అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిరాహార దీక్షకు దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన, అత్యంత అవినీతి పరులు కూడా అతి బిగ్గరగా సంఘీభావం తెల్పడం అనూహ్యమైనదేమీ కాదు. కమల్‌హాసన్ చిత్రం భారతీయుడు ఘన విజయంతో మొదలై ఒకే ఒక్కడు, ఠాగూరు, అపరిచితుడు వంటి చిత్రాల విజయ పరంపర అవినీతిపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని ఆగ్రహానికి ఒక ప్రతిబింబం వంటిదే. వాటిలో పరిష్కారాలు సమగ్రమైనవా సక్రమమైనవా అంటే కాదు. అందుకే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం 'క్షమించడం' అన్న మెగా కథానాయకుడు అవినీతిని అరికట్టేందుకు సోనియా గాంధీ కృత నిశ్చయంతో వున్నారని జన్‌పథ్‌లో ప్రకటించేశారు. కాల్పనికతకూ వాస్తవికతకూ తేడా ఇక్కడే తెలుస్తుంది. జన లోక్‌పాల్ బిల్లును తమను కూడా కలుపుకొని హడావుడిగా ఆమోదించాలని పట్టుపట్టిన అన్నా హజారే దీక్ష కూడా అలాటి అవాస్తవిక సన్నివేశాన్నే ఆవిష్కరించింది.
తన దీక్ష దగ్గరకు రాజకీయ వేత్తలెవరూ రాకూడదని శాసించిన అన్నా హజారే రాజకీయ బాబాగా
అభివర్ణించబడే రామ్‌దేవ్‌ను సలక్షణంగా స్వాగతించారు. అధికార వ్యవస్థలో భాగంగా చాలా కాలం వున్న కిరణ్ బేడీని ప్రముఖంగా ముందు నిలిపారు. బిజెపికి సన్నిహితులైన మేధావులు అనేక మంది అక్కడ సాక్షాత్కరించారు. ఆఖరులో నరేంద్ర మోడీని, నితీష్ కుమార్‌ను కీర్తించడంతో ఆయన దీక్ష ముగిసింది. తమను మెచ్చుకున్నందుకు నితీష్ కుమార్ నమ్రత ప్రకటిస్తే మోడీ మరింత గడుసుగా ఇది విమర్శలకు దారి తీస్తుందేమోనని ముందు జాగ్రత్త ప్రదర్శించారు. ఇంతా అయ్యాక అద్వానీ స్వయానా రాజకీయ వేత్తలను తృణీకరించే ధోరణి మంచిది కాదని హెచ్చరిక చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని మోడీకరించడం మంచిది కాదని సిపిఎం నాయకులు వి.శ్రీనివాసరావు వ్యాసం రాశారు. చర్చలలో ప్రాతినిధ్యం వహించిన కేంద్రమంత్రి కపిల్ సిబాల్ దీనితోనే ఒరిగి పడేది ఏముంటుందని సందేహం వెలిబుచ్చారు. అందుకు గాను అన్నా హజారే ఆయనపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు కూడా. ఈ పరిణామాలన్ని అన్నా హజారే దీక్ష వివిధ కోణాలను ఆవిష్కరిస్తున్నాయి.
