Pages

Sunday, May 11, 2014

ప్రణబ్‌ ముఖర్జీ ఏం చేస్తారు?






పెద్దపార్టీ సిద్ధాంతమా?
సుస్థిరతకు ప్రాధాన్యతా?
నిపుణులతో సంప్రదింపులు
కార్పొరేట్‌ శక్తుల హడావుడి



లోక్‌సభ ఎన్నికల చివరి ఘట్టం సోమవారంతో ముగిసి పోనున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై అందరూ దృష్టి సారిస్తున్నారు. పదేళ్లు పాలించిన తర్వాత దిగిపోతున్న ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వీడ్కోలు సమావేశాలు సందేశాలతో నిష్క్రమణకు సిద్ధమవుతుంటే కొత్తగా వచ్చే వారి కోసం రకరకాల శక్తులు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ అధినేతలు తమ తమ అనుకూల జాతీయ ప్రాంతీయ పార్టీల తరపున ధనరాశులతో వేచి చూస్తున్నారని రాజధాని పరిశీలకులు చెబుతున్నారు. వీరంతా రకరకాల లాబీలు నడుపుతూ రాజకీయ దళారులను సమీకరిస్తున్నారు. కాంగ్రెస్‌ దిగిపోవడం ఖాయమైనా బడా మీడియా అదే పనిగా చాటింపు వేసినట్టు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ రావడానికి అవకాశం ఏ మేరకు వుంటుందనేది ఇప్పుడు ప్రశ్నగా చెబుతున్నారు. బిజెపికి 200 స్థానాల లోపు తెచ్చుకుంటే మిత్రులను కూడగట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభం కాదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకుడు ప్రభుచావ్లా రాశారు. 180 దగ్గరే ఆగిపోతే బిజెపిలో మోడీ వ్యతిరేకులు చెలరేగిపోతారని కూడా ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ దెబ్బతింటే రాహుల్‌ను ఏమీ అనబోరని, 120 వరకూ వస్తే ఆయనను పరిరక్షకుడుగా కీర్తిస్తారని కూడా రాశారు. ఈ రెండు పార్టీలకు తక్కువ స్థానాలు వచ్చిన సందర్భంలో తృతీయ కూటమి ప్రయత్నాలకు బలం వస్తుందని అనేక బలీయమైనప్రాంతీయ పార్టీల నేతలు పోటీ పడతారని కూడా భావిస్తున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి సంగతి అలా వుంచితే మొత్తం 29 మంది మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుతం రంగంలో వున్నారని ఆయనే లెక్క వేశారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి బిజెపికి 200 పైన స్థానాలు వచ్చే అవకాశం దాదాపు లేదని మరో ప్రముఖ సంపాదకుడు దిలీప్‌ పడగోవ్‌కర్‌ విశ్లేషించారు. అయితే రాజ్యాంగ సంప్రదాయాలకు చాలా విలువనిచ్చే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పెద్ద పార్టీగా వచ్చే వారినే పిలుస్తారనీ, అప్పుడు మొదటి అవకాశం

Thursday, May 8, 2014

రేపటి రూపం..?




