Pages

Wednesday, March 2, 2011

రుజాగ్రస్త జాహ్నవీయం




ఎదురు దెబ్బలు నిజం కావచ్చు.విచ్చిన్నాలు సత్యం కావచ్చు. కూలిన సామ్యవాద సమాజాలు సాక్ష్యం ఇవ్వొచ్చు. ఇవన్నీ నిజమైనా- సోవియట్‌ తూర్పు యూరప్‌ విచ్చిన్నాల తర్వాత కూడా - సామ్రాజ్యవాద సంసేవకులు, స్వేచ్చా విపణి భాష్య కారులు దాన్ని చీల్చి చెండాడాలని ముచ్చట పడటంలో ఆ సిద్ధాంత బలం సాక్షాత్కరిస్తుంది. మార్క్సిజం దేవతా వస్త్రం లాటిదనే విభూత భాష్యం. జాహ్నవీ దండకంలో తాజా సుభాషితం.కమ్యూనిస్టు సిద్ధాంతంపై కాలకూట విషం కక్కడానికి అంకితమైన జాహ్నవి అనే ఈ బురఖా కలం ముసుగు తొలగించి
నగ స్వరూపాన్ని బయిటపెట్టింది. దీనిపై ఇప్పటికే అనేక మంది మిత్రులు స్పందించారు. మార్క్సిస్టు సిద్ధాంతంపై దాడికి ఉద్దేశించిన విఫల విఘాతక యత్నాలలో ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాదు. తనపై వరుసగా విమర్శనలు రావడమే విజయమనే భ్రమలో ఈ వారం ఆ రుజాగ్రస్త జాహ్నవీయం పరాకాష్టకు చేరింది. చరిత్ర మిథ్య సిద్ధాంతం మిథ్య మార్క్సిజమే మిథ్య పొమ్మనే దుస్సాహస ప్రహసనానికి పాల్పడింది.

ఆధునికానంతర అనే వాదం వాస్తవంలో మార్క్సిజం పూర్వ వాదమే అన్నట్టు జాహ్నవి కొత్తకాలమ్‌లో పాత మ్యాటర్‌లా సాగిస్తున్న మేధో మధనం నిజానికి వాస్తవ వధనం. చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రం,సాహిత్యం రాజకీయాల ప్రాథమిక పరిచయం లేకున్నా కనీస జీవితానుభవం బట్టి చూసినా ఇంతలేసి అసత్యాలు రాసి ఆనంద తాండవం సాగించేవారు కాదు. రొట్టె లేని వాడికి స్వేచ్చ గురించి చెప్పడం దండగన్న పెట్టుబడిదారీ పెద్దల మాటలైనా గౌరవిస్తే - ఐపిఎల్‌ భారతానికి బిపిఎల్‌ భారతానికి మధ్యన మహాంతరాలు గమనిస్తే - మార్కెట్‌ శివాలతో వూగిపోయేవారు కాదు. దేశాలపై దురాక్రమణల పర్వంలో అంకుల్‌ శ్యాం అఘాయిత్యాలు అరకంట చూసినా ప్రపంచీకరణ పారవశ్యంలో పడిపోయే వారు కాదు. ఇరవయ్యవ శతాబ్దపు విజ్ఞానసారమంతటినీ ఇముడ్చుకుని విప్లవ కార్యాచరణకు మార్గం చూపిన గతి తార్కిక పద్దతిని ఖండించేందుకు మతి తప్పిన విజ్ఞాన సర్వస్వంలా వూరేగే వారు కాదు.


