Pages

Thursday, March 6, 2014




ఎట్టకేలకు కిరణ్‌ పార్టీ

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొత్త పార్టీ స్థాపించాలని ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆలస్యంగా తీసుకున్న ఈ నిర్ణయం నాటకీయ మార్పులకు దారితీసే అవకాశం చాలా తక్కువ. పదవిలో వుండగా వున్న బలం వేరు, లేనప్పుడు పరిస్థితి వేరు. నిజానికి ఆయన పదవిలో వున్నప్పుడు కూడా సొంతబలం తక్కువే. పైగా ఇప్పటికే కోస్తా రాయలసీమల్లో వైఎస్సార్‌ పార్టీ ప్రభావం అధికంగా వుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో తమ బలం కూడా పెరిగిందని తెలుగుదేశం వారు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభావం తెలంగాణలో వుండకపోయినా తక్కినచోట్ల వుంటుందని బిజెపి అంచనాగా వుంది. సిపిఎం సమైక్యత నినాదం ఇచ్చిన సిపిఎం కూడా కొన్ని చోట్ల గట్టిగానే తలపడుతుంది.ఎన్నికల పొత్తు కుదిరితే మరింత ప్రభావం వుంటుంది. ఇన్నిటినీ కాదని కిరణ్‌ పార్టీ పెద్ద ఫలితాలు సాధించే అవకాశం వుండదు. కాని ఓట్ల చీలికకు కారణమై తద్వారా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు కొంత మేలు చేయొచ్చు. రెండవది మూడేళ్లుగా అధికారంలో వున్న నేతగా కిరణ్‌ అస్తవ్యస్త పరిస్థితికి జవాబు చెప్పుకోవలసి రావచ్చు. మిగతా వారికి ఆ సమస్య వుండదు. మొత్తంపైన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రాంతంలో బహుముఖ పోటీలకు ఓట్లచీలికకు మాత్రం ఇది దారి తీస్తుంది.

No comments:

Post a Comment