కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణా ప్రాంత ఎంపిలు పదవులు తీసుకోరాదని టిఆర్‌ఎస్ ఎంత చెప్పినా అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. సదరు కాంగ్రెస్ ఎంపిలు కుండబద్దలు కొట్టి మరీ పదవులు వదులుకోబోమని చెప్పడంలోనే అది తేలిపోయింది. తీరా ఎవరికీ ఏ పదవులూ వచ్చిందీ లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం వైఖరి ఎలా వుంటుందన్నదానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై వుంది. అవిభక్త రాష్ట్రంలో తెలంగాణాకు రాజ్యాంగ పరమైన రక్షణలు ఏర్పాటు చేయడం అత్యుత్తమ మార్గమని దేశానికీ మంచిదని కమిటీ చెప్పింది. విభజన అనివార్యమైన పరిస్తితుల్లోనే
అది కూడా అందరి ఆమోదంతోనే జరగాలని కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు జరగాల్సింది దీనిపై చర్చ, నిర్ణయం తప్ప పదవులు పరిత్యాగాలూ కాదు. వాటివల్ల ఒక రాజ్యాంగ రాజకీయ సమస్యకు పరిష్కారం లభించగలదన్న ఆశ కూడా ఎవరికీ లేదు.పైగా అందరం తెలంగాణా వాదులమేనని ఎంత చెప్పినా ఏ పార్టీ ప్రయోజనాలు ఇంకా చెప్పాలంటే ఏ నాయకుని ప్రయోజనాలు వారికి వుంటాయి.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక పనికి మాలినదనీ, చెత్త అని, నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని,తప్పులు తడక అని తెలంగాణా విభజన వాదులు వ్యాఖ్యలు కురిపిస్తున్నారు.ఇంతకూ ఆయన చేసిన పని అన్ని పక్షాల ప్రాంతాల ప్రజల అభిప్రాయాల సేకరణ, క్రోడీకరణ మాత్రమే. ఈ క్రోడీకరణలో విభజన వాదులు లేవనెత్తిన అనేక ఫిర్యాదులు నిజమేనని ఆయన తేల్చారు.అదే సమయంలో నిధుల కేటాయింపు, నదీ జలాలు ప్రాజెక్టుల వంటి పూర్వాపరాలను, సాంసృతిక అసమానతలపై యాంత్రిక వాదనలను తోసిపుచ్చారు. పరిష్కారాలు చెప్పేప్పుడు కూడా అన్ని కోణాల నుంచి సూచనలు చేశారు. ఇవన్నీ చూడకుండా కొన్ని అప్రియ సత్యాలు చెప్పారు గనక శ్రీకృష్ణ కమిటీ నివేదికనే తిట్టిపోయడం రాజకీయ ప్రచారానికే పనికి వస్తుంది. ఒక ఉప ప్రాంతానికి సంబంధించిన నాయకులు కేవలం ఆ వొక్క కోణం నుంచే మాట్టాదవచ్చు గాని దేశాన్ని రాష్ట్రాన్ని గమనంలో వుంచుకోకుండా పరిష్కారాల గురించి ఆలోచించడం ఎలా సాధ్యం?
శ్రీకృష్ణ కమిటీ తెలంగాణా ప్రాంత ప్రయోజనాల రక్షణకు రాజ్యాంగ ఏర్పాట్లను గురించి చేసిన ప్రతిపాదన విఫల ప్రయోగం అని విమర్శకులు ఆగ్రహించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. గతంలో (భద్రాచలం మినహా) తెలంగాణా శాసనసభ్యులందరితో ి పని చేసిన ప్రాంతీయ మండళ్లు విఫలమైనాయంటే కారణం రాజకీయ నిర్లక్ష్యమే. వాటిని అచ్చంగా అదే రీతిలో పునరుద్ధరించి అదే విధంగా విఫలం కానివ్వాలని లేదు. ఎందుకంటే ఇంతగా రగిలిని చైతన్యం మటుమాయమై పోవడం అసంభవం. గతానుభవాలను బట్టి అప్పటికంటే నికరమైన రాజ్యంగ రక్షణలతో పకడ్బందీగా నిర్వహించవచ్చు.పైగా సారథులు తెలంగాణా ప్రాంత నేతలే గనక ఎలాటి అన్యాయం అసమానతలు తలెత్తకుండా చూడవచ్చు. అయినా విఫలం కావడం అనివార్యమనేట్టయితే అప్పుడు రాస్ట్ర విభజన మాత్రం సర్వరోగ శాశ్వత నివారిణి అని చెప్పగలవారెవరైనా వుంటారా? ఒక్కదెబ్బతో విడదీసిన( అది కూడా ఆదివాసీ,కొండ ప్రాంతాల కొలబద్దతో) చత్తీస్‌ఘర్, జార్ఖండ్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాలు సమస్యా రహితమైన స్వర్గధామాలుగా వెలిగిపోతున్నాయా? వేర్పాటును సమర్థించే మావోయిస్టులు అక్కడెందుకు ప్రాణాంతకదాడులకు పాల్పడుతున్నట్టు? సర్కార్లు సాల్వాజుడుంల వంటి అవాంఛనీయ పద్దతులతో జన హననం కావించడమెందుకు? కనక రాజ్యంగ ఏర్పాటైతే విఫలం కావడం తథ్యమనీ రాష్ట్ర ఏర్పాటు ఏక్‌దమ్ అభివృద్ధికి రాచబాట అయిపోతుందని విశ్వసించడానికి ఆధారాలేమీ లేవు . ఇతర రాజకీయ ప్రాకృతిక ఆర్థిక కారణాలు లేకుండా కేవలం వేర్పాటు వల్లనే దేశాలు రాష్ట్రాలు బాగుపడిపోయిన దాఖలాలు ప్రపంచంలో లేవు. మూడు రాష్ట్రాల రాజకీయ అనుభవాలను శ్రీకృష్ణ కమిటీ వివరంగానే ప్రస్తావించి విభజనే తారక మంత్రం కాదని తేల్చింది.మాకు విభజనే కావాలని అడగవచ్చు గాని పరిశీలనాంశాలు చెప్పడమే తప్పయినట్టు చిత్రిస్తే చెల్లుబాటు కాదు.
