Pages

Sunday, September 9, 2012

గురజాడ వెలుగుజాడ


తెలుగు సాహిత్యంలో నూత యుగావిర్భావాన్ని సూచించే వేగుచుక్క గురజాడ అప్పారావు. పంథొమ్మిదో శతాబ్దపు వ్యక్తిని ఇరవై ఒకటో శతాబ్దంలోనూ చెప్పుకుంటున్నామంటే అందుకు కారణాలు అనేకం.


పెరిగి విరిగితి
విరిగి పెరిగితి
కష్టసుఖముల
సారమెరిగితి

కొత్తమిన్కుల
తెలివితేటల
మంచి చెడ్డల
మార్చితిన్‌! అని స్వయంగా చెప్పుకున్న గురజాడ నిజంగానే సమాజంలో మంచి చెడ్డల గురించి పాతుకుపోయిన అభిప్రాయాలను ప్రశ్నించి సమూలంగా పరిష్కరించేందుకు కలం పట్టాడు.
ఎప్పుడైనా యుగకర్తలైన వారు సాహిత్య ద్రష్టలుగానే గాక సామాజిక ద్రష్టలుగా కూడా వుంటారు. వారి భావనలు కాలరేఖలను దాటి తదుపరి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. వారి మాటలు కొత్త బాటలు వేస్తాయి. గురజాడ అక్షరాలా తెలుగువారి వెలుగుజాడ. గురజాడ అప్పారావు అగ్రస్థానం కేవలం ఏ ఒక్క కోణం నుంచో, ఒక్క కారణం నుంచో లభించింది కాదు.
గురజాడ సనాతన కుటుంబంలో పుటిyనా దైవభ'క్తిని బోధించడానికి పరిమితం కాలేదు. పైగా దైవభావనకు మానవతాపూరితమైన వ్యాఖ్యానం ఇచ్చాడు. తను రాజుగారి కొలువు చేసినా రాజభ'క్తికే పరిమితం కాలేదు. ఈ రెంటినీ మించిన దేశభ'క్తిని చాటి చెప్పాడు. అది కూడా సంకుచితమైన, దురభిమానపూరితమైన దేశభ'క్తి కాదు. ఏ దేశంలోనైనా అనుసరించగల విశ్వజనీనమైన దేశభ'క్తి, ఆ గీతానికి ప్రపంచ జాతీయగీతం కాగల శక్తి వుందని మహాకవి శ్రీశ్రీ అందుకే అంటాడు.
దేశభ'క్తిని బోధించడమే కాదు - దేశం అంటే ఏమిటో కూడా తొలిసారి గురజాడ చెప్పారు. అంతకు ముందు కాలంలో దేశం అంటే నదులు, పర్వతాలు అని కీర్తించే భౌగోళిక దృష్టి మాత్రమే వుంది. లేదా రాజుల విజయాలనే చెప్పే ధోరణి వుంది. గురజాడ ఆ దృక్పథాలను మార్చేశారు. దేశమంటే మట్టికాదు, మనుషులన్నాడు. మనుషులంటే ఎవరనే ప్రశ్న ఆ వెంటనే వచ్చింది. తిండి కలిగితే కండ కలదోరు, కండ కలవాడేను మని'ోరు అన్నాడు. 'మనిషి చేసిన రాతి బొమ్మకు మహిమ కలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల బాలా' అని ప్రశ్నించాడు.
అప్పటిదాకా అంతా రాజులు, మతాధిపతులు, ఆచార్యులు చెప్పినటేy జరిగింది. అలాగాక సామాన్యమైన మనిషిని కేంద్రబిందువుగా చేసుకోవాలన్న దృషిy పునర్వికాసయుగంలో వచ్చింది. మానవతా వాదం అన్నమాటను ఈనాడు మనం మరో అర్ధంలో వాడుతున్నాం గాని అది మొదట వాడుకలోని వచ్చిన సందర్భం అదే. దాన్ని తెలుగునాట శక్తివంతంగా
ప్రతిపాదించినవాడు గురజాడ. మానవ సంబంధాలు ఛిద్రమై పోతున్నాయని అందరూ ఆవేదన చెందుతున్న ఈనాటి పరిస్థితుల్లో ఈ సందేశం ప్రత్యేకించి స్మరణీయమవుతున్నది. దేశం అంటే దోచుకునే వాడికి ఒక పెద్ద మార్కెట్‌లా కనిపిస్తుంది. కుటిల రాజకీయాలు నడిపేవారికి దేశమంటే కులాలు, మతాలుగా కనిపించవచ్చు. కాని వాస్తవానికి దేశమంటే ఇవేవీ కాదు- ఆ దేశంలో నివసించే మనుషులేనని గురజాడ చెప్పిన భావం చాలా గొప్పది.
దేశమనే భావన కూడా నాగరికత పరిణామ క్రమంలో పెరిగిందే. ఐరోపాలో జాతి రాజ్యాలు పెంపొంది, వలస దేశాలలోనూ క్రమేణా ఆ విధమైన చైతన్యం పెరుగుతున్న కాలం. వలస రాజ్యాలను కొల్లగొట్టడమే కాక వాటికి నాగరికత నేర్పడం తమ తెల్లవాళ్ళపై పడిన భారమని గొప్పలుపోయిన బ్రిటిష్‌ పాలకుల వల్ల వలస ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకింది. మాకూ గొప్ప చరిత్ర వుందని చెప్పడానికి కొందరు వెనక్కు చూడటం కూడా ప్రారంభించారు. ఆ క్రమంలో కొంత ఛాందసత్వం కూడా ప్రబలింది. కాని గురజాడ ఆధునికుడు. 'వెనకచూసిన కార్యమేనోరు, మంచి గతమున కొంచెమేనోరు' అనగలిగినవాడు. అదే సమయంలో గతాన్ని విచక్షణా రహితంగా తోసిపుచ్చడం గాక 'కొత్త పాతల మేలు కలయిక' కావాలని చెప్పగలిగినవాడు.
ఆధ్యాత్మిక స్ఫూర్తిగా పరిగణించబడిన వివేకానందుడు కూడా దేశం ముందుకు పోవాలంటే గత చరిత్ర గొప్పతనాన్ని చెబుతూ కూచుంటే సరిపోదని, ఆధునిక వైజ్ఞానికాభివృద్ధి కావాలని నొక్కి చెప్తాడు. ఈ విషయంలో గురజాడకు స్పష్టత వుంది. ఆయన 'కన్ను కానని వస్తుతత్వము కాంచనేర్పరు లింగిరీజులు' అంటూ సాహిత్యంలో మూఢత్వాన్ని చీల్చి చెండాడి, వైజ్ఞానికతకు పట్టం కడతాడు. ఇది ఆయనకు ఆధునికత సంతరించిన ఒక విశేషం. మూఢనమ్మకాలలో ముఖ్యమైనవి అకారణ భ'యాలు. తోకచుక్క కనిపిస్తే ఎవరో ఒకరు గొప్ప వాళ్ళు పోతారనే భ'యం అకారణమైనదంటూ గురజాడ 'తలతునేనిది సంఘ సంస్కరణ పతాకగాన్‌' అని ప్రకటించాడు. ఇప్పటికీ కొందరు శాస్త్రవేత్తలు అనేవారు కూడా మూఢవిశ్వాసాల నుంచి బయటపడటం లేదని గుర్తు చేసుకుంటే గురజాడ ఆనాడే అంతటి దృఢమైన వైఖరి తీసుకోవడంలోని విశిషyత అర్ధమవుతుంది.
సామాజికంగా గురజాడ భావ విప్లవకారుడి పాత్ర పోషించాడు. జాతీయోద్యమం అస్పృశ్యతా నివారణను చేపటyకముందే గురజాడ కుల వివక్షపై నిప్పులు చెరిగాడు. 'మంచి చెడ్డలు ఎంచి చూడగ మనుజులందున రెండె కులములు, మంచి యన్నది మాలయైతే మాలనే అగుదున్‌' అని ప్రకటించాడు. 'మతం వేరైతేను ఏమోరు, మనుషులొకటై మనుషులుంటే జాతియున్నది లేచి పెరిగి లోకమున రాణించునోరు' అని చెబుతాడు. 'చెటyపటాyల్‌ పటుyకుని దేశస్తులందరు నడవవలెనోరు, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోరు' అని పిలుపునిస్తాడు. కుల మతతత్వాలు ప్రకోపిస్తున్న నేటి పరిస్థితుల్లో ఈ పిలుపు ప్రాధాన్యత ఎంతటిదో చెప్పనవసరం లేదు.
