ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని అమాంతం అభివృద్ధి మార్గంలో దూసుకుపోయేలా చేశాయని నమ్మే వారికి లోటు లేదు. కావాలని ఆ ప్రచారం చేసే కార్పొరేటీధీశులు, కపట వచనాలకు మారుపేరైన పాలక వర్గ నేతలు చెబితే పర్వాలేదు. అమాయకులూ అవగాహన లేని వారు నమ్మినా ఆశ్చర్యం లేదు. కాని విద్యాధికులూ విషయజ్ఞులమని భ్రమించే వారు కూడా అదే నిజమని నమ్ముతూ ఆ పైన నాలాటి వారు విమర్శిస్తే విరుచుకుపడుతుంటారు. అలాటి వారంతా భారతీయ శిశువుల పౌష్టికాహార లోపంపై మొన్న ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఏమంటారో చూడాలి. ఇరవై ఏళ్ల సరళీకరణ తర్వాత - దానికి ప్రవక్త మన్మోహన్ నోటనే సిగ్గుచేటు వంటి మాటలు విన్న తర్వాతనైనా ఆలోచించుతారా? పేద కుటుంబాలకు ఆహార భద్రత లేదు సరే కసి గందులకు గర్భిణిలకు కూడా సరైన తిండి పెట్టలేని అభివృద్ధి రేట్లు ఎవరికి గాట్లు? 42 శాతం మంది పిల్లలు ఆహార లోపంతో బాధపడుతుంటే భావి భారతం ఏమవుతుందని బాధపడే బదులు గతం గొప్పలు చెప్పుకునే వారు లేదా కొద్ది మంది గొప్పవారిని చూసి మురిసిపొమ్మనే వారు ఎవరికి ప్రతినిధులు? ఈ లోపం ఎవరి పాపం? వెలిగే భారతం రగిలే భారతం వీటి మధ్య అంతరాలను తొలగించేందుకు పోరాడాల్సిన ప్రత్యామ్నాయాలు చెప్పాల్సిన బాధ్యత బుద్ధి జీవులకు లేదా? సరళీకరణ నిజానికి గరళీకరణ అని స్పష్టంగా గుర్తించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆర్థికాభివృద్ధి పేరుతో అసమానతలు పెంచడం ఒకటైతే అన్నం కూడా లేకుండా చేయడమా, హత విధీ!
Sunday, January 15, 2012
సరళీకరణా? గరళీకరణా?

Subscribe to:
Post Comments (Atom)
nice
ReplyDeleteసరళీకృత విధానం వల్లే ఈ వేల కమ్యూనికేషన్, సమాచార వ్యవస్తలో గణనీయమైన అభివృద్ధి సాదించాము, అలాగని లోపాలు లేవని కాదు. అలాగే రిటైల్ రంగంలో లోకూడా ఈ విధానం అవసరం, వీటిపై ఒక పటిష్టమైన మానిటరింగ్ వ్యవస్తను ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఉంది. డెబ్బై ఎనభై దశకంలో పారీశ్రామీకరణ అవకాశాన్ని వదులుకోన్నాము కాని ఇప్పుడు ఎలాగైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి.
ReplyDeleteఆఖరుకు మన్మోహన్ సింగ్ గారే సిగ్గు పడుతున్నా మీకు అవి కొన్ని లోపాలు గా కనిపిస్తున్నాయి. అసలు ఆ విధానాలలోనే లోపం వుంది. మీరు చెప్పే కమ్యూనికేషన్లు వగైరా సాంకేతికాభివృద్ధికి సరళీకరణ పేరిట గరళీకరణ అవసరం లేదు.
Deleteరవిగారూ, సాంకేతికాభివృధ్ధి అనేది కేవలం కొద్దిమందికే ఉపయోగం అని నమ్మితే మీకు యేమీ చెప్పదగినవాడను గాను. కాని వినదలచుకుంటే కొన్ని విషయాలు.
ReplyDelete1. అన్నిరకాలరంగాలలో అభివృధ్ధి అనేదాని మౌళికప్రయోజనం విస్తృతమానవప్రయోజనమే.
2. అభివృధ్ధిప్రయోజనాలు ప్రజాబాహుళ్యానికి అందకపోతుంటే దానికి కారణం ఆయా శాస్త్రసాంకేతికరంగాల మౌళికస్వభావంలోనో, ఆయా రంగాల శాస్త్రజ్ఞులయొక్క నిజాయితీలోనో లోపంగా భావించటం సరైన దృక్పధం కాదు. అది పాలనా వ్యవస్థనుండి యేర్పడే లోపం.