ఈ క్షణంలో ధరల పెరుగుదల, ఉద్యోగాల శూన్యత, ఆహార అభద్రత, అవినీతి, నేరాల విజృంభణ, సామాజికవివక్షతలు వంటి రుగ్మతలు ఏవైతే ప్రధానంగా వేధిస్తున్నాయో వీటికి రాష్ట్ర విభజన పరిష్కారం చూపిస్తుందని చెప్పడం భ్రమలు కల్పించడమే. విభజన కన్నా విధానాల మార్పే వీటికి పరిష్కారం. అలాటి మాటలేవీ వినిపించకుండా కేవలం సీమాంధ్ర తెలంగాణా అంటూ మాట్లాడితే సరిపోదు. అసమానతలు వివిధ స్థాయిల్లో వివిధ రూపాల్లో కొనసాగించడం దోపిడీవ్యవస్త లక్షణం. వాటినే ఆధారంగా చేసుకుని ప్రజల మధ్య విభజన పెట్టి రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడం పాలక వర్గ నేతల లక్షణం. ఆత్మబలి చేసుకున్న యువతను గురించి ఆవేదన చెందడంతో పాటు వారిని ఆ విధమైన పరిస్థితికి నడిపించిన భ్రమాత్మక వాదనల నిజానిజాలు గుర్తించడం కూడా అవసరం. లేకపోతే ఇలాటి విషాదాలు పునరావృతం కావచ్చు. అవాస్తవ వాదనలతో అగ్నికి ఆజ్యం పోస్తూ ఆ పైన ఎవరు ఎన్ని సుద్దులు చెప్పినా ఫలితం వుండదు. అలాగే రాష్ట్ర విభజన కోసం పాద ప్రక్షాళనల వంటి పవిత్ర కార్యాలు తలపెట్టి వీర తెలంగాణా సాయుధ పోరాట వారసత్వాన్ని కించపర్చాల్సిన అవసరం అంతకన్నా వుండదు.
తెలంగాణా నేతలు లేదా సీమాంధ్ర నేతలు అందరూ చాలా కాలంగా అన్ని రకాల రాజకీయ క్రీడలలో ఆరితేరిన వారే. ముఠాలు మూటలు కట్టిన వారే. ఇందులో ఎవరు ఎక్కువ లాభపడ్డారు, ఎవరు ఎక్కువ పదవులు పొందారు అన్న దానితో ప్రజలకేమీ నిమిత్తం లేదు. నిరుద్యోగులకూనిష్ట దరిద్రులకూ ఉద్యోగులకూ సామాన్యులకూ దళితులూ గిరిజనుల వంటి ఉపేక్షిత వర్గాలకూ అలాటి తేడాలేమీ వుండవు. రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటి నిర్ధారించిన రాయలసీమ నుంచి అత్యధిక కాలం ముఖ్యమంత్రులు( రాష్ట్రపతి కూడా) పాలన చేశారు. అయితే వొరిగిందేమిటట? కరీం నగరీయడు ప్రధానిగా పూర్తి కాలం పదవి వెలగబెట్టినా తెలంగాణాకు చేసిందేమిటి? మహబూబ్ నగర్ మహానాయకులు కేంద్రంలో వుండి ఘోరమైన వెనకబాటు నుంచి ఆదుకున్నదేమిటి? ఇందిరా గాంధీ గారే మెదక్ నుంచి ఎన్నికైనా లాభమేమిటి? కనక ఒక ప్రాంతంలో ప్రజల అభివృధ్దికి అక్కడి అధినేతల పదవీ ఫలాలకు, ధనస్వాముల సంపద కేంద్రీకరణకు ఏ సంబంధం వుండదు. ప్రాంతీయ అసమానతలను గురించి శ్రీకృష్ణ కమిటీ చేసిన నిర్ధారణలు గతంలో సెస్ వంటి ఆర్థిక సంస్థలు చేసిన అధ్యయనాలకు దగ్గరగా వుండటం యాదృచ్చికం కాదు. ఇప్పుడు తెలంగాణా విభజనను బలపర్చే సి.హెచ్.హనుమంతరావు గారి వంటి వారు ఆ అధ్యయనంపై వెలువడిన సంపుటి సంపాదకుల్లో ఒకరు. ఇప్పుడు ఈ వాదనకు ప్రప్రధాన ప్రతినిధిగా వుండి తెలుగుదేశంపై నిరంతరం ధ్వజమెత్తే అధినాయకుడే ఒకనాడు శాసనసభలో ప్రాంతీయ రక్షణలకు కాలం చెల్లిందని రద్దు చేయాలని చంద్రబాబును వేడుకున్న చరిత్ర వుంది. అలాగే ఇప్పుడు విభజన వద్దనే వారిలో కొందరు లోగడ జై ఆంధ్ర అన్నవారే. అంతెందుకు? ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుపై హడావుడి అక్కర్లేదనే మొదట్లో చెప్పిన నీలం సంజీవ రెడ్డి రాష్ట్రానిక తొలి ముఖ్యమంత్రి! కనకనే పాలక వర్గ పార్టీల నాయకులు అప్పటి తమ అవసరాలను బట్టి చేసే రాజకీయ పదజాలాల మాయాజాలంలో చిక్కుకుపోకుండా అప్రమత్తంగా వ్యహరించవలసిన అగత్యం వుంటుంది. అసమానతలు అలక్ష్యాల వల్ల ఏర్పడే పరిస్తితిని స్వార్థపరులైన రాజకీయ వేత్తలు ఉపయోగించుకుంటారని శ్రీకృష్ణ చేసిన హెచ్చరిక ఈ కోణంలో చాలా కీలకమైంది. ఇది ఏ ప్రాంతంపైన ఏ నాయకుని పైనా ప్రత్యేకంగా చేసిందనుకోనక్కరలేదు. ప్రభుత్వ ఉద్యోగాలే తగ్గిపోతుంటే విదిలించే కొన్నిటి కోసం జనం మధ్య మంటలు రేగకుండా జాగ్రత్త పడాలని కూడా శ్రీకృష్ణ సరిగ్గానే చెప్పారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక లోటుపాట్లు ఏమైనా అంతిమ నిర్ణయం తీసుకోవలసిన కేంద్రం దాగుడుమూతలు బాధ్యతా రహితమైనవి. అది తమ అంతర్గత వ్యవహారమైనట్టు ఒకో ప్రాంతం వారిని విడిగా పిలిపించి ప్రహసనాలు నడిపించడం, మంత్రులు కూడా ప్రాంతాల వారిగా మాట్టాడ్డం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విరుద్దం. ఈ వికృత విన్యాసాలన్నిటికీ తెరపడాలంటే సత్వరం నిర్ణయం అత్మావశ్యకం. జగన్ సవాలో మరొకటో సాకుగా చూపిస్తూ సాగదీయడం సర్వానర్థం. ఏ నిర్ణయం తీసుకోలేమనుకుంటే ఆ మాటైనా జనానికి చెప్పాలి తప్ప అవాంఛనీయమైన వూహాగానాలకూ, వ్యూహాలకూ అవకాశమివ్వకూడదు. అందరినీ సంప్రదించిన కమిటీ ఒక అధికారిక నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఆట ముగించకపోవడం ఆందోళనకరం. ఈ అనిశ్చితిలో మంట కాచుకునే వారి వైఖరి మరింత అభ్యంతర కరం.
