ఓ మహాత్మా ఓ మహర్షీ
ఓ క్షమా పీయూష వర్షీ
ఎచట నీ అహింస
ఎచట నీ కరుణా రిరంస
చూడు దేశం ద్వేష మగం
క్షుర జిహ్వానల విభుగం
మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ వాక్యాలు గాంధీజీ ప్రబోధాలకు దేశంలో వాస్తవాలకు మధ్యన అంతరాన్ని కళ్లకు కడితే కాళోజీ మరింత సూటిగా-
బాపూజీ బతికిన యప్పటి
సత్యాహింసల దుప్పటి
ఘనతలు సాంతము చిరిగెను
అతుకుల బొంతగ మిగిలెను అంటాడు. ఈ వ్యాస రచయిత ఒక సందర్భంలో
కుంభకోణ భారతాన
రోజుకొక్క రోత గాధ
గంగలోన కలిసెనులే
గాంధి తాత నీతిబోధ అని రాశాడు. ఈ మాటలు ఎంత నిజమో తెలుసుకోవడానికి మొన్ననే ముగిసిన గణతంత్ర(రిపబ్లిక్) దినోత్సవం కన్నా మరో సందర్భం అవసరం వుండదు.
రిపబ్లిక్ దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దేశానికి ప్రధానమైన బెడద అవినీతి అని ఆవేదన ఆందోళన వెలిబుచ్చారు. ఇంచుమించు అదే సమయంలో శక్తివంతుడైన ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి దేశాలు దాటిపోయిన నల్లడబ్బు ఆసాములు వివరాలు తెలిసినా వెల్లడించగల అవకాశం లేదని నిస్సిగ్గుగా చెప్పేశారు.ఈ రెండు మాటలకూ మధ్యన తేడా