గురజాడ అప్పారావు కన్యాశుల్కం ఒక సామాజిక విప్లవం కూడా. తరతరాలుగా కరుడుగటిyన సామాజిక వ్యవస్థను సవాల్‌ చేసిన శక్తివంతమైన కళాత్మక రూపం కన్యాశుల్కం. అంతకుముందు కాలంలో నాటకాలలో గాని, కావ్యాలలో గాని నాయికా నాయకులంటే కులీన వర్గాల నుంచి వచ్చిన వారే అయివుండాలి. పై కులాలకే చెంది వుండాలి. దాని నిర్వహణలోనూ అనేక సూత్రాలు, ఆంక్షలు. వాటన్నిటినీ గురజాడ ఒక్క దెబ్బతో ధ్వంసం చేసేశాడు. వేశ్యాకులంలోని మధురవాణిని నాయికను చేశాడు. ఆ మధురవాణి సనాతనాచార పరాయణులమనేవారి బూటకత్వాన్ని పటాపంచలు చేసింది. అంతకుముందు కాలంలో సంస్కర్తలు చాలామంది వేశ్యావృత్తిని వ్యతిరేకించడంతో పాటు వేశ్యలను కూడా అసహ్యించుకునేవారు. ఆ ధోరణిని మార్చి మధురవాణిలో ఇంత మహత్తర చైతన్యం చూపిన గురజాడ మరోవైపు ఉన్నత కులం నుంచే వచ్చిన గిరీశంను అవలక్షణాల పుట్టగా చూపించడంలోనూ చాలా సాహసం వుంది. ఆ గిరీశం ఈనాడు మనం వెండితెరపై చూసే అనేకానేక పాత్రల దుషyత్వాన్ని, భ్ర'షyత్వాన్ని తనలో ఇముడ్చుకుని, ఇప్పుడు మనం చూసే సవాలక్ష కుతంత్రాల ప్రతిరూపంగా కనిపించడూ? మోసపూరితమవుతున్న సామాజిక దృశ్యానికి సంకేతంగా గురజాడ వందేళ్ళ కన్నా ముందే ఆ పాత్రను సృషిyంచడంతో సందేశం సుస్పషyం. కన్యాశుల్కం గిరీశంతో అతనితోనే ముగియడం దేన్ని సూచిస్తుంది? వెంకటేశం వంటి వాన్ని గొప్పవాణ్ణి చేస్తానంటూ తల్లిదండ్రులను బురిడీ కొటిyంచి తలాతోక లేని ఇంగ్లీషు ముక్కలు నేర్పే గిరీశంలో నేటి కార్పొరేట్‌ విద్యా వ్యాపారపు పూర్వ రూపం, తెలుగును అపహాస్యం చేసే ఆంగ్ల భా'ా వ్యామోహం కనిపించడం లేదూ? ఆధునిక తెలుగు నాటకంలో గిరీశం లాటి మంచి పాత్ర మరిరాదు.
కన్యాశుల్కంలో స్త్రీ పాత్రలనీ పురుషులపై ఏదో ఒక దశలో తిరగబడటం గురజాడ మనోభావాన్ని సూచిస్తుంది. ఆధునిక స్త్రీ కొత్త చరిత్ర సృషిyస్తుంది అన్న గురజాడ అగ్నిహోత్రావధాన్ల భార్య వంటి సనాతన పాత్రలతో కూడా తిరుగుబాటు మాటలనిపించడం చూస్తాం. బాల వితంతువు బుచ్చమ్మ తన చెల్లెలి పెళ్ళికోసమే గిరీశంతో వెళ్ళిపోవడమే సిద్ధమవడంలోనూ సాహసం, త్యాగం చూస్తాం. పూటకూళ్ళమ్మ చీపురుతో బాదినా, మీనాక్షి శాపనార్ధాలు పెటిyనా అన్నిటా స్త్రీ నిరసన తొలి సంకేతాలు పరికిస్తాం.
అన్నీ వేదాల్లో వున్నాయష అనే అగ్నిహోతావధాన్లు విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్య ఫారాలు ప్రవేశపెటేy నేటి పాలకులకు పూర్వ రూపం కదూ? పురోహితుడు నిర్ణయించిన ముహుర్తంలో మగపిల్లవాడికి ఆడ వేషం వేసి పుస్తె కట్టించడం ఆచారాల, ఆచార్యుల బండారాన్ని బటyబయలు చేయడం కాదూ? ఇలా ఇందులో చాలా అంశాలు నేటికీ వర్తిస్తాయి. వందేళ్ళు దాటినా ఈ నాటకం సజీవంగా వుందంటే అందుకు కారణం రచనా శిల్పం మాత్రమే కాదు - సామాజిక సారాంశం కూడా.