(ఆంధ్ర జ్యోతి 'గమనం' శీర్షికన జనవరి 20న ప్రచురితం)
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ఒప్పుకుంటే గోర్ఖాల్యాండ్ ఏర్పాటుని అంగీకరించాల్సి వస్తుందని తెలంగాణాని వ్యతిరేకించిన CPMలో పని చేసే మీరు చెప్పే శ్రీరంగ నీతులకి తెలంగాణా ప్రజలు హింసని ఆపేస్తారా? మిగితా విప్లవ పార్టీలు CPI(ML) New Democracy, CPI(Maoist) తెలంగాణాకి అనుకూలంగానే ఉన్నాయి. మీరు బెంగాల్‌లో మీ వాళ్ల ప్రయోజనాల కోసం తెలంగాణా ప్రయోజనాలని త్యజించారు.
ReplyDeleteప్రత్యేక తెలంగాణాకి నేను వ్యతిరేకం కాదు. ప్రత్యేక రాయలసీమకి కూడా నేను వ్యతిరేకం కాదు. కానీ జనాన్ని ఫూల్ చేసే శ్రీకృష్ణ కమిటీ లాంటి హిపోక్రిటిక్ కమిటీలకి నేను వ్యతిరేకం. తెలంగాణాకి ప్రధాన అవరోధం హైదరాబాద్ ఇష్యూ అని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. కేవలం హైదరాబాద్ అభివృద్ధే ప్రధానమా? ఇతర ప్రాంతాలలో అభివృద్ధి అవసరం లేదా? తమ గ్రామానికి రోడ్లు వేశారు కానీ త్రాగు నీటి సౌకర్యం కల్పించలేదు అని వాపోయే గ్రామస్తులు ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ల గ్రామానికి వందల మైళ్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగితే వీళ్ల ముఖాలలో కాంతులు వికసిస్తాయా?
ReplyDeleteఉన్న విషయమంతా స్వార్థపురిత రాజకీయాల్లొ ఉంది . ప్రజల అవిధ్య, అలసత్వం కుడా మరొకారణం ,శ్రీ క్రిష్ట్న కమిటీ ఏమి చేస్తుంది , వాస్తవాల్ని చెప్పటం తప్ప
ReplyDeleteకేవలం హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేసి అదే నిజమైన అభివృద్ధి అని చెపుతున్న నాయకులని నమ్ముతున్నది బాగా చదువుకున్న గణమే కానీ నిరక్ష్యరాస్య గణం కాదు.
ReplyDeleteరాష్త్ర విభజనే అన్ని సమస్యలకు పరిష్కారమని చెబుతున్నవాళ్ళని నమ్ముతున్నది ఆ చదువుకున్న గణమే కదా ! ఎన్నుకున్న ప్రజల్ని నిర్లక్ష్యం చెసింది ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ రాజకీయనాయకులు . ,ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టింది వాళ్ళే కధా . హైదరబాదు రాజధానిగా తెలంగాణా ఏర్పడిన తరువాత కొందరి రాజకీయ ప్రయోజనాలకోసం రేపు ఉత్తర ధక్షిణ తెలంగాణాలని ,ప్రత్యేక హైదరాబాద్ రాస్ట్రమని ఉద్యమాలు బయలుదేరాయే అనుకుందాము అప్పుడేమిచేయాలి. ప్రత్యేక రాస్ట్రం కోసం ప్రజాప్రతినిధుల ఇళ్ళని ముట్టడిస్తాం అంటున్నారు కొన్ని చోట్ల ఆవిధంగా జరుగుతున్నది కూడా. ఇదంతా ప్రజాప్రయొజనం ముసుగులో జరుగుతున్న రాజకీయమే .ఇదే ప్రాతీయ సమస్యలపై ప్రజలు ఉద్యమిస్తే ప్రజాప్రతినిదుల్ని ముట్టడిస్తే ఈ రాజయ పార్టీలు ప్రజలపక్షాన నిలబడతాయా.
ReplyDeleteనేను చెప్పేదేమిటంటే తెలంగాణా ఉధ్యమం అనేది ధశాబ్ధం క్రితం రెండో సారి రాజకీయప్రయొజనం కోసం పుట్టింది ఇప్పటికి ప్రజల మద్దతు సాధించింది అంధ్రా , రాయలసీమ, తెలంగాణా ఏ ప్రాంతమైనా ఫొలితిచల్ స్య్స్తెం మారకుండా ప్రస్తుత పరిస్తితుల్లొ ప్రజలు కొరుకున్న అభివ్రుద్ది సాధ్యం కాదు. ఈ తెలంగాణా ఉధ్యమం ప్రాతీయాబివ్రుద్ది కోసమైతే బాగుండేది.రాస్ట్రవిభజన దేశం మరిన్ని చిన్న రాష్త్రాలుగా విడిపోవటానికి మార్గమౌతుంది
రాష్త్ర విభజనే అన్ని సమస్యలకు పరిష్కారమని చెబుతున్నవాళ్ళని నమ్ముతున్నది ఆ చదువుకున్న గణమే కదా ! ఎన్నుకున్న ప్రజల్ని నిర్లక్ష్యం చెసింది ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ రాజకీయనాయకులు . ,ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టింది వాళ్ళే కధా . హైదరబాదు రాజధానిగా తెలంగాణా ఏర్పడిన తరువాత కొందరి రాజకీయ ప్రయోజనాలకోసం రేపు ఉత్తర ధక్షిణ తెలంగాణాలని ,ప్రత్యేక హైదరాబాద్ రాస్ట్రమని ఉద్యమాలు బయలుదేరాయే అనుకుందాము అప్పుడేమిచేయాలి. ప్రత్యేక రాస్ట్రం కోసం ప్రజాప్రతినిధుల ఇళ్ళని ముట్టడిస్తాం అంటున్నారు కొన్ని చోట్ల ఆవిధంగా జరుగుతున్నది కూడా. ఇదంతా ప్రజాప్రయొజనం ముసుగులో జరుగుతున్న రాజకీయమే .ఇదే ప్రాతీయ సమస్యలపై ప్రజలు ఉద్యమిస్తే ప్రజాప్రతినిదుల్ని ముట్టడిస్తే
ReplyDeleteఈ రాజయ పార్టీలు ప్రజలపక్షాన నిలబడతాయా .
