Pages

Wednesday, February 15, 2012

శ్రుతి మించిన మతభాష్యం


సరికొత్త బొగ్గు కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు నిజం కాదని సిఎజి వినోద్‌ రాజా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసినట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్నది. వాస్తవం ఏమంటే సిఎజి నివేదిక లీకేజిపై ప్రధాని కార్యాలయం ఆరా తీస్తే దాన్ని మాత్రమే ఆయన ఖండించారు. విచారం వెలిబుచ్చారు. పైగా సిఎజిని సమాచార హక్కు చట్టం కింద చేర్చాలని కూడా కోరారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో మాత్రం తాము ఎలాటి ముసాయిదా(చిత్తు ప్రతి) నివేదిక కూడా ఇంత వరకూ ఇవ్వలేదని ఇంకా పరిశీలన చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఒక కీలకమైన సాంకేతికమైన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఆడిటింగ్‌లో ఏవైనా ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం ఒక పట్టాన ముగిసేది కాదని, అప్పటి వరకు వాటిని తాత్కాలిక అభిప్రాయాలుగానే పరిగణించాల్సి వున్నందున తమ దృష్టికి వచ్చిన అంశాలను కూడా చెప్పగల స్తితి వుండదని సూచించారు. బొగ్గు కుంభకోణం విషయానికి వస్తే అలాటి ఆరోపణలే లేవని ఆయన లేఖలో ఎక్కడా పేర్కొనటేదు. సిఎజి లేఖ
పూర్తి పాఠం (ఈ కథనం బయిటపెట్టిన) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. అందులో ఒక పేరాగ్రాఫు పట్టుకుని అంతా సజావుగా వుందని బుకాయించడం చెల్లుబాటయ్యేది కాదు. 2 జి స్ప్రెక్ట్రం సందర్భంలోనూ ప్రభుత్వం ఇలాగే సమర్థించుకుని తర్వాత దారుణంగా దొరికిపోయి సంకీర్ణ ధర్మం అంటూ అధర్మపన్నాలు చెప్పింది. బొగ్గు ఉత్పత్తి ఖర్చుకు ప్రైవేటు కంపెనీలకు సరఫరా చేస్తున్న రేటుకు మధ్య తేడాను లెక్కకట్టి న సిఎజి తద్వారా ఖజానాకు రావలసిన ఆదాయం ఎంత గల్లంతు అవతున్నదో తేల్చింది. ఇంకా తొంభై శాతం బొగ్గు నిల్వలు వున్నాయి గనక దాన్ని 90 తో గుణించి 10 లక్షల కోట్ల నష్టం లెక్క తేల్చింది. ఇది వూహాజనితమేమీ కాదు. ఇప్పుడున్న ప్రైవేటీకరణ జపంలో అసాధారణమూ కాదు. పైగా ప్రధాని బొగ్గు శాఖ చూస్తున్నప్పుడే ఇదంతా జరిగింది. ఇది వరకటి పోస్టులో నేను ప్రకృతిని కొల్లగొట్టడం గురించి రాశాను. ఇక్కద సమస్య ప్రకృతి వనరులన్నదే తప్ప కేవలం సౌందర్యం పర్యావరణ పరిరక్షణ కాదు.ప్రపంచంలోని బొగ్గు నిల్వల్లో 7 శాతం మాత్రమే మన దేశంలో వున్నాయి. ఉత్పత్తిలో ఆరు శాతమే మనం చేస్తున్నాం. కనక అక్రమ లాభాల మాట అటుంచి వాటిని జాగ్రత్తగా వాడుకోవలసిన బాధ్యత కూడా మనపై వుంది. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు బహుళజాతి సంస్థలు పరిశ్రమల పూర్వ ఆర్థిక వనరులు అంటే భూములు గనులు నీరు రేవులు కొండలు వాయు తరంగాల వంటి వాటిపై కన్నేశారన్నది ప్రభాత్‌ పట్నాయక్‌ వంటి ఆర్థిక వేత్తల విశ్లేషణ. ఒకప్పుడు బ్రిటిష్‌ వారు మన దేశం వచ్చింది కూడా ముడి సరుకుల కోసమేనని మర్చిపోరాదు. ఇప్పుడు కూడా ఏదో విధంగా వనరులను తరలించుకుపోతున్నారు. కనక ఇది ఆర్థిక అంశమే గాని కేవలం పర్యావరణ పరిరక్షణ పాఠం కాదు.

14 comments:

  1. చాలా మంచి సమీక్ష. చక్కగా రాశారు.

    ReplyDelete
  2. "సామాజిక ఆర్థిక రాజకీయాంశాల కలబోతే చరిత్ర". perfect. nijanga baga raasaru. prati matam lonu manchi chedu rendu unnayi. adi telusukokunda vaagevaallatone samasya antaa.

    ReplyDelete
  3. "సామాజిక ఆర్థిక రాజకీయాంశాల కలబోతే చరిత్ర". perfect. nijanga baga raasaru. prati matam lonu manchi chedu rendu unnayi. adi telusukokunda vaagevaallatone samasya antaa.

    ReplyDelete
  4. నేను హిందూమత అనుకూలవాదినైనప్పటికీ మీ వ్యాసం బావుందనకుండా ఉండలేకపోతున్నాను. అయితే విషయాన్ని ఏకాండిగా వ్రాసుకుంటూ వెళ్లారు. కాస్త గద్యలు (paragraphs) గా విడగొట్టవలసిందని మనవి.

    ReplyDelete
  5. వ్యాసం బాగుంది. దీన్ని నేను గూగుల్ ప్లస్‌లో షేర్ చేశాను.
    https://plus.google.com/111113261980146074416/posts/BT3fFJ9hVqy

    ReplyDelete
  6. మీ విశ్లేషణ నచ్చిందండీ.

    ReplyDelete
  7. గతంలో నేను కూడా కంచ ఐలయ్యలాగే హిందూ మతం పోతే కుల వ్యవస్థ మాయమైపోతుంది అని అనుకున్నాను. కానీ రంగనాయకమ్మ గారి రచనలు చదివిన తరువాత నా అభిప్రాయం మారింది. విదేశాలలో కుల వ్యవస్థ లేదు కానీ అక్కడ ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఇండియాలో కుల వ్యవస్థ పేరుతో ఆర్థిక అసమానతలని బహిరంగంగా సమర్థించడం జరుగుతోంది. విదేశాలలో ఆ పేరు చెప్పుకోకుండానే ఆర్థిక అసమానతలని కొనసాగిస్తున్నారు. జస్టిఫికేషన్ దొరికినా, దొరకకపోయినా అణచివేత వ్యవస్థ (oppressive system) అనేది కొనసాగుతుంది.

    ReplyDelete
  8. చాలా సమగ్ర సమీక్ష! చాలా బాగుంది. ఒకటికి రెండు సార్లు చదివాను.

    ReplyDelete
  9. రవి గారు,
    చాలా చక్కగా రాసారు. అయ్యలయ్యగారి గందరగోళ వాదనను, తాత్వికతను మీరు ఆకళింపు చేసుకొని, ఆయనను, అతనిని సమర్ధించే వారికి అర్థమయ్యే భాషలో తిప్పికొట్టారు. ప్రపంచ చరిత్ర లో పలు గట్టాలు మీకు బాగా తెలిసి ఉండటం వలన ప్రతి ఆరోపణకి సమాధానమిస్తూ ఇంత చక్కని వ్యాసం రాయగలిగారనిపించింది. అయ్యలయ్యగారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ క్రింది వీడీయో ఉపయోగపడుతుంది.

    The making of Prof. Kancha ilaiah Osmania University
    http://www.youtube.com/watch?v=tmu98HWqQPE

    ReplyDelete
  10. చాలా నిష్పాక్షికంగా, సూటిగా రాశారు. ఇందులోని చాలా అంశాలు మరింత చర్చించ దగ్గవి.

    పేరా గ్రాఫుల విభజన సరిగా ఉండేట్లు చూడగలరు.

    ReplyDelete
  11. కంచ ఐలయ్య అనుకునేది ఏమిటంటే "కుల వ్యవస్థ మాత్రమే పోవాలి, ఆర్థిక అసమానతలు పోవాల్సిన అవసరం లేదు" అని. కుల వ్యవస్థ హిందూ మతంలో మాత్రమే ఉంది. వేరే ఏ మతంలోనూ లేదు. హిందువులందరూ క్రైస్తవ మతంలోకి లేదా ఇస్లాం మతంలోకి మారిపోయి కుల ఐడెంటిటీలని త్యజించినా ఆర్థిక అసమానతలు ఎప్పటిలాగే ఉనికిలో కొనసాగుతాయి. ఆర్థిక అసమానతలు ఎప్పటిలాగే కొనసాగినా కేవలం కులం పోవడమే గొప్ప విషయం అని దళితులు, గిరిజనులు అనుకునేలా కన్విన్స్ చెయ్యడమే కంచ ఐలయ్య ఉద్దేశం. రంగనాయకమ్మ గారు వ్రాసిన "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం చదవండి. ఆ పుస్తకంలో రంగనాయకమ్మ గారు చంద్రభాన్ ప్రసాద్ గారిపై చేసిన విమర్శలు కూడా చదవండి. చంద్రభాన్ ప్రసాద్ ఐడియాలజీ కూడా దగ్గరదగ్గరగా కంచ ఐలయ్య గారి ఐడియాలజీ లాంటిదే. కంచ ఐలయ్య OBC కులం నుంచి వచ్చిన దళిత మేధావినని చెప్పుకుంటే చంద్రభాన్ ప్రసాద్ తాను దళిత కులం నుంచి వచ్చిన దళిత మేధావినని చెప్పుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక మౌలికమైన తేడా ఒకటి ఉంది. చంద్రభాన్ ప్రసాద్ గారు ఆర్థిక అసమానతలు ఎప్పటిలాగే ఉంటాయనీ, వాటిని మార్చడం సాధ్యం కాదనీ అంటారు. కంచ ఐలయ్య గారు మాత్రం ఆర్థిక అసమానతల గురించి మాట్లాడకుండా తెలివిగా కులం, మతం లాంటి పనికిరాని అంశాలవైపే ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తారు.

    ReplyDelete
  12. చాలా సమతూకం తో రాశారు. కుల వివక్ష ను ఖండించే పేరు తో వేలం వెర్రులను సమర్ధించకూడదు.

    ReplyDelete