ప్రాంతాల వారీ వివాదాలు పెంచే ఈ ధోరణి కేవలం మాటలకే పరిమితం కాలేదని సాగర్ జలాల విడుదల వివాదం స్పష్టం చేస్తున్నది. మొన్నటి ఎన్నికల ఎదురు దెబ్బల నుంచి తేరుకోవడానికి తరుణోపాయంగా నీటి విడుదలను వివాద గ్రస్తం చేయడం అవాంఛనీయ పరిణామం. కృష్ణా జలాల కనీస మట్టం, ఆ సమయంలో నీటి విడుదలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, ఆ సందర్భంలో పాటించాల్సిన ప్రాధాన్యతలు వీటిపై స్పష్టమైన జీవో వుంది. ఇప్పుడు నీటి లభ్యత చాలా తక్కువగా వుంది గనక ఏం చేయాలన్న దానిపై అఖిలపక్ష సమావేశం జరిపి అంగీకృత నిర్ణయానికి రావలసి వుండింది. అలా గాక ఉప ఎన్నికల అనంతర రాజకీయ నిర్వహణలో భాగంగా ఆదరాబాదరాగా నీటిని విడుదల చేయడం, విమర్శలు రాగానే తాత్కాలికంగా విరమించుకోవడం ఇప్పుడున్న సున్నితమైన రాజకీయ పరిస్థితిలో అత్యంత బాధ్యతా రహితం. సాగునీరు తాగునీరు వీటి మధ్య పాటించాల్సిన నిబంధనలు వుండనే వున్నాయి. కొంతమంది చెబుతున్నట్టు ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో తాగునీటి అవసరాలనే గాక ఇతర చోట్ల కూడా ప్రభావం చూపే అంశం. నిజంగా ఆగష్టులో వర్షాలు కురవకపోతే ఏం చేయాలన్నది ఒక సవాలు. సమిష్టిగా చర్చించి సమతుల్యత పాటించాల్సిన సందర్భంలో అకారణ ఉద్రిక్తతలు పెంచడం కూడా ఒక రాజకీయ వ్యూహమనుకోవాలా?
Saturday, June 30, 2012
నీటి విడుదలలో కొత్త వివాదం
ప్రాంతాల వారీ వివాదాలు పెంచే ఈ ధోరణి కేవలం మాటలకే పరిమితం కాలేదని సాగర్ జలాల విడుదల వివాదం స్పష్టం చేస్తున్నది. మొన్నటి ఎన్నికల ఎదురు దెబ్బల నుంచి తేరుకోవడానికి తరుణోపాయంగా నీటి విడుదలను వివాద గ్రస్తం చేయడం అవాంఛనీయ పరిణామం. కృష్ణా జలాల కనీస మట్టం, ఆ సమయంలో నీటి విడుదలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, ఆ సందర్భంలో పాటించాల్సిన ప్రాధాన్యతలు వీటిపై స్పష్టమైన జీవో వుంది. ఇప్పుడు నీటి లభ్యత చాలా తక్కువగా వుంది గనక ఏం చేయాలన్న దానిపై అఖిలపక్ష సమావేశం జరిపి అంగీకృత నిర్ణయానికి రావలసి వుండింది. అలా గాక ఉప ఎన్నికల అనంతర రాజకీయ నిర్వహణలో భాగంగా ఆదరాబాదరాగా నీటిని విడుదల చేయడం, విమర్శలు రాగానే తాత్కాలికంగా విరమించుకోవడం ఇప్పుడున్న సున్నితమైన రాజకీయ పరిస్థితిలో అత్యంత బాధ్యతా రహితం. సాగునీరు తాగునీరు వీటి మధ్య పాటించాల్సిన నిబంధనలు వుండనే వున్నాయి. కొంతమంది చెబుతున్నట్టు ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో తాగునీటి అవసరాలనే గాక ఇతర చోట్ల కూడా ప్రభావం చూపే అంశం. నిజంగా ఆగష్టులో వర్షాలు కురవకపోతే ఏం చేయాలన్నది ఒక సవాలు. సమిష్టిగా చర్చించి సమతుల్యత పాటించాల్సిన సందర్భంలో అకారణ ఉద్రిక్తతలు పెంచడం కూడా ఒక రాజకీయ వ్యూహమనుకోవాలా?
Friday, June 29, 2012
రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త నాటకం?