నేను చెప్పేదేమిటంటే తెలంగాణా ఉధ్యమం అనేది ధశాబ్ధం క్రితం రెండో సారి
రాజకీయప్రయొజనం కోసం పుట్టింది ఇప్పటికి ప్రజల మద్దతు సాధించింది అంధ్రా , రాయలసీమ, తెలంగాణా ఏ ప్రాంతమైనా political system మారకుండా ప్రస్తుత పరిస్తితుల్లొ ప్రజలు కొరుకున్న అభివ్రుద్ది సాధ్యం కాదు. ఈ తెలంగాణా ఉధ్యమం ప్రాతీయాబివ్రుద్ది కోసమైతే బాగుండేది .రాస్ట్రవిభజన దేశం మరిన్ని చిన్న రాష్త్రాలుగా విడిపోవటానికి మార్గమౌతుంది
నేను ఉండేది కోస్తా ఆంధ్రలో. సమైక్య రాష్ట్రంలో ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఆధారపడేది వ్యవసాయం మీదే. ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం లేని సమైక్య రాష్ట్రం ఉంటే ఎంత, లేకపోతే ఎంత?
ReplyDeleteప్రవీణ్,
ReplyDeleteప్రాంతీయ అభివృద్ధికి అవరోధం సమైక్యంగా వుండటమే అని మీరు భావిస్తున్నారా? అదెలా? మరి అంత మంది ముఖ్యమంత్రులు వచ్చిన రాయలసీమ కోస్తా, తెలంగాణలకన్నా చాలా విషయాల్లో వెనకబడివుందన్ని నివేదిక చెబుతోంది, ఎందుకు? విభజిస్తే అభివృద్దిపథంలో దూసుకుపోతాం అని మీకెలా అనిపించింది? ఏమైనా అర్థవంతమైన ఆలోచనలున్నాయా? లేక ఏదో హిందీ సినిమాల్లో లాగా 'ఏ బారాత్ నై చలేగీ' అని గుంపులోంచి అరచి అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నమా?
ప్రవీణ్....
ReplyDeleteచాలా ఎంట్రీలు ఇచ్చారు. ధన్యవాదాలు. నా రాజకీయ భావాలు మీకు తెలిస్తే వాటిని మీరు విమర్శిస్తే నాకు అభ్యంతరం లేదు.కాని విషయాలను కలగాపులగం చేయకుండా జాగ్రత్త పడండి. సిపిఎం బెంగాల్‌లో అధికారంలో లేక ముందు, గూర్ఖాలాండ్ సమస్య రాకముందు కూడా భాషా రాష్ట్రాల పట్ల ఇదే వైఖరితో వుంది. అంతకు ముందు అవిభక్త కమ్యూనిస్టు పార్టీ కూడా. విధానాలు మారకుండా కేవలం విభజనతోనే ఏ సమస్యలు తీరిపోవన్నది నిజం. మీరు చెప్పిన ఎంఎల్ పార్టీలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో ఎంతగా కల్లోలాలు సృష్టిస్తున్నది నేను గుర్తు చేశాను. వారు చెప్పిన విభజనే పరిష్కారమై వుంటే ఇలా చేయవలసి వచ్చేది కాదు కదా.. ఎవరు ఏ ప్రాంతంలో వుండి ఏ వాదాన్ని సమర్థిస్తున్నారన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఎవరికీ ఏ ప్రాంతం మీద గుత్తాధిపత్యం వుండదు. రాజకీయ సమస్యలు పార్టీల వర్గాల విధానాలను బట్టి నిర్ణయమవుతాయి. ఈ దేశ రాష్ట్ర పాలకవర్గాలు దీనిపై స్పష్టమైన అంచనాకు వచ్చే వరకూ ఈ సమస్య పరిష్కరించరు. కనక ప్రాంతాల వారీగా ప్రజల మధ్య అపార్థాలు వుద్రేకాలు వుండకూడదన్నదే నా మాట. అంతేగాని మీరు అన్న 'శ్రీరంగ నీతులు' నేనేమీ చెప్పలేదు. బ్లాగు మిత్రులు ఎవరైనా ఈ విషయంలో సంయనంతో వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది
గూర్ఖాల్యాండ్‌లో మాట్లాడేది నేపాలీ బాష. బాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఉండాలంటే గూర్ఖాల్యాండ్‌ని అంగీకరించాలి. గూర్ఖాల్యాండ్‌ని వ్యతిరేకించడం ఏ ప్రమాణం అవుతుంది?
ReplyDeleteభాషా ప్రయుక్త రాష్ట్రాలే కొలబద్ద ఐతే, అన్ని హిందీ రాష్ట్రాలనూ ఒక్కటిగా కలపాలి. లక్షద్వీప్, కేరళ ఒకే రాష్ట్రం చేయాలి. పాండిచెర్రీని తమిళనాడులో కలపాలి. యానాంని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలి వగైరా, వగైరా.
ReplyDeleteపైదాన్ని బట్టి తెలిసేది, ఒక భాషకి ఎన్నైనా రాష్ట్రాలు ఉండొచ్చు. కాని ఒక రాష్ట్రంలో మాత్రం ఒకే భాష మాట్లాడే వారు ఉండాలి. CPM వారికి ఇంత చిన్న విషయం తెలియదనుకోలేం.