3. ప్రభుత్వరంగం దారుణవైఫల్యాల అనంతరమే ప్రైవేటురంగానికి దారులు తెరుచుకున్నాయి. ప్రభుత్వరంగంలోని వ్యవస్థలూ, పరిశ్రమలూ దిగ్విజయంగా నడుస్తూ ఉంటే ప్రైవేటురంగానికి ప్రభుత్వం ఇతోధిక ప్రోత్సాహం ఇవ్వవలసిన పరిస్థతి ఉత్పన్నం అయ్యేదే కాదు.
4. యే వ్యవస్థ అయినా, యే పరిశ్రమ అయినా సరయిన దారిలో నడవకపోతే ప్రభుత్వం గమనికతో ఉండి సరైన చర్యలు తీసుకోవాలే కాని. కళ్ళుమూసుకుని కూర్చుని అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడటమేమిటి? ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంది - గరీబీకి కారణం ప్రభుత్వపాలనావ్యవస్థల వైఫల్యం అయనప్పుడు తగిన చర్యలు తీసుకోవటం మాని యీ నినాదం ప్రజలమీదకు వదలటం వంచనే కదా? మిష్టర్ (అన్)క్లీన్ రాజీవ్ గాంధిగారు ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతిరూపాయలోను 15పైసలే ప్రజలకు చేరుతున్నాయని ఒక గొప్ప నిర్వేద ప్రకటన చేసాడు - కాని దానికి కారణమౌతున్న ప్రభుత్వపాలనావ్యవస్థల వైఫల్యం గురించి ఆయన ప్రవేశపెట్టిన దిద్దుబాటు యేమీ లేదు. ఈ రోజున మన నిత్యపర్యాటకప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా అటువంటిదే ఒక ప్రకటన వదిలితే దాని ఆంతర్యం ఆయనకు ప్రభుత్వపాలనావ్యవస్థల వైఫల్యం గురించి అవగాహనలేదనా? లేక ప్రస్తుతం ఉన్న ఆర్ధిక విధానం కారణంగానే పేదరికం పెరుగుతోందని సెలవియ్యటమా?
5. నిజానికి పేదరికం నిర్మూలనకు ప్రభుత్వాలు చిత్తశుధ్ధితో యేమీ చేయటం లేదు - ఘనతవహించిన కీర్తికాముకప్రధాని నెహ్రూగారి కాలంనుండీ. అన్ని ప్రభుత్వాలది ఒకటే యావ. ప్రజలను ఓట్లుగా మాత్రమే చూసి అధికారం నిలబెట్టుకోవటానికి ప్రయత్నంచటమే.
6. సాంకేతికాభివృధ్ధిని వ్యతిరేకించటం అనే ఫ్యాషన్ ఒకటి ఉంది. అది మేధావులమనుకొనే వాళ్ళకు మనదేశంలో చాలా యెక్కవగా ఉంది. మీరు దానిని కొత్తగా ఋజువు చేయనక్కరలేదు. కొయ్యముక్కలను రాపాడించి నిప్పు పుట్టించటం నుండి అగ్గిపెట్టె దాకా ఆ తరువాతా మన వంటప్రయత్నానికి దోహదమయ్యే ఆ సాధనాలలో మార్పులు కూడా సాంకేతికాభివృధ్ధి క్రిందికే వస్తాయని ఈ మేధావివర్గానికీ, మీకూ తెలియదనుకోవాలా?
నిజానికి వ్యతిరేకించవలసినది సాంకేతికాభివృధ్ధిని కాదు. దాని ఫలితాలను ప్రజలకందకుండా అడ్డుపడే రకరకాల స్వార్ధపర శక్తులను.
సాంకేతికాభివృద్ది లేకపోతే మీరూ నేనూ ఇలా మాట్లాడుకోగలిగేవాళ్లమే కాదు. కనక ఆలోచించే వారెవ్వరూ దాన్ని వ్యతిరేకించరు. కాని సామాజికాంశాలతో నిమిత్తం లేని సాంకేతిక జపం వల్ల ప్రయోజనం లేదు అనే చెప్పదల్చుకున్నది. పేదలను సృష్టించే విధానాలను అనుసరిస్తూ పేదరికం నిర్మూలన గురించి చెప్పడం హాస్యాస్పదమే. మన్మోహన్ గొప్ప సత్యం చెప్పాడని కాదు నా భావం, నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు అని మాత్రమే. ఆర్థిక సంస్కరణలు ప్రైవేటు భాగస్వామ్యం సాంకేతిక వికాసం ఏదీ తప్పు కాదు. కాని ఆ పేరుతో దేశ సంపదను ప్రకృతి వనరులను కొద్ది మందికి కట్టబెట్టే వైపరీత్యంపైనే నా విమర్శ. మీరన్నట్టు ఫ్రభుత్వ రంగం విఫలం కావడం వల్లనే ఇలా జరిగిందనే మీ భావం పూర్తిగా నిజం కాదు. ఇదే పాలకులు అవసరమైనప్పుడు ప్రభుత్వ రంగం పేరిట హడావుడి చేశారు. ఇప్పుడు ప్రైవేటీకరణ పరుగులు పెడుతున్నారు. ప్రజా ధనంతో ఆస్తులతో ప్రకృతి వనరులతో ప్రైవేటీకరణ శక్తులకు పట్టం కట్టక్కర్లేదు. దేశీయ చొరవను వదిలేసి విదేశాలచుట్టూ ప్రదక్షిణలు చేయనక్కర్లేదు. దేశానికి ప్రజలకు మేలు చేసే సంస్కరణలనే ఆహ్వానించాలి. పిల్లలకు కూడా తిండి పెట్టలేని ప్రస్తుత పరిస్థితి మారాలి. నేను చెప్పింది ఇంత వరకే. నెహ్రూనే కాదు, వాజ్‌పేయి ప్రధానిగా వున్నా ఆ మాటలే చెప్పారు. పెద్ద తేడా ఏమీ లేదు.
Deleteసంతోషం రవిగారూ. మన అభిప్రాయాల్లో మౌళిక బేధాలేమీ లేనేలేవు.
ReplyDeleteదేశ సంపదను ప్రకృతి వనరులను కొద్ది మందికి కట్టబెట్టే వైపరీత్యం మనమంతా తప్పక ప్రతిఘటించాలి. విప్రతిపత్తి యేమీ లేదు. దేశీయ చొరవను వదిలేసి విదేశాలచుట్టూ ప్రదక్షిణలు చేయనక్కర్లేదు - నూటికి నూరుపాళ్ళూ యేకీభవిస్తాను.
పిల్లలకు కూడా తిండి పెట్టలేని ప్రస్తుత పరిస్థితి మారాలి - నిజమే. కాని సాంకేతికాభివృధ్ధి ప్రసక్తి యెందుకు. ఇక్కడ సమస్య పాలకవర్గాలకు చిత్తశుధ్ధి లేకపోవటం.
ఫ్రభుత్వ రంగం విఫలం కావడం వల్లనే ఇలా జరిగిందనే మీ భావం పూర్తిగా నిజం కాదు - కాకపోవచ్చు. కాని నిజంపాలు హెచ్చుకానే ఉంది కదా. అపారప్రజావనరులను ప్రభుత్వరంగం భోజనం చేయటం యేరకంగా సమర్ధనీయం. అలాగని ప్రైవేటురంగం విచ్చలవిడితనానికి దిగవచ్చని అర్ధంకాదు. ప్రభుత్వాలు సమర్ధంగా పనిచేయాలనే నా తాత్పర్యం - అది వదిలేసి కారణాలు వెదకటం వలన పేదరిక నిర్మూలన యేమాత్రం సుగమం అవుతుంది చెప్పండి?
>> Manmohan Singh said this: New Delhi, Jan 10 (IANS) Expressing concern that 42 percent of India's children were underweight, Prime Minister Manmohan Singh said Tuesday that levels of under-nutrition were 'unacceptably high' despite GDP growth and labelled malnutrition a 'national shame'.
ReplyDeleteHE WAS TALKING ABOUT GDP NOT LIBERALIZATION. DO YOU UNDERSTAND THE DIFFERENCE BETWEEN GDP AND LIBERALIZATION?
@teja,
Deletethank you very much for the extraordinary elucidation. hope you are also aware that some thing called "letter and spirit'.. clear?
What was the malnutrition level during the days of license-quota raj?
Delete