ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత టీవీ5 నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌పై చర్చ చాలా సేపు జరిగింది. గతంలో జెమినీలో సర్వే, టీవీ9లో ఆఖరున నిర్వహించిన ఒపీనియన్ పోల్ చర్చలకు కూడా హాజరయ్యాను. మొత్తంపైన ఇవన్నీ కూడా ఒకే విధంగా వుండగా ఎగ్జిట్ పోల్ సహజంగానే వాటికి ముగింపు అని చెప్పాలి.తెలంగాణా ప్రాంతంలో ఉప ఎన్నికల ఫలితాలు టిఆర్‌ఎస్ పక్షానే వస్తాయని, అయితే ఓటింగు మాత్రం ఏకపక్షంగా వుండకపోవచ్చని ఎగ్జిట్ పోల్ చెబుతున్నది. టిఆర్‌ఎస్ అభ్యర్థులకు 50-55 శాతం, మహబూబ్ నగర్‌లో 34 శాతం ఓట్లు వస్తాయని ఆ పోల్ అంచనా వేసింది.అయితే స్టేషన్ ఘన్‌పూర్, కామారెడ్డి రెండు చోట్ల తెలుగు దేశం రెండవ స్థానంలో వస్తే మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో వస్తుందని అంచనా. మొత్తంపైన ఈ ఎన్నికల ఓటింగు ఏకపక్షంగా వుండదనీ,ఇతర పార్టీలు కూడా తెలంగాణా క్షేత్రంలో కాలూనుకుంటాయని వచ్చిన అభిప్రాయాన్ని ఎగ్జిట్‌పోల్ ధృవపర్చింది. అయితే ఈ దశలో టిఆర్‌ఎస్ నాయకులు, ప్రత్యేక తెలంగాణాను బలపర్చే ఇతరులు కూడా సిపిఎం తప్ప మిగిలిన పార్టీలకు వచ్చిన ఓట్లన్నీ తెలంగాణా వాదానికేనని కొత్త తర్కం మొదలు పెట్టారు. ప్రచారంలోనూ అంతకు ముందూకూడా దుర్భర స్తాయిలో దూషించుకుని పరస్పర ద్రోహాలు ఆపాదించుకుని ఇప్పుడు హఠాత్తుగా మాకందరికీ వచ్చిన ఓట్లు ఒకటేనని చెప్పడం కంటే వైపరీత్యం వుంటుందా?అయితే ఇది భవిష్యత్ రాజకీయాలకు సూచిక కూడా. ఎంందుకంటే అందరూ ఇదే వాదనతో ఈ ప్రాంత ప్రజలను గందరగోళ పర్చి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పోటీ పడతారన్నమాట.
కోవూరు మెజారిటీపై ఆశలు
కోవూరులో వైఎస్‌ఆర్ పార్టీ విజయం సాధిస్తుందని అంటున్నా మెజారిటీ ఎగ్జిట్ పోల్ చెబుతున్న దానికన్నా ఒకటి రెండు రెట్లు ఎక్కువుంటుందని ఆ పార్టీ నాయకులు ఆశతో వున్నారు.ఈ ఫలితంతోనే రాజకీయాలలో పెనుమార్పులు వచ్చేస్తాయని కూడా అంచనాలు కడుతున్నారు. వాస్తవం ఏమంటే ఈ ఫలితం రాబోయే సామూహిక ఉప ఎన్నికల ఫలితాలకు ముందస్తు సూచిక అవుతుంది. అసలు మార్పులు ఆ తర్వాతనే వస్తాయి. అంతే తప్ప వెనువెంటనే నాటకీయ పరిణామాలు వచ్చి పడతాయనుకోవడానికి లేదు. వైఎస్‌ఆర్ పార్టీ వారు మెజారిటీపై అతి అంచనాలు పెట్టుకుంటే అప్పుడు వచ్చిన విజయాన్ని కూడా తామే సరిగ్గా చెప్పుకోలేని స్తితి రావచ్చు. కనక ఒకింత వాస్తవికంగా ఆలోచించడం మంచిది. వారి సంగతి ఎలా వున్నా తెలుగుదేశం మాత్రం ఈ ఓటమి తర్వాత కొంత విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు.