దేశం ముందున్న సమస్య అవినీతి అని సాక్షాత్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గణతంత్ర దినోత్సవ సందేశంలోనే చెప్పారు. అవినీతి పరులని తెలిసినా అధికారం కోసం రాజా వంటి వారిని చేర్చుకోక తప్పడం లేదని మన్మోహన్ సింగ్ ఆ తర్వాతే వెల్లడించారు. కనక అవినీతిపైన ఈ దేశంలో విమర్శలు చేయని వారు ఆవేదన చెందని వారు ఎవరూ లేరు. అయితే వ్యవస్థీకృతమైన అవినీతి మూలాలు చూడకుండా కాయకల్ప చికిత్సలపై కదన శంఖాలు ఎంతగా పూరించడం వేళ్లు వదిలి కొమ్మను విరచిన చందంగానే మిగిలిపోతుంది. అనేక విధాలైన ఆర్థిక దోపిళ్లపై ఆధారపడిన ధనస్వామ్య వ్యవస్థ సరళీకరణ యుగంలో మరీ దుర్గంధ భరితమై, దుర్మార్గమై పోయిందనేది అసలు వాస్తవం. అవినీతి పాతకాల సరళీకరణ తప్ప పరిష్కారాల సరళీకరణ కాదిది. వామపక్షేతర పార్టీలన్ని నేతలు రీతులు ఏవైనా సరళీకరణను భుజాన మోస్తూనే వున్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రవచిత విధానాల అనివార్య ఫలితం అవినీతి అని అంతర్జాతీయ అనుభవమూ చెబుతున్నది. విప్లవాత్మకమైనదిగా వర్ణించబడిన సూక్ష్మ రుణ పిత, నోబుల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అవినీతి ఆరోపణపై బోనెక్కడం దీనికో ఉదాహరణ. పౌర సమాజం పేరుతో ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జివోలు) ప్రతిదాన్ని నడిపించాలని చెప్పడం చాలా ఆకర్షణీయంగా వుంటుంది గాని వాస్తవంలో అది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సూత్రాలనే ప్రశ్నిస్తుంది.పైగా ప్రభుత్వాలనే కొనుగోలు చేయగల అంతర్జాతీయ తిమింగళాలు ఈ సంస్థల ప్రతినిధులను ప్రభావితం చేయలేవనుకోవడం కూడా అసంబద్దమే. పుచ్చిన మిరియాలైనా జొన్నల కన్నా నయం అన్నట్టు రాజకీయ పార్టీలు కనీసం ప్రజల ఓట్ల కోసం ఆమోదం కోసం బూటకంగానైనా కొన్ని పనులు చేస్తుంటాయి. ప్రభుత్వాలను పార్లమెంటులో ప్రశ్నించే నిలదీసే అవకాశమైనా కొంత వుంటుంది. కాని కేవలం నీతి మంతులనే ముద్ర వేసుకున్నంత కొందరు వ్యక్తులకు వ్యవస్థాగతమైన పాత్ర కల్పిస్తే ప్రశ్నించడానికి అవకాశమేమిటి? రాజకీయాలపై తరచూ అసహనం ప్రదర్శించే లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ వంటి వారు కూడా అన్నా హజారే వైఖరిలో అవాస్తవికత కొంత వుందని చెప్పడం గమనించదగ్గది.
లోక్‌పాల్ బిల్లు 42 ఏళ్లలో ఎనిమిది సార్లు వెనక్కు పోయిందంటే పాలకులకు దాన్ని తీసుకురావడం పెద్దగా ఇష్టం లేదనేది స్పష్టం. ఎప్పటికైనా ఆ బిల్లు తెచ్చినప్పటికీ అంతటితోనే అవినీతి ఆగిపోతుందని కాదు. నిబంధనల ఉల్లంఘన అవినీతి అనడం ఒకటైతే అసలు నిబంధనలే అంతర్జాతీయ బేహారులకు అనుకూలంగా వున్నప్పుడు చేయగలిగిందేమిటి? బ్రాహ్మణి స్టీల్స్ అమ్మకంపై వచ్చిన కథనాలు గాని, అంతకు ముందు ఎమ్మార్ వ్యవహారం గాని ఏం చెబుతున్నాయి? నిబంధనల నిర్ణయంలోనే ప్రజల వనరులను గుత్తాధిపతులకు కట్టబెట్టే ఏర్పాటు జరిగాక అంతా చట్టబద్దంగానే అవినీతి జరిగిపోతుంది. అవినీతి పడగ నీడ పేరిట ఈ రచయిత(కె.వీరయ్యతో కలసి) అనువదించిన పుస్తకం ప్రపంచ బ్యాంకు ప్రతిచోటా అవినీతిని పెంచి పోషిస్తున్న తీరును సోదాహరణంగా వివరిస్తుంది. ఈ నిరాహారదీక్షతో సహా నిరంతరం అవినీతిపై వినిపించే విమర్శలలో సామ్రజ్యవాదం, ప్రజా వనరుల ప్రైవేటీకరణ వంటి మాటలే వినిపించవు. అందుకే ఇది పాక్షికమైన వ్యవహారం.
