Pages

Wednesday, March 30, 2011

నేరాలు- సంసృతి- మీడియా




టీవీ అనేది మార్కెట్‌ యుగానికి ప్రథమ ప్రతినిధి. టీవీ లేకపోతే మార్కెటింగ్‌ అసంభవం. టీవీ వల్లనే మనం ఉదయం వాడే టూత్‌ పేస్టు నుంచి రాత్రి వాడే ఆలౌట్లు ఇతరాల వరకూ మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే మనను కీలుబొమ్మల్లా తిప్పేసుకుంటాయి. మా వాడు ఫలానా చాక్‌ లేట్‌ తప్ప తినడనీ, కొత్త ఫ్యాషన్‌ రాగానే వెంటబడతాడని మహా ఇదిగా చెప్పుకుని మురిసిపోవడం చూస్తుంటాము. ఇదంతా మార్కెట్‌ మహిమే. భారత దేశంలో నూతన ఆర్థిక విధానాల మొదటి దశ రాజీవ్‌ హయాంలో 1984లో మొదలైంది. టీవీ విస్తరణలో అది తొలి దశ . పివి నరసింహారావు మన్మోహన్‌ ద ్వయం దాన్ని మరింత ఆధునీకరించింది 1991లో. అప్పటి నుంచి ప్రైవేటు ఛానెళ్ల దశ. ఈ క్రమంలో ప్రతిదీ టీవీ మయమై పోయింది. అంతకు ముందు పత్రికలో వస్తేనే వార్త. ఇప్పుడు టీవీలో చూపిస్తేనే ఘనత. నడత.

టీవీలలో నేర వార్తల తీరు నా ప్రసంగ ఇతివృత్తం.అయితే సమాజంలో సాధారణ సంసృతి స్వరూపాన్ని ప్రస్తావించకుండా అదొక్కటే మాట్లాడ్డం కుదరదు. సంసృతి అంటే స్థూలంగా మనం జీవించే విధానం. బ్రిటిష్‌ రచయిత మేధావి రేనాల్డ్స్‌ విలియమ్స్‌ మాటల్లో చెప్పాలంటే శారీరకంగా సంక్రమించేది గాక జీవన క్రమంలో

సంతరించుకునే భావనలు చర్యల సముదాయమే సంసృతి. కనుక నేటి సమాజం ఏ విధంగా వుందనే దానిపై నేరాల తీరు, వాటికి సంబంధించిన వార్తల తీరు ఆధారపడి వుంటుంది. ఇప్పుడు మనం మార్కెట్‌ యుగంలో జీవిస్తున్నామని అందరూ అంగీకరిస్తారు. ఈ మార్కెట్‌కు ధనమే సర్వస్వం. శాసనం. అది ఎందుకు అంటే విలాసంగా బతకడానికి. విలాసం ఎలా వస్తుందంటే వినియోగించే వస్తువుల ద్వారా. వస్తువులు ఎంత ఎక్కువగా వుంటే అంత వైభోగం. ఎక్కువ ఖరీదైన వస్తువులు కావాలంటే ఎక్కువ ధనం కావాలి. అందుకోసం ఏం చేసినా ఫర్వాలేదు. ఈ సమాజంలో ఏదైనా వస్తువే. వస్తువుతోనే చూస్తాం. ఒక మహా చక్రవర్తి తన ప్రియురాలికి తాజ్‌ మహల్‌ కట్టించి ఇచ్చాడు. ఈ పేద వాడి ప్రేమను చులకన చేశాడు అని ఆలీ సర్దార్‌ జాఫ్రీ రాస్తాడు. అలాగే ఖరీదైన కానుకలు ఇవ్వడంలోనే ప్రేమ వుంది.గొప్ప వుంది. ముఖేష్‌ అంబానీ సతీమణికి 1700 కోట్ల సౌధాన్ని ఇస్తాడు. మన బందరు మొత్తం కలిసినంత సొమ్ము అన్న మాట. పలానా ప్రిజ్‌లో తిండి ఇస్తేనే తల్లి ప్రేమ. ఫలానా ఉంగరం పెడితేనే ప్రేమ. ప్రతిదానికి ఒక లెక్క. ప్రతిదీ వస్తు రూపంలోనే. ఎన్నికల రాజకీయాల్లో దేవుడు మతం కులం అన్ని వస్తువులే.వీటన్నిటికీ వేదిక టీవీ. వస్తువులు అమ్ముకోవాలంటే వాటిని అనుక్షణం మన బుర్రల్లో జొప్పిస్తుండాలి. మనం డబ్బులు కట్టి చూసే టీవీలో మనకు తెలియకుండానే బ్రేకులు.. నిజానికి అవి అడ్వర్టయిజ్‌మెంట్లు.చచ్చినట్టు చూస్తాం. కొన్నాళ్లకు వాటికి అలవాటై పోతాం.అలా వీక్షకులను అలవాటు చేయడానికి టీవీ అన్నది ఆకర్షణీయమైందిగా వినోదాత్కమైందిగా వుంటేనే చూస్తారు.చూస్తేనే అమ్ముకోవడం వీలవుతుంది. ఇదే ఇక్కడ వ్యాపార సూత్రం. అలా చూసేట్టు చేయాలంటే అనుక్షణం ఏదో ఒక ఉత్కంఠ వుండాలి. ఎడతెగని సస్పెన్స్‌ నడవాలి. నేరస్త వార్తలు అందుకు బాగా ఉపకరిస్తాయి.