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత- సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత- ఉప ఎన్నికల తర్వాత- రంజాన్ తర్వాత ఇలా రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం వాయిదా వేయడానికి కేంద్రం రకరకాల కారణాలు చూపిస్తూ వచ్చింది.ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత పరిష్కారం చెప్పేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అందరినీ సంప్రదించాలని చెప్పే హౌం మంత్రి చిదంబరం కూడా సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. మూడు మాసాల్లో తెలంగాణా ఏర్పాటు జరిగిపోతుందని తాము చేసిన ప్రకటన నిజమనడానికి ఇది నిదర్శనమని టిఆర్‌ఎస్ నాయకులు లేదా ఇతర పార్టీల తెలంగాణా నాయకులు కొందరు అప్పుడే అంటున్నారు.మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదని కూడా వారు ముక్తాయిస్తున్నారు.నిజానిక ఉప ఎన్నికల వెను వెంటనే ఈ అస్త్రంబయిటకు తీస్తారని నేను బ్లాగులో ఇది వరకే రాసిన సంగతి మిత్రులకు తెలుసు. అయితే ఇప్పుడు నడుస్తున్న నాటకం అంతకంటే రసవత్తరంగా వుంది. కేవలం తెలంగాణా నాయకులు మాట్లాడ్డమే కాదు- వారికంటే ముందే ఇతర ప్రాంతాల నేతలు నిరసన స్వరాలు వినిపించడం మొదలెట్టారు. లగడపాటితో మొదలైన ఈ దుమారం టిజివెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి వంటి మంత్రుల మాటలతో మరింత తీవ్రమైంది. రాయల తెలంగాణా అనీ, రాయలసీమలో కర్నూలు అనంతపురం జిల్లాలను కలిపి ఇస్తారని ఇలా రకరకాల కథనాలకు కాంగ్రెస్ నేతలే వూతమిస్తున్నారు.మరో వైపున
నాయకత్వ మార్పు కథనాలకు కారకులెవరు?

మీరు కోరుకుంటున్నట్లుగా (నాయకత్వ మార్పు) జరగదు అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.నిజానికి మీడియాకు అలాటి కథనాలు ఇస్తున్న వారు కాంగ్రెస్ నేతలే.ఎవరో ఎందుకు? పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏమి చెబుతున్నాయి?గురువారం సాయింత్రం లోకేష్ వారసత్వ నాయకత్వ స్వీకరణపై చర్చకు టీవీ9లో వుండగా నేటి మాటలో బొత్స వ్యాఖ్యలు విన్నాను.వాటిని నిశితంగా గమనిస్తే చాలా అర్థం వుంది. తర్వాత దానిపైనా చర్చించాల్సి వచ్చింది. లిక్కర్ వ్యాపారులపై దాడులలో విమర్శలను ఎదుర్కొన్న బొత్స తనకు 'అవకాశం వస్తే' మధ్య నిషేదం విధిస్తానని అన్నారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వున్నాయీ వ్కాఖ్యలు. మొదటిది మద్యం వ్యాపారంతో సంబంధం వుందన్న ఆరోపణలకు సమాధానంగా నిషేదంగురించి చెప్పడం. అయితే తనకు అవకాశం వస్తే చేస్తానని చెప్పడం ద్వారా అధికారం అప్పగిస్తే చేస్తానని సూచించడం. 'ఇప్పుడు పిసిసి అద్యక్షుడుగా వున్నాను.రేపు ఏదైన అవకాశం వస్తే అందరినీ ఒప్పించి అధిష్టానంతో మాట్లాడి మద్య నిషేదానికి కృషి చేస్తాను' ఇవి బొత్స మాటలు. ఈ మాటలలో ఏమైనా అస్పష్టత వుందా? బహుశా కిరణ్ జవాబు బొత్సను ఉద్దేశించినదై వుండొచ్చు. చిరంజీవి అర్హత గురించి జోగి రమేష్ అంతకు ముందే చెప్పారు. అభిమానంతో అన్నాడని మెగాస్టార్ సమర్థించారు. జెసి దివాకర రెడ్డి, శంకర రావు వంటి వారు అంతకు ముందే వ్యాఖ్యానించారు. టికాంగ్రెస్ నేతలు కొందరు తీవ్రమైన విమర్శలే చేశారు.ఇవన్నీ తమ వారి నుంచే జరిగిపోతుంటే
Monday, June 18, 2012
శ్రుతి మించిన అతి తర్కం (రంగనాయకమ్మ గారి పుస్తకంపై నాటి విమర్శపునర్ముద్రణ)
దళితుల సమస్య పరి'ా్కరానికి ''బుద్దుడు చాలడు, అంబేద్కరూ చాలడు మార్క్స్ కావాలి'' అంటూ రంగనాయకమ్మ ఇటీవల ఒక పుస్తకం రాశారు. సామాజిక న్యాయభావన, అట్టడుగు తరగతుల వారిలో స్వీయ అస్తిత్వం గురించిన చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాటి చర్చలు అందరి దృష్టినీ ఆకర్షించడం సహజమే. అందులోనూ అంబేద్కర్ దళితజాతి చైతన్యానికి వైతాళికుడిగా పరిగణించబడుతున్నారు. దేశంలో అత్యున్నత గౌరవాభిమానాలు పొందుతున్న దివంగత నాయకులలో ఆయనొకరు. ఇందుకు సహేతుకమైన కారణాలే వున్నాయి. వాటిని రంగనాయకమ్మ ఇలా వివరించారు:
''అంబేద్కర్ అస్పృశ్యుల సమస్యను దేశంలో అందరి దృష్టికి తెచ్చారు. ఆ దురాచారం మీద పోరాటాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మలచారు. మనకూ హక్కులున్నాయనే స్పృహ అస్పృశ్యులలో కలిగించారు.