ఒక రాష్ట్రంలో ఒక బాష మాట్లాడేవాళ్లు మాత్రమే ఉండాలంటే పశ్చిమ బెంగాల్‌లో నేపాళీ బాష మాట్లాడే ప్రాంతాలని గోర్ఖాల్యాండ్‌గా ఏర్పాటు చెయ్యాలి. గోర్ఖాల బాష వేరు, సంస్కృతి వేరు. అయినా CPM గోర్ఖాల్యాండ్ ఏర్పాటుని అంగీకరించడం లేదు.
ReplyDeleteప్రవీణ్ గారూ,
ReplyDeleteనా వైఖరి పైనే చెప్పాను. అన్ని కోణాల నుంచి చూస్తే సమాధానాలు వాటికవే తెలుస్తాయి. డార్జిలింగ్ జిల్లా నైసర్గిక స్వరూపం, జన సంఖ్య, సరఫరాల సమస్య, సరిహద్దులు వగైరాలను బట్టి కూడా ఆలోచించాల్సి వుంటుంది.వారు అడిగే ప్రాంతంలో అందరూ నేపాలి భాష మాట్లాడేవారేనన్న భావన కూడా సరికాదు. ఈ వాదనను ఒప్పుకుంటే రేపు దేశంలో చాలా జిల్లాలు ఇలాగే అడుగుతాయి. ఏ రాజకీయ నిర్ణయానికైనా ఒక ప్రాతిపదిక వుండాలి. దాని భవిష్యత్తు ప్రభావాలను పరికించాలి. అన్నిటినీ మించి ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టి పబ్బం గడుపుకోచూసే రాజకీయ వేత్తల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఇది తెలంగాణా విభజనకో టిఆర్‌ఎస్‌కో లేక సిపిఎంకో మాత్రమే పరిమితమైన సమస్యగా చూడటం వల్లనే మీరు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నారు.బెంగాల్‌లో సిపిఎం అధికారంలోకి రాకముందు కూడా ఇదే విధానం అన్నందుకు నేపాలీ భాష సమస్య తీసుకొచ్చారు. మతం, రంగు వంటి వాటితో పోలిస్తే భాష ప్రాతిపదిక అన్నది ప్రజాస్వామికమైందే గాని తీసి వేయదగింది కాదు. అయితే భాషను బట్టి ఏర్పడిన రాష్ట్రాలలోనూ మినహాయింపులు వుంటాయి. చారిత్రిక నేపథ్యం అందుకు కారణం. హైదరాబాదులో తెలుగే మాట్లాడని వారు వున్నారు కదా అంటే వాస్తవమే కదా? అది వద్దనుకుంటే అప్పుడు దేశమంతా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు కొత్త సూత్రమేదో రూపొందించుకోవాలి. ఇంతకూ జనానికి తిండి ఉద్యోగం వసతి కల్పించకుండా కొల్లగొట్టే పెట్టుబడిదారులను భూస్వాములను వదిలిపెట్టి ప్రాంతాల వారిగా లెక్కలు వేసుకోవడం ఎవరిక మేలు? ప్రజాస్వామ్యంలో ఒకరి భావాలతో ఒకరు ఏకీభవించకపోయినా ఒక వాదనా సూత్రాన్ని అంగీకరిస్తేనే చర్చ నడుస్తుంది.
హరి గారూ,
భాషా రాష్ట్రాల సందర్భంలోనూ ఇతర వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని కాదు. పాండిచ్చేరి విడిగా ఎందుకు వుందంటే ఫ్రెంచి వారి అధీనంలో వున్న దాని విముక్తి ఆలస్యమైంది.అలాగే పోర్చుగీసు వారి పాలనలోని గోవా కూడా. ఈ కారణాల వల్లనే అక్కడ మాట్లాడే భాషలు మిగిలిన చోట్ల వున్నవైనా విడిగా ఏర్పడ్డాయి.(గోవాపై ఆధిపత్యం కోసం కర్ణాటక, మహారాష్ట్ర మధ్య వివాదం నడుస్తూనే వుంటుంది) దాన్నే చారిత్రిక నేపథ్యం అని చెప్పుకుంటాము. హైదరాబాదులో ఏ నాడూ తెలుగు మాట్లాడని వారున్నారు. అయితే దాని భవిష్యత్తుపై తెలుగు వారి మధ్యనే బోలెడు తర్జనభర్జనలు నడుస్తున్నాయి. హిందీ రాష్ట్రాల ఏర్పాటులోనూ భాష పరమైన సూత్రాలతో పాటు వాటి చారిత్రిక నేపథ్యం, సంస్థానాల స్వరూపం, స్తానిక భాషా భేదాలు వంటివి ప్రభావం చూపించాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, బెంగాల్ వంటివి అచ్చంగా భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు. వీటి చరిత్ర వేరు.ఇది ఎవరో కూచుని సృష్టించిన తేడాలు కావు. చారిత్రిక సత్యాలు. గూర్ఖాలాండ్‌నే గనక ఏర్పాటు చేసేట్టయితే రేపు ఆంధ్ర ప్రదేశ్‌లో పది పన్నెండు ప్రతిపాదనలు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. మీరు విడిపోవడం గురించే మాట్లాడుతున్నారు.ఒకప్పుడు బీహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కలసి ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పడాలని ప్రతిపాదన చేసి విఫలమైనారు. కనక పాలక వర్గ పార్టీల నేతలు కులాలు మతాలు ప్రాంతాల పేరిట రకరకాల విన్యాసాలు చేస్తూనే వుంటారు. వాటిని ప్రజల ప్రయోజనాలకోసం జరుగుతున్న పవిత్ర కార్యాలుగా భావిస్తే నష్టపోయేది జన సామాన్యమే. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపిలు చెరో వైపున చెరో మాట చెప్పడంలో అది స్పష్టంగా కనిపించడం లేదా?
సమైక్య రాష్ట్రంలో బాగుపడింది ఎవరు? బడా పెట్టుబడిదారులే కదా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలనీ నిర్లక్ష్యం చేసి హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసినది బహుళజాతి కంపెనీల చేత పెట్టుబడులు పెట్టించడానికే కదా. విశాఖపట్నంలో కూడా పెట్టుబడులు పెట్టించలేదు. విశాఖపట్నంని కేవలం హాలీడే రిసార్ట్‌గా వాడుకున్నారు. కొద్ది మంది కార్పరేట్ పెట్టుబడిదారులకి మాత్రమే లాభం కలిగించే సమైక్య రాష్ట్రాన్ని నేను ఎలా అంగీకరించగలను? How do you claim your CPM as Marxist party while your ideas are more illusionistic than materialistic?