ఆరోగ్య సంరక్షణ గురించి ఆహార అభద్రత గురించి ఒబామా నుంచి మన్మోహన్‌ వరకూ అధినేతలే ఆందోళన పడుతుంటే సెల్లు పోను ప్రగతి గురించి సొల్లు కబుర్లు రాసి వుండే వారు కాదు. దేశంలో ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల చొప్పున ఘరానా బాబులకు రాయితీల వాన కురుస్తుందన్న ఆగ్రహమే వుంటే పేదల తిండికో ఇంటికో రైతన్న సేద్యానికో రాయితీలు ఇవ్వడం నేరమని చెలరేగి రాసే వారు కాదు. ఏకాక్షిలా ఎంత సేపటికీ పై చూపు తప్ప ఆధోజగత్సహౌదరుల ఆలోచన పట్టని ఈ మేధా బిరుదాంకితులకు అస్మదీయ పెట్టుబడిదారీ విధానమే అపర వేదమై ఘోషిస్తుంది. ప్రశ్నించే ప్రత్యామ్నాయ వాణి, ప్రతిఘటనా శక్తి మహాపరాధిలా కనిపిస్తుంది. జాహ్నవి ఇంత వరకూ రాసిన ప్రతి పంక్తి ఈ కోవలోదే. వాటిని ఖండించడానికి ఉదాహరణలూ ఉప పత్తులూ శుద్ధ దండగ. వాదానికి సమాధానం వుంటుంది గాని వితండానికి ఏముంటుంది? సందేహాలకు సమాదానం వుంటుంది గాని విద్వేషానికి విరుగుడు ఏముంటుంది? అంధత్వానికి చికిత్స వుండొచ్చు గాని కళ్లు మూసుకున్న కబోదికి వాస్తవ జగతి ఎలా అగుపిస్తుంది?
మార్క్సిస్టు సిద్ధాంతం ప్రాతిపదికగా సోవియట్‌ యూనియన్‌ అవతరించిన తర్వాతనే అంతర్జాతీయ వ్యవస్థ స్వరూపం మారింది. చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలు సామ్యవాద పథం పట్టి వుండకపోతే సామ్రాజ్యవాద దేశాలు దురాక్రమణలతో ప్రపంచాన్ని ఎప్పుడో ఫలహారంలా నంచుకుని వుండేవి. మన దేశానికి కూడా భద్రత కల్పించి స్వావలంబనకు దో హదం చేసిన సోవియట్‌ పాత్రను ఎవరూ తుడిచి వేయలేరు. అది అనేక అంతర్గత లోపాలతో విచ్చిన్నమైన తర్వాత అంతర్జాతీయ దృశ్యం ఎలా మారిపోయిందో కూడా కనిపిస్తూనే వుంది. ఆ విచ్చిన్నానికి బాద్యుడైన గోర్చబెవ్‌ను ఈ రోజు 80 వ జన్మ దినోత్సవాన రష్యన్లు బేఖాతరు చేస్తే సామ్రాజ్యవాద శిథిల సౌధమైన లండన్‌లో సత్కరిస్తున్నారు. వ్యక్తులుగా ఎవరు వున్నా వారి వెనక వున్న దివా ళాకోరు పోకడలే ఈ దురవస్థకు దారి తీశాయనడం నిస్సందేహం.
సోవియట్‌ తూర్పు యూరప్‌ విచ్చిన్నం నిస్సందేహంగా సోషలిజానికి పెద్ద ఎదురుదెబ్బే.అయితే సినారె వంటి ఉదార వాద కవి కూడా రాసినట్టు పైనున్న మంచు కరిగినా పర్వతం కరిగిపోయిందనుకోవడం మూర్ఖత్వం. చరిత్ర వెనక్కు తిరుగుతుందని, ధరిత్రి బల్లపరుపుగా వుందని, నరుడు మళ్లీ వానరడవుతాడని నమ్మని ఆశావాదులం మేము అని ఆ తరుణంలో నేనూ రాశాను. నిజంగానే కొంతమంది కలగన్నట్టు దాంతోనే ఎర్రజండా మటు మాయమై పోలేదు. ప్రపంచీకరణ పేరిట సాగుతున్న అమెరికనీకరణపై అంతర్జాతీయ ప్రతిఘటనలూ ఆగలేదు. దోపిడీని పీడనను ప్రతిఘటించడం ప్రశ్నించడం మానవాళి సహజ లక్షణం. మార్క్సిజం ఆ పోరాట సూత్రాలకు శాస్త్రాన్ని క్రోడీకరించింది.
ఆస్పత్రిలో ఎవరో కొందరు మరణిస్తే వైద్య శాస్త్రం తప్పు కానట్టే కొన్ని దేశాలు విచ్చిన్నమైతే సిద్ధాంతం ఆసాంతం వమ్మయిపోదు. అమెరికాకే దడపుట్టిస్తున్న ఆర్థిక శక్తిగా చైనా పొరుగునే వుంది. వెనిజులాలో చావేజ్‌ నుంచి నేపాల్‌ కమ్యూనిస్టుల వరకూ దేశ దేశాల అనుభవం ఇదే చెబుతున్నది. ఈ ఎదురు దెబ్బల తర్వాత కూడా వరసగా నాలుగు సార్లు బెంగాల్‌లో సాధించి, కేంద్రాన్ని కూడా ప్రభావితం చేయగల ప్రజాశక్తిని ప్రదర్శించిన వామపక్షం ఈ దేశంలో సజీవంగా వుంది. అరబ్‌ దేశాల ఘటనలూ సమర శీల శక్తికి సంకేతమిస్తున్నాయి. ఈ ఘటనలన్ని ఒకటి కాకపోవచ్చు. వీటన్నిటి పాఠాల్లోనూ తేడాలు వుండొచ్చు. మొత్తంపైన ప్రపంచీరణ అనేది అవినీతీకరణ అని దాని పితామహుడుగా నోబుల్‌ బహుమతి పొందిన ప్రపంచ బ్యాంకు ఉపాద్యక్షుడు జోసఫ్‌ స్టిగ్జిల్‌ వంటి వారే చాటి చెబుతుంటే జాహ్నవి మరో వైపు చూస్తున్నారు, హతవిధీ!