గురజాడకు సామాన్య ప్రజల హృదయం ఏమిటో బాగా తెలుసు. వారికి దేశ స్వాతంత్య్రం గురించి ఆసక్తి లేదని కాదు. అంతకంటే తమ జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే విషయాలే వారు ఎక్కువగా పటిyంచుకుంటారు. స్వాతంత్య్రం వస్తే మా ఊళ్ళో కానిసేyబుల్‌ మారిపోతాడా అన్న ప్రశ్నలో ఈ స్థానికత తొంగి చూస్తుంది. స్థానికతను యాసలోనూ గురజాడ ప్రదర్శిస్తారు. కన్యాశుల్కంలో మనం పూర్తిగా పాత్రోచిత భాషను చూస్తాం. అందులోనూ ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా తర్వాత కాలంలో గురజాడ వ్యవహారిక భా'ా ఉద్యమ సారథులలో ఒకరవడానికి బీజాలు ఇక్కడే వున్నాయి. స్థానిక భాష, మాండలికాలపై అనంతమైన వాదోపవాదాలు సాగుతున్న నేపథ్యంలో ఆనాడే గురజాడ చూపిన ఆ ఆదర్శం గమనార్హమైంది.
1892లో కన్యాశుల్కం తొలి కూర్పు వెలువరించిన గురజాడ అప్పారావు 1910లో ముత్యాల సరాలు సృజించడం ద్వారా కవిత్వం వైపు మరలడం, పద్యాల నుంచి సూత్రబద్ధ ఛందస్సుల వైపు మొగ్గడం సామాజిక దృషిy ఫలితమే రాజకీయాలలో మనం కోరుకునే ప్రజాస్వామికం భా'ా సాహిత్యాలలోనూ రావాలని ఆయన ఆకాంక్ష. అందుకు సాధనమే వ్యవహారిక భాష అలాగే సులభ'తరమైన మాత్రాబద్ధ ఛందస్సులతో కూడిన గేయాలు.
కూర్తువా ముత్యాల సరములు
కూర్చుకుని తేటైన మాటలు అనడంలో తన భావాన్ని ఆయన ప్రారంభ'ంలోనే ప్రకటించారు. ఇంతా చేసి కవిత్వం ఏం చేయాలనే దానిపైనా, ఎలా వుండాలనే దానిపైనా ఆయనకు స్పషyత వుంది.
ఆకులందున అణగి మణగి
కవిత కోకిల పలుకవలెనోరు
పలుకులను విని దేశమంద
భిమానముల మొలకెత్తవలెనోరు
కవిత్వం అనేది సూటిగా రసరహితంగా గాక శిల్ప సమన్వితంగా వుండాలని ఈ మాటలలో చెప్పారు. ఆ కవిత్వం ఎలా వుండాలంటే దేశమందభిమానములు సృషిyంచేలా వుండాలి. అప్పటికి ఇప్పటికి కూడా కవితా రీతిని, సందేశాన్ని ఇంతకంటే చక్కగా చెప్పడం సాధ్యం కాని పని. సాహిత్యంలో వస్తువు ముఖ్యమా, శిల్పం ముఖ్యమా అనే చర్చ ఎప్పుడూ సాగుతూనే వుంది. ఈ ఒక్క వాక్యంలో గురజాడ ఆనికి సమాధానం ఇచ్చేశాడు. అప్పటికి ఇప్పటికి కూడా ఈ సందేశం సామాజిక స్పృహ గల రచయితలకు శిరోధార్యమైంది.
గురజాడ కవిత్వంలో మానవ ధర్మాలన్ని వున్నాయి. స్నేహం, ప్రేమ, దాంపత్యం, సంస్కరణ, వృత్తి, వ్యాపారాలు వగైరాలన్ని.
అప్పటి వరకూ తెలుగు సాహిత్యంలో అప్సరసలు, పతివ్రతలు మాత్రమే వున్నారు. గురజాడ మొదటిసారిగా రక్తమాంసాలున్న స్త్రీలను ప్రవేశపెటాyడు. దేవాంగనల స్థానే వేశ్యాంగన మధుర వాణిని ఆమెకు అంతకు ముందు లేని సజీవ చైతన్యమిచ్చాడు.
పాతివ్రత్యమే పరమ ధర్మమంటూ భ'ర్త పాదసేవ తప్ప భార్యకు మరో స్థానం లేదన్న మాటలను తోసిపుచ్చుతూ 'మగడు వేల్పన పాత మాటది, ప్రాణమిత్రుడ నీకు' అని భార్యకు చెప్పే భ'ర్తను సృషిyంచాడు. ఆ విధంగా తెలుగు సాహిత్యంలో స్త్రీ పురుషుల మధ్య పరిణితమైన ప్రేమ భావనను తీసుకొచ్చిన వాడు గురజాడే.
