Pages

Wednesday, March 5, 2014




్నకల తేదీల ప్రకటన పూర్తయింది గనక ఇక రాజకీయమంతా విభజనపై గాక విజయ సాధనపై నడుస్తుంది. అందుకోసం పార్టీలు తమ తమ విన్యాసాలలో మునిగిపోతాయి. సిపిఐ, న్యూడెమోక్రసీ మజ్లిస్‌లతో ఆ పార్టీ సర్దుబాట్టు చేసుకోవచ్చు. విలీనమై కాంగ్రెస్‌ను బలోపేతం చేయకపోవడం ఒక విధంగా మంచి విషయమే.. తెలుగుదేశం బిజెపితో జట్టు కట్టడం తథ్యం.లోక్‌సత్తా కూడా బిజెపితో కలుస్తుందన్న వార్తలే విచిత్రంగా వున్నాయి. సుపరిపాలన అన్న అంశంపై మోడీని బలపరుస్తామని అ పార్టీ అతి కీలక నేత ఒకరు నాతో అన్నారు. లోక్‌సత్తా పాత్ర చాలా పరిమితమైనా జయప్రకాశ్‌ నారాయణ్‌ కలిగించిన భావనకు ఇది పూర్తి వ్యతిరేకంగా వుంటుంది. బిజెపి నేత మోడీ మంత్రజాలాన్ని సీమాంధ్రలో ప్రధానంగా ప్రయోగించాలని బిజెపి భావిస్తున్నట్టు కనిపిస్తుంది.
కాంగ్రెస్‌ నాయకులు టిఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నామని అంటున్న మాట కేవలం ప్రజలముందు చెప్పుకోవడానికి ఉద్దేశించిందనుకోవాలి. టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో విలీనం లేదని చెప్పడమంటే బహుశా పొత్తు కూడా వుండదనే అర్థం.ఇది కూడా ఎత్తుగడే అని కొందరంటున్నారు గాని అది మరీ అతిశయోక్తి కావచ్చు. ఫలితాల తర్వాత ఏమైనా జరగొచ్చు గాని ఇప్పటికైతే పోటీ తప్పదు.
పిఎం తెలంగాణాలో పొత్తుల విషయం ఇంకా ఏ అభిప్రాయానికి వచ్చినట్టు కనిపించదు. సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌ పార్టీతో పొత్తు విషయం కూడా పరిశీలనలో వుందని తుది నిర్ణయం కేంద్ర కమిటీ తీసుకుంటుందని లోగడ బి.వి.రాఘవులు చెప్పారు. ఇటీవల కేంద్ర కమిటీ ముగిసింది. రాష్ట్ర కమిటీ 8 వతేదీన సమావేశం కాబోతుంది. తుది నిర్ణయం అప్పుడు వెలువడవచ్చు.
మొత్తంపైన సీమాంధ్రలో కన్నా తెలంగాణాలో పార్టీల పోరాటం, ఓట్ల విభజన ఎక్కువగా వుంటుంది. కమ్యూనిస్టులకు కూడా ఇక్కడ బలమైన కేంద్రాలున్నాయి. ,కాంగ్రెస్‌ రాష్ట్రం ఏర్పాటు చేసింది తామేనని చెప్పుకుంటే బిజెపి, బలపర్చానంటుంది. తెలుగుదేశం దానితో పొత్తు పెట్టుకుని తన యంత్రాంగాన్ని రంగంలో దించుతుంది. అయితే ఆ పార్టీ వారు అనేకమంది టిఆర్‌ఎస్‌లోకి వలసలు రావడం దాని పరిస్థితిని తెలియజేస్తుంది.చంద్రబాబు నాయుడు లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారంలో అంతర్గతంగా అవసరమైతే కేంద్రానికి వెళ్లవచ్చన్న సంకేతం కనిపిస్తుంది. చివరకు ఏది ఏమయ్యేది చూడాల్సిందే.
జూన్‌2న ఆవిర్భావ తేదీ ప్రకటించారు గనక ఈ ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్‌కు ఆఖరి ఎన్నికలు. ఇవి సజావుగా ఏర్పడేబోయే రాష్ట్రాల అభివృద్ధి ప్రజా శ్రేయస్సు లక్ష్యాలుగా జరిగితే చాలా మంచిది. ఇంకా ఉద్రేకాలు పెంచుకుంటే అంతకన్నా పొరబాటుండదు.
ఇతర రాష్ట్రాలలో ఎన్నికలపై మరోసారి.

No comments:

Post a Comment