ఈ పాక్షికత్వం ఇంకా ఇతర విధాలుగానూ కనిపిస్తుంది. నరేంద్ర మోడీ పాలనలో గుజరాత్‌లో సాగిన జాతి హత్యాకాండ దేశమంతటి ఖండనకు గురైంది. నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఒక దశలో మోడీని తప్పించే విధంగా మాట్లాడి సంఫ్‌ు పరివార్ చేతుల్లో దెబ్బ తిన్నారు. మోడీపై ఇతర ఆరోపణలు అటుంచి రాజకీయాధికారం కోసం మత మారణహౌమాన్ని సృష్టించడం అవినీతిని మించిన అఘాయిత్యం కాదా? మోడీతో కలసి ఎన్నికల ప్రచారానికే నిరాకరించిన నితీష్‌ను కూడా కలిపి పొగడ్డంలో రాజకీయ వాస్తవికత ఎంత? ఇదే సమయంలో నిరాడంబరంగా నామినేషన్ వేసి స్వంత ఇల్లు లేదని ప్రకటించిన బుద్ధదేవ్ భట్టాచార్య ప్రత్యేకత ఎందుకు కనిపించలేదు? త్రిపుర నుంచి వెలువడే డైలీ దేశర్ కథ సంపాదకుడు గౌతం దాస్ ఒక సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి తానూ ఒక మామూలు రూమ్‌లో వుంటామని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగానే నృపేన్ పదవీ విరమణ సందర్భంలో ఒక్క సూట్ కేస్‌తో బయిటకు నడిచాడు! నిజాయితీ పరుడైన శంకరన్‌ను పిలిపించుకుని మరీ నియమించుకున్నాడు. మరో వైపున రెండు దశాబ్దాలకు పైబడి బెంగాల్ ముఖ్యమంత్రిగా వున్న జ్యోతిబాసుపైన ఎలాటి ఆరోపణలూ నిలబడలేదు. ప్రశ్నల కుంభకోణం స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఒక్కరంటే ఒక్క కమ్యూనిస్టు సభ్యుడు తమకు దొరకలేదని ప్రకటించడం ప్రపంచమంతా చూసింది. కమ్యూనిస్టేతర ఇంకా చెప్పాలంటే రాజకీేయేతర కార్పొరేటీకృత మార్గాల గురించే ఆలోచించే వారికి ఈ ప్రత్యేకతలు పొరబాటున కూడా కనిపించవు. సరళీకరణను ప్రశ్నించని ప్రత్యామ్నాయాలు మాత్రమే వారికి కావాలి.ప్రజల ప్రజా సంఘాల, ప్రజా పక్షాల పాత్ర లేని పౌర సమాజ ఫార్ములాలే సర్వ శ్రేష్టమైనవి!
రాజకీయాలంటేనే చెడ్డవి అని శాపనార్థాలు పెట్టడం ద్వారా నిజమైన చెడ్డ రాజకీయాలను, పాలక వర్గాల దోపిడీ వ్యూహాలను రక్షించడమే జరుగుతుంది. రాజకీయేతర శక్తులకు పెద్ద పీట వేయడం ద్వారా పరోక్ష పద్దతిలో మార్కెట్ శక్తుల ఆధిపత్యానికి మార్గం సుగమమవుతుంది. పౌర సమాజం అంటే అర్థం నానా రకాలైన ఎన్జీవోలు కాదు. ముసుగులు వేసుకున్న కార్పొరేట్ ప్రతినిధులు కాదు. అన్నా హజారే మొదలెట్టిన వాటర్ షెడ్ వ్యవస్థ కూడా అనేక చోట్ల అవినీతి ఆరోపణలకు గురి కావడం అసత్యం కాదు. నిన్నటి పారిశ్రామిక దిగ్గజం టాటా, నేటి అగ్రగాములలో ఒకరైన అనిల్ అంబానీ, వీటన్నిటిని బయిటపెట్టే మీడియా దళారీ నీరా రాడియా ఇదే సమయంలో పార్లమెంటరీ కమిటీ ముందు వాగ్మూలం ఇవ్వాల్సిన స్తితి దేన్ని సూచిస్తుంది? అవినీతి నిర్మూలనను ఆర్థిక మూలాలతో సంబంధం లేని ఆదర్శంగా చూపించడం అవాస్తవికతే. ఎన్రాన్ కుంభకోణం నుంచి సబ్ ప్రైమ్ సంక్షోభం వరకూ అమెరికా తదితర దేశాల్లో సాగిన అవినీతిని విస్మరించి వాటినే నమూనాలుగా చెప్పడమూ సరికాదు. రాజకీయ అవినీతిని అదే పనిగా దూషించే మార్కెట్ మార్కు అవినీతికి కూడా కళ్లెం వేయగలగాలి. విశృంఖల ప్రైవేటీకరణ విచ్చలవిడి అవినీతి కవల పిల్లలనే పరమ సత్యాన్ని గుర్తించక పోవడమంటే అది నీడతో యుద్ధ క్రీడగా మిగులుతుంది.
cogent words.
ReplyDeleteచాలా బాగా చెప్పారు గారూ. సగం సగం తెలివితో వెఱ్ఱిపోకడలు పోతూ మతతత్వ, అతివాద భావజాలాన్ని తీవ్రంగా మనుషుల్లోకి తీవ్రంగా చొప్పిస్తున్న ఈనాటి క్రీమీ లేయర్ కుహనా మేధావి వర్గానికి దీటుగా. మార్క్సిస్టు, లెనినిస్టు భావజాలపు నిబిడీకృతమైన శక్తిని తమ కలంద్వారా బహిర్గతపరచి, చదువరులను ఉత్తేజితం చేయగలిగిన ఒక్క గొంతుక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను.
ReplyDeleteమార్క్సిస్టు భావజాలాన్ని విశదీకరించిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పగలరా?
Good Analysis.
ReplyDeleteఅవినీతి విషయంలో, కమ్యూనిస్టులు మిగతా పార్టీల నాయకుల కంటే చాలా చాలా బెటర్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, వీరెవరి పేర్లూ ప్రస్తావించకుండా, కేవలం ఆ ఇద్దరి పేర్లనే హజారే ప్రస్తావించటం కొంత అణుమానాస్పదంగానే ఉంది.
/జ్యోతిబాసుపైన ఎలాటి ఆరోపణలూ నిలబడలేదు/
ReplyDeleteఅవునవును, నిలబడకుంటే జరిగినట్టే కాదు. సుబ్రహ్మణ్యస్వామి మంకు పట్టు పట్టకుంటే, రాజా పై ఆరోపణలు కూడా నిలబడేటివి కాదు.
అవును బుద్ధదేవుడికి ఇల్లు లేదు, కరుణానిధికి కూడా ఇల్లు కారు లేవు.
/అన్నా హజారే మొదలెట్టిన వాటర్ షెడ్ వ్యవస్థ కూడా అనేక చోట్ల అవినీతి ఆరోపణలకు గురి కావడం అసత్యం కాదు/
మీ టైమింగ్ బాగోలేదు, ఈ బురద చల్లుడు కాస్త ముందుగా చేయాల్సింది.
కమ్యూనిస్టులను వేదిక మీద ఆహ్వానించి మైక్ ఇవ్వలేదు, పైగా తమను కాకుండా ఎగస్పార్టీ వాళ్ళను కొన్ని విషయాల్లో మాత్రమే మెచ్చుకున్నారు. అంతే .. వ్యాసాలు రాసి స్వయం ప్రకటిత మేధావులు చీల్చి చెండాడేస్తున్నారు! దివాళాకోరు పార్టీలు, అంతకన్నా దివాళాకోరు నాయకులు.
హజారే నే అడగొచ్చును కదా. స౦దేహ౦ ఎ౦దుకు :)
ReplyDeleteజ్యోతిబాసుపైన ఎలాటి ఆరోపణలూ నిలబడలేదు
ReplyDelete_________________________________
By the same logic, మోడీ పైన కూడా ఎలాంటి ఆరోపణలూ నిలబడలేదు :))
విశృంఖల ప్రైవేటీకరణ విచ్చలవిడి అవినీతి కవల పిల్లలనే పరమ సత్యాన్ని గుర్తించక పోవడమంటే అది నీడతో యుద్ధ క్రీడగా మిగులుతుంది.
ReplyDelete________________________________________________________________________
విచ్చలవిడీ ప్రభుత్వీకరణ, పంచాయత్ ల పేరుతో సీపీయం ఆడుతున్న సిగ్గులేని రాజకీయాలకన్నానా? It's like the pot calling the kettle black.
This comment has been removed by the author.
ReplyDeleteనృపేన్ చక్రవర్తి తానూ ఒక మామూలు రూమ్‌లో వుంటామని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగానే నృపేన్ పదవీ విరమణ సందర్భంలో ఒక్క సూట్ కేస్‌తో బయిటకు నడిచాడు*
ReplyDeleteమరి అంతటి నిజాయితి పరుడైన నృపేన్ చక్రవర్తి ని ఎర్ర పార్టినుంచి ఎందుకు బహిష్కరించారో! చనిపోయే ఒకరోజు ముందర పాలిట్ బ్యురో తిరిగి తమ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం ఏకారాణాల వలన తీసుకోవలసి వచ్చిందో తెలియజేయగలరు.
ప్రజాధనం పై ప్రభుత్వ యాజమాన్యం పెరిగిన కొద్దీ అవినీతి పెరుగుతుంది. అలాగే వ్యాపారంపై ప్రభుత్వ పెత్తనం ఎక్కువైనా కూడా అవినీతి పెరుగుతుంది.
ReplyDeleteమరోకోణం ఏమంటే, వ్యాపారంపై పెత్తనం తగ్గితే వ్యాపారులు దేశాన్నే కబళించ జూస్తారు. ఇది ప్రతిరోజూ మనం ప్రత్యక్షంగా చూస్తున్న విషయం.
వీటికి మనకు కనిపిస్తున్న ఒకే ఒక పరిష్కారం, కఠినమైన నిబంధనలు, అమలు చేయడానికి, విచారించడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. దానికోసమే హజారే పోరాడారు.
http://telugu.stalin-mao.in/49510167
ReplyDeleteBy the same logic, మోడీ పైన కూడా ఎలాంటి ఆరోపణలూ నిలబడలేదు :))
ReplyDelete___________________________________
Enquiries are still going on in many cases. His right hand man(Amit Shah), and his favourite IPS officers are already IN.
I am talking about Modi, not Amit Shah. Applying Jyoti Basu logic to Modi, he is NOT YET a criminal and should be considered innocent.
ReplyDeleteThe same way .. nothing has been proved against Rajiv Gandhi on Bofors, Are the communists ready to give him a clean chit?
ReplyDeletecomments are just as expected.
ReplyDeletethose who react just from anti communist angle are free to do so.
if any malakpeta rowdy in his wisdom can eqate jyothi basu with modi and rajiv or another one equate buddha with karuna they are most welcome...
yes, nripen at one stage gone out for a while and was back till the end. that in no way belittle his spotless record
i never said modi is a criminal in technical sense but no body obsolved modi of the genoside in gujarat. godra can never be an excuse.. appolitical hajare founnd him as the fountain of virtue.even Advani was embarassed about the praise showered on modi. any way i did'nt comment on the integrity of hajarebut just anlysed the root causes of corruption.
i thank those who complimented and differed as well.
హజారే సంస్కర్త కాదని నేను అనలేదు కానీ అతని సంస్కరణలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయి. మోడీ అధికారంలో ఉన్నవాడే కదా. సంస్కరణలు కోరేవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళని అంత సులభంగా నమ్మేస్తారా?
ReplyDeleteమలక్పేట్ రౌడిగారు అన్నాగారు కూడా మీమల్లె ప్రభుత్వ సెక్టారు కారుచౌకగా అమ్మకానికిపెట్టినప్పుడు కిమ్మనలేదు. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతే కనిపించలేదు. విచ్చలవిడిగా ప్రభుత్వీకరణ అంటూ రాయడానికి చేతులెలా వచ్చాయండి. మీలాంటి ఫోజుగాల్లవల్లె ఈరోజు ఈస్థితిలో ఉన్నాము.
ReplyDelete25 ఇయర్స్ సిఎంగా పనిచేసి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పదవి నుండి స్వచ్చంద్దంగా నిష్క్రమించడం చాల గొప్ప విషయంగా భావిస్తున్నాను. మంచి ఆదర్శాన్ని గుర్తించలేని మీ కళ్ళకు మోసపు గంతులు ఉన్నాయని స్పష్టమౌతోంది. దయచేసి మంచిని చూసేందుకు ప్రయత్నించండి. ఆదర్శాలకు వక్రభాస్యలు చెప్పకండి.
ReplyDelete(వివిధ పత్రికల్లో అన్నాగారు మోడిని పొగడడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక వేత్తలు, కళాకారులు, సంగసేవకులు స్పందించిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మనవి.)
ReplyDeleteఆదివారం హజారే మీడియానుద్దేశించి మాట్లాడుతూ నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. తద్వారా తనంతట తానుగా ఉద్యమ పరిధిని కుదించుకున్నారు. రాజకీయాలకతీతంగా అవినీతి వ్యతిరేకోద్యమం అన్న ఆయన మాటల చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేసింది. మోడీని ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. చట్టం వచ్చి ఎనిమిదేండ్లయినా ఇంతవరకు గుజరాత్‌లో లోకాయుక్తను నియమించలేదు. పైగా ఆ చట్టం పరిధిలోకి ముఖ్యమంత్రి రాడు. అదే సమయంలో బెంగాల్ లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే హజారే అసలు ఉద్దేశాలేమిటో మనకు బోధపడుతుంది.