ReplyDeleteప్రత్యేక తెలంగాణా వస్తే గొప్ప అద్భుతాలు జరిగిపోవు. నిజమే. మాకు దగ్గరలో ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నానికి satelliteగా ఉన్న భీమునిపట్నం, అనకాపల్లి అభివృద్ధి చెందుతాయి. అవతల విజయవాడ, గుంటూరు, తెనాలి కూడా అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులని ఒకే చోట కేంద్రీకరించడం కంటే వివిధ పట్టణాలకి పంపిణీ చెయ్యడం మేలు కదా.
ReplyDeleteతెర గారు,
ReplyDeleteమీరు స్పందించి నందుకు ధన్యవాదాలు.
మీరే చెపుతున్నారు కదా, భాషతో పాటు చారిత్రక నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని. ఎలా చూసినా తెలంగాణా, ఆంధ్ర నేపథ్యాలు వేరు వేరు. కలిసే టప్పుడే కలవడానికి వ్యతిరేకించి, చివరికి షరతులతో కూడిన ఒప్పందంతో కలిసిన చరిత్ర తెలంగాణాది. ఆ ఒప్పందాలు వమ్ము చేయ బడ్డప్పుడు విడిపోయె హక్కు ఎందుకు ఉండదు? అది గుర్తించడంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి?
మరో విషయం ఏమంటే, ఇప్పుడు ఉద్యమం ఒక పెట్టుబడిదారుని చేతిలోనో, రాజకీయుడి చేతిలోనో లేదు. అది ప్రజల చేతిలో ఉంది. ప్రజాబలం ఉన్నచోటే కదా బెల్లం చుట్టూ ఈగల్లా ఈ రాజకీయులుండేది? ఉద్యమంలో ఎవరో ఒక పెట్టుబడి దారుడొ, జమీందారో ఉన్నాడని చెప్పి ఉద్యమాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సబబు? ఆ మాటకోస్తే స్వాతంత్ర్య ఉద్యమంలొ, కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా వీరంతా ఉన్నారు, ఉంటున్నారు.
రవి గారు,
ReplyDeleteనాకు తెలిసి, మీరు తెలంగాణా ఇవ్వకూడదని కానీ, తెలంగాణా కావాలని అడిగే హక్కు లేదని కానీ ఎక్కడా అనలేదు. ఉద్యమ స్వరూపస్వభావాల గురించే మాట్లాడుతూ వస్తున్నారు. ఈ సమస్యపై ప్రాంతీయ వివక్ష లేకుండా, సమ దృష్టితో అనలైజ్ చేస్తున్న అతి కొద్ది మంది విష్లేషకుల్లో మీరు కూడా ఒకరని తెలుసుకోడానికి పెద్దగా శ్రమ పడక్కర్లేదు. 'జై తెలంగాణా 'అనలేదు కాబట్టి మీరు కూడా తెలంగాణాకి వ్యతిరేకమే అనుకునే వారికి ఎవరూ సమాధానం చెప్పలేరు. Thanks
రవి గారు మీరు national question(జాతుల సమస్య) గురించి స్టాలిన్ వ్రాసినది చదివారా? ప్రాంతం కూడా మనుషుల ఐడెంటిటీని నిర్దేశిస్తుందని స్టాలిన్ వ్రాయలేదా? యూదులు (ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చిన జాతి) కోసం బిరోబిద్ఝన్ ప్రాంతాన్ని స్వయం పరిపాలిత ప్రాంతం (autonomous oblast)గా ఏర్పాటు చెయ్యలేదా? అది 36,000 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం గల ప్రాంతం. అది తెలంగాణా కంటే చాలా చిన్నది.
ReplyDelete/ప్రత్యేక తెలంగాణా వస్తే గొప్ప అద్భుతాలు జరిగిపోవు. నిజమే. మాకు దగ్గరలో ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది/
ReplyDeleteహ్వా..హ్వా..
నీకేంకావాలో కోరుకో అని వరమిస్తే " నా మేనమామ చెవుల్లో జుట్టు మొలవాలని కోరినట్టుంది". :)) సీమాంధ్రకు విశాఖ రాజధాని అవడం జరగదు. ఏమైనా భీముని పట్నం అభివృద్ధికి, తెలంగాణా రావడానికి మీరేసిన లంకె, మోకాలికి, బోడిగుండుకు వేసినట్టుంది.
హిందీ రాష్ట్రాల ఏర్పాటు ప్రాతిపదిక వేరే, అన్నిటికీ ఒకటే మంత్రం వేయాలనే విభజనకారుల వాదన అర్థరహితం. హైద్రాబాద్ లేకుండా తెలంగాణా అడిగితే ఎప్పుడో ఇచ్చేవారేమో, కాని తెలంగాణ ఆత్మగౌరవమంతా హైద్రాబాద్లోనే డిపాజిట్ చేశారాయె. నక్సల్స్ నుంచి ఎదురౌతున్న శాంతిభద్రతల దృష్ట్యా ప్రస్తుతం విభజన చేయకూడదు, చేయరు -అంతే. ఆత్మగౌరవ డిపాజిట్ హైద్రాబాద్నుంచి ప్రతి తెలంగాణ జిల్లాకూ సమంగా తరలించాల్సిన అవసరం వుంది. అంతవరకూ ' కల్సుందాం రా.. " అంతే! :))
భౌగోళికంగా హైదరాబాద్ సీమాంధ్రకి నూటయాభై కిలో మీటర్ల దూరం. తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని ఎలా అవుతుంది? సమైక్యవాదులకి హైదరాబాద్ మీద ప్రేమే కానీ ప్రాంతం మీద ప్రేమ లేదని నువ్వే ఒప్పుకున్నావు. భీమునిపట్నం వైజాగ్‌కి satellite town వైజాగ్ అభివృద్ధి చెందితే ఆ ప్రభావం భీమునిపట్నం మీద ఉంటుంది.
ReplyDelete50ఏళ్ళ పైబడి మన రాజధాని హైద్రాబాదే కాబట్టి అదే వుంటుంది, అనుమానమా?!