ఇంతకూ ఈ రాతల వెనక స్పష్టమైన ఆలోచనా విధానం వుంది. ప్రపంచీకరణ విషమ ఫలితాలు అసమ జీవితాల స్వరూపం స్పష్టమవుతున్న కొద్ది ప్రజలలో పునరాలోచన క్రమం వేగం పుంజుకుంటున్నది. 2 జీ స్పెక్ట్రం వంటివి కార్పొరేట్‌ కాలుష్యానికి పట్టిచూపుతున్నాయి. వూచలు లెక్కపెడుతున్న రాజులు రాజాలు ఇందుకు నిదర్శనాలుగా వున్నారు. ఉత్పాదక రంగం క న్నా వూహాజనిత లాభాల రంగం ఎక్కువవుతున్న తీరు ఆర్తిక వ్యవస్థలకే అపాయం తెచ్చి పెట్టి మాంద్యాలకు సంక్షోభాలకు దారి తీస్తున్నది. అసంతృప్తి రకరకాల రూపాలలో ప్రజ్వరిల్లుతున్నది. దున్నేవాడికి భూమి అన్న నినాదం స్థానే అభినవ హిరణ్యాక్షులు వేల ఎకరాలు చాపచుడుతున్నారు.కాకరాపల్లి కాల్పులోనూ అదే పునరావృతమైంది. అయితే జాహ్నవి లాటి నిశిత మేధకు, ఆయనకు వంతపాడే మాజీ అరుణార్కులకు ఇవేవీ సమస్యలు కావు. మహత్తర పెట్టుబడిదారీ విధానం వీటికి ఎందుకు అవకాశమిచ్చిందో అక్కర్లేదు. ,
సామ్యవాదం హక్కులను హరించును, పెట్టుబడి దారి విధానంలో స్వేచ్చ వుండును, స్వేచ్చ సంపదను సృష్టించును, ప్రపంచీకరణ స్వర్గానికి బాట వేయును,కార్పొరేట్‌ వలయంలోనే ప్రగతి వుండును, కోటీశ్వరులకు రాయితీల వల్ల దేశ ఉత్పత్తి పెరుగును, పేదలకు ఉపశమన చర్యలు ఉపద్రవమును తెచ్చును,ప్రభుత్వ రంగము దండగ, ప్రైవేటీకరణతోనే పండుగ వగైరా వగైరా అరిగిపోయిన రికార్డును అదే పనిగా వినిపించడం ద్వారా జీవిత వాస్తవాల నుంచికాస్తయినా దారి మళ్లించాలన్న ప్రయాస ఇందులో ప్రస్పుటమే.
మార్క్సిజం అన్వయంలో లోపాలు దొర్లి వుండొచ్చు, ఆ సిద్దాంతాన్ని అనుసరించే రాజకీయ పక్షాల పురోగమనంలో హెచ్చు తగ్గులుండొచ్చు. ఇక ముందు కూడా పొరబాట్లు జరగొచ్చు.కాని దరిద్రులను కాల్చుకుతిన్న నరజాతి చరిత్రకు ప్రత్యామ్నాయాలను ఆవిష్కరించింది మాత్రం ఆ శక్తులే.ఇప్పుడూ వాటికి ఆ గౌరవం వుంది. వాటిపై విశ్వాసం వుంది. దాన్ని దెబ్బ తీయడం కోసమే ఈ వితర్క కుతర్కాలన్నీ. మార్కెట్‌ మాయాజాలంలోనూ డాలర్‌ రాజ్యపు అడుగు జాడల్లోనూ ఉజ్వల భవిత వుందని వూరిండడం ప్రజలను గ్లోబలిపీఠం ఎక్కించడానికే.
జాహ్నవి వ్యాసం చివరలో ్ట అజ్ఞానం నశించు గాక అని అహంకరించినట్టు మంత్రాలు చదివితే దోపిడీ పీడన దురాక్రమణ అంతరించదు. దానిపై పోరాటానికి విశాల జనరాశులను సమాయత్తపరచాలి. వర్తమాన చరిత ఆ దిశలోనే నడుస్తున్నది..

32 comments:

  1. నేను మార్క్సిస్ట్‌నే కానీ ఈ వ్యాసం నాకు అర్థం కాలేదు. కాస్త సులువైన భాషలో వ్రాసి ఉంటే బాగుండేది. నాకు తెలిసి ఆధునికాంతరవాదం (post modernism)లో కొత్తదనం లేదు. డాలర్ ఖర్చు పెట్టి నాలుగైదు డాలర్లు సంపాదించడమే ఆధునికత అనుకుంటే అది బెంజమిన్ ఫ్రాంక్లిన్ టైమ్ నుంచి ఉన్నదే అని చెప్పొచ్చు.

    ReplyDelete
  2. ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం జాహ్నవి అనే కలం పేరుతో విపరీత ధోరణిలో సాగుతున్న రాతలకు సమాధానంగా రాసిన ఈ వ్యాసం (2011 మార్చి 3న) నా కాలమ్‌ గమనంలో ప్రచురితమైంది. బ్లాగర్లు కూడా చూడ్డానికి వీలుగా ఇక్కడ కూడా వుంచాను. అయితే ఇందులో కొన్ని ప్రస్తావనలు జాహ్నవి వ్యాసాలు చూడని వారికి కొంత కొత్తగా వుండొచ్చు. ఇందులోని భాషా ప్రయోగానికి కూడా అదే నేపథ్యం.కొంత కష్టమన్న ప్రవీణ్‌ శర్మ మాట నిజమే కావచ్చు గాని అందుకూ కారణం వుంది.కాకపోతే నేను ప్రతిసారీ ఇలాటి పదజాలంతో రాయను.

    ReplyDelete
  3. నేను చదివేది 'వార్త' దినపత్రిక. అందులో చంధ్రభాన్ ప్రసాద్ అనే మేతావి మార్క్సిజంపై నిప్పులు కక్కుతూ వ్రాసేవాడు. తాను దళిత మేధావినని చెప్పుకుంటాడు. కుల వ్యవస్థ పోవాలంటాడు కానీ వర్గ సమాజం పోదు, అది ఇలాగే ఉంటుంది అని అంటాడు. ఆ మేతావిని విమర్శిస్తూ కలేకూరి ప్రసాద్ గారు 'ఆంధ్ర ప్రదేశ్ దళితులు' అనే పుస్తకంలో వ్రాసారు. చంద్రభాన్ ప్రసాద్ నాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ జాహ్నవి అనే అతని గురించి కొత్తగా వింటున్నాను.

