తలచినదే జరిగినదా దైవం ఎందులకూ అనే ఒక సినిమా పాట కాంగ్రెస్ విషయంలో మాత్రం తిరగబడుతుంటుంది. దేవుడి విషయం పక్కనబెడితే ఆ పార్టీ మాటల గారడీని రాజకీయ మాయాజాలాన్ని పదే పదే చూసిన ప్రజలు చెప్పగానే నమ్మేసే స్థితి ఎప్పుడో మారిపోయింది. నెల రోజుల గడువులో తెలంగాణాపై ప్రకటన చేస్తామన్న హౌం మంత్రి హామీని కూడా నా వంటి వాళ్లం విమర్శనాత్మకంగానే తీసుకున్నాము. ఆ ప్రకటన వచ్చిన రోజున నేను తిరుపతిలో తెలుగు మహాసభల్లో వున్నాను. నెల అంటే బాగానే వుంది గాని నెలకు 365 రోజులు కాకుండా చూడాలని సరదాగా అన్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అదే నిజమైనట్టు కనిపిస్తుంది. మూడు రోజులు ముందుగానే గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కథ మొదటికి వచ్చిందని తేల్చేశాయి. ఇందుకు సీమాంధ్ర నాయకుల లాబీయింగ్ కారణమని తెలంగాణా వాదులు చేసే ఆరోపణ పాక్షికంగానే సత్యం. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణా సీమాంధ్ర నాయకులు వుభయులూ వ్యవహరిస్తుంటారన్నది పూర్తి సత్యం. ఉభయ ప్రాంతాల నేతలకూ ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి. ఏదో విధంగా కేంద్ర రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకోవడంలో వారికి ఎలాటి విభేదాలు వుండవు. ఆజాదూ అని మీడియాలో ఆయన పేరును సరదాగా రాస్తుంటారు గాని నిజానికి ఆ జాదు కాంగ్రెస్ రాజనీతిదే!రేపు దీనిపై మరో సవరణో వివరణో వచ్చినా ఆశ్చర్యం లేదు. కనక అన్ని ప్రాంతాల ప్రజలూ అప్రమత్తంగానూ సంయమనంతోనూ వుంటేనే ఈ రాజకీయ మాయోపాయాలను తిప్పికొట్టడం సాధ్యమవుతుంది. విద్యుచ్చక్తి భారాలు, ఆర్టీసీ చార్జీలు అధిక ధరలు అవినీతి వ్యవహారాలపై పోరాడటం అందుకో మార్గం. అన్ని పార్టీలూ 2014 ఎన్నికలపై దృష్టి పెట్టి వున్నాయి గనక అసలు సంగతి అప్పుడే తేలుతుంది.
Wednesday, January 23, 2013
తలచినదే జరిగినదీ!

Friday, January 18, 2013
హైదరాబాద్ చర్చ తీవ్రం
అవసరమైతే హైదరాబాదు ప్రతిపత్తిపై రెఫరెండంకు సిద్ధమని టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్య రాజధానిపై మధనాన్ని మరింత తీవ్రం చేసింది. ఇప్పటి వరకూ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, తెలుగుదేశం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రత్యేక ప్రతిపత్తి కోరుతూ వచ్చారు. ఏ పరిస్థితిలోనూ హైదరాబాద్‌పై చర్చకు ఆస్కారమే లేదనీ, వదులుకునే ప్రసక్తి లేదని టిఆర్‌ఎస్ ఘంటా పథంగా చెబుతూ వచ్చింది. అలాటిది గురువారం నాడు ఒక టీవీ చర్చ మధ్యలో జొక్యం చేసుకున్న కె.సి.ఆర్ అనపర్తి ఎంఎల్‌ఎ శేషారెడ్ది ప్రశ్నకు జవాబుగా తాము రెఫరెండంకు సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. తెలంగాణా విడిపోవాలని ఆ ప్రాంతంలో 99.9 శాతం మంది కోరుకుంటారన్న ఆయన మాటలు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు గాని రెఫరెండంకు సంసిద్ధమనడమే చర్చను కొత్త మలుపు తిప్పింది. హైదరాబాదు ఒక్కటే ఇప్పుడు నిర్ణయానికి ఆటంకమవుతుందనే భావన బాగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి రాష్ట్ర భవిష్యత్తుపై ప్రకటన రాకుండా ఒక్క హైదరాబాదు గురించిన చర్చ జరిగే అవకాశం చాలా తక్కువ. కాగా హైదరాబాదు చర్చనే ముందు చేపడితే తెలంగాణా చర్చ వెనక్కు పోయే అవకాశం కూడా వుంటుంది. ఇవన్నీ తెలిసి కూడా కెసిఆర్ రెఫరెండంకు సిద్ధమని చెప్పడంలో వ్యూహాత్మక కారణాలుంటాయని భావిస్తున్నారు. అందుకు తగినట్టే
కెసిఆర్ ఆలా అని వుండాల్సింది కాదని టిఆర్‌ఎస్‌లో కొందరు భావిస్తున్నారు గనకే
పాక్ ప్రమాద వ్యూహం
భారత సైనికులు హేమరాజ్, సుధాకర్‌లను అమానుషంగా హతమార్చి మృతదేహాలను పంపించిన పాకిస్తాన్ దుశ్చర్య వెనక దుస్తంత్రం చాలా ప్రమాదకరమైంది. ఇటీవలి కాలంలో సంబంధాల సాధారణీకరణ చర్యల గురించిన మాటలు జరుగుతుండగా హఠాత్తుగా ఇంతటి అఘాయిత్యం జరగడం అందరినీ దిగ్భ్రాంత పరిచింది.అలవాటైన సైనిక పద్ధతుల ప్రకారం ఆ మరుసటి రోజున భారత సైన్యం కాల్పుల్లోనూ ఒక పాకిస్తాన్ జవాను మరణించాడు. దాయాదులుగా పిలవబడే ఈ రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతల పర్వంలో ఇది కొత్త అధ్యాయం. ఇప్పటికి మూడు సార్లు యుధ్ధాలు చేసుకున్న ఉభయ దేశాలు 1998లో టీవీల సాక్షిగా కార్గిల్ ఘర్షణను కూడా చూశాయి.ఈ అన్ని సందర్భాల్లోనూ వివాదాన్ని ఘర్షణను రగిలించింది పాకిస్తాన్ అనడంలో సందేహం లేదు. దీని వెనక తీవ్రమైన అంతర్జాతీయ రాజకీయ వ్యూహాలు వున్నాయన్నది కూడా నిజం. భారత ఉపఖండంలో ఉద్రిక్తతలను రగిలించడం, పెద్ద దేశమైన భారత్‌ను నిరంతరం చక్రబంధంలో ఇరికించడం పాకిస్తాన్ నిరంకుశ సైనిక- రాజకీయ - అధికార దుష్టత్రయం వ్యూహమైతే అందుకు ప్రేరణ, నిర్ధేశకత్వం అమెరికా సామ్రాజ్యవాదానిది. ఆఖరుకు తమ నాయకురాలైన బెనజీర్ భుట్టోతో సహా వందలాది మందిని ఉగ్రవాదదాడుల్లో బలి చేసుకున్న పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా అలాటి ఉగ్రవాద కార్యకలాపాలనే మూర్ఖంగా కొనసాగిస్తున్నదంటే కారణం అది ఆ దేశ పాలక కూటమి అస్తిత్వానికి మూలాధారం కావడమే.
గతంలో మూడు యుధ్దాలు ఒక సాయుధ ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాలు 2003 నవంబరులో వాస్తవాధీన రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఆమాత్రమైనా ఉపశమనం కలిగినందుకు అందరూ ఆనందించినా అది పైపై వ్యవహారమేనని కూడా అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు ఏదో సాకుతో కాల్పులు ఘర్షణలు చొరబాట్టు జరుగుతూనే వస్తున్నాయి. కొత్త నిర్మాణాలు, బంకర్ల మరమ్మత్తులు వంటివి ప్రత్యేకంగా కారణమవుతుంటాయి. కాశ్మీరీ ప్రజలను రెండుగా విభజించిన యుద్దాల ప్రభావం కూడా దీనివెనక వుంటుంది. ఆరు మాసాల కిందట ఒక వృద్ధ మాత సరిహద్దుకు ఆవల వున్న తన కుటుంబసభ్యులను చూసేందుకు వెళ్లిరావడం చినికి చినికి గాలివానై తాజా ఘటనలను ఘర్షణలకు దారి తీసిందని
స్వాములకైనా..చట్టం చట్టమే
శ్రీశైలంలో స్వామి కమలానంద భారతిని అరెస్టు చేయడం హిందూ మతంపైన దాడిగా సంఘ పరివార్ ప్రతినిధులు గగ్గోలు పెట్టడం ఏ విధంగానూ సమర్థించరాని విషయం. మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మత భావాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తప్పయితే కమలానందులది కూడా తప్పే. సంక్రాంతి నాడు స్వామీజీని అరెస్టు చేశారంటూ రాజకీయాలతో సంబంధం లేదనే సాధుసంతులు అనేకులు ధ్వజమెత్తడం మరింత అవాంచనీయం. సాధువులకైనా సన్యాసులకైనా మౌల్వీలు పాధర్లు ఎవరికైనా చట్టం చట్టమే. నిజానికి సంయమన శీలతకు ప్రతిరూపంగా వుండాల్సిన స్వామీజీ బిరుదాంకితులకు ఇది మరింతగా వర్తిస్తుంది. కమలానంద అరెస్టు న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జరిగిందే తప్ప ఎవరి ఇష్టానుసారం చేసింది కాదు. ఇందిరా పార్కు దగ్గర ఆయన మాట్లాడిన మాటలు కూడా తెలియనివి కావు. ఉద్రిక్త వాతావరణం వున్నప్పుడు బాధ్యత గలవారెవరైనా ఆచితూచి మాట్లాడాల్సి వుంటుంది.అంతేగాని అవతలివారిపై రెచ్చగొట్టడమే ఏకైక లక్ష్యంగా నోరు పారేసుకోవడం దురుద్దేశపూరితం. ఇలాటి ప్రసంగాలకు ప్రజలు స్పందించడం లేదంటే అది వారి పరిపక్వత మాత్రమే. వాస్తవంలో అది భారతీయ సమాజంలో అంతర్లీనంగా వుండే లౌకికతత్వం,మత సామరస్యాల ప్రతిబింబం. అయితే ఆ మౌలిక విలువలకే చేటు తెచ్చేలా ఇటీవలి పరిణామాలు వుండటం ఆందోళన కలిగిస్తుంది. కమలానంద భారతి దేవుళ్లను దూషించలేదంటూ సమర్థించే వారు అంతకన్నా తల్లిని మించిన దైవం లేనేలేదు అన్న మానవజాతి మహౌన్నత సూక్తిని విస్మరిస్తున్నారు. ఆ వాదనలన్ని అలా వుంచి వివాదం న్యాయస్థానంలో వున్నప్పుడు దాని ఆదేశాల కోసం అంతిమతీర్పు కోసం ఎదురు చూడాలి తప్ప తమకు తామే తీర్పులిచ్చేసుకుని ఆవేశపడిపోతే కుదిరేపని కాదు. పొంచి కూచున్న రకరకాల మతోన్మాద శక్తుల పాచికల నుంచి మతసామరస్యాన్ని సామాజిక శాంతిని కాపాడుకోవడమే ఇప్పుడు ప్రథమ కర్తవ్యం.
సమీక్షా లేశం లేని శత చంద్ర దినోత్సవం
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకోవడం సహజంగానే ఆ పార్టీ ముఖ్య నాయక గణానికి సంబరంగా మారింది. ఈ క్రమంలో ఆయన గతంలో వైఎస్‌రాజశేఖర రెడ్డి నడిచిన దూరాన్ని అధిగమించాడన్నది కూడా ప్రచారంలో ప్రధానాంశమైంది. కొన్ని పత్రికలు అత్యుత్సాహంతో వెనక రాజశేఖరరెడ్డిని వేసి చంద్రబాబు ఆయనను మించిపోయినట్టు చిత్రాలు ప్రచురించాయి. సజీవంగా వున్నప్పుడు ఈ ఇద్దరు నాయకుల మధ్యనే రాజకీయ పోటీ అన్నట్టు చిత్రించింది చాలక ఆయన మరణానంతరం కూడా దాన్నే కొనసాగించడం కొంత విడ్డూరంగానే వుంది. వాస్తవానికి రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల జగన్ పార్టీ తరపున పోటీ యాత్ర నడిపించిందనే వాస్తవం గుర్తు చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కొంటున్నది ఆయన సంతానాన్ని అని అర్థమవుతుంది. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న మీమాంస బొత్తిగా అనవసరం. ఈ పాదయాత్రలేవీ పేద యాత్రలు కావని నేను చాలా చర్చల్లో సరదాగా అన్నాను. బలమైన పాలక పక్ష నేతలు అధికారం కోసం జరుపుతున్న యాత్రలు ఇవి. వీటికి స్పష్టమైన నేపథ్యం వుంది. హంగూ ఆర్భాటాలు కూడా వున్నాయి. చంద్రబాబు వయస్సు అరవై దాటిపోయింది గనక కాస్త శ్రమ అధికంగా వుండొచ్చు గాని దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక మందినాయకులు అనేక విధాల శ్రమదమాదుల కోర్చి ప్రజల కోసం పోరాడిన సందర్బాలున్నాయి.
ఇటీవలి కాలంలో తెలుగు దేశం ఎదుర్కొంటున్న ఇరకాటాలు, సంక్షోభాలు తగిలిన ఎదురుదెబ్బల దృష్ట్యా పార్టీకి కాస్త జవసత్వాలు కల్పించేందుకు శ్రేణులలో విశ్వాసం నింపేందుకు చంద్రబాబు యాత్ర ఉద్దేశించిందని అందరికీ తెలుసు.ఆ విషయంలో కొంత వరకూ ఫలితాలు సాధించివుండొచ్చు గాని విస్తార జనాలలో విశ్వసనీయత పొందగలిగారా అన్నది ముందు ముందు గాని తేలదు. బయిటి జనం విశ్వాసం మాట ఎలా వున్నా పార్టీ ఎంఎల్‌ఎలు, నాయకులు అవతలి పార్టీలలోకి వెళ్లకుండా ఆపడంలో కూడా ఆయన కృతకృత్యం కాలేకపోయారన్నది వాస్తవం. ఎందుకంటే ఈ యాత్రకు సమాంతరంగా అలాటి వలసలు సాగుతూనే వున్నాయి.ఇప్పటికీ ఆగిన దాఖలాలు లేవు.అలాగే తెలంగాణాపై స్పష్టత అన్న విషయం తీసుకుంటే పార్టీపై దాడిని తట్టుకోవడానికి కాస్త ఉపయోగపడే వైఖరి ప్రకటించగలిగారే తప్ప పూర్తిగా సుస్పష్టత ఇచ్చారని ఎవరూ అనలేరు.రాసిన లేఖలో అస్పష్టత, అఖిలపక్షానికి హాజరైన ప్రతినిధి చెప్పిన దాంట్లో స్పష్టత వుందనేది అత్యధకుల
Subscribe to:
Posts (Atom)