ReplyDeleteవిభజిస్తే తెలంగాణను జిల్లాకో రాజధానిగా విభజించాలి, వాళ్ళకు చిన్న చిన్న రాష్ట్రాలు మంచి గుంటాయంటున్రు.
పోతే.. సీమాంధ్రకు (వస్తే గిస్తే), డొర్నకల్/మార్కాపురం కొత్త రాజధాని. ప్లీజ్.. మడతపేచీ పెట్టకుండా ఒప్పేసుకో, చిత్తూరు నుంచి రావాలంటే రైల్లో మాకు దాదాపు 24గంటలు ప్రయాణం, కాళ్ళు వాచిపోతాయ్ బాబు, నావల్లకాదు. కావాలంటే భీముని పట్నం, శ్రీకాకుళం చిన్న రాష్ట్రాలుగా చేసుకో, అభివృద్ధిపథంలో తెలంగాణాలా దూసుకునిపో, వైజాగ్ చెవుల్లో చెట్లు మొలవాలని అడగొద్దు, ఒగ్గేయ్. :P
భౌగోళికంగా వైజాగ్, కుప్పం/హిందూపురానికి దాదాపు 1000కిమీ. ఏది దగ్గర ప్రవీణ్? :)
ReplyDeleteమన అభిప్రాయాల్లో తేడాలేమిటో తెలిసిన తర్వాత వూరికే సాగదీసుకోవడం వల్ల ఫలితం వుండదు. ప్రవీణ్ అలాగే హరి, శంకర్ ఎవరైనా సరే, బ్లాగులు కొన్నిటిలో జరుగుతున్న లాటి వాదనలను దూషణలను నేను కోరుకోవడం లేదు. విభేóేదించడానికి అంగీకరిద్దాం అనుకుంటేనే ఆరోగ్యకరమైన చర్చ సాధ్యం. నా వైఖరి నేను చెప్పాను. అలాగే పాలక వర్గ రాజకీయ పార్టీల పాచికల పట్ల అప్రమత్తంగా వుండాలని చెప్పాను. అంతే.ప్రజల ఉద్యమం, ప్రజలు కోరుతున్నారు వంటి మాటలు ప్రచారానికి పనికి రావచ్చు గాని విధాóనాల రూపకల్పనకు సరిపోవు. ప్రజల ముందు ఎవరు ఏ వాదనలు చేసి ప్రభావితం చేస్తున్నారన్నది కూడా చూడాలి. ఏ ప్రాంతంలోనూ ఏ ప్రజలూ ఏ ఒక్క పార్టీ వెనకనే లేరు. అన్ని పార్టీల విధానాలూ తాత్కాలికంగానైనా ఏకరూపంలో వుండటం అసాధ్యం. ప్రజలు లేరని నేనెక్కడా అనలేదు గాని దాని మరో కోణాన్ని చూడకపోతే నష్టం. పైగా విధానం సరైందా కాదా అని నిర్ణయించేది ప్రజలు వుండటం వుండకపోవడం ఒక్కటే కాదు. వివిధ సమస్యలపై పార్టీలు విధానాలు తీసుకుని జనంలోకి వస్తున్నాయి తప్ప ముందుగా తెలుసుకుని కాదు. ఏ స్పందనలు ఏ నేపథ్యంలో అన్నది గమనంలో వుంచుకోకపోతే సరైన నిర్ణయానికి రాలేము. అలాటి సమగ్ర కోణం అవసరం అనేదే నేను చెబుతున్నాను. సిపిఎం ఏం చెప్పినా దాన్నిబట్టి ఇక్కడ జరిగేదీ లేదు, ఆగేదీ లేదు. నానా విన్యాసాలు చేస్తున్న పాలక పక్షాలను వదిలిపెట్టి దాన్నే పదే పదే ప్రస్తావించడంలో వాస్తవికత కన్నా వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది. దానిపై విమర్శలు చేయదలిస్తే మరో సందర్బం చూసుకోవచ్చు.
ReplyDeleteరవి గారు. మీరు చెప్పాలనుకుంటున్నది ఏమిటి? ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకి కార్మిక వర్గంతో సంబంధం లేదనే మీరు చెప్పాలనుకుంటున్నారు. అది పాలక వర్గ ఉద్యమమని మీ వాదన. నేను మార్క్సిస్ట్‌గానే ఈ ప్రశ్న అడుగుతున్నాను "స్టాలిన్ ఏర్పాటు చేసిన Jewish Autonomous Oblastకి, కార్మిక వర్గానికి మధ్య సంబంధం ఏమిటి?" అస్తిత్వవాదాలని గుర్తించినవాళ్లందరూ పాలకవర్గవాదులైతే స్టాలిన్ కూడా పాలకవర్గవాది అవుతాడా? ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్లలో ఒకరైన మీరు స్టాలిన్ రచనలు చదివే ఉంటారనుకుంటాను. బాష ఒక్కటే ప్రజలని ఏకం చేస్తుందనుకుంటే కెనడాని USAలో విలీనం చెయ్యొచ్చు, కెనడాలో ఫ్రెంచ్ బాష మాట్లాడే క్యూబెక్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చెయ్యొచ్చు. బాష ఒక్కటే రాజకీయ సరిహద్దులకి నిర్దేశం అనుకుంటే చాలా దేశాల, చాలా రాష్ట్రాల సరిహద్దులని పునర్వ్యవస్థీకరించాలి.
ReplyDeletenaa vaikhari indake cheppanu.naku bookhouse editorga marxist pustakalu anvayam gurinchi kanisa avagahana undi. vati sandarbham saramsamveru.meeru chese vadana avastavikamaindi. anduke agrree to differ annanu. vere emi khandinchaledu. siddhnta bhasha meere vadutunnaru.nenu ananivi meere uhinchiprasnalu westunnaru.idi poortiga astitwa udyamam kooda kadu.konasanchaleka kadu gani ika apeddam.
ReplyDeleteప్రవీణ్ గారు,
ReplyDeleteమీరు చాలా విషయాలు ఒకదానితో ఒకటి అసందర్భంగా కలిపేసి పాఠకులని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
మనం చర్చించేది, దేశాలగురించా, రాష్ట్రాల గురించా? ముందు ఆలోచించండి, కెనడాని అమెరికా లో కలపడానికీ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ లో నుండి విడగొట్టడానికీ ఏమి సంబంధముందో ఆలోచించండి. దేశాలకి సార్వభౌమాధికారం ఉంటుంది, రాష్ట్రాలకి అది వర్తిస్తుందా?