<> సీ.పీ.ఎం (టీ.ఆర్.ఎస్ ఎలాగూ ఉపప్రాంతీయ పార్టీ కనుక)తప్ప రెండు ప్రాంతాలలో సూటిగా ఒకే మాట చెప్పే సాహసం మిగతా పార్టీలు చేయడం లేదు. కోవూరు విజయం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కు కొత్త ఊపుని ఇస్తుంది. రాజకీయంగా కొత్త సమీకరణాలకు కూడా కొన్ని అనూహ్య ఘటనలతో సహా ఇది ప్రేరణ కాబోతుంది.
ReplyDeleteకోవూరు ఉప ఎన్నిక ఫలితం ప్రత్యేకమయినది. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ పార్టీ వై ఎస్ ఆర్ జిల్లా బయట ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోలేదు. ఇదే ప్రధమం. ఇక్కడ జగన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధి ఇంతకు ముందు తెలుగు దేశం తరపున పోటీ చేసాడు. పార్టీ మారి కూడా ఘన విజయం సాధిస్తే జగన్ హవాకు తిరుగు ఉండదు. ఎల్లో మీడియా ఎంత గోల చేసినా, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనడానికి ఈ ఉప ఎన్నిక ఫలితం చెంప పెట్టు కాబోతుంది.....
ReplyDeleteనిజమే ప్రజలు అవిన్నేతి నేతలు కావలిఅనుకున్తుంటే ఎల్లో మీడియాకడు కదా ఎవరు ఆపలేరు మూడు ఏళ్లు ప్రజలకుఎమి చేయకపోయినా వారినే ప్రజలు ఆదరిస్తున్నారు అంటే ఏమనుకోవాలి
Delete"సిపిఎం తప్ప మిగిలిన పార్టీలకు వచ్చిన ఓట్లన్నీ తెలంగాణా వాదానికేనని కొత్త తర్కం మొదలు పెట్టారు"
ReplyDeleteమీ తర్కం ఏమిటి? కాంగ్రెస్ తెదేపా భాజపాలు తాము రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని చెప్పలేదు, పైగా తెలంగాణాపై తెరాసా కంటే తమకే చిత్తశుద్ధి ఉన్నాయన్నారు. ఇదే కారణం వల్ల సీపీఐ కూడా వామపక్ష ఐక్యత బదులు తెలంగాణా వాదానికే మొగ్గు చూపింది.
సీపీఎం మాత్రమె విశాలంధ్రకు కట్టిబడి ఉంది కాబట్టి, వారు ఈ అంశం పై పోటీ చేయకున్నా వారి మాత్రమె వోట్లను తెలంగాణా వ్యతిరేకంగా లేక్కేయడం సబబే కదా.
"మాకందరికీ వచ్చిన ఓట్లు ఒకటేనని చెప్పడం కంటే వైపరీత్యం వుంటుందా?"
వాళ్ళు అన్ని మాటలు మీరు అంట కట్టడం న్యాయమా? మేమందరమూ ఒకటే అని ఎవరూ అనలేదు. తామంతా తెలంగాణకు కట్టుబడి ఉన్నామని అని చెప్పడానికి, అందరూ ఒకటే అనడానికి తేడా ఉందని మీరు గమనించాలి.
మీరూ మీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కావచ్చు గాక, అది మీ హక్కు. కానీ ఇక్కడ ఎన్నికలు తెలంగాణా రావాలో ఒద్దా అనే విషయం పై జరగలేదని, ప్రజలలో అత్యధికులు తెలంగాణా రావాలని కోరుకుంటున్నారని ఒప్పుకుంటే మీకే విశ్వసనీయత పెరుగుతుంది. తెలంగాణా వాదం పై ఎవరి విశ్వసనీయత ఎంత అనే విషయం పైనే ప్రజలు తీర్పు చెప్పారు.
As a politician, you can & should have opinions. As an analyst, however, passing off your preference as a prediction may not be a great idea.
/కానీ ఇక్కడ ఎన్నికలు తెలంగాణా రావాలో ఒద్దా అనే విషయం పై జరగలేదని/
DeleteYes, that is true. The election is not being held to decide or even to know opinion on the seperation. How could you seperatists come to such senseless conclusions?!
/తెలంగాణా వాదం పై ఎవరి విశ్వసనీయత ఎంత అనే విషయం పైనే ప్రజలు తీర్పు చెప్పారు/
That is your understanding/perception. I think it is just time-pass election not a genuine/regular one. It is part of drama/stunt by some political buffoons, who want to keep the issue alive for their survival (extortions etc). Ofcourse, some educated NRIs also taking part for reasons best known to them.
/ప్రజలలో అత్యధికులు తెలంగాణా రావాలని కోరుకుంటున్నారని ఒప్పుకుంటే మీకే విశ్వసనీయత పెరుగుతుంది./
ReplyDeleteఒప్పుకోకపోతే? 'స్పష్టంగా' చెవిలో శంఖంపెట్టి వూది, ఒప్పుకునేవరకూ తెలంగాణలో తిరగనివ్వరా? :)
విశ్వసనీయత పెరుగుతుందో, తరుగుతుందో... మీరు చెప్పాలి, మాకు తెల్వద్. మీరు గేమంటే గదే! గెలిచినాక రాజీనామా ఎప్పుడు చేస్తరో స్పష్టంగా చెప్పున్రి. :P
SNKR, like the blogger you too should differentiate between prediction & preference. Your opinion on buffoons, extortions etc. even if true can't obliviate one fact i.e. all parties claimed to be Telangana champions. CPM, the only one to champion the cause of united AP, is coming a cropper.
Deletesomehow both of you are stressing the obvious. it is not the task of the analyst. my point is that there is no difference what so ever on the demand for a separate Telangana between these parties. when all of them fight with same slogan and abuse each other the goal is nothing but political supremacy. i hope you understand .. cpm has no stakes in this ugly mudslinging. it is only a limited force and never pretended otherwise. finally the nominal votes it get tell everything. why worry about that? talk about the great champions waiting for laurels.
Delete@తెర:
ReplyDeleteBy resorting to language like "ugly mudslinging", you are giving up any pretence of neutrality you may ever have had. The point is that you were asked to play the role of an analyst but chose partisanship.
I am surprised at your surprise about the struggle for political supremacy. Politicians, whether Buddadev, Mamata, Babu or Kiran, will always strive for supremacy. The "holier than thou" face being now put up by CPM and its cronies is based on the fact their strength is miniscule, not value based.
Do you agree people are supporting Telangana statehood demand? I find it strange you resort to wordsmithing just to avoid acknowledging this simple reality. Criticizing TRS, Congress or TDP can come later but avoiding the demand is awkward.
:D
DeleteJaiGottimukh
Are you neutral?!
Are you not supporting KCR and seperatists?
Before blamming the author look at yourself. I say this is a time-pass agitation raised by some political buffoons, sheep-like people are just following. Once the Police opened cases, VijayaShanti, Harish Rao, KTR, KCR just disappeared from the scene and called-off indefinetly, terming it as strategic mouth-shut! :))
/Do you agree people are supporting Telangana statehood demand?/
DeleteWhich people?
Has it been endorsed by the State Assembly or parliament?
Since when, the seperation idea is in circulation? Who is behind it?
Why none of the family members sacrificed for the cause they incited?
Do you agree that given a chance, many states want to seperate and be independant?
Do you know that rulers of Hyderabad state wanted to join in Pakistan?
Do you know the fact that Hyderabad state was liberated by Indian Army?
Do you know that AP was formed as a linguistic state? And there are many such states in India?
People who are intoxicated with regional feelings and hatred, may demand anything but it is majority to decide what need to be done in the interest of country, do you agree/understand that?!
It is not at all strange that you resort to wordsmithing just to avoid acknowledging this simple reality.
@SNKR:
DeleteYou are missing the point here. The post is about bye-election exit polls, not Asafjahis wanting to join Pakistan. Trying to raise half baked points like these is an attempt to divert attention from the democratic process.
I did not claim to be neutral. A TV analyst (like the present blogger) is expected to provide his analysis in a non-partisan manner.
@SKNR
ReplyDeleteరాజకీయ బఫూన్ల విషయం పైకి వచ్చినపుడు నవ్వు రావడం సహజమే. దాన్ని జగన్ వీరాభిమానులకు వెకిలి అనిపించడం కూడా వాస్తవమే. గంభీరంగా వుండాలని ఘటొద్గజునిలా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోవుంది అన్నట్లు మొహం పెట్టడం ప్రేక్షకులకు విసుగు కల్గిస్తుంది.
