్పందనలు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణా విభజన కోరే మేధావులు ఒక వైపున, పరిమితమైన కోణం నుంచి దాన్ని వ్యతిరేకించేవారు మరో వైపున ఇష్టాను సారం ముద్రలు వేస్తున్నారు.పైన రాసిన వ్యాఖ్యలు చదివిన తర్వాత రెండు రకాలైన భాష్యాలు చెప్పడానికి ఎలా వీలు కలిగిందో నాకు బోధపడటం లేదు. జెపిపై దాడిని ఖండిస్తూనే ఆయన మాటలలో కూడా కొంత పొరబాటు వుందని చెప్పడం నేరంగా కనిపిస్తున్నది. వాటిని ప్రస్తావిస్తూనే దాడి తప్పు అంటే మరో భాగానికి అపరాధమవుతున్నది. ఉభయులు సమగ్రమైన కోణం నుంచి చూస్తే తప్ప నేను చెబుతున్నది అర్థం కాదు. దయచేసి స్తిమితంగా పరిశీలించి స్పందించండి.కోవర్టు సమైక్య వాది డైరెక్టు అనైక్య వాది ఇన్ని రకాలుండరు... వారి వారి స్తానాలను రాజకీయ ప్రయోజనాలను బట్టి మాట్లాడుతుంటారు. జెపి కూడా విడిపోయినా కలిపి వుంచినా దానితోనే తలకిందులయ్యేది లేదని చాలా సార్లు చెప్పారు. ఇక కిరణ్‌ కుమార్‌ రెడ్డి లేదా రోశయ్య తమ రాజకీయ మనుగడను బట్టి వ్యవహరిస్తారు తప్ప వారికి స్థిరమైన వైఖరి వుండదు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి వంటి వారు మరింత సూటిగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు.ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ తెలుగు దేశం అదే కొనసాగిస్తున్నాయి..
    అటూ ఇటూ కూడా తీవ్రమైన పదాలతో ధ్వజమెత్తడం వల్ల ఫలితం వుండదు.ప్రజలకు అప్రమత్తంగా విచక్షణగా వుండేందుకు దోహదం చేయాలి.

    ReplyDelete
  5. జెపిపై దాడిని ఖండించడంలో నేను కానీలు అర్థనాలేమీ వాడలేదు. ఆయన చైనాను కూడా తిట్టినా నాకు అభ్యంతరం లేదు. భారత స్వాతంత్రానికి బద్ద వ్యతిరేకి అయిన చర్చిల్‌ను ఉటంకించడాన్ని మాత్రం ఆమోదించలేను

    ReplyDelete
  6. >>>>>
    కోవర్టు సమైక్య వాది డైరెక్టు అనైక్య వాది ఇన్ని రకాలుండరు... వారి వారి స్తానాలను రాజకీయ ప్రయోజనాలను బట్టి మాట్లాడుతుంటారు.
    >>>>>

    స్థానాలను, రాజకీయ ప్రయోజనాలను బట్టి మాట్లాడడాన్నే కపటత్వం అని నేను అంటున్నది.

    ReplyDelete
  7. వీర తెలంగాణా ప్రజల
    విజ్ఞతకే పరిహాస్యం

    .......ఇది పచ్చి నిజం

    ReplyDelete
  8. దాడి విచారకరం, దురదృష్టం.


    జెపి గారి ని అభిమానించే మాకు,
    అంటుంటే నమ్మకం కలగలేదు కాని ..
    వ్యూహాత్మకమైన పదజాలం జెపిగారి మాటల్లో మొదటిసారి కనబడింది.
    ఎప్పుడూ స్పష్టతతో తొనికిస లాడే జెపిగారు లో, ఈ మధ్య కాలంలో అస్పష్టత స్పష్టంగా కనిపిస్తుంది.

    జెపి గారు మీడియా పాయింట్ వద్ద విచారం తెలియజేయాల్సిన విషయాలు ఇంకా చాలానే వున్నాయి,
    క్ష్మమాపణలు కూడా ఇంకా చాలామందికే చెప్పాల్సిన అవసరముంది.