చాలాచోట్ల స్త్రీలను, మాలలను గురించిన ప్రస్తావనలు గురజాడ సామాజిక దార్శనికతను తెలియజేస్తాయి. మంచి చెడ్డలు ఎంచి చూడగా మనుజులందున రెండె కులములు, మంచియన్నది మాలయైతే మాలననేనౌతా అని అన్నారు. కాని మరోచోట 'మలిన దేహులు మాలలనుచును, మలిన చిత్తుల కధిక కులముల, నెల నొసంగిన వర్ణ ధర్మమ, ధర్మ ధర్మంబే' అని అసమానతల కుల వ్యవస్థను, నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఆయన తర్వాత చాలా కాలానికి వర్గ చైతన్యంతో తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన శ్రీశ్రీ కూడా స్త్రీలకు, దళితులకు సంబంధించి గురజాడతో సరితూగలేరు. మహాప్రస్థానంలో స్త్రీ అమ్మగా తప్ప ఆధునిక స్త్రీగా, జీవన సహచారిణిగా అగుపించడం చాలా అరుదు. స్త్రీని అమ్మగా ఆకాశానికెత్తడం చాలా ప్రాచీనమైన సరళమైన భావన. ఆమెను సమానమైన విలువతో స్నేహితురాలుగా చూపటంలో గురజాడ ఆధునికత వుంది.
గురజాడ మానవతా దృషిy, దురాచారాల ప్రతిఘటన, ఇతివృత్త చిత్రణ తారాస్థాయికి చేరిన రచన 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ'. ఖండకావ్య ప్రక్రియను సామాజికరించిన గురజాడ పూర్ణమ్మలో దాన్ని అద్భుతంగా వాడుకున్నారు.
పూజారింటను పుటిyన చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఏయే వేళలో పూచే పువ్వుల నాయా వేళల అర్పించి బంగరు దుర్గను భ'క్తితో కొలిచింది (అంటే ఆమె దేవత కూడా బంగారే). కాని డబ్బు ఆశతో తల్లిదండ్రులు ఆమెను ఒక ముసలి మొగుడికి కటyబెటాyలనుకున్నారు. వరకట్నం ఎదురిచ్చినపుడు, కన్యాశుల్కం తీసుకున్నప్పుడు కూడా బలిపశువు వధువే కావడం గమనించదగ్గ విషయం. పూర్ణమ్మ అందుకు తలవంచి పెళ్ళి చేసుకుంది. అత్తవారింటికి వెళ్ళేప్పుడు అమ్మా నాన్నలకు నమస్కరించింది. వాళ్ళ దీవెనలు వింటూ ధిక్కార పూర్వకంగా ఫక్కున నవ్వింది. నలుగురు కూచుని నవ్వే వేళ నా పేరొకతరి తలవండి. మీ బిడ్డలలో ఎవరో ఒకరికి ప్రేమగ నా పేరివ్వండి అని వేడుకుంది. ఇక్కడ మనకు అక్షరాలలో ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళే సన్నివేశం సాక్షాత్కరిస్తుంది. కాని కణ్వుడు శకుంతలను దుష్యంతుడి దగ్గరకు పంపుతూ నీతులు చెప్పిన తీరు కాదు. ఇక్కడ పూర్ణమ్మదే మాట. ఇంతా చేసి పూర్ణమ్మ అత్తగారింటికి పోలేదు.
'కన్నుల కాంతులు
కలువల చేరెను
మేలిమి చేరెను
మేనిపసల్‌
నడకల బెళుగులు
హంసల చేరెను
దుర్గను చేరెను
పూర్ణమ్మ'
అంటూ గురజాడ కరుణరసాత్మమైన ముగింపు నిస్తాడు. ఇక్కడ శిల్పం, విషయం కూడా హృదయాలను తాకుతాయి. చిన్న ఖండికకు ఇచ్చిన ఈ ముగింపు వాస్తవంలో ఒక మహాకావ్య సన్నిభ'ంగా గోచరిస్తుంది. దుర్గను అంత భ'క్తిగా కొలచిన పూర్ణమ్మ చివరకు ఆమెనే చేరిందని రాయడంలో వున్న ధిక్కారం దాచినా దాగదు.