    ReplyDelete
  4. I read every sentence in this post.
    Neither do I know who Jahnavi is, nor did I ever read Jahnavi's articles, but everything that is mentioned here makes me YAWN! A big YAWN that is.

    You guys are so boring..been writing the same stuff for 20 years.

    చైనా ఒక్కటి మిగిలుందా మీకు..అదీ అమెరికా కన్స్యూమరిజం లేకపోతే
    చంకనాకి పోయేది ఈ పాటికి. మీరేం చంకలు గుద్దుకోవక్కర్లేదు, రొట్టె లేని స్వేచ్చనేం చేసుకుంటాం అంటున్నారు కదా, ఓ సారి వెళ్ళి ఆ స్వెట్ షాపుల్లో పని చేసి రండి, కార్మికుల హక్కులు బాగా అనుభవంలోకి వస్తాయి.

    ఇహ అరబ్ దేశాల్లోని అసంతృప్తి మంటల్లో కూడా యాంటి అమెరికన్ చుట్ట వెలిగించుకున్నారే. వండర్ఫుల్ అచీవ్మెంట్.

    ఒకడేమో నుదిటి మీద బందూకు పెట్టి ఉక్కుపాదంతో జనతానణచేసి స్వేచ్చ హరిస్తాడు, ఇంకోడేమో నువ్వు నాకోసం పనిచేయ్, నువ్వు సంపాదించంతా నాకిచ్చేయ్, నీక్కావాల్సిన రొట్టెముక్క కలకాలం నీకిస్తాను అంచెప్పి వాణ్ణి గానుగెద్దుని చేస్తాడు.

    మంచి కంపెనీ మీది.

    మన్మోహన్ సింగ్ 1991 లో ఫ్రీ మార్కెట్ ఎకానమీ బడ్జెట్స్ తో వస్తూంటే, ఇదే ఆంధ్రజ్యొతి లో పెద్ద హెడ్లైన్స్ "మధ్యతరగతి నడ్డి విరిచిన మన్మోహన్" అని మేతావులు ఫ్రంట్ పేజిలో రాపించారు. ఇది దేశాన్ని నాశనం చేస్తుంది చూడండి అని జ్యొస్యాలు చెప్పారు. పాపం భారతదేశం.

    పోతే మీరు ఆర్టికల్ బాగా రాసారు, మీ శైలి బిగింపుతో చదివింప చేసేలా ఉండి నాకు నచ్చింది, కాని అంతంత పెద్ద పేరాగ్రాఫులు కాకుండా కొంచెం విడగొడితే చదవడానికి సులువుగా ఉండి ఇంకొచెం మంది చదువుతారేమో ఆలోచించండి.

    ReplyDelete
  5. కుమార్ గారు, వినిమయవాదానికి మానవ విలువలు గురించి పడుతుందా? ఇండోనేసియాలో ఒక ఎలెక్ట్రానిక్ వస్తువు తక్కువ ధరకి తయారు చెయ్యించి దాని మీద అమెరికా కంపెనీవాళ్లు తమ బ్రాండ్ వేసుకుని ఇండియాలో ఎక్కువ ధరకి అమ్ముతారు. ధర ఎప్పుడూ ఉత్పత్తి చెయ్యడానికైన ఖర్చు కంటే ఎక్కువే ఉంటుంది కానీ ధర రూపాయి తగ్గినా వినియోగదారుడు సంతృప్తిపడిపోతాడు. ఆ వస్తువు తయారు చేసిన కార్మికుల శ్రమ గురించి పట్టదు. చిన్నప్పుడు గ్రామోఫోన్లు ఉండేవి. అవి పోయి సిడి ప్లేయర్లు వచ్చాయి. కానీ ఇప్పటికీ పల్లెటూర్లలో చాలా మంది దగ్గర సిడి ప్లేయర్లు లేవు. అంగట్లో ఎన్ని వస్తువులు ఉన్నా అవి ఎగువ తరగతికే అందుబాటులో ఉన్నాయి.

    ReplyDelete
  6. $ప్రవీణ్ అన్యా

    ఆహ్.. ఏమి చెప్పావు అన్యా! చాణుక్యుల వారు తన అర్ధశాస్త్రంలో వీటిని ఎప్పుడో ఉదాహరించారు.

    #..చంధ్రభాన్ ప్రసాద్ అనే మేతావి మార్క్సిజంపై నిప్పులు కక్కుతూ..
    వా!!!వూ!
    మార్క్సిజం మీద నిప్పులు(?) కక్కేవాళ్ళంతా మేతావులు అంటే ఎట్లా? ఆయన అన్నదాంట్లో వాస్తవం ఉందా లేదా అన్న పాయింట్ చూడు! పోనీ, మీకు అంతగా నొప్పెట్టిన వ్యాసాలేవో చర్చకు పెట్టండి.

    ReplyDelete
  7. చంద్రభాన్ ప్రసాద్ తిప్పింది అరిగిపోయిన రికార్డే. అలాంటి అరిగిపోయిన రికార్డ్‌లు చాలా విన్నాను కానీ చంద్రభాన్ ప్రసాద్ గురించి తరువాత వ్రాస్తాను. అతని కంటే తెలివైన మేతావులు ఉన్నారులే.

