Pages

Monday, August 15, 2011

మన్మోహన మంత్రదండం ?అవినీతి భాగోతాల గురించి దేశం గగ్గోలు ఎత్తి పోతుంటే ప్రధాని మన్మోహన్‌ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తన దగ్గర అవినీతిని నిర్మూలించే మంత్రదండం లేదనడం ఒక అపశ్రుతి. అవినీతి పరుల దగ్గర మాత్రం అనేక మంత్రదండాలున్నాయి. వాటిని తీసి పారేస్తే చాలు. మిశ్రమ ప్రభుత్వం గనక అవినీతి పరులైనా చేర్చుకోక తప్పదని గతంలో చెప్పిన ప్రధాని ఈ కాలంలో చాలా విన్యాసాలే చేశారు.ఇన్ని అక్రమాలకు ఆలవాలమైన ప్రభుత్వానికి ఆధ్యర్యం వహిస్తున్న నేతగా ఆయన కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు లోక్‌పాల్‌ ముసాయిదా కూడా నిస్సారంగానూ లోప భూయిష్టంగానూ రూపొందించారు. మొన్న నెత్తిన పెట్టుకున్న అన్నాహజారేను ఇప్పుడు ప్రత్యర్థిగా పరిగణించి వాగ్యుద్ధాలతో ఆంక్షల హద్దులు పెడుతున్నారు. హజారే దీక్ష హజార్‌ సవాళ్లు అంటూ గతంలో దీనిపై చర్చించుకున్నాం. ఇప్పుడు కూడా అమెరికా ఆయనకు మద్దతుగా మాట్లాడటం అనుచిత జోక్యమే. అయినా సరే ప్రజాస్వామికంగా నిరశన తెలిపే హక్కును నిరాకరించడం సమర్థనీయం కాదు. ఆరోగ్య రీత్యా అవసరమైతే అప్పుడు ఎలాగూ పోలీసులు రంగంలోకి రానే వస్తారు. ఈలోగానే ఇంత అసహనం తగని వ్యవహారం.

12 comments:

 1. "ప్రధాని మన్మోహన్‌ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తన దగ్గర అవినీతిని నిర్మూలించే మంత్రదండం లేదనడం ఒక అపశ్రుతి."

  మన్మోహన్ గారు కరెక్టుగాచెప్పారు. 130 కోట్లమంది భారతీయులని ఒక్కరోజులో నిజాయితీ పరులుగా చెయ్యాలంటే నిజంగా మంత్రదండమే కావాలి.

  ఈ దేశంలో (ఆ మాటకొస్తే భారత జాతీయుల్లో) ఎంతమది నిజాయితీ పరులు, అలా అంటూ ఎవరైనా ఉంటే అవకాశం రానివాళ్ళే.

  ReplyDelete
 2. సూర్య,
  మన్మోహన్‌ను అభిమానించండి.ఆయన మాటలను బలపర్చండి. కాని అందుకోసం దేశ ప్రజలందరినీ అవినీతిపరులను చేయకండి. అత్యధికులు ఖచ్చితంగా మంచివాళ్లే. వ్యవస్థను వదిలిపెట్టి వ్యక్తులను గురించి మాట్లాడకండి.అవకాశం లేకనే నీతిగా వున్నారంటున్న మీరు చాలా మంది నిరుపేదల ముఖ్యంగా శ్రమ జీవుల నిజాయితీ శత కోటీశ్వరులకన్నా మెరుగ్గా వుంటుందని మర్చిపోకండి.

  ReplyDelete
 3. Can you write an article differentiating between Lokpal and JanLokpal.Knowings how slow that thingss happen in democracy, the initial Lokpal bill by govt. is pretty fast. It is near impossible that any govt. brings out a bill that matches 100% with NGOs.

  I was following at JP. In one show he criticized the stubbornness of Annazee and said in democracy we should respect the parliament. He even praised the govt. bill. His arguement was this is very good first step. It can be still improved but those things can happen over time.
  And then changes voice in another pressmeet and condemns the govt. I think he is struggling between playing to gallery and what his heart says.
  Thats why I am looking at people like you who can read the bills and analyze.
  Regards.

  ReplyDelete
 4. @pavani,

  pending the article suggested by you let me mention three points. PM should be included. along with it Judicial commission must be formed.election reforms expedited. NGOs can't be not sole arbitrators in the matter. i disagree with JP on exclusion of pm and also NGO'S. u may refer earlier entry on Anna's earlier fast.hope to write in detail later.

  ReplyDelete
 5. Ravi garu,

  Thank You. So as I understand there is some difference even among analysts. JP explained at length why he doesn't want PM to be in. Similarly he argued judiciary should not be included either.

  Anyways, I believe there should be some flexibility from eitherside. The institution has to eveolve overtime.

  Looking for forward to your artile....

  Regards....

  ReplyDelete
 6. మీరు ముందు అవినీతి ని నిర్వచించాలి.

  నా దృష్టిలో ట్రైన్‌లో బెర్త్ కోసం ఓ వంద రూపాయలు ఇవ్వడంకూడ అవినీతే. వోటుకి వంద (వెయ్యా?) తీసుకోవడంకూడా అవినీతే. ఎక్కడైనా క్యూల్లో మద్యలో దూరడంకూడా అవినీతే. మనకున్న అధికారాన్ని దుర్వినియోగం (లంచం గురించి చెప్పట్లే, కార్యాలయ వాహనాన్ని సొంత పనులకు వాడుకోవడం లాంటివి) చెయ్యడంకూడ అవినీతే.

  ఉదాహరణ: ఓ రోజు సింహాచలం కొండమీద ప్రసాదంకోసం లైన్లో నుంచుంటే, ఒకాయన క్యూని బైపాస్ చేసి ప్రసాదం కొనేసుకుంటున్నాడు, ఏమిటి స్పెషల్ అంటే, ప్రెస్ అంటాడు, అప్పటితో అప్పటిదాక మిగిలున్న గౌరవంకూడా పోయింది ప్రెస్ అంటే (చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ... అన్న సామెతకి సరిగ్గా సరిపోతుంది ఈ సంఘటన) ;)

  శ్రమజీవులగురించి మీరు ఊహాలోకాల్లో ఉన్నట్లనిపిస్తోంది, నేను మాఊర్లో చాలామందిని చూశా, శ్రమజీవుల్ని, నేనింతకన్నా ఎక్కువ చెప్పదలుకోలేదు.

  నాకోవిషయం అర్ధమయ్యింది, ఈ దేశం ప్రతి ఒక్కడు, తను తప్ప మిగిలిన వాళ్లంతా నిజాయిగా ఉండాలనుకుంటాడు. ఇప్పుడు ఈ హజారే (ఈయనికిప్పుడే ఈ దేశంలో అవినీతి కనిపించిందా ;)) ఉద్యమాన్నే తీసుకోండి, ఇక్కడ బెంగుళూరులో, నేనుకూడా సర్ధిస్తున్నాను అని బ్యానర్లు, వాళ్ల ఫొటోలతో సహా, ఆ మొహాలని చూస్తే వాళ్లు నిజాయితీ పరులంటే నమ్మాలనిపించదు :)

  Anyways, you keep writing as usual and enjoy in your utopia world.

  ReplyDelete
 7. రాహుల్ బెత్తం ముందు మన్మోహన్ మంత్రదండమైనా, ప్రణబ్ ముఖర్జీ రాజదండమైనా పనిచేయవు. మీటింగు పెట్టి ' మీకు బుద్ధుందా? నాకు తెలియకుండా ఇంత అరాచకం చేస్తారా?' అంటూ ముసలోళ్ళనందరినీ 'దండం దశగుణం భవేత్' అంటూ ఏకిపారేశాడట కదా మన భావి ప్రధాని?! :D

  ReplyDelete
 8. Mr.Suryudu,

  Those who consider healthy human values as utopia can enjoy their own negative dirty real world with all the joys bestowed upon. it is better to keep ideals at least as utopia than accepting all the filth. Any way sir, for heaven's sake don't ridicule the toiling people. they are 1000 times better than any of us with all the aberrations.fine, tks.

  ReplyDelete
 9. దీనిలో ప్రణబ్ రాజదండం లేదు. వుంటే రామ్దేవ్ బాబా ని చేసినట్టు చేసే వాళ్ళు. ఇది చిదంబరం ఐడియా
  Krishna Mohan
  http://www.facebook.com/profile.php?id=1348702068

  ReplyDelete
 10. జగన్ ఏడుపు ( ఓదార్పు) గోల, కొదందారం తెలంగాణా గోల, అన్నా హజారే లోక్పాల్ గోల లో, సామాన్య మానవుడి గోల, ఇదంతా చూస్తుంటే ఎవడి గోల వాడిదే అనిపిస్తున్నది..

  ReplyDelete
 11. తెర గారు:

  మీరు మిష్టర్ సూర్యుడు అనేసారు కాబట్టి, మీ టోన్ ని ఊహించుకోగలను :)

  నా ఉద్దేశ్యం మిమ్మల్ని నొప్పించాలనికాదు. అవి నా అభిప్రాయలంతే, అవి నిజమవ్వాలనీ లేదు అలా అని అవి అబద్దమనికూడా నేననుకోను :)

  భారత దేశమంలో ప్రజలందరూ నిజాయితీపరులైపోతే ..., :) నాక్కూడా ఆనందమే. అది జరిగేపని కాదనేది నా అభిప్రాయం (భారత దేశంలో అందరూ నిజాయితీ పరులవ్వక్కర్లేదు, కనీసం ఓ నలభై శాతమైనా అద్భుతమే :))

  భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ప్రజలందరు స్వాతంత్ర్యం వచ్చాక వాళ్ల పరిస్తితులన్నీ ఒక్కసారిగా మారిపోతాయనుకున్నారు, కాని జరిగిందేమిటి, స్వాతంత్ర్యం వచ్చిన ఐదారు సంవత్సరాలకే అర్ధమైపోయింది, దోచుకునేవాడి రంగులోనే తేడా అని :)

  నాదో సలహా / ఐడియా: పర్యావరణ రక్షణవాదులు ఏదో ఓరోజు గంటపాటు కరెంటు దీపాలు ఆపేసి వాళ్ల సమర్ధన తెలిపారు కదా, అలానే ఈ నిజాయితీవాదులు, ఓ వారంరోజులపాటు అసలు లంచాలు తీసుకోకుండా (;), అలానే హైదరాబాదులో ఒక్కరోజు పాటు అందరు ట్రాఫిక్ నిబందనలు (లేన్ డిసిప్లేన్ తో సహా) పాటించి ఎందుకు తమ సమర్ధన తెలుపకూడదు :) (ఇందువల్ల వర్షాలు కూడా పడే అవకాశముంది :))

  ఇందులో వ్యంగ్యమేమీ లేదు. ఈ టపాకి ఇది నా ఆఖరు వ్యాఖ్య. ఆంటే నేను చెప్పాలనుకున్నవన్నీ అయిపోయాయని కాదు, కాని అవి అప్రస్తుతం. వాదనలతో పనికాదు :)

  ReplyDelete
 12. సూర్యుడూ,
  మిస్టర్‌ అనడంలో ఆగ్రహమేమీ లేదు, ఆంగ్లం గనక గారూ అనే బదులు అలా అన్నాను. మనుషుల మౌలిక విలువలమీదనే సందేహం వెలిబుచ్చడం గురించి నా స్పందన తప్ప ఎక్కువ మందిలో పాపాలో, లోపాలో లేవని కాదు. ఇదేదో పాజిటివ్‌ థింకింగ్‌ వ్యవహారం కాదు, వాస్తవం ఏమంటే జనాభాలో సగం మందికి ఏ అవినీతితో సంబంధం లేదు. మిగిలిన వారిలో సగం మందికి అవకాశమే లేదు. చెమటోడ్చి బతికేవారిలో అవలక్షణాలు వుండొచ్చు గాని అవినీతి చేయగలిగింది తక్కువ. ఠాగూరు సినిమాలో వలె లేదా అపరిచితుడులో వలె అటెండర్‌ నుంచి రాష్ట్రపతి వరకూ అందరినీ కలిపి మాట్లాడ్డం వాస్తవికంగా వుండదని మాత్రమే నేను చెప్పదలచింది. వాన చుక్క నేలమీద పడేవరకూ స్వచ్చంగానే వుంటుంది.తర్వాతే బురదగా మారుతుంది. దోపిడీ సమాజం అంతర్గర్భితం చేసిన లక్షణాలు మానవుల సహజ స్వభావం కాదు. మానవీయతే సహజ లక్షణం. దాన్ని వక్రీకరించి, వస్త్వీకరించిన వికృత ఫలితాలు మనం చూస్తున్నాం. అది నేను చెప్పదలచింది. ఈ చర్చచు సంబంధించి ఇదే నాకూ ఆఖరి ఎంట్రీ.

  ReplyDelete