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారే గుజరాత్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై ప్రముఖ కళాకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాబాయి తీవ్ర విస్మయానికి గురయినట్లు పేర్కొన్నారు. అన్నా హజారే దీక్షకు మద్దతుగా అహ్మదాబాద్‌లో ఆందోళనలో పాల్గొన్న మల్లికా సారాబాయి మోడీని పొగడటంపై హజారేకు నిరసన తెలుపుతూ లేఖ రాశారు. గుజరాత్ గ్రామాల్లో కొద్దిపాటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. 'మీ పొగడ్తను ఉపసంహరించుకోకపోతే లోక్‌పాల్ ఉద్యమానికి మాకు మేము దూరంగా ఉండాల్సి వస్తుంది' ఆమె లేఖలో పేర్కొన్నారు. తన ప్రశంస కేవలం గ్రామీణాభివృద్ధికి సంబంధించి మాత్రమేనని హజారే సారాభాయికి లేఖ రాశారు. 'నరేంద్ర మోడీ నితీష్‌కుమార్ గ్రామీణ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులను మాత్రమే నేను ప్రశంసించాను. అదే సమయంలో మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తాను' అని హజారే సారాబాయికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తీవ్రంగా బాధపడ్డాం: సామాజిక కార్యకర్తలు
అన్నా హజారే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించినందుకు తీవ్రంగా బాధ పడ్డామని పలువురు సామాజిక కార్యకర్తలు ఒక పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, అన్ని అణగారిన వర్గాలకు వ్యతిరేకమైనదని స్పష్టం చేశారు. ఈ మేరకు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర అధ్యక్షుడు జెఎస్ బందుక్వాలా, మానవ హక్కుల సంస్థ డైరెక్టర్ ప్రశాంత్, ఫాదర్ సెడ్రిక్ ప్రకాశ్, నేషనల్ ఫెలో ఆఫ్ ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ (సిమ్లా)కి చెందిన ఘన్‌శ్యాం షా, సామాజిక కార్యకర్తలు రోహిత్ ప్రజాపతి, తృప్తి షా, నందిని మంజ్రేకర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ఇండియా అగైన్‌స్ట్ కరప్షన్' గుజరాత్ కన్వీనర్ వినోద్ పాండ్యా సహా అనేకమంది అన్నా హజారేకు వాస్తవ పరిస్థితి తెలియదని అభిప్రాయపడ్డారు. ఆయన స్వయంగా గుజరాత్‌కు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు.
అవినీతి నిర్మూలన గురించి కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు కానీ అలా కబుర్లు చెప్పేవాళ్ళు ఆచరణ విషయంలో ఇంకోలా అనుకుంటారు. ఎవరు ఎంత డబ్బులు తింటే తమకేమిటి, తమ జేబు నుంచి డబ్బులు తియ్యలేదు కదా అని అనుకుంటారు. జనం ఇలా అనుకోబట్టే అవినీతి పోవడం లేదు. రవి గారు చెప్పినట్టు రాజకీయాలే చెడ్డవనీ, స్వచ్ఛంద సంస్థలే మంచివనీ అనుకుంటే ప్రయోజనం ఉండదు. రాజకీయ నాయకులు కూడా జనం నుంచే వస్తారు, ఎక్కడి నుంచో ఊడిపడి రారు. జనంలో స్వార్థం, సంకుచితత్వం ఉంటే రాజకీయ నాయకులలోనూ అవే ఉంటాయి.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteఅవినీతికి వ్యతిరేకంగా కబుర్లు చెప్పేవాళ్ళని చాలా మందిని చూశాను. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యొచ్చు కదా అని అంటే రాజకీయ నాయకులు మన జేబుల నుంచి డబ్బులు తియ్యడం లేదు అంటూ వెనకడుగు వేస్తారు. మనం టాక్స్ కట్టిన డబ్బులే భోంచేస్తారు అని చెపితే ఆ లెక్కలు ఎవరు చూస్తారు అంటూ కప్ప దాటు సమాధానం చెపుతారు.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteనాకు తెలిసి ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత టైమ్‌లో దేశంలో ఒక్క పరిశ్రమనైనా ప్రభుత్వపరం చెయ్యలేదు. ప్రభుత్వీకరణ అంతా 1984కి ముందే జరిగింది.
ReplyDeleteA ny wouldlike feedback and arguments. i for ne is not for editing at all.. then there are some
ReplyDeletedigits.after all it is the blog run by me.
with all my personel patience decency demands delition of rowdy comments. because i cant attribute any thing to malak pet... i am a poet my self.. yet the pen refuses to reply in the same coin.. i hope at least in future m.r.refrian from this kind of writing.
with all the differences sankar sounds sensible.. but he shuold also appreciate the fact that i didn,t make any personel comment on Anna..
Then 'my friend' is a general uasge that everybody know.. in fact i thought of correcting it as our friend.. but we differed and continue dihher on many issues in futere.
రవి గారు, ఈ లింక్ చూడండి: http://telugu.stalin-mao.in/49669918
ReplyDeleteకొందరికి బాగా ఏడుపు సీన్లుండే డైలీ సీరియల్లంటే చాలా ఇష్టం. రోజూ ఆ సీరియల్స్ చూస్తుంటారు.. ఏడుస్తుంటారు. అంటే వారు ఏడుపును ఎంజాయ్ చేసే స్థాయికి చేరుకుంటారన్నమాట. అట్లే కొందరు దేషాన్ని ఎంజాయ్ చేసే స్థాయికి చేరుకుంటారు. ఎవరైనా ఓ మాట చెబితే, దానిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారు. వీరు మాత్రం, ఏ రకంగా అర్థం చేసుకుంటే చెప్పినోన్ని ఎక్కువగా ద్వేషించ వచ్చో, ఆ మార్గంలో అర్థం చేసుకుని ద్వేషించటం మొదలెడ్తారు. అదో తుత్తి అన్నమాట.
ReplyDelete( ఇప్పుడు, Next comment- మీరే హజారే గారిని అలా అర్థం చేసుకుని ద్వేషిస్తున్నారని, మీకే ద్వేషమంటే ఇష్టమనీ, అందుకే పోస్ట్ అలా రాశారనీ రాస్తారు. అలాగని వీరికి విమర్శకీ, ద్వేషానికి తేడా తెలీదని కాదు..తెలిసినోల్లే..తెలివైనోల్లే.. జస్ట్ తెలీనట్లు నటిస్తారంతే.. అప్పుడే కదా 'తుత్తి ' దొరికేది )
WELCOME TO HATE
cheekati & udaya,
ReplyDeleteBoth the comments are excellent and exactly true.
Uday, Amar & Cheekati all your comments and observations are excellent, excellent and exactly true, keep writing.. :D
ReplyDeleteఅన్నా! ఇంతమందిని తట్టి లేపావన్న ఆనందం ఒకవైపు ఆ వెనువెంటనే -- ఇంత కాలం ఎలా,ఎందుకు నిద్దరోయామన్న స్ఫురణ కలిగి కులుక్కుమంటోందన్నా! మీరన్నట్టే ఇంకా జరగాల్సింది చాలా ఉంది. నువ్వు తలతెంచి ఇవ్వాల్సినంత ఉద్రేకం నీనుండి అస్సలు ఊహించాలేమన్నా! తల.... For full article see -- http://gksraja.blogspot.com/2011/04/blog-post_09.html
ReplyDeleteకేవలం వామపక్షవాదాన్ని విమర్శించటానికి కొందరు కంకణం కట్టుకోని కూర్చున్నారు. వారు దేనిగురించైనా "బేస్ లెస్స్" గా వాదించగలరు. ఎందుకంటే వారికి ఒక సిధ్ధాంతం అంటూ ఏమి వుండదు. వ్యక్తిగత దూషణ, వెకిలి రాతలు వారి చేష్టలు. వారికి అవినీతికి ఆలయమైన కాంగ్రేస్ అయినా, అవినీతి మరియు మతమౌడ్యంతో వున్న భాజాపా అయినా, చమురు, ప్రపంచాధిపత్యం కోసం ఊచకోతకు పాల్పడుతున్న ఆమెరికా అయినా వారికి సరే. వారికి యిప్పుడున్న నిష్ప్రయోజన సమాజం యిలానే కొనసాగాలి. సమాజంలో కొంతమందే సుఖపడాలి. సమాజంలో మార్పు రాకూడదు. మార్పు రావాలనుకున్నా ఎటువంటి మార్పు రావాలో తెలియదు. వామపక్షవాదం మాత్రం బలపడకూడదు. నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తునేవున్నా మీరు డిలీట్ చేసిన కామెంటు బ్లాగరు దీనిలో దిట్ట. మీ సమయం వృధాచేసుకోవద్దు అటువంటి కామెంట్స్‌పై.
ReplyDelete