    ReplyDelete
  8. $..తిప్పింది అరిగిపోయిన రికార్డే..

    పర్లేదులే, ఒక్కోసారి అరిగిపోయినవి ఆణిముత్యాలైతే పదేపదే వినాలనిపిస్తుంది, నకళ్ళు చేయించి మరీ దాచుకోవాలనిపిస్తుంది. అంటే అవంటే ఇష్టంలేని మనకు అరగట్లేదన్నమాట! :))

    అది(అరగడం) పక్కన పెడితే, చంద్రభాన్ గారు వాస్తవిక దళితమేధావి. ఇతరమతాలు పక్క మతాలమీద దాడి చేసాయి, ఒక్క హైందవం ధర్మ౦(మతం) తప్ప అంటే హైందవంలో కూడా వైష్ణవులు, శైవులూ దాడి చేసుకున్నారు(?) అనే చచ్చుపుచ్చు పోలికలు తెచ్చి, మనఇంట్లో మనం తగువులాడుకోవడం, వేరే ఇంటివాడు వచ్చి దాడి చేయడం రెండూ వేరనే సామాన్య ఇంగితపు శాస్త్రాన్ని మరిచిపోయే మేతావివర్గానికి కడుదూరం పాటిస్తాడు. ఎప్పుడో ఏదో జరిందని వ్యాసాలు రాస్తూ వాటితో చుట్టలు కాల్చుకునే వ్యక్తి కాదు, అచ్చు మీలానే. సర్లే, మీరేదో ఆయన గురించి రాస్తా అన్నారుగా.. అప్పుడు చూద్దాం!

    ReplyDelete
  9. చంద్రభాన్ ప్రసాద్ ఒక దళిత మేధావి కాదు, అతను మేతావి. నేను దళితవాదినే కానీ నాకు దళితవాదం కంటే మార్క్సిజం-లెనినిజం, స్త్రీవాదం మీదే ఆసక్తి ఎక్కువ. మనిషి నిజజీవితంలో కులం, మతం కంటే డబ్బుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. కేవలం కులాన్నీ, మతాన్నీ విమర్శిస్తూ కూర్చుంటే సమాజంలో గొప్ప మార్పు రాదు. కత్తి మహేశ్ గారు కూడా కేవలం కులాన్నీ, మతాన్నీ విమర్శిస్తూ కూర్చోలేదు. అతను గ్లోబలైజేషన్ లాంటి సామ్రాజ్యవాద విధానాలని కూడా విమర్శించారు. చంద్రభాన్ ప్రసాద్ neo-elite class దళితుల పక్షాన నిలబడే మేతావి. పల్లెటూర్లలో ఊరి చివర గుడిసెలలో ఉండే దళితుల జీవితాల గురించి చంద్రభాన్ ప్రసాద్‌కి పట్టదు. దళిత సినిమా నటులకి ఎన్ని సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు, దళిత మ్యుజిషియన్లకి ఎన్ని ఆర్కెస్ట్రాలలో అవకాశాలు ఇస్తున్నారు, డూన్ స్కూల్‌లో దళిత IAS అధికారుల పిల్లలపై వివక్ష లాంటి విషయాలు వ్రాస్తుంటాడు. దేశంలో తిండితిప్పలు లేక అలమటిస్తున్న దళితుల గురించి మాట్లాడకుండా గ్లోబలైజేషన్ వల్ల మన చేతుల్లోకి ఎన్ని సెల్ ఫోన్లు వచ్చాయి లాంటి విషయాలు వ్రాస్తుంటాడు. పల్లెటూర్లలో మిడిల్ క్లాస్‌వాళ్లలో కూడా చాలా మందికి వ్యక్తిగత లెట్రిన్‌లు లేవు. కేవలం సమాచార వ్యవస్థని అభివృద్ధి చేసి ప్రజల జీవితాలు మార్చొచ్చట! ఇది చంద్రభాన్ ప్రసాద్ లాంటి మేతావుల సూత్రీకరణ.