గురజాడ అప్పారావు చిన్న కథ పునాది పురుషుడు. ఆ కథలన్ని స్త్రీ సమస్యను గాని, సామాజిక సమస్యలను గాని స్పృశించినవే. ఇప్పుడు రకరకాలైన వాదాలలో వినిపించే చాలా అంశాలు ఆయన నాడే ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దిద్దుబాటు కథలో వేశ్యాలోలుడైన భ'ర్త కళ్ళు తెరిపించడం సుమతీ సావిత్రి కథలు చదివిన దేశానికి కొత్త అనుభ'వమే. అంతకంటే కూడా మనుషుల్లారా మీ పేరేమిటి, పెద్ద మసీదులలో గురజాడ మూఢాచారాలను, మతపరమైన విద్వే'ాలను, సంఘర్షణలను దాదాపు వందేళ్ళ క్రిందట చిత్రించారు. కథ అనే ఆధునిక ప్రక్రియను తీసుకురావడమే కాక దాన్ని సామాజిక దృషిyతో వినియోగించడంలోనూ ఆయన దార్శనికత గోచరిస్తుంది. హిందూ ముస్లిం నినాదాలు కూడా చిత్రించిన తీరులో ఆయన నేటి భారతాన్ని ప్రత్యక్షంగా చూశాడా అనేంత సందేహం కలుగుతుంది. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగాలని చెప్పిన గురజాడ అందుకు భిన్నమైన ప్రవర్తన ఎలా వుంటుందో ఈ కథలలో మనకు తెలియజెప్పాడు. మీ పేరేమిటి కథలో హేతువాద దృషిyని నొక్కి చెప్పిన గురజాడ పెద్ద మసీదు కథలో మతాచారుల కన్నా మనుగడకే మనిషి ప్రాధాన్యతనిస్తాడని నిరూపించాడు. తీర్థయాత్రకు వెళ్ళి వచ్చేసరికి అంతకుముందు గుడి వున్న చోట మసీదు ప్రత్యక్షం కావడం, సద్భ్రాహ్మణుడే తురకల్లో కలసి మసీదుకు కాపలా కాయడం అందులో చిత్రిస్తాడు. ఈ విధమైన కథల ద్వారా గురజాడ మతాలనేవి మనుషుల మధ్య అడ్డుగోడలు కాకూడదని, అవి ఆచరణలో నిలిచేవి కావని గటిyగా చెబుతాడు.
ఇక వ్యవహారిక భా'ోద్యమంలో గిడుగుకు తోడునీడగా చేసిన సేవ తెలుగు జాతి మరచిపోకూడదనిది. ''తెలుగు సాహిత్యాన్ని సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమా లేక దానికి జవసత్వాలిచ్చి దాన్ని ఒక గొప్ప నాగరిక శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి వుంది'' అని ఆయన హెచ్చరించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బోధనా భాష సమస్యను పరిశీలించేందుకు వేసిన కమిటీని నామినేషన్ల ద్వారా మాయ చేసి అభివృద్ధి నిరోధకమైన నిర్ణయాలు చేయించినా గిడుగు, గురజాడ పోరాటం మాత్రం సత్ఫలితాలిచ్చింది. ఆ కమిటీకి గురజాడ సమర్పించిన అసమ్మతి పత్రం ప్రజల భాష కోసం జరిగే పోరాటానికి ప్రామాణికమైన నిలిచింది.
చదువులు పై వర్గాలకే పరిమితమైనప్పుడు అర్ధం కాని సంస్కృతంలో బోధించినా చెల్లిందని, ఇప్పుడు అత్యధికజనం చదువుకోవాలంటే మాత్రం వారికి తెలిసిన భాషలో చెప్పాలని గురజాడ అంటారు. సామాజిక దొంతరలను స్పషyంగా చెబుతూ అగ్రవర్ణ బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దశ దాటిపోయాక అప్పటి సంస్కృత ప్రధానమైన భా'ా శాస్త్ర నియమాలను పటుyకుని కూచోవడం వల్ల ఫలమేమిటని ప్రశ్నిస్తాడు. నిత్య జీవితంలో మాట్లాడుకునే భాషకు దగ్గరగా వుంటేనే జ్ఞాన సముపార్జన సులభ'తరమవుతుందని నిరూపిస్తాడు.
''విశాల ప్రజానీకం చదువుకోవడం పూర్వాచార సంప్రదాయంలో భాగం కాదు. నాడు జ్ఞానార్జన సాహిత్యం క్షీణ దశలో వున్నప్పుడు తెలుగులో సాహిత్య సృషిy ఆరంభ'మైంది. అందువల్ల ఆ క్షీణ దశ లక్షణాలైన భా'ా కళా సంప్రదాయాలు తెలుగు సాహిత్యంలో పాతుకుపోయాయి.'' 'తెలుగు కవిత పరిస్థితి ఎటువంటిదంటే అది సంకుచిత మతానుయాయులకు మాత్రమే అభిమాన పాత్రమైంది. పండితులు పండితుల కోసమే రాశారు. కాలం గడిచే కొద్ది సులభ'ంగా అర్ధం కాకుండా వుండటమే గొప్ప కావ్య లక్షణమన్న భావం ఏర్పడింది.''