టీవీలలో నేరాలు హింసా త్మక ఘట్టాలు వాటిపై ధారావాహికల గురించి ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతున్నా అవి పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. కారణం ఏమంటే వినోద ప్రధానంగా కనిపించవలసిన టీవీలకు నేర వార్తలు గొప్ప మసాలాలు. వాటిని మరింత రంజుగా చేసి చూపిస్తేనే వీక్షకులు అతుక్కు పోతారు. ఇది బుల్లి తెరఅంటారు గాని నిజానికి బల్లి తెర. ఎందుకంటే మనం బల్లుల్లా అతుక్కుపోతాం. టీవీ వార్తల విశ్వసనీయత ప్రమాణాలు వగైరా అంశాల్లోకి పోకుండా కేవలం నేర కథనాల గురించి మాత్రమే నేను చెబుతాను.

టీవీ నేర కథనాలు ఆందోళన కరంగా వున్నాయని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. వాటి వల్లనే నేరాలు పెరుగుతున్నాయని కూడా అంటున్నారు గాని అది పూర్తి సత్యం కాదు. నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మాఫియా మార్కెట్‌ సంసృతి. దాన్ని ఆకర్షనీయంగా చూపించడం టీవీ సంసృతి. కారణం దాని మార్కెట్‌ సూత్రాలే.ప్రేక్షకులను కట్టిపడేయాలంటే విపరీతమైన వికృతమైనదేదో చూపిస్తుండాలి లేకపోతే కుదరదని వారి భావన.పైగా టీవీ స్వభావం కూడా పత్రికలతో పోలిస్తే ప్రాధాన్యతలను తారుమారు చేస్తుంది. దేన్నయినా చూపించే వెసులు బాటు చిన్న వార్తకు కూడా పెద్ద దృశ్య మాన్యత కల్పిస్తుంది. దిన పత్రికల్లో క్రైం న్యూస్‌ కింద అర కాలం కూడా రాని ఒక నేరం హత్య లేదా దాడి దగ్ధం టీవీ విజువల్స్‌ పుణ్యాన ప్రధాన వార్త కావచ్చు. అసలు నేరం మరింత వికృతంగా భయానకంగా ముద్రితమవుతుంది. ఉదాహరణకు ఇటీవల ఉయ్యూరుకు చెందిన పండు హత్యకు గురైనప్పుడు గాని, సూరిని కారులో కాల్చి చంపిన ఘటనను గాని చూసి చూసి తల్చుకోకముందే కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. నిజంగా దాని వల్ల ప్రయోజనం వుందా అంటే ఏమీ లేదు. ఆ వార్తను చూసేట్టు చేయడానికి అలా పదే పదే చూపించాలని వారి వాదన. చూస్తే కడుపులో తిప్పుతుందని మన వేదన. వారు అర్థ నగంగానో నెత్తురు కక్కుతూనో పడి వున్న దృశ్యాన్ని అదే పనిగా చూపిస్తే జుగుప్స పరాకాష్టకు చేరడం అనివార్యం. రాజీవ్‌ గాంధీ హత్య సందర్భంలో హతుల మాంస ఖండాలు, హత్యా స్థలం చిత్రాలు హతమార్చిన మానవ బాంబు థాను దేహ శకలాలు ప్రచురించే సందర్భంలో హిందూ ఇవి మనో వికారం కలిగించవచ్చునన్న హెచ్చరికను ముందే ఇచ్చింది. కాని ఇప్పుడు మనో వికారం కలిగితే తప్ప వాటికి విలువేమిటన్నట్టు వ్యవహరిస్తున్నారు.
పరస్పర పోటీలో ఇది మరింతగా వెర్రి తలలు వేస్తున్నది. అది ఎక్లూక్లిజవ్‌ అయితే మరీ కష్టం. మా వాళ్లందరిలోకి మా కర్రోడే కాస్త ఎర్రన అన్నట్టు ఎవరిది వారికి ఎక్లూక్సిజివ్‌. అన్నిటిలో కనిపిస్తూనే వుంటుంది. కనక ఆ దృశ్యాన్ని పదే పదే చూపించడం జరుగుతుంది. హర్రర్‌ కథలు టెర్రర్‌ చిత్రాల్లో వలె పోలీసు విజిల్స్‌, మృత దేహాలు ఏడుపులు పెడబొబ్బలను కథనానికి లోగోగా చేసుకుని మాటిమాటికి వేస్తుంటారు. ఇది పిల్లలపై ఎలాటి ప్రభావం చూపిస్తుందంటే బలహీనులైన వారు చలించి పోయినా ఆశ్చర్యం లేదు.ఈ విషయమై భారత బాల వైద్యుల సంఘం ఆందోళన వెలిబుచ్చింది కూడా. పిల్లల్లో టెలి అదిక్షన్‌ సున్నితత్వాన్ని మొద్దు బారుస్తుందని ఆ సంఘం పేర్కొన్నది. స్త్రీలపై హింస అసభ్య చిత్రణ కూడా ఈ కోవలోకే వస్తుంది.ఈ కథలు ఎంత వరకూ ఏ ప్రమాణాలతో వేయాలన్న దానిపై ఇప్పటికి కొలబద్దలు లేవు. ఇటీవలనే హైకోర్టు నేర వార్తల ప్రసారంపై ఆంక్షలు విధించిన తర్వాత కొన్ని ఛానళ్లు స్వల్పంగా మార్చుకున్నా మౌలికంగా తేడా లేదు. బహుశా రాదు కూడా.ఎందుకంటే టీవీ మార్కెట్‌కు నేర వార్తలు పెద్ద సరుకు. అందులో నేరస్తుడు ఆకర్షనీయమైన వ్యక్తి.మొదటి రోజుల్లో నేరస్తుడు విలన్‌ అని పోలీసు హీరో అని అన్నట్టు వుండేది. ఇప్పుడా స్థితి పోయింది. పోలీసు వ్యవస్త లోపాలు ఒక కారణం మాత్రమే. సమాజంలో రాజకీయాలలో నేరస్త శక్తుల ప్రాబల్యం పెరిగి పోవడం వారు ప్రజా ప్రతినిధులు కూడా కావడం వంటి కారణాలు దీని వెనక వున్నాయి. 1995లో దీనిపై విచారణ జరిపిన వోరా కమిటీ నివేదిక చూస్తే ఈ విషయం బోధపడుతుంది.
ఆస్తుల ఆక్రమణలు, కిరాయి హత్యలు,నల్లడబ్బు చిద్విలాసాలు, మహిళలపై అత్యాచారాలు అసభ్య కార్యకలాపాలు మత్తుమందుల విలయ విహారాలు మద్య సామ్రాజ్యాలు అన్ని మాఫియా తరహాకు దోహదం చేస్తుంటే వీటిని రసవత్తరమైన కథనాలుగా మీడియా పూసగుచ్చి అందిస్తున్నది. ఇదంతా ఒక విష వలయంగా మారుతున్నది. వాట్‌ బ్లీడ్స్‌ దట్‌ లీడ్స్‌ అన్నది ఇక్కడ సూత్రంగా మారి పోయింది. మొద్దు శీను మనకు ఆసక్తికరమైన కథకు వనరు అవుతాడు. రియాల్లీ షోలలో ఏడిపించిన కొద్ది ఆకర్షణ పెరగుతుందనే భావనతో గిల్లి మరీ ఏడిపించడం శాడిజమే తప్ప మీడియా యిజంకాదు.