    ReplyDelete
  10. చర్చలో పాల్గొనడం మన భావాలను వినిపించడానికి మాత్రమే పరిమితం అయితే ఇక చర్చ ప్రయోజనం శూన్యం. అది కూడా చర్చనీయాంశంతో సంబంధం లేని వాటి చుట్టూ తిరగడం.. పేరు మోసిన వాళ్లు సరే సరి.. ఉత్సాహంగా స్పందించే కొత్తతరం విద్యా వంతులైనా ఆ ధోరణిని మార్చుకోలేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది.
    ప్రవీణ్‌ మార్క్సిస్టునని చెబుతున్నారు.. మంచిదే. కాని మీరు మరింత విమర్శనాత్మకంగా విశ్లేషించుకొని స్పందించడం మేలు చేస్తుంది. మీకే కాదు-సమాజానికి కూడా.చంద్రభాను ప్రసాద్‌ దళిత మేధావి అయినా అందులో విపరీతాంశాలు అనేకం వస్తున్న మాట నిజం.కాని ఆయనను మేతావి అనొద్దు- ఆ మాట చాలామందికి వర్తించవచ్చు.
    ఆనంద్‌ ఎన్‌ గారు ఇరవై ఏళ్లుగా ఒకటే చెబుతున్నారంటూ బహుశా వామపక్ష వాదంపై అసహనం వెలిబుచ్చుతున్నారు. వేల ఏళ్ల చరిత్రనే పట్టుకుని నూతనత్వాన్ని ఆహ్వానించలేని వారి సంగతి ముందు చూడండి. సమానతా భావాలే ఆధునికమైనవి,మనుషుల అసమానతలు దైవదత్తమన్నట్టు మాట్లాడే సంసృతి సంగతి చూడండి.. చైనా ఒక్కటి మిగిలిందని అపహాస్యం చేస్తే చేశారు ఆ భాష అలా వుండాల్సిన అవసరం వుందా? నా వ్యాసంలో బిగువు వుందంటూనే ఇలా అనడంలో పొంతన వుందా? అయితే చిన్న పేరాలుగా విడగొట్టమని మీరిచ్చిన సలహాను పాటించాను,, గమనించారా?
    రాజేష్‌, చంద్రభాను పట్ల గాని మరొకరి పట్ల గాని విమర్శనాత్మకంగా వుండక తప్పదు. అలా చెప్పే వారందరూ మనువాదులు కానక్కర్లేదు. దళిత నామ స్మరణ చేసే వారంతా వారి బాంధవులూ కాదు. భారత దేశంలో కుల వివక్షత నిజం. అదే సమయంలో ఆర్థిక అసమానతలూ నిజం. వీటిలో ఒక్క దానికే పరిమితమైతే చాలా నష్టం. ఆర్థిక అసమానతలపై పోరాటాలను తక్కువ చేయడం ఇంకా నష్టం. ప్రపంచీకరణ వల్ల బాగా నష్టపోతున్నది అమెరికాలో నల్లజాతీయుల నుంచి మన దగ్గర దళితుల వరకూ పీడిత వర్గాల ప్రజలే.కనక ఎవరు ఏది రాసినా దాని పట్ట వారి వైఖరి ఏమిటన్నది తప్పక గమనించాలి. ఇది చంద్రభానుపై చర్చ కాదు గనక ఇంతకంటే రాయడం లేదు. మరోసారి ఆ విశ్లేషణ ..
    అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  11. $..మనిషి నిజజీవితంలో కులం, మతం కంటే డబ్బుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు..
    Truly! ఆ డబ్బుకోసం కులాన్ని, మతాన్ని వాడుకుంటాడు కూడా!

    $..అతను గ్లోబలైజేషన్ లాంటి సామ్రాజ్యవాద విధానాలని కూడా విమర్శించారు...

    ఈ మిల్లీనియపు ముక్కిపోయిన జోకు! :))

    సర్లే, విమర్శించడం నిన్న మొన్న పుట్టినోడు కూడా చేస్తారు! మీరు తెలంగాణా బలపరుస్తున్నారు కదా, మరి మీరు తెలంగాణాకై ఏమి చేస్తున్నారు అని ఒకాయన మొన్న అడిగితే నా పాటికి నే ఎంచక్కా ఉద్యోగం చేసుకుంటూ ఏమీ తోచనప్పుడు విమర్శిస్తూ ఉంటాను అనేరకాన్ని మీరు వెనుకేసుకరావటం
    ఆక్షేపణీయం.

    ఇక మీరు చంద్రభాన్ గారి గురించి చెప్పిన వాటిలో వాస్తవాల్ని తెలుచుకునే ప్రయత్నం చేస్తా! కానీ నిజానికి మీరేవైతే ఆయనపట్ల తప్పులుగా చెప్పారో అవి ఒప్పులు. ఒకవేళ మీరు చెప్పినవాటి కోసమే పాటుపడాలి అని అనుకుని ఉ౦టే అంబేద్కర్ గారు ఉచితఫలాలతో పాటు ఒక ఇల్లు, ల్లెట్రిన్ ఇతర అవసరమైనవీ కూడా ఇవ్వాలనీ క్లాజ్ పెట్టేవారేమో!

    ReplyDelete
  12. @rajesh

    meeru praveenpai naa vyakhyalanu kooda meeke anvayinchukunnttunnaru... ayanaku kooda vimarsanatmakanga unadalne cheppanu.

    ee sariki nenu chandrabhanu tappulu evi cheppindi ledu.. oka konam matrame choopinchanu
    ambedkar watini koraledani meerendukanukuntunnaru? avi tappa?

    ReplyDelete
  13. జాహ్నవి వ్రాసిన వ్యాసం నేను చదవలేదు కానీ మీరు ఇచ్చిన వివరాలని బట్టి అతను చంద్రభాన్ ప్రసాద్ టైపేమోనని నాకు సందేహం వచ్చింది. నేను ఇంతకు ముందు చెప్పాను 'చంద్రభాన్ ప్రసాద్ గురించి తరువాత వ్రాస్తాను, అతని కంటే తెలివైన మేతావులు ఉన్నారు‌' అని. కానీ రాజేశే అతని గురించి అడిగాడు. చంద్రభాన్ ప్రసాద్ దళితవాదం పేరు చెప్పుకుంటాడు, జాహ్నవి ఆ పేరు చెప్పుకోడు, అదొక్కటే మౌలికమైన తేడా అనుకున్నాను.

