బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో రెండవ పెద్ద భాగస్వామి జనతా దళ్(యునైటెడ్) భావి ప్రధాని అభ్యర్థి ఎంపికపై సాగిస్తున్న ఎడతెగని ప్రహసనం ఇప్పుడు మరింత రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌కు తామే ఏకైక ప్రత్యామ్నాయమని ఎన్ని ప్రగల్భాలు పలికినా అనేకానేక పక్షాల మద్దతు లేకుండా గద్దెనెక్కలేమని బిజెపికి అంతకు మించి దాన్ని నడిపించే ఆరెస్సెస్ పీఠాధిపతులకు బాగా తెలుసు. అందుకే కేంద్రంలో అధికారమే పరమార్థంగా అవమానాలు అవాంతరాలు దిగమింగి రాష్ట్రాల్లో సదరు భాగస్వామ్య పక్షాల పెద్దన్న పాత్రకు తలవంచుతుంటారు. గుజరాత్ మారణహౌమం తర్వాత ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల్లో అనేకం నిష్క్రమించినా మిగిలిన ఏకైక పెద్ద మిత్ర పక్షం జెడియు మాత్రమే. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నేతల నుంచే తమ మోడీకరణ వ్యూహానికి ప్రతిబంధకం ఎదురవడం బిజెపికి గొంతులో వెలక్కాయలా తయారైంది. పైకి ఎన్ని మేకపోతు గంభీరాలు వొలకబోసినా బిజెపి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ సారికి ఎలాగో కార్పొరేట్ల కరుణతో నెట్టుకురావచ్చని వ్యూహ కర్తల అంచనా. ఆయన అత్యాశా వ్యూహాలు కూడా అలాగే వుండటం వల్ల అనివార్యంగా అందుకు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హిందూత్వ ఎజెండా
Thursday, April 18, 2013
మోడీ- జేడీ(యు) ప్రహసనం
సంస్కృత సంస్కృతి
ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అత్యవసర పోలీసు డయల్ సర్వీసు 100 ప్రారంభించారు.ఈ నెంబరుకు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా పోలీసు సహాయం లభిస్తుందని ప్రకటించి తనే డయల్ చేశారు. అయితే పాపం ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యం. తర్వాత ఎవరో ఎలాగో కలిపి ఇచ్చారు గాని పాపం ఆయనకు అప్పటికే విసుగొచ్చి ఇక స్పందించడం మానేశారు. ఆదిలోనే హంసపాదు వంటి ఈ చేదు అనుభవాన్ని కూడా దిగమింగి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోలీసులకు ఓ చక్కటి సలహా ఇచ్చారు. ప్రజలతో వ్యవహరించేప్పుడు సంస్కృతం మాట్లాడకండి అని.
సంస్కృతమే మన సంస్కృతి అనీ, అది దైవభాష అనీ ఈ దేశంలో చాలా మంది ప్రచారం చేస్తుంటారు. కనక చాలా మంది నమ్ముతుంటారు కూడా. సంసృతంలో నాలుగు శ్లోకాలు ఇంగ్లీషులో నాలుగు కొటేషన్లు దంచేస్తేనే సదరు వ్యక్తి పండితుడని మనం నమ్ముతాం. అందుకే హైటెక్ బాబులు అడపాదడగా ఒకటో అరా సంసృత చరణాలు వల్లిస్తుంటారు. అలాగే స్వామి వర్యులు ఇంగ్లీషు వాక్యాలు జొప్పిస్తుంటారు.ఏతావాతా ఒక దశలో సంసృతం మరో దశలో ఆంగ్లం తెలుగు వంటి భాషలను ఎదగకుండా చేశాయన్నది ఒక వాదన. అలాగే అర్థం కాని సంసృతంలోనూ అన్నీ జరిపేంచుస్తుంటారు పురోహితులు. వారికైనా అర్థం అవుతాయో లేదో మనకు తెలియదు గాని వందల ఏళ్లపాటు వేదాలు వల్లెవేసిన వారంతా అక్షరాస్యులు కాదన్నది నిజం. అసలు వేదాలు అచ్చు వేయకూడదనేది కూడా వందేళ్ల కిందటి వరకూ మన వాళ్లు గట్టిగా నమ్మిన మాట. అన్నీ వేదాల్లో
Wednesday, April 17, 2013
రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ
రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం తెలుగు వారందరూ సంతోషించే విషయం. రెండు మూడు తరాలుగా రావూరి భరద్వాజ పేరు, రచనలూ, భావనలూ సాహిత్య ప్రియులకు సుపరిచితాలు. ప్రగతిశీల వాదులకూ ప్రజాస్వామిక భావాలకూ సదా సన్నిహితంగా మెలిగే రావూరి భరద్వాజ అక్షర శ్రామికుడు. అవిరామ స్వాప్నికుడు. తరాల మధ్య వారధి. సాహిత్య కార్యక్రమాల సారథి. అన్నిటినీ మించి స్నేహశీలి. ఎనిమిది పదుల వయస్సు దాటినా నిరంతర క్రియాశీలంగా కలుపుగోలుగా మసలే సహృదయ సాహిత్య జీవి. అందుకే ఆయనకు అఖిలభారత స్థాయిలో అత్యున్నత పురస్కారం లభించడం అభినందనీయం. మొదటిది విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి వస్తే రెండవది సి.నారాయణరెడ్డి విశ్వంభరకు లభించింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు ఆ గౌరవం దక్కింది. ఈ విధంగా ఇది తెలుగు వారికి లభించిన మూడో జ్ఞానపీఠం కనుక మరింత ప్రత్యేకం.
నిజానికి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొడవటిగంటి కుటుంబరావు, వంటి మహాకవులు రచయితలెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నిజానికి తాను శ్రీశ్రీ, ఆరుద్రల పేర్లు అనేక సార్లు సిఫార్సు చేశానని సినారె ఒక సందర్భంలో చెప్పారు. అయితే అప్పట్లో అధినేతల ఆలోచనా ధోరణులు అభ్యుదయాన్ని అస్సలస్సలు సహించేవి కావు గనకే వీరెవరికీ జ్ఞానపీఠం వంటివి లభించే సూచనే లేకపోయింది. తర్వాతి కాలంలో
Subscribe to:
Posts (Atom)