Pages

Wednesday, January 26, 2011

కిరణ్‌ వర్సెస్‌ జగన్‌ - ఇప్పుడేమి జరుగున్‌?



ఈ రోజంతా చర్చ దీని చుట్టూ తిరుగుతున్నది. జగన్‌ వర్గం శాసనసభ్యులు సీఎల్పీ కార్యాలయం సాక్షిగా సవాలఅధిష్టానం ఆదేశాల మేరకే కిరణ్‌ అలా మాట్లాడారా అన్న దానిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి.
ు విసరడంతో కాంగ్రెస్‌ కలహాలు రసకందాయంలో పడినట్టే భావించాలి. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు భూమిక ఏర్పరచాయని చెప్పాలి. ఆయన వ్యాఖ్యల్లో నాలుగు అంశాలున్నాయి-

మొదటిది- ఒక ఎంఎల్‌ఎ ఖూనీ కేసులో ప్రతిపక్షం దాడి నుంచి ముఖ్యమంత్రి కుమారుడిని కాపాడ్డానికి అరవై రోజులు అధ్యయనం చేసి సమర్థించాల్సి వచ్చింది. నిజానికి ఇది చాలా తీవ్రమైన అంశం. మద్దెల చెరువు సూరి హత్య తర్వాతి పరిస్థితులలో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి యథాలాపంగా ప్రస్తావించి వుంటారనుకోలేము. పరిటాల రవి నుంచి సూరి వరకూ జరిగిన హత్యల పరంపరకు
సంబంధించిన నిజానిజాలు వెల్లడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది.
రెండవది- వైఎస్‌ను పివి దగ్గరకు తీసుకెళ్లానని చెప్పడం అతిశయోక్తిగా అనిపిస్తుంది.
మూడవది- నిబంధనలకు విరుద్దమైన ఒక పనిని చేయమని చెప్పారన్నమాట- అనేక అనుమానాలకు ఆస్కారమిస్తుంది.
నాలుగవది- హెలికాప్టర్‌ ఎక్కవలసి వుండి ఆఖరి నిముషంలో ఆగిపోయాను. దీనిపై జగన్‌ వర్గం అనేక ఆరోపణలు చేస్తున్నా వాటిని తీవ్రంగా తీసుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ప్రమాదంపై మూడు నివేదికలు ఇప్పటికే వచ్చాయి. ఆ రోజు వెంట వెళ్లవలసి వుండేదని అధికారులు కూడా అన్న సందర్భాలున్నాయి. దాన్ని బట్టి కుట్ర సిద్ధాంతం నిజమై పోదు.

అధిష్టానం ఆదేశాల మేరకే కిరణ్‌ అలా మాట్లాడారా అన్న దానిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. మొత్తంపైన ఢిల్లీ యాత్రతో మొదలు పెట్టి ముఖ్యమంత్రి ధీ అంటే ఢ అన్నట్టు మాట్టాడ్డం ప్రభుత్వంపై భరోసా నిలబెట్టే తప్పని సరి ప్రయత్నం కావచ్చు. అయితే అసందర్భమైన అనుమానాస్పదమైన వ్కాఖ్యలు అందుకు దోహదపడవు. వాటిని ఆసరా చేసుకుని జగన్‌ వర్గం ఇప్పుడు ఎదురు దాడి మొదలెట్టింది. ఇప్పుడు స్పందించవలసిన వంతు ప్రభుత్వ పక్షంపై వుంటుంది. ఏతావాతా ఇది ఇప్పటికిప్పుడే పెద్ద తుపానుగా మారకపోవచ్చు. ఎందుకంటే ఇరుపక్షాలకు తమ బలాలు బలహీనతలు తెలుసు. జగన్‌: వర్గీయులు సభ్యత్వం పోగొట్టుకునేలా వ్యవహరించరు. గద్దెమీద నున్న వారు దాన్ని చేజార్చుకోవడానికి సిద్ధమవరు.
ఉభయులూ తెలుగు దేశంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నా ఆ పార్టీ అధికార పక్షం తగాదా తీరు తెన్నులు తేలే వరకూ తల దూర్చే అవకాశం వుండదు. పైగా దాని తలనొప్పులు దానికి వున్నాయి. మా దయ వల్ల ప్రభుత్వం బతుకుతుందని చెబుతున్న వారు రేపు తెలుగుదేశం అవిశ్వాసం ఇచ్చిన తర్వాత కూడా దయ కొనసాగిస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు సమాధానం లేదు.ఈ వ్యవహారంలో మ్యాచ్‌ ఫిక్సింగుల గురించి మాటలు వినిపిస్తున్నా సూత్రధారుల మధ్య వైరుధ్యాలే కథ కొనసాగడానికి కారణమవుతున్నాయి. టిఆర్‌ఎస్‌, వంటి పార్టీలు కూడా అస్థిరత్వం గురించి మాట్లాడుతున్నాయి గాని ఎలాటి చొరవ తీసుకోవడానికి సిద్ధంగా లేవు. కనక
అయితే జగన్‌ ఆర్థిక సామ్రాజ్యంపై వచ్చిన ఆరోపణలపై జవాబు ఇచ్చుకోవడం మాత్రం తప్పని సరి. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా బింకంగా మాట్లాడ్డం వల్ల ప్రయోజనమేమిటని ఆ వర్గంలోనే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయడం అనివార్యమైనా ఏకపక్షంగా హడావుడి పడితే నిలబెట్టుకోవడం గురించి కూడా ఆలోచించాలని వారంటున్నారు.
ఈ ఉదంతంలో వైఎస్‌ కు ఎవరు వారసులన్న తర్జనభర్జనలు వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. అయితే రాష్ట్రం అంటే కాంగ్రెస్‌ వైఎస్‌ మాత్రమే కాదని కూడా వారికి తెలుసు. సమస్య వారసత్వంగా అధికార పీఠం ఎవరికి దక్కాలన్నదే తప్ప వేరే విలువలు నైతికత ఇందులో కలికానికైనా లేవనేది కూడా స్పష్టం.అందుకే ఈ పార్టీలకు సంబంధించి నైతికత చిత్తశుద్ధి అన్న మాటలను నేను చర్చలలో ఉపయోగించడం మానేశాను. అయితే వాస్తవంగా కనిపిస్తున్న పరిస్తితిని బట్టిచూసినప్పుడు మాత్రం ఏ పక్షమూ ఇప్పుడున్న స్తితిని వెనువెంటనే ్గ కదిలించేందుకు సిద్దంగా లేదని స్పష్టమవుతుంది. కాకపోతే రాజకీయంగా భీకర భాషణల ప్రహసనం మరి కొంత కాలం సాగొచ్చు. ఇందులో ప్రజల ప్రయోజనాలు ప్రస్తావనకు రావచ్చు గాని వాస్తవంలో ఇది పూర్తిగా అధికారం కోసం అంత:కలహం మాత్రమే.

2 comments:

  1. వాస్తవంలో ఇది పూర్తిగా అధికారం కోసం అంత:కలహం మాత్రమే.
    మీరన్నది నిజం...నిజం

    ReplyDelete
  2. రాజకీయాలలో అనుభవం లేని జగన్‌కి తండ్రి పేరు చెప్పి ముఖ్యమంత్రి పదవి ఎలా కట్టబెడతారు? ఇదేదో రాచరిక దేశమైతే జగన్ పదవి కాంక్షని అర్థం చేసుకోవచ్చు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం.

    ReplyDelete