    -satya

    ReplyDelete
  9. ఆశ్చర్యం మీ వాదన.చర్చిల్ మాటల్ని ఆయన ఆదర్శంగా ఏమన్నా తీస్కోమని చెప్పాడా. చర్చిల్ అవహేళన చేస్తూ చెప్పిన మాటల్ని నిజం చేసేలా మన ప్రవర్తన వుంది అని అన్నాడు. ఆయన రాష్ట్రపతి పాలన ఎక్కడ కోరుకున్నాడు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్రపతి పాలన మినహా మరో గత్యంతరం వుండదు అనటం కోరుకోవటమా?. ట్.ఆర్.స్ సమర్ధిచుకోవటానికి చెప్పిన వక్రీకరణల్ని మాత్రమే మీరు విన్నట్టున్నారు. కావాలంటే ఆయన మాటల్ని యదాతధంగా వినండి ఇక్కడ.

    http://www.youtube.com/watch?v=37-hOwEUg9s

    క్షమించాలి. మీ చర్చలు, బ్లాగు చూస్తే చాలా సందర్భాలలో మీరు పూర్తి/సరైన విషయం తెలుసుకోకుందా మాట్లాడతారు అనిపిస్తుంది. శ్రీక్రిష్ణ రిపోర్ట్ వచ్చినపుడు కూడ మీరు సాయంత్రం వరకూ చర్చల్లో పాల్గొన్నారు అది చదవకుండా. పోనీ, తర్వాత బ్లాగులో కూడా మీ అభిప్రాయం విషయం తెలుసుకోకుండానే రాసారు. నాకు రిపోర్ట్ చివరి భాగం చదవటానికి 15ని పట్టింది. అసలే టి.వి లలో చర్చా ప్రమాణాలు చాల తక్కువ అంటే మీలాంటి వారు కూడా ఇలా చేస్తే ఎలా.

    ReplyDelete
  10. malli malli chebutunnanu..dadini naa kante gattiga khandinchina varundaru. ayite jp garu kooda alochinchukone avakasam ivvandi. ewaripatla guddi bhakti waddu. okka chinna vyakhyake anta talladillipovada, napai vaykyalu guppinchadam prajaswamaya spoorti avutundemo yochinchani.
    sare, charchalantara naa sakti koddi nenu chebutanu.. ayite teliyandi neneppudu cheppaledu.meeru goppaga bhavinche varu kooda tadabadina sandarbhalunnayi.
    tv charchalalo chala lopalundochhu kani chulakana cheyakandi..bloglo tappu unte appude cheppi undalsindi.naku telisi edi ledu. emaina naa varaku nenu hanikaranga eppudoo matladaledu. matladanu.

    ReplyDelete
  11. "emaina naa varaku nenu hanikaranga eppudoo matladaledu. matladanu."

    If you stand by this, I think you should withdraw your 4th paragraph in which you are talking about Churchill and president rule.

    IT IS REALLY UNFAIR to 'MISQUOTE' him and support that 'ILLEGAL' attack on JP. Please listen to his speech again and see if you still stand by what you have said.

    ReplyDelete
  12. meeru kandinchademo kaani,durahankaari jayaprakash churchil ni utankinchadam meeku
    asahananni kaliginchinattu undi.asthaminchadanukonna 'ravi'ee deshamlo
    asthaminchinatte,telangana gadda meeda valasa
    palana asthamayam spurinchi mee loni samrajyavadi
    ulikkipaddattu unnadu.

    ReplyDelete
  13. By the way, I am not saying that you have supported the 'ATTACK'. But by 'MISQUOTING' JP, you are surely adding legitimacy to their ATTACK. That's all I wanted to say.

    You should present the 'FACTS' before you judge anybody.

    ReplyDelete
  14. asa garu .. nenu qoute chestegada.. asandarbha prastavana annanu.. antunnanu.


    k.manohari garoo.. meeremanukuntunnaro meeku teliste tarwata nenu spandinchagalanu. tittadame laxyamaite nirabhyantaranga konasaginchandi.
    atu, itu kooda asahanam ela perugutundo ee rendu vyakhyalu chooste telustundi.
    good night for now.

    ReplyDelete
  15. అసహనం?
    అతను చెప్పిన మాటల యొక్క వక్రీకరణలు విని, అతనలా చెయ్యటం తప్పు(మీ భాషలో అసందర్భం) అని చెప్పారు. అయ్యా! అవి వక్రీకరణలో, కావో కనీసం ఒకసారి తేల్చుకొని అప్పుడు వ్రాయండి అంటే దానికి అసహనం అని పేరు పెడుతున్నారా? సంతోషం సార్.

    ReplyDelete
  16. జెపి గారు తీసుకున్న దుష్టాంతం, చర్చిల్ వేసింది సరైన ప్రశ్నే అన్న్టట్టు వుంది. దుష్టాంతానికి దరిదృడు చర్చిలే దొరికాడా?. మొట్టమొదట అయనన్న మాట నిజమే నేడు జరిగింది "రాజ్యాంగ వైఫల్యం"...
    అక్కడ అసంబ్లీలోనే ఎమ్మెల్యేలు, మైకు పీకి అవేశం తో ఊగిపోయున్నారు, మార్షల్స్ తో తన్నులు తిని ఉన్నారు, ఇక్కడ ఈయన పుండు మీద కారాన్ని చల్లినట్లుగా మాట్లాడితే జరిగే పరిణామలిలాగే వుంటాయని అందరికి అర్థమయ్యింది.

    ReplyDelete
  17. ఓ మంచి పెద్ద మనిషిలా, తప్పు ఇరువైపులా వుంది అని చెప్పేక్రమంలో మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకనిపిస్తుంది. రాజ్యాంగ వ్యవస్థని,గవర్నర్ ని గౌరవిద్దాం, హూందాగా,సమ్యమనం తో మెలుగుదాం అని చెప్పడానికి సమయం,సంధర్భం చూసుకోవాలా..?

    ReplyDelete
  18. బాగా చెప్పారు. అసెంబ్లీలోనే సంస్కారహీనంగా ప్రవర్తించిన ప్రత్యేక రాష్ట్రం, రాజ్యాధికారం ఇవ్వాలా అని తటస్థులు కూడా ప్రశ్నించుకునేట్టు చేశారు. వీళ్ళ గొర్రెలగుంపుకు మద్దతివ్వలేదని జెంటిల్మన్ జె.పి పై దాడి చేశారు. మజ్లిస్ బాహాటంగానే మద్దతుఇవ్వలేదు, మరి వీళ్ళు ఒక్క మాటైనా వాళ్ళపై దాడి చేశారా? పోనీ విమర్శించారా? లేదే!

    ఒంటరి, మర్యాదస్తుడు జెపి పై కాదు, దమ్ముంటే మా మెగా, జెసి, జగన్, బాబు, బొత్స, వట్టి, ఆనం లమీద దాడిచేయండి, చూద్దాం. ;) :)

    తెర గారు, అమెరికా, బ్రిటన్లను ఆదర్శంగా తీసుకోరాదన్నారు, మరి అవే పెద్ద ప్రజాస్వామిక దేశాలు. మన రాజ్యాంగమే వాటినుంచి తీసుకోబడింది. కరప్ట్, అప్రజాస్వామిక చైనా/రష్యా లను ఆదర్శంగా తీసుకోవాలా?! చైనా/రష్యాలను స్తుతించందే కమ్యూనిస్ట్లకు రోజు గడవని మాట నిజం కాదా?

    ReplyDelete
  19. రవి గారు,
    జె.పి. స్పీచ్ విన్నాను. సందర్బోచితంగా చర్చిల్‌ని అనుకున్నట్టే మన నాయకులు చేస్తున్నారని అన్నారు, నిజమే కదా? చర్చిల్ అంటే మనకు నచ్చకపోయినా, ఓ ప్రముఖ పురాతన ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు.

    'రాష్ట్రపతి పాలన మినహా గత్యంతరం వుండదేమో' అని సందేహాన్ని వ్యక్తం చేశారు, నిజమే! ఇలాంటి ఆటవిక దాడులు మరికొన్ని జరిగితే, నరసింహన్ చేతికి పగ్గాలు త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్, .

    ReplyDelete
  20. thanks everybody...
    peddamanishila undadalchukoledu kabatte oka danni khandinchi.. marokati vishlesinchanu. aa paina ewari bhavalu varivi.
    communistulanu, communist desalanu entaina vimarsinchavachhu. kani mana swatantranni avahelana chesina valla prastavana asandarbhame.
    rashtrapati palana ee okka ghatanato radu, vachhina ewariki manchidi kadu.
    neruga khandanaku guraina varikante, kasta viamrsaku lonaina vare ekkuvaga viruchukupadatam asakti karam.
    nenu jp gari daggare ilati matalu chalasarlu cheppanu.maa madhya aa matram avagahana undi. ayana abhimanulu naa matala venuka gala maro konanni choodalekapotunnaru.
    paina ewaro rasinattu jp ontarivadu, balaheenudu kadu. ee dadula samskrutini khandinchebadulu walla meeda cheyandi, weella meeda cheyandi annattu matladdam asale sarikadu.

    ReplyDelete
  21. జేపీ గారు అన్నది

    చర్చిల్ మాటలు తప్పని నెహ్రూ పటేల్ లయితే నిరూపించారు కానీ మనం ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోయాం అని. నేను తెలంగాణా వాడిని అయినా ఆ అసెంబ్లీ వీడియో చూసిన తరువాత ఈ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete