Pages

Wednesday, June 8, 2011

మర్మయోగి విన్యాసాలు -వివాదాలు



అవినీతి చాలా ప్రమాదకరమైందే, దాన్ని అరికట్టడానికి అవినీతి పరులను శిక్షించడానికి అవశ్యం పోరాటాలు సాగవలసిందే. కాకపోతే ఆ పోరాటాలు చేసే వారు కూడా అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా వుండకూడదు. యోగా గురు పేరిట బృహత్‌ సామ్రాజ్యం స్థాపించుకున్న రామ్‌దేవ్‌బాబా అవినీతి వ్యతిరేక పోరాటం మాత్రం అడుగడుగునా అలాటి వివాదాలకే ఆలవాలంగా వుండటం విడ్డూరం. .మొదటిది- కాంగ్రెస్‌ ప్రభుత్వ నేతలు ఆయనను రాజలాంఛనాలతో స్వాగతించడం. రెండవది- ఆయన దీక్ష ప్రారంభించడానికి ముందే దాళన్ని విరమించే విషయమై తమకు లేఖ రాశారని ప్రభుత్వం ఆ ప్రతులు విడుదల చేయడం. మూడవది- దీక్షా శిబిరం కోసం భారీ ఎత్తున కార్పొరేట్‌ స్థాయిలో జరిగిన ఏర్పాట్లపై సమాచార హక్కు చట్టం కార్యకర్త అరుణ్‌ రారు స్వయంగా ధ్వజమెత్తడం. నాలుగు- దీక్షా శిబిరంలో సాధ్వీ రీతాంబరి లాటి కరుడు గట్టిన మతోన్మాద శక్తులు ప్రత్యక్షం కావడం. అయిదవది- ఆయనను ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు సంభవించిన సంఘటనలు, చేసిన ప్రకటనలు ఆరు- ఆరెస్సెస్‌,బిజెపిలు వాటి అనుకూల మీడియా ఇదే ఏకైక ఎజెండాగా సాగిస్తున్న హడావుడి. యోగాను ఛాందసాన్ని వ్యాపారాన్ని జోడించి లాభాలు దండుకుంటున్న రామ్‌ దేవ్‌ను నిస్వార్థ దేశభక్తుడైన
జయ ప్రకాశ్‌ నారాయణ్‌తో పోల్చి చూపిస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగించక మానదు. ఇది సంఘ పరివార్‌ వ్యూహంలో భాగమే కావచ్చు.

అన్నా హజారే నిరాహార దీక్ష సందర్భంలో గాని ఇప్పుడు గాని అవినీతిని ఆర్థిక వ్యవస్థ నుంచి, సరళీకరణ విధానాల నుంచి విడదీసి చూపిస్తున్న తీరే చాలా అవాస్తవికమైంది.అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్‌-యుపిఎ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలు పచ్చి వాస్తవమైనా అంతకు ముందు బిజెపి ఎన్‌డిఎ హయాంలోనూ తక్కువ తిన్నది లేదు. వాటిని అలావుంచి రామ్‌దేవ్‌ బాబా స్వయంగా అవినీతి అరోపణలకు అతీతంగా లేరు. ఆయన పదిహేను వేల కోట్ల రూపాయల ఆధ్యాత్మిక సామ్రాజ్యం అనేక అరోపణలకు నిలయమైంది. ఆయన నడిపించే ఫ్యాక్టరీలలో కార్మికుల స్థితిగతులపై అనేక ఉద్యమాల నడవడం ఒకటైతే - ఆయన విక్రయించే ఆయుర్వేద ఔషధాలలో మానవ శరీర పదార్థాలను మిళితం చేయడం దేశమంతటా విమర్శలకు దారి తీసింది.వీటిపై సరైన సమాధానాల కోసం బడా మీడియా గట్టిగా ప్రయత్నించింది కూడా లేదు. రాజకీయ పార్టీ పెడతానంటూఆయన దేశ వ్యాపిత పర్యటన జరపడం,ఆరెస్సెస్‌ సహకారం కోరడం కూడా తెలిసిన విషయాలే.అయితే సంఫ్‌ు పెద్దలు సహకారం ఇస్తాము గాని పార్టీ వద్దని సలహా ఇచ్చిన మీదట ఈ మార్గం ఎన్నుకున్నట్టు కనిపిస్తుంది. మతతత్వ రాజకీయాలతో ఇంతగా పెనవేసుకున్న వ్యక్తి రాజకీయాలకు అతీమైన పౌర సమాజీకుడుగా చిత్రించబడటమే పెద్ద విచిత్రం. పౌర సమాజం అన్నది అప్రకటిత ఆదాయ వనరులు గలిగిన ఎన్జీవో సామ్రాజ్యానికి పెట్టిన ముద్దుపేరు. రాజకీయ పార్టీలు వాటిని బలపర్చే వారు నడిపించే వారు ప్రజలు కానట్టు రాజకీయాలను తిట్టిపోస్తూ తద్వారా చెడ్డ రాజకీయాలకు మేలు చేసే వారే పౌరులైనట్టుచిత్రంచే ఒక విపరీత ధోరణి ఇది. అన్నా హజారే గురించి రీడర్స్‌ డైజెస్ట్‌లో చాలా ఏళ్ల కిందటనే వ్యాసం రావడం దీనికో ఉదాహరణ మాత్రమే.మంచి వారుగా కనిపిస్తూ మార్క్సిజం జోలికి పోని మహాత్ములు మర్మయోగులు వీరికి అవసరం! రామ్‌దేవ్‌ బాబా వారికి గొప్పగా సరిపోతాడు మరి! కాషాయ కూటమికి కూడా అంతకన్నా కావలసింది లేదు.
సమస్య ఏమంటే ప్రజలు ప్రజా ఉద్యమాల పొడగిట్టని పాలకులకు కూడా ఇలాటి శక్తులతో వ్యక్తులతో వ్యవహరించడం సులువు. మూలాలను ముట్టుకోకుండా కాయకల్ప చికిత్సలతో సరిపెట్టే ఈ అవినీతి వ్యతిరేక విన్యాసాలకు వారు ఇతోధిక ప్రచారం కలిగిస్తారు. అమితంగా స్పందిస్తారు. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధాన మంత్రులకు కూడా స్పందించిన రీతిలో రామ్‌దేవ్‌ బాబా, అన్నా హజారేలకు స్పందన లభించిదంటే అదే కారణం. తర్వాత నాటకీయమైన అరెస్టు ప్రహసనం చాలా తప్పయినా అదికూడా ప్రచారం పెంచే దినుసు లాటిది. దాన్ని ఆధారం చేసుకుని వీరంగం తొక్కుతున్న కాషాయ సేన కాపట్యం మరింత లోతైనది. అవినీతిని ఖండిస్తూనే ఈ అనుమానాస్పద విన్యాసాలను కూడా విమర్శనాత్మకంగా చూడవలసే వుంటుంది.

28 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  8. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  11. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  12. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  13. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  14. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  15. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  18. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  19. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  20. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  21. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  22. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  23. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  24. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  25. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  26. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  27. చూస్తుంటే యిదేదో పెద్ద కార్పోరేట్ కుట్రగా వుంది అవినీతిపై పోరాటం అంటే! అవినీతి గురించి మాట్లాడేవారిని చూసి ప్రజలు చీకొట్టే రోజుకోసమ్ వీరి ప్రయాస!

    ReplyDelete
  28. భారతదేశ జనాభాకి పార్లమెంట్ బాధ్యత వహిస్తుంది . అన్నా హజారే కాదు . రాందేవ్ ది పూర్తిగా బోగస్ దీక్ష . అవినీతి బిజెపి కి కాంగ్రెస్ అవినీతి గూర్చి మాట్లాడే నైతికత లేని కారణాన .. రాం దేవ్ ని సమర్ధిస్తుంది . అందరూ కలిసి సీరియస్ విషయాన్ని బఫూనరీ స్థాయికి దిగజార్చేశారు .

    ReplyDelete