భాషలో నిర్జీవ పదాలకు ఉదాహరణగా స్త్రీ అన్న మాటకు 130 మాటలున్నాయని, ఇందులో తొమ్మిది మాత్రమే ఉపయోగిస్తున్నామని చెబుతారు. ఇదంతా భా'ా సమస్య పట్ల గురజాడకు గల అపారమైన అవగాహనను, అధ్యయనాన్ని చెబుతుంది.
ఇక్కడే ఇంకో విశేషం వుంది. గురజాడ స్వతహాగా సంప్రదాయక శైలిలో పద్యాలు రాసి మెప్పించిన వాడు. ఆయన తొలి రచన ఇంగ్లీషులో సాగింది. వీటిని ఇంగ్లీషు పత్రికలలో పెద్దలు విమర్శకులు బాగా అభినందించారు. ఆ విధంగా ఆంగ్లంలోనూ, సంప్రదాయ సాహిత్యంలోనూ మంచి పటుy వున్న గురజాడ ఆ రెంటినీ వదలి ప్రజల భాష వైపు రావడానికి కారణం ఆయన పరిశీలనా శక్తి మాత్రమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే గురజాడ అక్షరాలా ఆధునిక దృక్పథం వున్న వ్యక్తి.
గురజాడ సామాజిక గుణాలు తెలియాలంటే కేవలం ఆయన సృజనాత్మక రచనలు చదివితే చాలదు. అంతకంటే ఆయన అసమ్మతి పత్రం చదవాలి. అంతేగాక ఆయన డైరీలు, లేఖలు, అవీ ఇవీ వంటివి పరిశీలించాలి. అప్పుడే గురజాడ సమగ్ర రచనలకు సంబంధించిన ప్రణాళికా బద్ధమైన పథకాలు రూపొందించుకోవడం చూస్తాం. అలాగే మనుషులను నిశితంగా పరిశీలించడం వల్ల తనలో మారుతూ వచ్చిన అభిప్రాయాలను కూడా పొందుపరుస్తారు. మనుషుల్లో వుటిyటిy పటాటోపం, బానిస ప్రవృత్తి ఆయనకు నచ్చవని ఈ డైరీలు తెలియజేస్తాయి.

ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే గురజాడ రచనలకే పరిమితమైన మనిషి అనికాదు. వాస్తవానికి ఆయన గొప్ప వ్యవహార దక్షుడు. విజయనగరం రాజు ఆస్థానంలో పత్రికలు చదివి వినిపించేవాడు. లీగల్‌ వ్యవహారాలు చూసేవాడు. ఆ సందర్భంలో కన్యాశుల్కం సమస్య ఆయన దృషిyకి వచ్చింది. ఆనంద గజపతి రాజు కన్నుమూశాక ఆయన సోదరి రేనా మహారాణికి వారసత్వ సంపద అందేలా చేయడంలో గురజాడ కీలకపాత్ర పోషించారు. సామాన్యంగా తమకు సమయం లేదని గొప్పగా చెప్పే రచయితలు ఇన్ని బాధ్యతలు మధ్యనే గురజాడ కృషి చేశారనే ప్రాథమిక సత్యం తప్పక గుర్తుంచుకోవాలి.
గురజాడ ఎంతటి భావుకుడైనా అంతే వాస్తవిక వాది కూడా. దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోరు, దేశి సరుకులు నమ్మవలెనోరు అంటూ దేశీయ ఉత్పత్తి పెరగాలని చెబుతారు. ధనమూలమిదం జగత్‌ కనుక డబ్బు తేలేనటిy సరుకునకు కీర్తి సంపదలబ్బవోరు అని స్పషyం చేస్తాడు. ఈ మాటలన్ని నేటికీ గొప్పగా వర్తించేవే. ఇప్పుడు అవసరం లేని వాటికి కూడా విదేశీ సరుకుల కోసం ఎగబడటం చూస్తుంటే గురజాడ సందేశం మరింత సార్థకమైందిగా కన్పించకమానదు.
