కర్ణాటకకు సంబంధించి ఒకే రోజున మీడియాలో వెల్లడైన రెండు వార్తలు స్వయంప్రకటిత భారతీయ సంసృతీ పరిరక్షకుల నిజ స్వరూపాన్ని వెల్లడిస్తున్నాయి.పుణ్య క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లే ఉడిపిలో అశ్లీల టూరిజాన్ని లేదా జారిజాన్ని ప్రోత్సహించినందుకు ప్రజా గ్రహం పెల్లుబికింది.ఆ నిరసన సాగుతుండగానే బిజెపి మంత్రి వర్గ సభ్యులు అక్షరాల శాసనసభలో అశ్లీల చిత్రాలు చూసి ఆనందిస్తూ దొరికి పోయారు. ఆరు మాసాలు పూర్తి చేసుకున్న సదాశివగౌడకు ఇది అర్థ సంవత్సర కానుక అన్నమాట. గతంలో అడ్డగోలుగా కేటాయించిన గనుల లైసెన్సులను సుప్రీం కోర్టు సాధికార సంఘం రద్దు చేయడం కూడా దీనికి తోడుగా చెప్పుకోవచ్చు. అపర ధర్మ పరాయణల అవినీతి అశ్లీల కాండను తప్పు పట్టడం మాత్రం అపరాధమేనేమో! కాని సంస్కార వంతులైన కర్ణాటక ప్రజానీకం వీటిని సహించే స్తితిలో లేరు. వాలెంటిన్స్ డే తప్పనీ, ఫలానా వస్త్ర ధారణ పొరబాటనీ దౌర్జన్యం చేసే సంఘ పరివార్ స్వంత పరివారం ఎంత ఘోరంగా వుందో తెలియడానికి ఈ ఉదాహరణలు చాలవా?
Tuesday, February 7, 2012
కర్ణాటకలో సంసృతీ పరిరక్షకుల అశ్లీల లీలలు!

Subscribe to:
Post Comments (Atom)
వాళ్ళూ సంస్కృతి పరిరక్షణలో భాగంగా సెన్సారు సభ్యులు మొదట అసభ్య చిత్రాలను వీక్షించినట్టు వీక్షిస్తున్నారేమో! :D
ReplyDeleteTiruvanantapuram CPI(M) flexi board లౌకిక ప్రజాతంత్ర విప్లవ పార్టీలమీద సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ బూర్జువా పత్రికల కుట్ర అని కొందరు అంటున్నారు, విశ్లేషించగలరు. ఇలాంటి కుట్రలు ఎండగట్టకపోతే ప్రజావ్యతిరేక తాడిత పీడిత వర్గ శతృవులు మరింత రెచ్చిపోయే అవకాశం వుంది.
మీరు చెబుతున్నదాంట్లో పొంతనలు సరిగా కుదరడం లేదు. బి.జె.పి. మంత్రులిద్దఱు అసభ్యచిత్రాలు చూస్తే అది హిందూ గ్రూపుల అసలురంగు బయటపడడం అలా అవుతుంది ? సెక్సు మీది ఆసక్తి జీవజాలానికంతటికీ సహజం కాదా. దానికీ సంస్కృతికీ సంబంధం ఏముంది ? వాళ్లేదో అసభ్యచిత్రాల్ని ప్రొడ్యూస్ చేసినట్లు రాస్తారేంటి ? హిందువులు సెక్సు చూడకుండానే, చెయ్యకుండానే హిందువుల జనాభా పెఱుగుతోందా ?
ReplyDeleteహిందూత్వ సిద్దాంతాన్ని రాజకీయ ప్రచారాస్త్రంగా చేసుకున్న వ్యక్తుల పాలనలో పుణ్య క్షేత్రంలో అశ్లీల టూరిజంను అనుమతించడం విడ్డూరమన్నమాట వాస్తవం. అదే నేను రాశాను.ఇక రాష్ట్ర మంత్రులు శాసనసభలో నీలి చిత్రాలు చూడటాన్ని ఏ జీవ సూత్రాలూ అనుమతించవు. ఇన్ని అంశాలు ఒకేసారి ఒకే రాష్ట్రంలో జరిగితే వారికి సంబంధించిన రాజకీయ పార్టీని లేదా తాత్వికతను ప్రస్తావించడం అనివార్యం కదా.. ఇప్పుడు ఆ మంత్రులు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. యెడ్యూరప్పతో మొదలు పెట్టి ఇన్ని రాజీనామాలు చేయవలసి వచ్చిందంటే అందులోని వైరుధ్యాన్ని చింతనా పరులు గుర్తించాలి కదా.. సిపిఎం తిరువనంతపురం పోస్టర్ల వివాదంపైన కూడా వివరణ ఇవ్వవలసే వచ్చింది కదా..
Deleteరవిగారు,
ReplyDeleteచూడటం 'నేరం కాదని' ఆ మతిలేని మంత్రి ఎదవ ప్రెస్ సమావేశం పెట్టి మరీ చెప్పుకున్నాడు. మీరూ అదే కోణంలో ఎత్తిపొడిచారే కాని, అసెంబ్లీలో అందులోనూ ప్రజాధనం తింటూ ప్రజాసమస్యలు చర్చించే సమయంలో అని సరిచేస్తే బాగుంటుందేమో చూడండి.
SNKR గారన్నట్లు - వాళ్ళు వాటిని శాసనసభలో చూడ్డమొక్కటే నాక్కూడా అభ్యంతరకరం. మిగతాది వాళ్ళ వ్యక్తిగతం.
ReplyDeleteమిగితాది వాళ్ళ వ్యక్తిగతం అనుకుంటే మంగళూరు పబ్‌లో నిక్కర్లు వేసుకుని నృత్యాలు చేసిన అమ్మాయిల ప్రవర్తన కూడా వాళ్ళ వ్యక్తిగతం అనుకోవాలి. కానీ సంఘ్ పరివార్ అలా అనుకోవడం లేదు.
ReplyDelete