రిజర్వేషన్ల ఉద్యమం అంబేద్కర్ కన్నా ముందే ప్రారంభించినా ఆయన ఆ ఉద్యమాన్ని కొనసాగించారు. రిజర్వేషన్ల వల్ల చిన్నకులాల్లో కొంత జనాభాకైనా పెద్ద చదువులు, ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
అంబేద్కర్ అస్పృశ్యుల విషయంలో కాంగ్రెస్‌ను, గాంధీని సాధ్యమైనంత ఎక్కువగానే బటyబయలు చేశారు....
అస్పృశ్యత మీదేగాక మొత్తం కులవిధానం అంతటి మీద అంబేద్కర్ తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శించారు.''
తన పుస్తకం చివరిభాగంలో రచయిత్రి ఇచ్చిన ఈ అంచనా ఆయన పాత్రను చాలావరకు సరిగానే చిత్రించింది. అయితే
Saturday, June 16, 2012
అవినీతికి ఆమోదమా? అధినేతలకు గుణపాఠమా?
18 ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలే వచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లేదా జగన్ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో విజయం సాధించారు. చాలా చోట్ల భారీ మెజారిటీలు లభించాయి. రాష్ట్ర రాజకీయ రంగంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావ ప్రక్రియ దీనితో పూర్తయినట్టే. బంగ్లాకాంగ్రెస్, ఉత్కళ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ వంటి పార్టీల తరహాలో మరో ప్రాంతీయ కాంగ్రెస్ అవతరించి బలం ప్రదర్శించింది. సిబిఐ కేసులు, అరెస్టులు ఆరోపణల నేపథ్యం వున్నా జగన్ అభ్యర్థులను ఎన్నుకున్నారన్నది నిజం. అయితే ఈ విజయంతో ప్రజలు ఆయనపై ఆరోపణలన్ని తోసిపుచ్చారనీ,న్యాయం చేశారని భావిస్తే అది అనుచితమే. రాజకీయంగా ఈ సారి కాంగ్రెస్ స్థానంలో జగన్ పార్టీని ఓటర్లు స్వీకరించారు. ప్రభుత్వ నిర్వాకాలపై , రాష్ట్రంలో రాజకీయ ౖ అనిశ్చితిపై పరిపాలనా ప్రతిష్టంభనపై ప్రజల అసంతృప్తి ఆగ్రహం ఈ తీర్పులో ప్రతిబింబించాయి. వైఎస్‌ఆర్ పథకాల ప్రచారం సామాజిక కోణాలు కూడా ప్రధాన పాత్ర వహించాయి. కేవలం సానుభూతితోనో మహిళల కన్నీళ్ల వల్లనో గెలిచారని లేక ప్రజలు తప్పుగా తీర్పు నిచ్చారని అంటే అది పాక్షికత్వం అవుతుంది.
ప్రాథమికంగా ఇది కాంగ్రెస్‌కు తిరసృతి. రెంటిని మినహాయిస్తే తక్కిన అన్ని చోట్ల పాలకపక్షం తన స్థానాలు కోల్పోయింది. శంకరరావు, దివాకరరెడ్డి వంటి పార్టీ నాయకులు భిన్న స్వరాలు వినిపించడం మొదలెట్టారు.మంత్రి మాణిక్యవర ప్రసాద్ ఒక విధమైన పునర్య్యవస్థీకరణ గురించి మాట్లాడారు. కనక చాలా మార్పులు
Subscribe to:
Posts (Atom)



