Pages

Saturday, September 15, 2012

దేశ ప్రజలపై దాడి: విదేశీ కార్పొరేట్లకు దాసోహం

 కుంభకోణాల తాకిడికి తల్లడిల్లిపోతున్న మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం సెప్టెంబరు 13,14 తేదీలలో తీసుకున్న నిర్ణయాలు తెంపరి తనానికి దుస్సాహసానికి పరాకాష్టగా వున్నాయి. డీజిల్‌ ధర ఎన్నడూ లేనంతగా లీటరుకు అయిదు రూపాయల పైగా పెంచడం, గ్యాస్‌ సిలిండర్లకు సంబంధించిన షరతులను కఠినతరం చేసి సబ్సిడీకే గాక సరఫరాలకు కూడా ఎసరు పెట్టడం ఆందోళన కలిగించే అంశాలు. డీజిల్‌ పెంపు వల్ల రాష్ట్రంపై 4300 కోట్ల రూపాయల వరకూ భారం పెడితే అదనపు వ్యాట్‌ కారణంగా ప్రభుత్వానికి 730 కోట్ల ఆదాయం వస్తుందట!ఆర్టీసిపై 325 కోట్ల భారం పడుతుంటే ప్రజలపై రుద్దడానికి సిద్ధమవుతున్నది. గ్యాస్‌ డీజిల్‌పై సబ్సిడీలు రద్దు చేయాలని ప్రపంచ బ్యాంకుకు అనుబంధమైన గ్లోబల్‌ సబ్సిడీ ఇన్షియేటివ్‌ సంస్థ(జెనీవా) మంగళవారం నాడు మూడు నివేదికలు విడుదల చేసింది. ఈ నిర్ణయాలన్ని దానికి అనుగుణంగానే వున్నాయి.చమురు రంగంలో ప్రైవేటు శక్తులు ప్రవేశించిన తర్వాత ధరల పెంపు వేగం పెరిగింది. అసలు నియంత్రణే ఎత్తివేయబడింది.ఇక గ్యాస్‌ సిలిండర్లయితే రెట్టింపు రేట్లు పెరగనున్నాయి. పైగా ఏడు కోట్ల సిలిండర్ల కొరత రానున్నది ప్రజలపై ఇంత నిర్దయగా వ్యవహరించిన యుపిఎ2 దేశ విదేశీ కార్పొరేట్లకు మాత్రం దేశాన్ని దోచుకోవడానికి తలుపులు బార్లా తెరిచింది.గతంలో ప్రజాగ్రహానికి వెరచి పక్కన పెట్టిన చిల్లర
వ్యాపారంలో 51 శాతం ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని పున:ప్రకటించింది. దేశీయ విమాన సంస్థలు కూలిపోతుంటే విదేశీ సంస్థలకు ఈ రంగంలో 49 శాతం వాటా కల్పించేందుకు సై అన్నది. అంతకంటే హానికరంగా ప్రజల భావాలను మలిచే ప్రసార రంగంలో ఏకంగా 79 శాతం విదేశీ పెట్టుబడులకు ఓకె చెప్పింది. ఇప్పటికి ఛానళ్లలో అనుమతించలేదంటున్నా ఈ చర్యలన్ని ఆ దిశలోనే వున్నాయి. అస్తుబిస్తుగా నడుస్తున్న తమ సర్కారుకు అంతర్జాతీయ బేహారుల అండదండలు సంపాదించడానికే మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఆదరాబాదరగా ఈ నిర్ణయాలు ప్రకటించింది. అమెరికా అద్యక్షుడు ప్రభుత్వ వర్గాలు మీడియా ఆయనపై చేసిన హెచ్చరికలు విమర్శలు బెదిరింపులు బాగా పనిచేశాయన్నది స్పష్టం. ...

No comments:

Post a Comment