ఎట్టకేలకు ఏళ్లతరబడి సాగిన అనిశ్చిత పర్వం ముగిసింది.ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడే రెండు చోట్ల ఓటర్ల తీర్పు నివ్వడం పూర్తయింది. ఇక కొత్త ప్రభుత్వాలు ఎవరు ఎలా ఏర్పాటు చేస్తారనే ప్రశ్న మాత్రమే మిగిలింది. ఇంత కాలం వినిపించిన ఇక్కడ మేము అక్కడ వారు అన్న పాట ఈ సమయంలోనూ కొనసాగుతున్నదే తప్ప పెద్ద మార్పు వుంటుందనిపించడం లేదు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కూ, ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఆధిక్యత వుండొచ్చన్న అభిప్రాయమే బలంగా వుంది. చివరి మోడీ-చంద్రబాబు- పవన్‌ కళ్యాణ్‌ త్రయం హడావుడి చేయడం వల్ల అవకాశాలు కొంత మెరుగుపడి వుంటాయి తప్ప అధికారం వచ్చే పరిస్థితి లేదని చాలామంది తెలుగుదేశం నాయకులు, అంతకు మించి బిజెపి నేతలూ కూడా ఒప్పుకుంటున్న స్థితి. వైసీపీ అద్యక్షుడు జగన్‌ మోహన రెడ్డి వ్యక్తిగత శైలి, కేసులూ వంటి వాటి గురించి గాని లేక టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యూహాలూ వాగ్ధోరణి గురించి గాని చాలా విమర్శలు వుండొచ్చు. కొందరు అసలే భరించలేకపోవచ్చు.అయితే వాటికీ ఓట్ల సరళిపై వచ్చే అంచనాల పరిశీలనకూ సంబంధం లేదు. ఎందుకంటే ఎన్నికల తరుణంలో ఎవరి ఇష్టాయిష్టాలు ఏవైనా వివిధ కోణాలు నుంచి విభిన్న ప్రాంతాల జన బాహుళ్యం నుంచి వినవచ్చే అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కద్దు. ఆ విధమైన అభిప్రాయాలను తీసుకున్నప్పుడే టిఆర్‌ఎస్‌, వైసీపీలకు మెరుగైన అవకాశాలున్నాయని అంచనాలు అత్యధికంగా వినిపిస్తున్నాయి.
ఇందులోనూ రెండు రాష్ట్రాల మధ్య ఒక ముఖ్యమైన తేడా వుంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రథమ శక్తిగా వస్తుందనే వారు కూడా పూర్తి మెజారిటీ వస్తుందా లేదా అని ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. అదే జరిగితే ఎవరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరమైన విషయం. దేశ రాజకీయాల్లో వున్న మూడు శక్తులతోనూ సంబంధం పెట్టుకోవడానికి కెసిఆర్‌కు అభ్యంతరం వుండకపోవచ్చు. కాని చెప్పినదాన్ని బట్టి చూస్తే

Sunday, May 4, 2014

మూడు పార్టీల డబుల్‌ డైలాగులు









ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారం కోసం ి ప్రధాన పార్టీల నేతలు సాగిస్తున్న విన్యాసాలు జుగుప్స గొల్పుతున్నాయి. ప్లేసు మారితే ప్లేటు మారులే అన్నట్టుగా తెలంగాణలో హౌరెత్తించిన డైలాగులు గుటుక్కున మింగేసి కొత్త పాటలు ఎత్తుకున్నారు. మిమ్మల్ను ఉద్ధరించేది మేమంటే మేమని పోటీ పడుతున్నారు. తమకు పోటీ చేయడానికి అభ్యర్థులు లేక అవతలి పార్టీల నుంచి ఫిరాయింపుదార్లను చేర్చుకున్నారు. ఏళ్ల తరబడి తమను నమ్ముకున్న వాళ్లను కాదని కొత్తగా దూకిన కోటీశ్వరులకు టికెట్లు కట్టబెట్టారు.అలాటి వారు దేశాన్ని కాపాడతామని కొత్త రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ఊకదంపుడు మాటలు చెబితే నమ్మే వెర్రి వెంగళప్పలా తెలుగు వాళ్లు?

