Pages

Friday, February 21, 2014

చిరును మించిన 'వెంకీ'¸











రాజ్యసభ చర్చలో ఈ రోజు బిజెపి సీనియర్‌ నేత వెంకయ్య నాయుడుకూ కేంద్ర మంత్రి చిరంజీవికి మధ్య ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. సభలో తొలి ప్రసంగం చేసిన చిరంజీవి కొంత తడబాటుకు గురవుతున్నా అనుకున్నది చెప్పడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ను సమర్థిస్తూనే హైదరాబాద్‌ యుటి హౌదాపై కేంద్రీకరించారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఆరుణ్‌ జైట్లీ లేచి ఒక మంత్రి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చునా అని పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. అది ఆ ప్రభుత్వం ఆ మంత్రి చూసుకోవలసిన విషయం తప్ప తనకు సంబంధం లేదని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ తెలివైన రూలింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు లేచి చిరంజీవి చాలా ప్రసిద్ధి గల నటుడని తనకు చాలా మంది అభిమానులున్నారని అన్నారు. ఆయన తన భావాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. తర్వాత ప్రసంగం కొనసాగించిన చిరంజీవి తన నటనను మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతూనే తాను ఇక్కడ నటించడం లేదని చురక వేశారు.
అయితే రాజ్యసభలో వెంకయ్య నాయుడు పదే పదే సవరణలు సీమాంధ్ర కోర్కెల పేరుతో లేచి వాదించడం ఓటింగు వరకూ వెళ్లకుండా సర్దుకోవడం చూసిన వారికి ఆయన నటనలో చిరంజీవిని మించి పోయారన్న అ భిప్రాయం కలిగింది. తామేదో సాధించామన్న అభిప్రాయం కలిగించడమే ఆయన తాపత్రయంగా అనిపించింది. వాస్తవానికి ఆయన పదే పదే అడిగిన ఏ కోర్కెను కూడా ప్రభుత్వం ఆమోదించలేదు. అయినా వివరణ కోరుతున్నాను, స్పష్టీకరణ అడుగుతున్నాను అంటూ ఒకటికి రెండు సార్లు లేచి మాట్లాడారు.

1 comment: