Pages

Saturday, July 7, 2012

తప్పు మీద తప్పు చేస్తున్న సర్కారు!వివాదాస్పద జీవోల విషయంలో కోర్టు నోటీసులు ఎదుర్కొంటున్న అమాత్యులకు (అందులోనూ ఇద్దరు మినహా) న్యాయ ఖర్చులు భరించి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమైంది. కాంగ్రెస్‌ పార్టీని ఆవరించిన అయోమయాన్ని, అది అనుసరిస్తున్న ద్వంద్వనీతిని వెల్లడించే నిర్ణయం ఇది. ఆ 26 జీవోల ఆధారంగానే జగన్‌ మోహన రెడ్డి అక్రమ లబ్ది పొందారని కేసు నడుస్తుంటే- వాటికి కారకులైన వారిని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుంది? అందులోనూ ఇద్దరిని ఎలా మినహాయిస్తుంది? ఇందులో ఎలాటి సూత్రమూ వుండనవసరం లేదా?జీవోలు సక్రమమైతే అప్పుడు క్విడ్‌ ప్రో కో పద్ధతిలో భారీ పెట్టుబడులు ఎందుకు పెడతారు? అంటే జగన్‌ కూడా నిర్దోషి అని ప్రభుత్వం చెప్పదలచిందా? మరి ఆయనపై అవినీతి ఆరోపణలతో దండెత్తదం దేనికి? అలాగే మంత్రులకు కల్పించిన రక్షణ ఐఎఎస్‌లకు ఎందుకు ఇవ్వరంటే ఏం చెబుతారు? నిజానికి వారు తమ శాఖ మంత్రుల మాట ప్రకారమే నడుచుకున్నామని చెప్పే అవకాశం పూర్తిగా వుంటుంది.కనక అవినీతిపై దర్యాప్తులో గాని విమర్శలలో గాని ద్వంద్వనీతి చెల్లుబాటు కాదని ఏలిన వారు గ్రహిస్తే మంచిది.

4 comments:

 1. క్విడ్-ప్రో-కో అంటేనే రెండువైపుల లబ్దిదారులున్నట్లు, మరి కేసును నీరుగార్చే చర్యలు కాంగ్రెస్ తీసుకుంటుంటొంది అంటే కేసువిషయంలో రెండు పార్టీల మధ్య మరో తాజా క్విడ్-ప్రో-కో ఒప్పందం కుదిరిందేమో. దొందూ దొందే.

  ReplyDelete
 2. The minsters have to resign or Hon'ble Chief Minster has to remove them. If any thing is not possible it is better Hon'ble Chief Minster resigns to keep the honour to Constitution of India and to establish values in politics. Nallari Kiran Kumar Reddy name will be remembered if he resigns for value based politics. Many have shown the way. Left parties have to start movement, if these can not be done to create a perfect school of thought in Politics in Andhra Pradesh.

  ReplyDelete
 3. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏరికోరి ఎంచుకున్న తన మంత్రివర్గంలోని మంత్రులందరికీ టోపీ పెట్టేసి, ఒక్కరికీ తెలియకుండానే, వేలకోట్ల ప్రజాధనాన్ని కొడుకుతో కలిసి ఒక్కరే బొక్కేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. నలబై మంది మంత్రుల్లో ఎవ్వరికీ తెలియకుండా, అనుమానమే రాకుండా, అసలు ఎవరికీ అర్థమే కాకుండా అద్భుతమైన రీతిలో వైఎస్సార్ అవినీతికి పాల్పడ్డారంటే చిన్నపిల్లలు కూడా నమ్మరు!!

  లక్షో, పదిలక్షలో కాదు, వేలకోట్ల స్థాయిలో జరిగిన అవినీతిలో వాటాలు ఇయ్యకపోతే ఈ మంత్రులు ఒప్పుకుంటారా?? వైఎస్సార్-జగన్ అవినీతి లీలల్లో కచ్చితంగా మెజారిటీ మంత్రులు భాగస్వాములే!!

  "నాకేం తెలియదు, ఆయన సంతకం పెట్టమంటే పెట్టేశాను" అంటున్న మోపిదేవి వెంకటరమణ సంతకం పెట్టిన తరవాత బుధ్ధిగా ఆ సంగతి మర్చిపోయారా?? సరే, మోపిదేవి మాటే నిజమనుకుంటే, తనకు తెలియకుండా వైఎస్సార్ ఏదో అవినీతికి పాల్పడుతున్నారనే అనుమానం ఇన్నేళ్ల రాజకీయానుభవం ఉన్న మోపిదేవికి కచ్చితంగా వచ్చే ఉంటుంది. వచ్చి కూడా జగన్ కొత్త పార్టీ పెట్టే వరకూ ఒక్కమాట కూడా మాట్లాడలేదంటే, తోటి రాజకీయనాయకుడు కోట్లక్కోట్లు ప్రజాధనం దోచేస్తుంటే నూరుమూసుకు కూర్చున్నాడంటే, ఆ అవినీతి సొమ్ములో మోపిదేవికి వాటా లేదంటే ఎవరు నమ్ముతారు??

  అందరూ కలిసి ప్రజాధనం దోచుకున్నారు, ఇప్పుడు అవినీతి కేసులు పెట్టిన తరవాత మళ్లీ ప్రభుత్వ(ప్రజా)ధనంతోనే కేసులు వాదించుకుంటారట!! ఒకవేళ క్లైమాక్స్ లో ఎవరైనా మంత్రి దోషి అని తేలితే, ప్రజాధనం బొక్కేసిన ఒక మంత్రికి ఇన్నాళ్లూ లాయర్ ఫీజులు చెల్లించిన ప్రభుత్వపెద్దలు ఆ కోర్టు ఖర్చునంతా వెనక్కి రాబడతారా??

  ReplyDelete
 4. రాష్ట్రంలో ప్రజాధనం లూటీ కొత్తపుంతలు తొక్కుతున్నది. అవినీతికి ఇది పరాకాష్ట!! జనం సొమ్ము నొక్కేసిన దొంగలు ఆ కేసుల నుంచి తప్పించుకోడానికి దొరల్లా ప్రభుత్వం నుంచి గ్రాంటులు పొందుతున్నారు. ఈ బహిరంగదోపిడీని సీపీఎం బలంగా వ్యతిరేకించాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి నిరసనలు వ్యక్తం చెయ్యాలి.

  ReplyDelete