    ReplyDelete
  14. సర్ !జాహ్నవిని భరించడం మరీ కష్టంగా ఉంది.ఈ మధ్య కాలంలో ఇంత ఇల్లాజికల్ గా .ఇంత ఔట్రైట్ గా ఉన్న పిచ్చి రాతల్ని చదవటం మళ్లీ ఇదే .పోరాట రూపం కూడా అంతే స్థాయిలో ఉంటె బాగుంటుంది .పోతే మీ వ్యాసాలలో పేరాలు పెద్దవిగా ఉంటున్నాయ్.చిన్నవి చేయండి .రీడబిలిటీ వస్తుంది .టీవీ లలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ హావ భావాలలో వెటకారం పాలు కొంచెం ఎక్కువ కనపడుతుంది .చెప్పే విషయం ఏదైనా మనుషుల భావోద్వేగాలు దెబ్బతినకుండా చెప్పాలి కదా ..ఎనీ హౌ నేను మనోహరిని .కృష్ణ మనోహరిలో సగాన్ని .గ్లాడ్ టు మీట్ యు సర్ .

    ReplyDelete
  15. ప్రవీణ్‌,
    నేను ఇది వరకే చెప్పాను, విమర్శనాత్మకత గురించి. జాహ్నవి, చంద్రభాను ప్రసాదులు వేర్వేరు కోణాలకు సంబంధించిన వారు. చెప్పేదాంట్లో సామ్యం వున్నా ఒకరిది నేరుగా సిద్ధాంతంపై దాడి.మరొకరిది తన సిద్దాంతం పేరిట దాడి. అయినా మీ వంటి ఉత్సాహ వంతులు పత్రికల్లో సుదీర్ఘంగా సాగుతున్న ఆ చర్చను గమనించకపోవడం ఆశ్చర్యమే.

    కృష్ణ మనోహరి ,
    మీ పరిచయానికి సంతోషం.

    పేరాలు ఇప్పటికే చిన్నవి చేస్తుంటాను. అయినా పత్రికలో రాసిన వ్యాసం గనక కొంత,, నా సాంకేతిక పరిమితులు కొంత ఈ పరిస్తితికి కారణమవుతుంటాయి.
    టీవీలలో మాట్లాడేప్పుడు ప్రజల పేరిట సాగే పాలక వర్గ రాజకీయ క్రీడను ఎండగట్టే క్రమంలో వ్యంగ్యం వెటకారం కూడా వుంటాయి. వారి దుస్తంత్రాలతో పోలిస్తే ఇవి చాలా స్వల్ప శాతం. పార్టీలూ ప్రాంతాలూ ప్రజలూ అంతా ఒకటేనన్న భావన ఇటీవల ప్రబలిన ఫలితమిది. అందుకే నేనెప్పుడూ విమర్శనాత్మకంగా చూడాలని చెబుతుంటాను. విడ్డూరపు ఎత్తుగడలు వికృత రాజకీయాలు వెటకారానికి గురికాకతప్పదు. ఈ పదిహేను మాసాలలోనూ నా వ్యాఖ్యలు నిజమని తేలుతున్నదీ లేనిదీ చూడండి. వెటకారం అన్నది రాశారు గాని సౌజన్యం సమతుల్యత కోసం పడే ఘర్షణ కూడా మీరు గమనిస్తుంటారా?
    ఈ ఎంట్రీ దాదాపుగా మన ముగ్గురి సంభాషణలా మారిపోయినట్టుంది. కనక ఇంతటితో ముగించి మరోసారి మాట్లాడుకుందాం

    ReplyDelete
  16. రవి గారు. నేను నా సొంత ప్రొజెక్ట్‌లో ఉండడం వల్ల ఆ వ్యాసాలు చదవలేదు. అంతే కానీ ఆర్థిక అంశాల మీద ఆసక్తి లేక కాదు. ఈ లింక్ దర్శించండి: http://radicalfeminism.stalin-mao.in

    ReplyDelete
  17. విడ్డూరపు రాజకీయాలు వికృత ఎత్తుగడలు tdp కాంగ్రెస్ సిపిఎం లాంటి పార్టీలు చేసినప్పుడు మీరు వెటకారం చేస్తే మా లాంటి సామాన్య ప్రజలు మీ intellectual honesty ని హర్షిస్తాము కాని విశాల ప్రజా సమూహాల ప్రజాస్వామిక ఆందోళనలని వెటకారం చేస్తేనే, అది marxist లమని చెప్పుకొనే మీ లాంటి వాళ్ళు చేసినప్పుడు నిరాశ నిస్పృహలు కలుగుతాయి.

    ReplyDelete
  18. అంటే మజ్లిస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెరాస, సిపీఇ, ప్రరాప లాంటి గొప్ప పార్టీలను వెంటకారం చేస్తే మేము హర్షించమన్న మాట. క్లుప్తంగా చెప్పాలంటే, మాకు జైకొడితే 'ఇంట'లెక్చ్యువల్స్ అంటాం, లేదా 'దొడ్డి'లెక్చ్యువల్స్ అంటాము. అర్థమయ్యింది కదాండి. ఇది జనాల ఇంటలెక్ట్!! :P

    ReplyDelete
  19. @ krishna manohari

    please understand the limitations of a meaningful and healthy debate. don,t prolong beyond a point. in fact this is the vetakaram of somebody who claim erupu. gods forbade. on most of these issues defenetly communists are on a better wicket. u r free to decide and judge who is honest. not that i can't react but i stop here. bye.