నేరాలను మీడియా చూపించకపోతే తెలిసేదెలా అన్న ప్రశ్న చాలా న్యాయమైంది. కొంతమంది అంటున్నట్టు చూపించడం వల్లనే నేరాలు పెరగడం లేదు. కాని చూపించేప్పుడు ఎలాటి నియంత్రణ నిబంధనలు తమకు తాము విధించుకోవాలన్నది చాలా కీలకం. చూపరులలో భయాన్ని జుగుప్సను కలిగించే విధంగా గాక వ్యతిరేకత, విముఖత అప్రమత్తత పెంచే విధంగా ఆ కథనాలు నడవాలి. చెడును ఆకర్షనీయంగా చూపించడం గాక అసహ్యించుకునే దిశలో నడవాలి.వ్యక్తుల ముఖ్యంగా స్త్రీలు పిల్లల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించే విధంగా గాక గౌరవం పెంచే విధంగా వాటిని ప్రసారం చేయాలి. అణగారిన వర్గాల వారినైనా సరే ఆత్మ గౌరవం దెబ్బ తినని విధంగా ప్రసారాలుండాలి.

వస్తు ప్రధానమైన ఈ మీడియాలో పరస్పర విరుద్దమైన అంశాలు ఏక కాలంలో వస్తుంటాయి. ఉదాహరణకు రక్తసిక్తమైన హత్య వార్తపైన సౌందర్య సాధనం యాడ్‌ వస్తుంటుంది. ఒక కరుణాత్మక కథనం మధ్యలో వినోదం బ్రేక్‌ వస్తుంది. ఇవన్నీ మానవ విలువలను తారుమారు చేస్తాయి. గందరగోళ పరుస్తాయి. కుటుంబాల విచ్చిన్నం,విడాకుల రేటు పెరగడం వంటి విపరిణామాల వెనక ఈ కారణాలున్నాయంటున్నారు.కనకనే మీడియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మనం ప్రతిదానికి పాశ్చాత్య మీడియాను హాలివుడ్‌ను అనుసరిస్తుంటాము. వారి నమూనాలే మనను దారి తప్పిస్తుంటాయి. డయానా మరణం సందర్భంలో పేపరాజి గురించి జరిగిన చర్చ మనం మర్చిపోకూడదు. సమాచార సామ్రాజ్యవాదానికి ప్రత్యామ్నాయం ప్రజాస్వామిక మీడియా మాత్రమేనని గుర్తించాలి. ప్రధాన స్రవంతి మీడియా అనేది మిథ్య అని గుర్తించాలి.

జరిగిన ఘటనకు దాన్ని చూపించే తీరుకు మధ్య వర్తి మీడియా. కనకనే అది చాలా బాధ్యతా యుతంగా ప్రవర్తించాలి. వ్యాపారం లాభాలు చూసుకుంటునే సమాజంపై తన ప్రభావాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి.నేర వార్తల విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది.అయితే సమాజంలో నేరస్త శక్తుల ప్రాబల్యం పెరుగుతున్నంత వరకూ నేరాల రేటు తగ్గనంత వరకూ మీడియా మాత్రమే చేయగలిగింది కూడా పరిమితమేనని గుర్తించాలి. ఇవన్నీ మీడియా దోషాలుగా చెప్పి దానిపై స్వారీ చేయాలనుకునే పోకడలను మాత్రం అనుమతించకూడదు. స్వయం నియంత్రణ వైపునే నడిపించాలి.
(బందరులో కృష్ణా విశ్వవిద్యాలయంలో 2011 మార్చి 20,21 తేదీలలో జరిగిన జాతీయ సెమినార్‌లో చేసిన ప్రసంగ భాగాలు)

6 comments:

  1. ఒస్తుప్రదానంగా సాగె పెట్టుబడిదారి సమాజంలొ శ్రమదొపిడి గురించి ఒక్కముక్క కూడా మాట్లాడకండి టి.వి ల్లొను సెమినార్ల్లొను గంటలుగటలు మాట్లాడండి .

    ReplyDelete
  2. @rammohan
    enduko telugu rledu kanka ila reply istunna.. deenikanna mundu entrylo prajaporatala gurinche rasanu.. ayite viniyoga samskrutiki sadhanaluga visha pracharalaku vahikaluga unna media vedikalanuupayoginchukovadam kuda oka mukhya badhyate. idi aa vidhanga chestunna pani tappa pedda anandamani kadu.. meerendukala bhavincharo nakartham kaledu.. nenu communist asyalaku ankitamaina kutumbamlo rendo taram vanni.. maa amma kuda mahiala sanghamto patu muncipal workerslo pani chesedi.. ediana dhanyavadalu..

    ReplyDelete
  3. పోస్ట్ బాగుంది .
    "ఎన్నికల రాజకీయాల్లో దేవుడు మతం కులం అన్ని వస్తువులే "ఈ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయి .సిపిఐ ,సిపిఎం ల కు కమ్మ్యునిజం ఎన్నికల వస్తువు కాదా ?అనే ప్రశ్న రావచ్చు .
    మీరు చెపుతున్న నీతి సూత్రం "వ్యాపారం లాభాలు చూసుకొంటునే సమాజం పై ప్రభావాన్ని గమనం లో ఉంచుకోవాలి "చాల చప్పగా ఉంది .అయితే వ్యాపారం ,లాభం ఉంటూ corporate social responsibility ఉంటె సరేనంటారు .బాగుంది .

    ReplyDelete
  4. Rammohan garoo,

    oka mata marichanu. anni rangalloki bheekaramaina poratam saidhantika rangamlo jarugutundani lenin annaru.. marx kuda bhavam jananni avahiste sakti avutundannadu. meero aa phototo pamparu gana idi add chestunnanu..ok.


    sree garoo,

    matonmadulaku devudu vastuve.. palaka partylaku kulam, matam,prantam anni sadhanale. sandeham ledu. ika nenu cheppindi chappaga unna.. uppaga unnaa .. viplavakarulaku kadu.. mamulu vyapara mediaku.. yadhavidhiga communistulapai asandarbha comments antara .. mee opika..

    ReplyDelete
  5. i have not commented upon communists.i have commented upon cpm.please dont get confused.

    ReplyDelete
  6. sree garoo,

    you your self seemed confused in the sense that u also commented on cpi. the topic is different why divert always. what is relevence of the topic media and elctoral politics of cpi and cpm..are u not bothered about communal or other ploys employed by many.. if u think marxists alone are to be blamed for everything and everyminute u r free to do so.

    ReplyDelete