తెలుగుదేశం సంగతి తీసుకుంటే- చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని ఇక్కడ అదే పనిగా ప్రచారం చేశారు. విభజించిన పద్ధతి తప్ప విడదీయడానికి మేము వ్యతిరేకం కాదని ఒకటికి రెండు సార్లు చెప్పారు. హైదరాబాదులో సంపదలన్నీ గుమ్మరించి నూతన నిర్మాణాలు చేసింది మేమేనని గొప్పలు పోయారు. తెలంగాణను అభివృద్ధి చేయగల విజన్‌ మాకు తప్ప అన్యులకు లేదని ఆత్మస్తుతి చేసుకున్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు ఆసాములకు ధారాదత్తం చేసి ధనరాశులు పోగేశామన్నారు.వాస్తవానికి ఆ కాలంలో అప్పులు విపరీతంగా పెరిగాయి.
ఇవన్నీ ఆలా వుంచి 2008లో తెలంగాణ విభజన కోసం అధికారికంగా తీర్మానం చేసి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ ఇచ్చి వచ్చారు. తాము ఆ లేఖను ఎన్నడూ వెనక్కు తీసుకోలేదనీ, కట్టుబడివున్నామనీ అదే పనిగా చెబుతూ వచ్చారు. పార్లమెంటులో విభజన బిల్లుచర్చకు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం సభ్యులు ప్రాంతాల వారీగా చీలిపోయి పరస్పరం కొట్టుకున్నారు.అలాటి పార్టీ సర్వాధినేత సమైక్యతను కాపాడేందుకు ప్రయత్నం చేశానని చెప్పడంకన్నా అసత్యం మరేముంటుంది?
విజన్‌ వున్న చంద్రబాబు సకల సంపదలూ హైదరాబాదులో కేంద్రీకరించే వ్యూహాన్ని ఎందుకు అనుసరించారు? వ్యవసాయ ప్రధానమైన ఈ రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ప్రపంచ బ్యాంకు మెప్పుకోసం ఎందుకు పాకులాడారు? స్వర్ణాంధ్ర నిర్మాణం ఎప్పుడో పూర్తయిపోయిందని ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు సీమాంధ్ర అనాద అయిందని

బెట్టు... ఎబ్బెట్టు..






అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువ గాదు అని ఏనాడో చెప్పాడు వేమన్న. మేడిపండు పొట్ట విప్పిచూస్తే పురుగులున్నట్టేనని పిరికివారి బింకాన్ని పోల్చి చెప్పాడా ప్రజాకవి. ఓటమి అంచుల్లో వుండి హాహాకారాలు పైకి వినిపించకుండా నానాతంటాలు పడుతున్న కాంగ్రెస్‌ నేతలు ఇంకా మేకపోతు గాంభీర్యం వెలగబెట్టడం ఆ తంతునే తలపిస్తుంది. ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కల్లో తేడాలు వుండటం తప్పిస్తే కాంగ్రెస్‌ ఘోర పరాజయం గురించి ఎలాటి సందేహం ఎవరికీ రావడం లేదు. ఈ కారణంగానే విదేశాంగ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ వంటివారు కూడా తాము అవసరమైతే తృతీయ కూటమికి మద్దతిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఆఖరులోనైనా అధికార పక్షానికి అధిష్టానానికి ఆ మాత్రం విజ్ఞత కలిగిందని లౌకిక వాదులు సంతోషించారు. మోడీ మతతత్వ కూటమి అధికారం చేపట్టకుండా నిరోధించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆశించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌తో సహా వామపక్ష ప్రాంతీయ పార్టీల నేతలు పలువురు ఇలాటి అంచనానే ప్రకటించారు. ఉన్నంతలో ఫలితాల తర్వాత చూస్తే కాంగ్రెస్‌కు అంతకన్నా గత్యంతరం వుండదనేదీ సుస్పష్టం. అయినా సరే ఇలాటి వార్తలు రావడం తమను పలుచన చేస్తుందని కంగారు పడిన యువరాజు రాహుల్‌ గాంధీ ఖండనలు విడుదల చేశారు. తద్వారా తమ అపరిపక్వతనూ అసహనాన్నీ బయిటపెట్టుకున్నారు.
ఈ దేశ రాజకీయ నేపథ్యంలో తృతీయ కూటమి అధికారం చేపట్టడానికి గల అవకాశాలను గురించి గతంలోనే మేము ప్రస్తావించాము. ఫలితాల తర్వాత ఏ పరిస్థితుల్లో ఏ శక్తుల కలయికతో ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందనేది ఫలితాల తర్వాత మాత్రమే తెలియాల్సిన విషయం. ఆ క్రమంలో బలీయమైన ప్రాంతీయ లౌకిక పార్టీలూ స్థిరమైన వామపక్షాల పొందికతో తృతీయ శక్తి అధికారం చేపట్టడం కూడా ఒక అవకాశం. కాని ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి అంగీకరించినా ప్రకటించడానికి అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ కూడా సిద్ధంగా లేవు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా