Pages

Tuesday, October 25, 2011

సకల విరమణ.. తదనంతరం...?



ఊహించినట్టుగానే ఉచితమైన రీతిలోనే సకల జనుల సమ్మె 42 రోజుల తర్వాత విరామం తీసుకుంది. విరమణ అన్నా, విరామం అన్నా వాస్తవంగా వర్తమాన ప్రభావంలో పెద్ద తేడా ఏమీ వుండదు. రాజకీయ నాటకాలతో ఉత్పన్నమైన సమస్యలకు సంక్షోభాలకు ఉద్యోగుల సమ్మెలు పరిష్కారం చూపించలేవని ఈ బ్లాగులో రాయడమే గాక ఇతరత్రా కూడా స్పష్టంగానే చెబుతూ వచ్చాను. ఇది సమ్మెదార్లను తక్కువ చేయడం కాదు. సవాళ్లు సంక్లిష్టతల తీవ్రతను చెప్పడం మాత్రమే. వరుసగా వివిధ తరగతులు విరామం తీసుకోవడం అనివార్యమైన పరిణామం. ఈ వాస్తవాన్ని గుర్తించడంలో ఎవరూ ప్రతిష్టలకు పోనవసరం లేదు. అలాగే విరమించారు గనక విఫలమైనారని ఇతరులు భావించనవసరం లేదు. ఇలాటి విషయాల్లో జయాపజయాల లెక్కల కన్నా జన హితమే కొలబద్దగా పెట్టుకోవాలి. అయితే ఉద్యోగులైనా విద్యార్థులైనా రాజకీయ వాస్తవాలను ప్రాంతాల వారీ కోర్కెల పరిమితులను కూడా గమనంలోకి తీసుకోవడం అవసరం. రాజకీయ సమస్యను భావోద్వేగ భరితంగా మార్చి చూపించడం స్వార్థపర శక్తులకు ఉపయోగం తప్ప విశాల జనబాహుళ్యానికి కాదు. పాలకులు తల్చుకుంటే రాష్ట్ర విభజన చేయొచ్చు. ప్రస్తుతానికి వారు అలా అనుకోవడం లేదు. ఆ అవకాశం లేదని కూడా పదే పదే స్పష్టంగానే చెబుతున్నారు. రెండువారాల్లో వచ్చేస్తుందని కెసిఆర్‌ చెప్పినప్పుడు గాని నవంబరు 1 కి వస్తుందని కోదండరామ్‌ అన్నప్పుడు గాని అవి ఆధారరహితాలేనని అందరికీ తెలుసు. వారికి ఇంకా బాగా తెలుసు.సమ్మె విరమణకై విజ్ఞప్తి చేసిన ఆజాద్‌ వ్యాఖ్యలలో కూడా ఇసుమంతైనా కొత్త దనం లేదు. అన్నీగత వైఖరి పునరుద్ఘాటనలే. అయినా ఆ ప్రకటన పెద్ద ప్రధానమైందన్నట్టు చూపించడంలో వాస్తవికత శూన్యం. ఇప్పుడు నిరాహారదీక్షలు అంటున్నారు గాని ఇంత త్వరలో పరిస్థితులు మారిపోతాయిని అనుకోవడానికి ఆస్కారమే లేదు. కాకపోతే వూపు నిలబెట్టడానికి ఉపయోగపడొచ్చు. కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయ ప్రకటన వేగవంతం చేయడమే ఇప్పుడు జరగాల్సింది.

11 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. విప్లవానకి అనుకులమైన మనం...ముందు జనత ప్రజాతంత్ర విప్లవం రావలని కోరుకున్నాం..ఇది అలాంటిదే ఈ సకలజన సమ్మే ఓ ప్రచారం అస్త్రమే

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. మీతో ఏకీభవిస్తున్నాను .కార్మికుల,ఉద్యోగుల సంఘాలు వారి స్వంత డిమాండ్ల కోసం సమ్మెలు,ఆందోళనలు చేయవచ్చునుగాని ,రాజకీయపక్షాల కోర్కెల కోసం మాత్రం చెయ్యకూడదు.ఏమైనా అన్ని సమ్మెలూ ముగిసి నార్మల్ పరిస్థుతులు ఏర్పడటం మంచిదీ .సంతోష కరమైనదీ కదా !

    ReplyDelete
  6. 1. సాదిక్‌ రెండు కామెంట్లు తనే తీసేసుకున్నాడు. ఎందుకో తెలియదు. అతను వుంచిన మూడవ కామెంట్‌లో భావం కూడా సరికాదు. జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని ప్రత్యేక తెలంగాణాకై సమ్మెను పోల్చడం సరైంది కాదు. గతంలో ప్రాంతీయ ఉద్యమాలు నడిపిన వారు తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించారో మర్చిపోలేము. కాకున్నా అదొక పాక్షికమైన కోర్కె తప్ప సమూలమైన మార్పునకు దారి తీసేది కాదు. ప్రధానంగా పాలక వర్గ పక్షాల ఆధ్వర్వంలో ప్రాంతీయ కోణంలో జరిగే సమ్మెను ఎవరైనా సమర్థించవచ్చు గాని దాన్ని విప్లవంగా చూపించడానికి పాల్గొనే వారిలో కూడా చాలా మంది సిద్ధంగా వుండరు.
    2.మనోజ్‌ ఆవేశంతోనో వ్యతిరేకతతోనో రాసిన కామెంట్‌లో భాష నాకు బొత్తిగా పొసిగేది కాదు. రాజకీయ విమర్శలెన్నయినా చేయొచ్చు గాని దూషణలు ఆపాదించడాలు సరైనవి కావు. కనకనే అయిష్టంగా తొలగించాల్సి వచ్చింది
    3.కమనీయం గారు నాతో ఏకీభవిస్తున్నారు గాని నేను వారితో ఏకీభవించలేను. ఉద్యోగులు విద్యార్థులు రాజకీయాంశాలపై పోరాడరాదని నా ఉద్దేశం కాదు. అయితే ఏ ఉద్యమం స్వభావం ఏమిటి, ఎంత వరకూ ఎంత కాలం అన్న దానిపై స్పష్టత వుండాలి.స్థూలంగా ప్రజాస్వామిక లౌకిక విలువల కోసం సమస్యల పరిష్కారం కోసం తప్పక పోరాడవచ్చు గాని పాలక పక్షాల ప్రాంతీయ క్రీడలో వుద్యోగులు కవచంలా మారడం వల్ల పలితం వుండదు. గతంలో రెండు ప్రత్యేక ఉద్యమాలలోనూ వారే అధికంగా నష్టపోయారు.కనకనే ఆ మాట ఎప్పుడూ చెబుతుంటాను. అంతే.

    ReplyDelete
  7. తెర గారు,
    మీకు నచ్చేలా భాష, భావం కామెంట్లలో వుండాలని మీరు ఆశించడం సబబే కాని వాస్తవికంగా వుండదు. ఎప్పుడూ ఎవరైనా తందాన తానాని చెరోవైపూ డప్పు కొడుతూ వుంటే అదోలా విసుగెత్తదూ? :) నాకైతే కౌంటర్-పాయింట్ వినాలంటే ఇష్టం (బూతులు లేకుంటే చాలు).

    తెలంగాణా సమ్మె విరమణకు దారి తీసిన పరిస్థితులు, త్యాగాలు, బలిదానం అని బీరాలు పలికిన RTC, NGO నాయకులు జీతాలకోసం, సమ్మె కాలానికి బోనస్ కూడా అడుక్కున్న కక్కుర్తికి కారణాలేమిటో విశ్లేషించగలరు.

    ఈ సమ్మెలో అసంబద్ధ డిమాండ్లకు, న్యాయబద్ధం కాని సమ్మెకాలం జీతాలకు ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది? ఒకసారి ఇలా రాజీ పడితే, రేపు ఆంధ్ర, సీమల్లో ఇలాంటి పరిస్థితులే కలిగితే, సమ్మె కాలంలో జీతం, బోనస్ ఉద్యోగులు హక్కుగా డిమాండ్ చేయరా? న్యాయస్థానాలు ఎండార్స్ చేస్తే మరి గతం తీర్పులకు అర్థం ఏమిటి? ముందు ముందు కఠినంగా వ్యవహరించడానికి మొహం ఎలా చెల్లుతుంది?
    ఉద్యోగ సంఘాల నాయకులకు కోట్లలో అందింది అనే వదంతులున్నాయి, మీ విశ్లేషణ ఏమిటి?