గురజాడ అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య అనారోగ్యంతో పెనుగులాడుతూ దైనందిన బాధ్యతలు నిర్వహిస్తూనే సాహిత్య రచనలోనూ, సామాజిక చింతనలోనూ వైతాళిక పాత్ర పోషించారు. ఆయన తర్వాత కాలంలో వెనువెంటనే జాతీయోద్యమ కవిత్వం వచ్చినా ఆపైన భావ కవిత్వంపై చేయి సాధించింది. దానికి కారణం కొత్తగా చదువుకున్న మధ్యతరగతి యువకులకు పరాయి పాలన వల్ల, పాత పద్ధతుల వల్ల కోరుకున్న ఆధునిక జీవితం లభించకపోవడంతో శోకం వైపు, ఊహా సుందరి వైపు వెళ్ళారు. వారి అప్రాప్త సుందరి వాస్తవానికి వారికి అందిరాని జీవన సూత్రమే. మళ్ళీ మహాకవి శ్రీశ్రీ రంగం మీదకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు గురజాడ వారసత్వానికి సముచితమైన కొనసాగింపు లభించింది. అభ'ు్యదయ వాదులు బాగా ప్రచారం చేశౄరు.
అడుగు జాడ గురజాడది
అది భావికి బాట
మనలో వెధవాయిత్వం
మరిపించే పాట అన్న శ్రీశ్రీతో మొదలై తర్వాత కాలంలో గురజాడ వైతాళిక పాత్రకు సర్వే సర్వత్రా గౌరవం లభించింది. ఆయన దేశభ'క్తి గీతం తెలుగువారి అనధికార జాతీయగీతమైంది. సొంతలాభ'ం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోరు అని ఆయన ఇచ్చిన కనీస ప్రణాళికను అమలు జరిపేందుకు ఆలోచనాపరులు ఆరాటపడసాగారు. మరోవైపు సొంతానికే సొంతం అన్న స్వార్ధపూరిత వాతావరణం పెరుగుతున్న కొద్ది దేశమంటే మనుషులోయి అనిగాక మార్కెట్లోయి అని చెప్పే వాణిజ్య ధోరణులు, కుల మతాల ప్రాతిపదికన మంటలు పెటేy కుటిలత్వం, కవిత్వంలోనూ అకారణమైన అస్పషyత, ఆఖరుకు తెలుగు భా'ా వికాసానికి ఎసరు పెటేy ప్రపంచీకరణ ప్రాబల్యం పెరిగే కొద్ది ఆయన సందేశం మరింత అవసరమవుతుంది. మరింత గౌరవం పెంచుకుంటుంది. కన్యాశుల్కం పోయి వరకట్నం వచ్చినా, వేశ్యా వృత్తి స్థానే సైబర్‌ సెక్స్‌ స్థాయికి చేరినా స్త్రీ విముక్తి కోరిన ఆయన కవితా శంఖం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.

(జోడింపు: గతంలో రాసిన వ్యాసానికి రెండు ముక్కలు జోడించదలచాను.
1.ఇటీవల విజయనగరంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య గోష్టిలో గురజాడ కన్యాశుల్కం సమకాలీన భారతీయ నాటకాలు అన్న అంశంపై ప్రసంగించాను. అదే పట్టణానికి చెందిన యు.ఎ.నరసింహమూర్తి ఈ విషయమై చాలా పెద్ద పరిశోధానాత్మక గ్రంధం రాశారు. ఆ నాటి సభలో గిరీశంగా ప్రసిద్ధులైన రమణమూర్తితో సహా అనేకులు పాల్గొనడం చాలా సంతోషం కలిగించింది.
2.శ్రీశ్రీతో సహా చాలా మంది ఎందుకో పుల్లయ్య గారు తీసిన కన్యాశుల్కం చిత్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు గాని నాకూ నాలాటి కొన్ని వేల మందికి అది బాగా నచ్చుతుంది. సావిత్రిమధురవాణి పాత్ర, లొట్టిపిట్లలు అంటూ ఆమె ఆపకుండా నవ్వడం వంటి దృశ్యాలు మరపు వచ్చేవి కావు. గిరీశంగా ఎన్టీఆర్‌ తన ఇమేజిని కూడా కాస్త పక్కనబెట్టి బాగానే నటిస్తారు. లుబ్దావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావు, రామప్పంతులుగా సీఎస్సార్‌, అగ్నిహెత్రావధనాలుగా విన్నకోట రామన్న పంతులు, కరటకశాస్త్రిగా వంగర ఎవరూ తక్కువ కాదు.పాటలు కూడా బాగుంటాయి. ముగింపు మార్చడం ఒక్కటి మినహా ఆ చిత్రంలో ప్రత్కేకించి తప్పు పట్టాల్సింది నాకు అగుపించదు)
3.గురజాడ సంస్మరణ సభలు మా సాహితీ స్రవంతి సంస్థ మొదటి నుంచి జరుపుతూనే వుంది. ఆలస్యంగానైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి రావడం మంచిదే. ఇదే పని శ్రీశ్రీ విషయంలోనూ చేసి వుంటే చాలా బావుండేది.)No comments:

Post a Comment