బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ ఏడాది మీకు ప్రగతిశీలంగానూ ప్రయోజనాత్మకంగానూ వుండాలని మీరు ప్రణాళికా బద్దంగా పురోగమించాలని కోరుకుంటున్నాను. ఏడాది పొడుగునా నా బ్లాగులో ఎంట్రీలు చూసిన ఇతరత్రా ఆదరించిన ప్రతివారికీ, ప్రత్యేకించి విమర్శల ద్వారా పదును అప్రమత్తత పెంచిన వారికి నా కృతజ్ఞతలు.
గత ఏడాది చివరలో ' కాలం ఖాతాలో వీడ్కోలు వీక్షణం' అని రాశాను. ఇప్పుడు దాన్ని ఒకసారి చదువుకుంటే గతాన్ని సమీక్షించుకోవడం ఎలా వున్నా రాబోయే రోజులను మెరుగ్గా ఉపయోగించుకునే అవకాశముంటుంది. అందరికీ కనీసం అత్యధికులకు ఏదో మేరకు అందుబాటులో వుండే సామ్యవాది (సౌమ్యవాది మాత్రం కాదు) కాలం ఒక్కటే.
కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రభావం
కాలం ఒక ప్రణాళిక
కాలం ఒక ప్రహేళిక
కాలం ఒక సవాలు
కాలం ఒక జవాబు
కాలం ఒక అవకాశం
కాలం ఒక అవరోధం
కాలం ఒక వాహనం
కాలం ఒక వాహకం
కాలం ఒక ప్రమాణం
కాలం ఒక ప్రయాణం
కాలం ఒక ప్రయోగం
కాలం ఒక ప్రకాశం
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDeleteరవి గారు,
ReplyDeleteమొదటిసారిగా మీ TV చర్చలు చూడటం జరిగింది. ముగ్గురు కండువాల(పుసుపు పచ్చ, గులాబి, త్రివర్ణం) మధ్య మీరు ప్రత్యేకంగా అనిపించారు. చర్చలు నిర్వహించే అంతను ఎంతవారిస్తున్నా వినక కండువాలు మూడు ఒకేసారి బిగ్గరగా అర్థంకాక చెబుతుంటే, మీరు హుందాగా ఎటో చూడటం నాకు నచ్చింది. వీళ్ళతో చర్చించడమంటే... మీ ఓపిక మెచ్చుకుంటున్నా.
మీకు కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు.
మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు !
ReplyDeleteమీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeletehappy new year 2u
ReplyDelete