    ReplyDelete
  20. @ praveen

    in a way u r also over reacting i suppose. my comment is of a general manner and nothing more. i just saw u r site on women and like the idea. in fact my book aa sagam sangatulu deals the issue and got good response. i again tell u not to react everybody on every point. often it turns out to be waste of time.

    ReplyDelete
  21. జాహ్నవి రోత రాతలపై గట్టి మొట్టికాయ వేసారు. మానవత్వంపై మచ్చుకైనా ప్రేమలేని నరరూప పెత్తందారీ జాహ్నవి. మానవుడు సంఘజీవి అనే ఆలోచన నుంచే అన్ని సమస్యలూ మొదలయ్యయనే ఈ పైశాచికవేత్తను సంఘీభావీష్క్రుతున్ని చేయాలి.

    ReplyDelete
  22. I will read Jahnavi's article and then reply about it. You said that it was like old gramophone record. So, I thought that it was similar to other such types.

    ReplyDelete
  23. @telakapalli ఆరోగ్యకరమైన చర్చ అంటే ఏంటో కొంచెం నిర్వచించగలరా? బహుశ ఆరోగ్యకరంగ ఉండటం అంటే మీ దృష్టిలో మీరు ఔనన్న దానికి తల ఊచటం కాబోలు .మన సిద్దాంతం పట్ల మనకెంత గౌరవం ఉంటుందో జాహ్నవి లాటి వాళ్లకి వాళ్ళు నమ్మే సిద్దాంతం పట్ల అంతే గౌరవం ఉంటుంది ,అట్లాగే నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు తాము నమ్ముతున్న లక్ష్యాల పట్ల అంతే ప్రగాడమైన నమ్మకం తో ఉంటారు .అవతలి వ్యక్తుల భావజాలం పట్ల మనకు అంగీకారం లేకున్నా సంయమనం పాటించడమే మేధస్సు .మీ శైలిని పునః పరిశీలించుకోండి .కృష్ణ మనోహరి గారి మాటల్లో అసంభావ్యత ఏమీ లేదని తెలుస్తుంది.పోతే ఇది ఇంటర్నెట్ ఆంద్ర పెట్టుబడి దారుల గుత్తాధి పత్యంలో ఉన్న మీడియా కాదు .మీకు ఇష్టమైనవే చర్చించడానికి.స్పాం అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి .సంయమనం పాటించండి .కొత్త తరానికి మార్గ దర్శకులు కండి
    @krishna manohari wellsaid .jai telangana
    @shankar . true .we should include some of the parties which you mentioned..

    ReplyDelete
  24. @gandavarapu
    ..
    ye charcha ayiana tedalu telisaka sagateesukovadam arogyakaram kadu. vibbhedinchadaniki angeekkariddam anukovadame prajaswamyam.
    jahnavini baga gaouravinchandi. kakapote telangana prajala patla prema ewari gutta sommanukovaddu. pettubadidarulu anni chotla unnarani kooda grahinchandi. nenu veera telangana madi book editornu.

    cpm nu vimarsincha vaddani nenekkada analedu. nenu em cheppalo itarulu adesiste angikarinchadamoo jaragadu.
    ewaraina spam choosukuntanante no objection.

    ReplyDelete
  25. ఇప్పుడే జాహ్నవి వ్రాసిన వ్యాసం చదివాను. అతనికి వంతపాడిన చందు సుబ్బారావు వ్యాసమూ చదివాను. జాహ్నవి తిప్పింది అరిగిపోయిన రికార్డే కానీ చందు సుబ్బారావు కొత్త రకం వాదన తెచ్చాడు. అతను ప్రైవేట్ రంగంలో అవినీతికి ఆస్కారం తక్కువ అని వాదించాడు. 2G స్పెక్ట్రంలో లంచాలిచ్చింది ప్రైవేట్ కంపెనీలు కాదా? తెలిసితెలియని విషయాలు మాట్లాడడం అంటే ఇదే.

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. This comment has been removed by the author.

    ReplyDelete
  28. రవిగారికి నమస్కారం. మీ వ్యాసాలు రెగ్యులర్గా చదువుతాను. జాహ్నవి, సుబ్బారావు లాంటి వారిని సముదాఇన్చకపోయినా పర్వాలేదు. కానీ మాలాంటి వారికోసం వారికి సమాధానంగా రాయండి. ఇలాంటివారు చాలామంది తారసపడుతున్నారు. శ్రమైఖ్య జీవన సౌన్ధర్యంఫై మీకున్న ప్రేమకు ధన్యవాదాలు.

    ReplyDelete
  29. ravi gariki namaskaram mee vyasam vignyanadaayakanga undi.

    ReplyDelete
  30. చారిత్రక భౌతికవాదం చదివినవాళ్లు ఎవరికైనా జాహ్నవి వ్రాసింది తప్పని అర్థమైపోతుంది. అతను చారిత్రక భౌతికవాదం చదవనివాళ్లని దృష్ఠిలో పెట్టుకుని వ్రాసి ఉంటాడు.

    ReplyDelete
  31. TeRa Garu! From the time I read the article ofJahnavi, I am waiting, if somebody answers to it. You did that properly. But that will be apt if it is published in Andhra Jyothi only. Any how you can not be silent on such articles. Go ahead.

    ReplyDelete
  32. @raja,

    I HOPE YOU KNOW THAT IT IS ONLY AFTER PUBLICATION IN aNDHRA jyothi that i reprroduced in the blog. just clarification

    ReplyDelete