    ReplyDelete
  8. శంకర్‌,

    మీరే కాదు, చాలా మంది నేను భిన్నాభిప్రాయాలను ఆమోదించలేక తొలగించినట్టు భావిస్తుంటారు. భాషలో నైనా ప్రయోగాల్లోనైనా కనీస ప్రమాణాలు పాటించకపోవడం నేను ఆమోదించలేను. అపహాస్యం చేయడానికి శాపనార్థాలు పెట్టుకోవడానికి, క్షుద్ర వ్యాఖ్యలతో తమకు తామే ఆనందించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే- నా మౌలిక స్వభావాన్ని తప్పుగా చూపేలా చిత్రిస్తే- లేక అదే పనిగా కించపర్చడానికే రాస్తే అప్పుడు నేనూ అదే స్థాయికి దిగి సమాధానం చెప్పలేను కదా.. అందుకే పదే పదే ప్రమాణాల గురించి చెబుతుంటాను. బ్లాగు అనేది హుందా చర్చకు వేదిక తప్ప నిందారోపణల మాలిక కాకూడదు.విమర్శ అవతలి వారు లేవనెత్తిన దానిపై వుండాలి తప్ప వారు ప్రస్తావించని ఉద్దేశించని వాటిపై కాదు. ఈ మాత్రం అర్థం చేసుకోదగిన శక్తి మీకుంది. చేసకోవడం ఇష్టం లేదంతే. గడాఫీపై మనిద్దరం భిన్నాభిప్రాయాలు కలిగి వుండొచ్చు. నా భావాలు నేను రాసుకున్నాను. మీ ఉద్ధేం ప్రకారం నేనుచెప్పేది సరికాదని అంటే చాలు. నా కోణం నేను చెబుతాను. ఆ విధమైన చర్చ జరగాలనుకుంటాను తప్ప తిట్టిపోసుకోవడం కాదు. నేను టీవీలో కూడా వీలైనంత వరకూ వాదనలు దూషణలు లేకుండా చర్చ జరగాలని కోరుకుంటాను. ప్రవీణ్‌ శర్మ వంటివారికి నా భావాలు నచ్చనప్పుడు అదే పనిగా రావడమెందుకు? వాళ్ల వ్యాసాల అడ్రసులు ఇవ్వడమెందుకు? మీరు ఒక భాగంలో ఏకీభవిస్తారు గాని మరో భాగంలో అవసరం లేని అవహేళనలు ఆక్షేపణలు చేస్తుంటారు. అమెరికా చేసింది సరైందే అని చెప్పండి తప్పేం లేదు. నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పండి. బావుంటుంది. మీ మాటలు చెప్పకుండా నేను చెప్పని వాటికి దెప్పి పొడవడం లేదా చెప్పిన వాటికి తప్పు అర్థాలు ఇవ్వడం అవసరమేమిటి? ఆరోగ్యకరమైన చర్చకు అరాచక వ్యాఖ్యలకు అయాచిత చొరబాట్లకు చాలా తేడా వుంటుంది. ఏ ఒక్కరూ ఏ ఒక్కరితో అన్ని విషయాల్లో ఏకీభవించరు. అయితే రాజకీయ విమర్శలకు అవాంఛనీయ దూషణలకు తేడా తెలుసుకోగలపాటి అనుభవం, భాషా విమర్శన నాకు చేతనవుతుందనే అనుకుంటున్నాను. తరచూ తారసపడే వారిలో మీరూ వుంటారు గనక ఇంత వివరంగా చెప్పాను. ఈ ప్రమాణాలు పాటించని వారిని నేను చూశాకనైనా ఎడిట్‌ చేస్తుంటాను. చాలా సార్లు వదిలేస్తుంటాను. కేవలం వ్యతిరేకుల కోసమే ఎవరూ బ్లాగులూ పత్రికలూ నడపనవసరం లేదు. ఏకీభవించేవారితో పంచుకోవడం,తటస్టులను చేరుకోవడం తప్పు కాదు. ఇలాటి వాటి వల్ల అసలు లక్ష్యమే దారి తప్పుతున్నది. ఇది కూడా మీకు నచ్చకపోయినా పైన చెప్పిన రీతిలో మాత్రం చేయబోరని ఆశిస్తాను. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలకు ఎక్కువ విలువ నిచ్చి సమయం వృథా చేసుకుంటున్నానని కొంత మంది అసంతృప్తిగా వున్నారు. వ్యతిరేకించేవారితోనైనా సాధారణంగా సంభాషించవచ్చుననే భావం గలవాడిని గనకే మీరు నా మాటలు తీవ్రంగా తీసుకోకపోవచ్చని తెలిసినా ఇంత వివరంగా మరోసారి బదులిస్తున్నాను.
    సున్నితమైన రాష్ట్ర పరిస్థితుల్లో సమ్మె నాయకులపై నేనెలాటి తొందరపాటు వ్యాఖ్యలు చేయదలచలేదు. నా అభిప్రాయాలు విమర్శనాత్మోకంగానే చెప్పాను. సమ్మె మొదలు కాకముందు నుంచి వివిధ వేదికలపై చెబుతూనే వచ్చాను.
    దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. మీరు చెప్పింది వాస్తవమే. మరీ తిడుతూ పేట్రేగి పోతుంటే తప్ప, ఇగ్నోర్ చేయండి. భేధాభిప్రాయాలను మరీ సీరియస్‌గా పర్సనల్‌గా తీసుకోకండి.
    ప్రవీణ్ శర్మ బ్లాగెరిగిన బ్రాహ్మణుడు, ఆయన లింకులు అంటే లాండ్ మైన్ల వంటివి, కొంచెం జాగ్రత్తగా వుండాలి :ఫ్ :))

    మీకు దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. రవి గారు, చాలా బాగా చెప్పారు. "వినదగు నెవ్వరు జెప్పిన..." అనేది పాత కాలం మాట అయిపోయింది ప్రస్తుతం. ఇక..మీర్రాసిన ఒక ##### గురించి.నాకు తన గురించి మొదటి అరగంటలో అర్థమైంది, "చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు" .
    ఏ తప్పైనా మొదటసారి చేస్తే పొనీలే కొత్తనుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చేస్తే మూర్ఖులమౌతాము. అందుకే
    I just ignored that gentleman (or whatever). The worst way to tackle a jackass is to try reason with it(him).

    ReplyDelete
  11. snkr and pavani

    you are correct. basically as a jounalist and one engaged in polemics i tend to react at various levels.. u might have noticed certain faces disappearing here. after all foolishness is no body's monopoly.. any way thanks for the empathy..

    ReplyDelete