ఇంకొకటి- నాకు తెలిసినంతవరకూ-Jewish Autonomous Oblast is a Place for Jewish Inhabitants, an administrative territorial created to protect the interests of a culture.
And there is a binding force called "culture" and its heritage that actually sparked off its formation. Its practically, an autonomous region within the region to 1) practice the cultural heritage of Soviet Jews 2) to encourage immigrations of Jews from Eastern Europe and within Russia and more importantly- to create a distinguished territorial unit for jews within Soviet Republic, kind of seperating green from scrap.
అది ఏ రకంగా తెలంగాణ విషయం తో పోలి ఉందో చెప్పండి.-ఎక్కడి యూదులు, ఎక్కడి 1940 పరిస్థితులు, ఎక్కడి రెండో ప్రపంచ యుద్ధం, అప్పటి సాంఘిక, రాజకీయ స్థితిగతులు ఎక్కడ కోస్తాంధ్ర అభివృద్ధి, ఎక్కడి తెలంగాణ ప్రత్యేకవాదం. ఎప్పటి స్టాలిన్, ఎప్పటి కేసీఆర్!
దానికీ దీనికీ సంబధమేలేదసలు.
నేనేమీ కంఫ్యూజ్ చెయ్యడం లేదు. ప్రాంతీయ అస్తిత్వవాద ఉద్యమాలని వేర్పాటువాదంగా అభివర్ణించినది ఏవరు? ఈ పోస్ట్ చదివితే రచయిత అలాగే అనుకుంటున్నారని అర్థం వస్తుంది. కాశ్మీర్ జిహాద్‌ని వేర్పాటువాదం అంటే అర్థం చేసుకోవచ్చు కానీ తెలంగాణా ఉద్యమాన్ని వేర్పాటువాదం అంటే ఎలా అర్థం చేసుకోగలము? How can we compare regional existencialism with secessionism?
ReplyDelete'వేర్పాటు' అంటే వేరేగా ఉంటామని అడగటం. తెలంగాణా వారు, సమైక్య రాష్ట్రంలో కాకుండా వేరేగా ఉంటామని అడుగుతున్నారు.రచయిత 'వేర్పాటువాదం' అని అన్నారో లేదోగానీ ఒకవేళ అన్నా కూడా, అది తెలంగాణా ఉద్యమాన్ని ఎలా తక్కువ చేస్తుందో కాస్త చెప్పగలరా? 'ఇక ఆపేద్దాం ' అని రచయిత మర్యాదపూర్వకంగా అడిగన తర్వాత కూడా, ఇక్కడ ఎవరు ఏ ఏ విషయాల్ని వేటితో కంపేర్ చేస్తున్నారో కనిపిస్తూనే ఉంది. 'జై తెలంగాణా అనే వరకూ వదలబొమ్మాలీ,వదల అన్నట్లుంది వ్యవహారం :)
ReplyDeleteయూనివర్శిటీలో సోషియాలజీ క్లాస్‌లో చదివిన పాఠం ఇది: Separatism అంటే విభజనవాదం. రాష్ట్రం నుంచి విడిపోవాలనుకోవడం విభజనవాదం అవుతుంది. Secessionism అంటే వేర్పాటువాదం. దేశం నుంచి విడిపోవాలనుకోవడం వేర్పాటువాదం అవుతుంది.
ReplyDeleteవేర్పాటు(secession) అనే పదాన్ని wrong contextలో ఉపయోగించడం ఎందుకు అనేదే నా ప్రశ్న. అలా అనడం తెలంగాణా ప్రజలని అవమానించడం అవుతుంది. ప్రత్యేక తెలంగాణా వస్తే నాకు వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏమీ లేదు. ప్రత్యేక తెలంగాణా వస్తే ఆంధ్రకి విజయవాడ రాజధాని అవుతుంది. వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాలు, వాటి satellite పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. అంతే కానీ నాకు వ్యక్తిగతంగా పెద్ద లాభం ఉండదు. నేను కోస్తా ఆంధ్రలో ఉంటున్నా ప్రజాస్వామ్య దృష్టితో ప్రత్యేక తెలంగాణాకి సపోర్ట్ ఇస్తున్నాను. ప్రజాస్వామ్యయుతంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించేవాళ్లని వేర్పాటువాదులు అనడం పైనే తెలకపల్లి రవి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అంతే కానీ రవి గారిని వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం నాకు లేదు.
ReplyDeleteపదాలకు contextలను నిర్ధారించే గురుతరబాధ్యతను భుజస్కందాలపై మోస్తున్న ప్రవీన్ శర్మగారికి హార్ధిక,వినమ్రతాపూర్వక శుభాభినందనలు.
ReplyDelete"ప్రజాస్వామ్యయుతంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించేవాళ్లని "
వహ్వా,వహ్వా.. మీరు మాత్రం న భూతో..న భవిష్యత్తు మాష్టారు.. కానివ్వండి.. కామెంట్లకు ఎడిటింగ్ పెట్టుకోవడం మినహా,రవి గారికి మరో ఆప్షన్ లేదు.
nenu charcha apeddamnnaka kooda chalane jarigindi. rashtra verpata rajyanga erpata annadi prasnaa andamlo evarini kinchaparchadamledu.adi krishna committee reportpai vyasam ani marchipokudadu. ikapote rajakeeyanga chese vyajhyalu ye prajalanu avamaniche samasya udayinchadu. endukante ye prantampaina ye partyki leda netaku guttadhipatyamlrdani nenu tarchoo chebtunnanu. ippudu kuda.
ReplyDeletePraveensarma garu nenu ee sandarbhamlo verpatuvadulu ani neneu dadapu andamledani gurthinchali. telangana vibhajana vadulu ani enduku antunnanante vibhajana korani varu kuda telangananu abhimanichavachhani cheppadaniki.nene veera telangana madi ani sayudhaporata veerulapai vachhina pustakaniki editornu kuda.inka chala vastayi.
intakoo samasya vibhajana okate kadu. itara amsalanu kooda charchilanai pade pade chebutunna. editing option intawaraku vadaledu. mana mitrulu a avasaram ranivvarane inka asistunna.