జగన్ మాత్రం? పాపం పసివాడులా 'సోనియమ్మా చూడాలి, నిన్నూ నాన్నను చూడాలి, ఓట్లు నాకే ఇవ్వాలి, CMసీట్లో నిద్దురపోవాలీ అని దీనాతిదీనంగా మొహం పెడుతూ అడ్డమైనవాళ్ళందరినీ ఓదారుస్తున్నాడా లేదా? ఎప్పుడైనా పేచీ పెట్టామా? భరిస్తున్నాంగా!
అయ్యా SKNR గారూ .. కందకులేని దురద కత్తిపీటకు ఎందుకు ?
రవిగారు మరీ అంత జగన్ ద్వేషి అయితే ఆయన నోట్లోంచి రావాలి ఆ మాట.. కోట్లాదిమంది జగన్ అభిమానుల్ని కించపర్చకండి... సభ్యతగా మాట్లాడండి
ఓ కరడుగట్టిన అవినీతిపరుడిని ఎవరు మాత్రం సపోర్ట్ చేస్తారు? అవినీతిపరులు తప్ప? కందకు దురద ఎందుకు వేయదంటే అది స్వంతమైన దురద. న్యాయంగా కత్తిపీటకే దురద వేయాలి. సి.బి.ఐ ని దర్యాప్తు చేయొద్దని కోర్టుల్లో అప్పీళ్ళేసింది ఎవరో! కందనా, దురదనా, కత్తిపీటా?
Deleteఇంకో మాట పాత్రికేయులను రాజకీయనాయకులతో కలిపి చర్చలకు పిలిచేది కనీసం వీరైనా తటస్థంగా మాట్లాడాలని.. వీళ్ళు కూడా "నీచ " రాజకీయ వేత్తల్లా మాట్లాడితే అది మంచిది కాదు..
ReplyDelete@ gottimukkala
Deletei may just ask you show at least one instance where i differed on this point? i never said that there is no desire for separation. but i go on saying that it is not panacea. all my criticism is only on politics of duplicity with which all people particularly of Telangana region are duped.try to comment on the content of my comments. not your insinuations. tks
రవి గారూ, తెలంగాణా డిమాండు ప్రజలలో లేదని మీరు అనలేకపోవచ్చు. కానీ ఆ ఆకాంక్ష బలంగా ఉందని మీరు ఒఒప్పుకున్న దాఖలాలు నాకయితే కనిపించలేదు. మీరు చంద్రబాబు శైలిలో (double negatives like never opposed) మాట్లాడడం మీ హుందాతనానికి సరిపోతుందా?
Deleteతెలంగాణా రావడం వల్ల ఏమీ ఒరగదని లేదా నష్టం జరుగుతందని అభిప్రాయం ఉంటె అదీ చెప్పండి. అలాగే తెలంగాణా డిమాండుని మోస్తున్న వారినీ విమర్శంచండి. కానీ అంతక ముందు ఒక్కసారి ప్రజాభిప్రాయం ఎటువైపు ఉందొ acknowledge చేస్తే సమతులంగా ఉండేదనేదే నా మనవి.
ఆ((( ఆకాంచలు! ఇవేమన్నా కొత్తా! 1969నుంచి అడపాదడపా మలేరియా, బర్డ్ ఫ్లూలా ఆకాంచలు వస్తన్నయ్, కాసేపు వణుకుతున్నాయ్, సూదిమందేత్తే పోతన్నయ్. దాఖలాలు అంతలా కనిపిస్తుంటే కనిపించలేదటారేమండి జై గొట్టిముక్కుల గారు?!
Deleteహుందాతనం గురించి వేర్పాటువాదులు కూడా స్పీచీలివ్వడమా! హవ్వ! హుందాగా వుంటే ఈపాటికి మీ సోకాల్డ్ ఆకాంచలు నెరవేరి 5ఏళ్ళయి వుండేవేమో.
@SNKR: రవి గారు ఒప్పుకున్న దాఖలాలు సార్ నేను అడిగింది, మిమ్మల్ని కాదు.
Deleteమీరు నేను హుందాగా లేకపోయినా ఫరవాలేదండీ. రవిగారు ఎంతో హుందాగా ఉంటారు కాబట్టి ఆయన statureకి సరిపోయిన వ్యాఖ్యలు ఆయన అభిమానులం కోరుకోవడం సమంజసమే కదా.
Thanks....
Deletei have no hesitation what so ever in accepting the intensity of the desire for a separate state.. what ever may be the background... any party may take any stand but it should be clear and forthright.